తెలంగాణలో ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐ కలయికతో పోటీచేసిన ప్రజా కూటమికి విజయావకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెలువరించిన సర్వేలతో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై ఒకింత గందరగోళం నెలకొన్నప్పటికీ కూటమి విజయావకాశాలపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో పాటు వచ్చే ఏడాది మేలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌తో సహా తెలంగాణ లోని పలు జిల్లాల్లో సెటిలర్లు ఏ పార్టీకి ఓటు వేశారనే విషయం ప్రధాన పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.

aprajakeeyam 10122018 2

ఈ సారి పోలింగ్ ఏ పార్టీకి మొగ్గు చూపుతుందనే విషయమై కాంగ్రెస్, టీడీపీలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్టవ్య్రాప్తంగా 70 శాతానికి మించి పోలింగ్ జరగటంతో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 20 సీట్లు గెలుచుకున్నప్పటికీ టీడీపీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో దాదాపు తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పొత్తుతో తక్కువ సీట్లలో పోటీ చేసినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్నందున కూటమి విజయంపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఇక్కడ కనుక గెలిస్తే, జాతీయ స్థాయిలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. ఇదే విన్నింగ్ ఫార్ములాగా, మోడీని దించే ఫార్ములాగా ప్రచారం చేస్తారు. ఇక జగన్, పవన్ ల సంగతి సరే సరి. చంద్రబాబు గ్రాఫ్ పెరిగితే, ఇక వీళ్ళ మాటకు విలువ ఉండదు. ఏపిలో జరిగే ఎన్నికలు చంద్రబాబు - మోడీ మధ్య యుద్ధంలా ఏపి ప్రజలు చూస్తారు. ఈ ఆటలో జగన్, పవన్, అరటిపండులు అవుతారు. రేపు ఈ సమయానికి మొత్తం తెలిసిపోతుంది.

aprajakeeyam 10122018 3

కాగా శుక్రవారం తెలంగాణలో జరిగిన ఎన్నికలు, అనంతర పరిణామాలపై చంద్రబాబు టీటీడీపీ నేతలతో ఫోన్‌లో చర్చించారు. వివిధ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులపై టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో అధికారులు కారు గుర్తుకు వేయాల్సిందిగా ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు టీఆర్‌ఎస్ ముఖ్యనేత కేటీఆర్ తిరిగి తామే అధికారంలోకి వస్తామని పోలింగ్ ముగియకముందే ప్రచారం చేయటం, సూర్యాపేట శాసనసభ స్థానంలో పోలింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి జగదీష్‌రెడ్డి ప్రచారం నిర్వహించటం, కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిపై బీజేపీ కార్యకర్తల దాడి తదితర అంశాలన్నింటిపై విచారణ జరపాల్సిందిగా టీటీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

పార్లమెంటు సమావేశాలకు సరిగ్గా ఒక్కరోజు ముందు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇవాళ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయే ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలోజరుగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి తాను హాజరు కావడం లేదంటూ కుశ్వాహ చెప్పిన కొద్దిసేపటికే... ఆయన ఎన్డీయేలో కొనసాగుతారా, లేదా అన్నదానిపై ఊహాగానాలు వెల్లువెత్తాయి.

modi 012122018 1

ఈ నేపథ్యంలోనే కుశ్వాహ ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్ఎస్పీకి ఒక్క సీటు కంటే ఎక్కువ ఇచ్చేందుకు బీజేపీ తిరస్కరించడంతో.. కుశ్వాహ ఇటీవల ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీహార్‌లో కుశ్వాహ పార్టీకి ఒక్క సీటుకంటే ఎక్కువ ఇవ్వబోమని చెప్పిన కాషాయ పార్టీ... సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూతో మాత్రం సమాన సంఖ్యలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించింది. దీంతో తమకు గౌరవనీయ సంఖ్యలో సీట్లు కేటాయించని పక్షంలో 2019 ఎన్నికల్లో ఎన్డీయే మూల్యం చెల్లించక తప్పదని కుశ్వాహ ముందే చెప్పారు.

