రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ లేఖ రాసినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, స్థానిక సంస్థల ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సీఎస్ నీలం సాహ్ని ఈ లేఖలో పేర్కొన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు యథావిధిగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టాలని, ఆమె ఎలక్షన్ కమీషనర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె లేఖలో తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేస్తూ, ఆరోగ్య శాఖ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని సూచించారు. జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని అన్నారు. మరో 3, 4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని, అందుకే అనుకున్న ప్రకారం ఎన్నికలు జరపాలని లేఖలో పేర్కొన్నారు.

స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్​ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్ కుమార్ స్పందించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులను అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్ కుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే ఎన్నికలను వాయిదా వేసినట్లు తెలిపారు. కమిషన్ ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ లేఖ విడుదల చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రమేష్‌కుమార్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారికి దురుద్దేశాలు ఆపాదించడం విధులు అడ్డుకోవడమేనని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు వ్యవస్థలను బలహీపరుస్తాయన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థన్న ఎస్​ఈసీ. .. హైకోర్టు న్యాయమూర్తికి ఉండే అన్ని అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంటాయని తెలిపారు.

కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించినందునే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏ కారణాలతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ రెండు పేజీల పత్రికా ప్రకటనను విడుదల చేసింది. జాతీయ స్థాయి యంత్రాంగంతో చర్చించిన తర్వాతే ఎన్నికలను వాయిదా వేసినట్లు రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వాయిదాపై సీఎం జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, జోక్యం చేసుకుని ఆదేశాలను నిలుపుదల చేయాలని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తన నిర్ణయంపై ఎన్నికల కమిషనర్ వివరణ ఇచ్చారు. కేంద్రం విపత్తు ఆదేశాలు ఉపసంహరించిన తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉంటుందని.. ఈ సమయంలో వ్యక్తి గత లబ్ది చేకూర్చే ఏ పథకాన్ని అమలు చేయకూడదని రమేశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో భారత ఎన్నికల కమిషన్ పాటించిన మార్గదర్శకాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం నియమావళికి విరుద్ధమని అందుకే పట్టాల పంపిణీకి అనుమతించలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలను నిలుపుదల చేశామని... రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆరు వారాలలోపే కరోనా ప్రభావం తగ్గితే వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పోలీసులు, అధికారులపై వేటు వేయడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపైనా రమేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల్లో హింస జరిగిందని పలు రాజకీయ పార్టీలు తమకు ఫిర్యాదు చేశాయని లేఖలో ఎస్​ఈసీ తెలిపారు. ఎన్నికల్లో హింస ఘటనపై హైకోర్టు లోనూ వాజ్యం విచారణలో ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను సైతం ప్రతివాదులుగా చేర్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని.. ఇదే విషయమై కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చెప్పిన అంశాలనే తాము పాటిస్తున్నట్లు తెలిపారు. నేడు రమేశ్ కుమార్ గవర్నర్‌తో భేటీ కానున్నారు. సీఎం జగన్ లేవనెత్తిన అభ్యంతరాలపై గవర్నర్‌ చర్చించే అవకాశం ఉంది.

రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా తన సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను చంద్రబాబు నియమించుకున్నారని, ఒకే సామాజికవర్గానికి చెందిన వీరిద్దరూ కల‌సి ఎన్నికను వాయిదా వేశారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నియమించిన రమేష్‌ వ‌ల్ల‌ ఎన్నికలు ఆగిపోయాయని, స్థానిక ఎన్నికల్లో వైకాపా స్వీప్‌ చేస్తుందని భయపడి తన కులానికి చెందిన చంద్రబాబుకు మేులు చేయడానికే ఎన్నికల‌ కమీషనర్‌ రమేష్‌కుమార్‌ ఎన్నికల‌ను వాయిదా వేశారని ఆయన విమర్శించారు. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఎన్నికల‌ కమీషనర్‌గా సిఫార్సు చేసింది నాటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నర్సింహ్మన్‌. త‌న వ‌ద్ద సెక్ర‌ట‌రీగా ప‌ని చేసిన ర‌మేష్ ను గవర్నర్‌గా ఉన్న నర్సింహ్మన్‌ సిఫార్సు వల్లే ఎన్నికల‌ కమీషనర్‌గా నియమింపబడ్డారు. వాస్తవానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా బిశ్వాల్ ను నియమించాల‌ని భావించారు. అయితే అప్పటి గవర్నర్‌ జోక్యంతో నిమ్మగడ్డకు ఆ పోస్టు వచ్చింది.

