తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వద్ద ఏపీలోని ఓటర్ల వివరాలన్నీ అక్రమంగా ఉన్నాయంటూ కూకట్‌పల్లిలో ఉంటున్న లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు చేపట్టడం తెలిసిందే. అయితే ఇక్కడ పక్కా ప్లాన్ తో, జగన, కేసీఆర్ వ్యవహరించారు. శానివాసం సోదాలు మొదలు పెట్టారు. ఆదివారం సెలవు, సోమవారం శివరాత్రి సెలవలు. ఇలా కోర్ట్ కి వెళ్ళే అవకాసం లేకుండా, మూడు రోజులు తమ పోలీసులతో ఇష్టం వచ్చినట్టు చెయ్యవచ్చు అని ప్లాన్ చేసారు. ఈ మూడు రోజుల్లో, అక్కడ వారిని బెదిరించి, డేటా మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసి, సెలవలు ఉన్న రోజుల్లో ప్లాన్ అమలు చేసేలా, వ్యూహం రచించారు.
అయితే ఇది పసిగట్టిన తెలుగుదేశం పార్టీ, ఏపి ప్రభుత్వం ధీటుగా, ఈ కుట్రను తిప్పి కొట్టింది. వీళ్ళ కుట్ర భగ్నం చెయ్యటం కోసం, కోర్ట్ మెట్లు ఎక్కారు. సెలవు రోజులు అయినా సరే, అత్యవసరంగా హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే జడ్జి ఇంటి దగ్గర విచారణ. రెండు రాష్ట్రాల మధ్య కేసు కావటంతో, దీనిపై విచారణకు హైకోర్టు అనుమతించింది. సాయంత్రం 5.30 గంటలకు జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నివాసంలో జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ ఉద్యోగులు రేగొండ భాస్కర్, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ రెబ్బాలను తెలంగాణ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డైరెక్టర్ డి.అశోక్ ఇచ్చిన పిటీషన్ పై విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్ వాదనలు వినిపిస్తూ ఆదివారం తెల్లవారుజామున 5.30, 7 గంటల మధ్య వేర్వేరు సమయాల్లో ఈ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. శనివారం అర్థరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వీరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. అయితే వారి పేర్లు ఎఫ్ఐఆర్లో లేవని చెప్పారు. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని కోర్టు సెలవులు ఉండటంతో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. ఆరుగురు పోలీసులు సాధారణ దుస్తుల్లో వచ్చి బలవంతంగా ఈ నలుగురిని తీసుకెళ్లారని, కుటుంబసభ్యులు అడ్డుకున్నా పట్టించుకోలేదని వెల్లడించారు. దీంతో, ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రేగొండ భాస్కర్, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్‌గౌడ్ రెబ్బాల అనే నలుగురు ఉద్యోగులను సోమవారం ఉదయం 10.30 గంటలకల్లా తమ ముందు హాజరుపరచాలంటూ తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదివారం ఆదేశించింది.