modi 012122018 1

బీహార్‌లోని రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీకి చెందిన ఆయ‌న‌.. మోదీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌శైలిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో క‌లిశామ‌ని, ఎన్నో ఆశ‌ల‌తో చేరామ‌ని, బీహార్ ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ వాటిని అమ‌లు చేయ‌లేక‌పోయార‌ని, అందుకే రాజీనామా చేస్తున్న‌ట్లు త‌న లేఖ‌లో తెలిపారు. ఆర్ఎల్ఎస్పీ పార్టీకి బీహార్ లో తొక్కేయటానికి మోడీ, అమిత్ షా ప్రయత్నాలు చెయ్యటం కూడా తెలిసిందే. దీంతో కేంద్ర‌మంత్రి ఉపేంద్ర ఎన్డీఏకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ ఉద‌యం కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కూడా క‌లిశారు. బీజేపీతో క‌లిసి ప‌నిచేస‌ది లేద‌న్న విష‌యాన్ని ఉపేంద్ర ఇవాళ వెల్ల‌డించ‌నున్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగనుండటంపై సర్వత్రా చర్చజరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో సమావేశం నిర్వహిస్తున్నారు. గత నెలలో జాతీయస్థాయి ప్రతిపక్ష అధిపతులు, ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన చర్చల పర్యావసానం దేశంలో బీజేపీయేతర పార్టీలలో ఐక్యత, ఉమ్మడి కార్యాచరణకు మలి విడత సమావేశం నిర్వహిస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకభూమిక వహించనున్నారు. దిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశానికి సోనియా, మన్మోహన్ సింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కూటమి పేరు, ఎజెండా నిర్ణయిస్తారని భావిస్తున్నారు. ప్రజా ప్రంట్ అనే పేరు ఉంటుందా.. మరేదైనా పేరా అనేది నిర్ణయిస్తారు.

cbn 10122018 2

ఏడు రాష్ట్రాల సీఎంలతో సహా.. ఇతర పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ను రూపోమ్దిమ్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. జనవరి 8 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాల వేళ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వాన్ని , అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీయనున్నాయి. మోదీ ప్రభుత్వానికి పూర్తికాల చివరి సమావేశం ఇదే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తప్పదని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి.

cbn 10122018 3

దేశ ప్రజలు నియంత పాలనను అంగీకరించరని ఎలుగెత్తి చాటనున్నారు. పార్లమెంటు అనుబంధ భవనంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు మన్మోహన్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, అహ్మద్‌ పటేల్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే నేత స్టాలిన్‌, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, ఎన్‌సీ అగ్రనేత ఫరూఖ్‌ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, ఆర్‌జేడీ యువనేత తేజస్వియాదవ్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎ నేత హేమంత్‌ సోరెన్‌, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నేత ఉపేంద్రకుష్వాహా, అసోం యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ నేత బద్రుద్దీన్‌ అజ్మల్‌ -కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులు అమరీందర్‌సింగ్‌ (పంజాబ్‌), నారాయణస్వామి(పుదుచ్చేరి)లతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఎల్డీఎఫ్‌ సీఎం పినరయి విజయన్‌(కేరళ)లనూ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.

సీఆర్‌డీఏ నిర్మిస్తున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’కు రెండో విడత కూడా అనూహ్య స్పందన లభించింది. రెండో విడతలోనూ నిమిషాల వ్యవధిలోనే వందల ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఫ్లాట్లను బుక్‌ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రక్రియలో తొలి అరగంటలోనే 700 ఫ్లాట్లకు పైగా బుకింగ్‌ పూర్తయింది. ఇందుకోసం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో 60 ఫెసిలేటషన్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు విజయవాడలోని సీఆర్డీఏ ఆఫీస్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయగా.. ఉదయం నుంచి ఫ్లాట్ల కొనుగోలు చేసేందుకు జనాలు క్యూ కట్టారు.

amaravati 10122018 2

రెండో విడత బుకింగ్స్‌లో గంటలోనే ఫ్లాట్లన్నీ (900) బుక్ అయ్యాయి. ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారురాలకు.. సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ ఫ్లాట్‌ బుకింగ్‌ పత్రాన్ని అందించారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మిస్తుండగా 300 ఫ్లాట్లకు గత నవంబరు 9న సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లో బుకింగ్‌ నిర్వహించింది. తొలివిడతలో అనూహ్య స్పందన రావడంతో మిగతా 900 ఫ్లాట్లకు సోమవారం బుకింగ్‌ నిర్వహించారు. మొత్తం హ్యపీనెస్ట్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి అప్పగిస్తామని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌ తెలిపారు.

amaravati 10122018 3

‘హ్యాపీ నెస్ట్‌’పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడు సమీపంలో అపార్ట్‌మెంట్లు నిర్మించబోతున్నారు. 12 టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 15 ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను చేపట్టబోతున్నారు. చదరపు అడుగు 3వేల492 రూపాయల వ్యయంతో ఈ గెటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుంది. ఈ ప్లాట్లకు సీఆర్డీఏ బుకింగ్ ప్రారంభించింది. ప్లాట్ల బుకింగ్ విషయానికొస్తే.. ప్లాట్ ధరలో ముందుగా 7శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బును నెలవారీ పద్దతిలో కట్టాలి.

Advertisements

Latest Articles

Most Read