nimmagaddaa 15032020 2

అంతకు ముందు కూడా నిమ్మగడ్డ చంద్రబాబు వద్ద ఎప్పుడూ పనిచేయలేదు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రమేష్‌కుమార్‌ మూడు సంవత్సరాల‌ పాటు ప్రాధాన్యతకల‌ పదవుల‌ను నిర్వహించారు. మొదటి నుంచి రమేష్‌ చంద్రబాబు వ్యతిరేక వర్గంలోనే ఉండేవారు. నాటి గవర్నర్‌ సిఫార్సు వ‌ల్ల‌ రమేష్‌కుమార్‌కు ఆ పదవి వచ్చింది కానీ, చంద్రబాబు వల్ల కాదు. రమేష్ కుమార్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2004 నుండి 2009 వరకూ నగరాభివృద్ది శాఖ,ఆర్ధికశాఖ కార్యదర్శలుగా పనిచేశారు. ఆ తర్వాత గవర్నర్ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా 7 ఏళ్ళు చేశారు. ఆయన కలెక్టర్ గా పని చెయ్యటం మొదలు పెట్టిన దగ్గర నుండి నేటికి ఒక్క తప్పుపని చెయ్యలేదు. అందుకే గవర్నర్ కూడా ఎన్నికల అధికారిగా ఆయన ఉంటే బాగుంటుందని చెప్తే అప్పటి ముఖ్యమంత్రి తననే ప్రతిపాదించారు.

nimmagaddaa 15032020 3

ఎలక్షన్ కమీషన్ నిర్వహించవలసిన పనులను రాష్టప్రభుత్వం కాదు ఇచ్చేది. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు ఏమి చెయ్యాలో భారత ఎన్నికల శాఖ నియమావళిని పెట్టింది. దానినే రాష్ట్ర శాఖ అమలు చేస్తుంది. భాధ్యతగల పదవిలో ఉన్న వారు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం కాదు బుద్ది ఉండాలి. జగన్ చేసిన ఇదే ఆరోపణ పై చంద్రబాబు కూడా స్పందించారు. "రమేష్ ని కూడా నేను రికమండ్ చెయ్యాలా .. నేను సీఆర్ బిశ్వల్ ని రికమెండ్ చేస్తే .. గవర్నర్ నరసింహన్ ..రమేష్ ఐతే బాగుంటదని అంటే .. గవర్నర్ మాటని కాదనటం ఎందుకులే అని యాక్సెప్ట్ చేసాను" అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కులం ఆపాదించటం, అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్నికల కమీషనర్ పై కులం అంటగట్టి, ఆడు ఈడు అంటూ వ్యాఖ్యలు చెయ్యటంతో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ రె-చ్చి-పో-తా-రో అని, ఏకంగా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటంతో, అనూహ్య పరిణామాల నేపధ్యంలో, పోలీసులు అలెర్ట్ అయ్యారు. జగన్ ప్రెస్ మీట్ తరువాత, ఎక్కడ వైసీపీ నేతలు, కార్యకర్తలు రె-చ్చి-పో-తా-రో అని, విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రత పెంచారు.​ బందరు రోడ్డులో, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఉంది. ఇక మరో పక్క, జగన్ తన పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చెయ్యటం పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్​కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కలవనున్నారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై సీఎం జగన్​ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేష్​కుమార్​ రేపు రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలవనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్​కు వివరించనున్నారు.

ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎస్​ఈసీ నిర్ణయంపై సీఎం జగన్​ ఇప్పటికే గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్నికల కమిషనర్​తో గవర్నర్​ చర్చించనున్నట్లు సమాచారం. మరో పక్క జగన్ ప్రెస్ మీట్ పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ ఎవరు చెప్పినా వినరు అనేదానికి ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సంఘంపై జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. క-రో-నా వై-ర-స్‌ ప్రపంచం మొత్తం మహమ్మారిగా మారిందన్న చంద్రబాబు... క-రో-నా బా-రి-న-ప-డి-న వారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయిందన్నారు. క-రో-నా-తో ఇప్పటివరకు 5వేల మందికి పైగా చనిపోయారని.. చైనా, ఇటలీలో ఔ-ష-ధా-ల దుకాణాలు తప్ప, అన్నీ మూసివేశారని తెలిపారు. మనుషుల ప్రా-ణా-ల కంటే ముఖ్యమా ఎన్నికలు అని ప్రశ్నించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, అధికారుల తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. వైకాపా శ్రేణులు పోలీసుల అండతో దౌ-ర్జ-న్యా-ని-కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. సీఎం జగన్​ రాష్ట్రాన్ని మరో పులివెందులగా మర్చారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్​ రాష్ట్రాన్ని పులివెందులగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పోలీసులు, అధికారుల అండతో వైకాపా నేతలు దౌ-ర్జ-న్యా-ని-కి పాల్పడుతున్నారన్న ఆయన.. ప్రత్యర్థి పార్టీల వారిని నామినేషన్లు కూడా వేయనీయడం లేదని మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలు గెలిచే చోట అధికారులను అడ్డుపెట్టుకుని నామినేషన్లు చెల్లవని చెప్పించారని వాపోయారు. ఎన్నికలు జరిగితే ప్రత్యర్థి పార్టీ ఒక్క స్థానం కూడా గెలవదా అని రామకృష్ణ ప్రశ్నించారు. విపక్ష పార్టీల నేతలు రాష్ట్రంలో పర్యటించకూడదా అని నిలదీశారు.

వైసీపీ నాయకులకి, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు, ఎన్నికల కమిషన్ వారికి సమాధానం చెప్తూ, ప్రెస్ నోట్ రిలేజ్ చేసింది. #PRESSNOTE In the contest of certain aspersions cast on the decisions taken by the State Election Commission, the factual clarification is as under. 1. The Government of India had issued a health advisory to the States to -avoid larger public gatherings some time back. On 14.03.2020, the Government of India had classified Corona virus as a 'disaster'and kept the nation in a State of preparedness. The State Election Commissioner did contact national level functionaries before taking a decision on the threat 'Corona' posed. If the aforesaid warning is de-escalated, the State Election Commission will restart the election process without loss of a single day. 2. The Model Code of Conduct (MCC) is in force during every election. The issue of house sites to individual beneficiaries is covered under the MCC.

ec 150320200 2

The Hon'ble High Court in its observations in WP (PIL) No. 177 of zOLg and 18 of 2020 observed that the State Electicin Commission is bound to follow the guidelines consistent to the guidelines of ECI and take appropriate steps to hold free and fair election without allowing to adopt the evil practices by any of the parties. The Commission is of the view that the present elections are merely put on a hold and not cancelled. As elections are likely to restart in six weeks or before, if the 'Corona' virus threat is de-escalated, a correct view is taken that the MCC will be in currency.

ec 150320200 3

3. Violence in the ongoing elections is a matter that is engaging the attention of the Commission and various political parties have been highlighting the surge of violence. This is also a subject matter in an ongoing litigation before the Hon'ble High Court in WP (PIL) No. 65 of 2020 in which the State Election Commission is the respondent. The State Election is affecting certain measures regarding Government functionaries, had acted as per the dictum of Hon'ble Supreme Court contained in the landmark judgment in Kishan Singh Tomar Vs, The Municipal Corporation of the City of Ahmedabad. Finally, the State Election Commission is a Constitutional body and the Commissioner is at par,with the Judge of High Court. All the safeguards available to a Judge of High Court are applicable to the State Election Commissioner. To attribute motives for the acts of a Constitutional functionary are highly regretted and will only weaken the institution. " అంటూ ఎలక్షన్ కమిషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

Advertisements

Latest Articles

Most Read