కరోనా వైరస్ విజ్రుంబిస్తుంది. ప్రపంచం అంతా, అతలాకుతలం అయిపోతుంది. అమెరికా లాంటి దేశాలు కూడా వణికిపోతున్నాయి. మన దేశంలో, గత మూడు రోజుల నుంచి, ఆందోళన కర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చాలా వరకు పుబ్లిక్ గుమికూడ కుండా ఎక్కడిక్కడ షట్ డౌన్ చేస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో, కరోనాని చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కరోనా వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికలు వాయిదా వెయ్యటం పై కుట్ర ఉంది అంటూ, నిన్న గోల గోల చేసారు. ఈ రోజు ఇదే విషయం పై సుప్రీం కోర్ట్ లో కేసు వేసారు. కరోనా సాకుగా చూపి, ఎన్నికలు వాయిదా వేసారని, అలా కాకుండా, ఎన్నికలు వెంటనే జరిపేలా చూడాలని కోర్ట్ ని కోరారు. జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ముందు, ప్రభుత్వం ఈ విషయం ప్రస్తావించింది. దీంతో రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

supreme 16032020 2

అయితే ఇది జరిగింది మాత్రం ఉదయం. సాయంత్రానికి వచ్చే సరికి, సుప్రీం కోర్ట్ ఒక నోటీసు ఇచ్చింది. అందులో, 17వ తేదీన కరోనా వల్ల, కోర్ట్ లో ఎలాంటి హియరింగ్ ఉండదు అని స్పష్టం చేసింది. దీంతో, ఏపి ప్రభుత్వం షాక్ తింది. ఇక మరో పక్క, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలో కూడా ఆయా స్టేట్ ఎన్నికల కమిషన్ లు, స్థానిక ఎన్నికలు వాయిదా వేసాయి. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు జరుపుతాం అని చెప్పారు. దీంతో ఇక్కడ కూడా జగన కు ఎదురు దెబ్బ అనే చెప్పాలి. రేపు కోర్ట్ లో కనుక వాదనలు వినిపిస్తే, ఈ విషయం ప్రస్తావించే అవకాసం ఉంటుంది. అదీ కాక, షన్ సింగ్ తోమర్‌ వర్సెస్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ద సిటీ ఆఫ్‌ అహ్మదాబాద్‌ కేసులో సుప్రీంకోర్టు, ఇది వరుకే, ఈ విషయం పై తీర్పు ఇచ్చింది.

supreme 16032020 3

ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఎన్నికల్ని వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి ఉందని ఆ తీర్పులో స్పష్టం చేసింది. ఇవన్నీ జగన్ కు ఎదురు అయ్యే అవకాశమే ఉంది. అయినా కూడా, సహజంగా ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో, కోర్ట్ లు కూడా జోక్యం చేసుకోవు. మరి ఈ విషయంలో కూడా జోక్యం చేసుకునే అవకాసం లేదు. ఇది ఇలా ఉంటే, మన రాష్ట్ర హైకోర్ట్ లో కూడా రేపటి నుంచి కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని, ఆదేశాలు ఇచ్చారు, చీఫ్ జస్టిస్. హైకోర్టుకు వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని, ఈ నెల 30 వరకు ఇలా చెయ్యాలని, టెస్ట్ లు చేసిన తరువాతే లోపలకు అనుమతించాలని చెప్పారు. ఇక అలాగే, కరోనా వైరస్​ ప్రభావంతో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ లాయర్లు వేసిన పిటిషన్ ​పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.

రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరిస్థితులను బట్టి రెండు మంత్రి పదవులు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో కీలక బాధ్యతలో వున్న మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు వెళ్లుతున్నారు. దాంతో వారు ఈ నెల 26వ తేదీ తమ మంత్రి వదవులకు రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఈ ఖాళీ అయ్యే స్థానంలో పదవులు ఎవరికి దక్కుతాయనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేసే మంత్రులో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలకమైన రెవెన్యూశాఖా మంత్రిగా వ్యవహరించారు. పైగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికుడా. ఇక మోపీదేవి వెంకటరమణ మార్కెటింగ్ శాఖా మంత్రిగా వ్యవహరించినా, ఆ బాధ్యతలను వ్యవసాయశాఖా మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో విషయం మంత్రులుగా రాజీనామా చేయబోయే ఇద్దరు బిసి వర్గానికి చెందిన వారే కావడం, ముఖ్యమంత్రి జగన్ తిరిగి వారి స్థానాలను భర్తీ చేసే సందర్భంలో బిసి సామాజిక వర్గీయులతోనే వాటిని భర్తీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది.

పిల్లి సుభాష్, మోపీదేవిలు ప్రాతినిధ్య వహించే ఆయా జిల్లాలకు చెందిన వారికే మంత్రులుగా అవకాశం రావొచ్చననే కథనం ప్రచారంలో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో అదే జిల్లాకు ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ కారణంగా ఖాళీ కాబోయే స్థానానికి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి అవకాశం ఉంటుందన్నారు. ఆమెకు ఇది మంచి చాన్స్ అయ్యే అవకాశంగా మారుతుందంటున్నారు. ఆమె పిల్లి సుభాష్ కు దక్కిని ఉపముఖ్యమంత్రి చాన్స్ లభించవచ్చునంటున్నారు.

ఎన్నికలకు కొన్నాళ్ళకు ముందు ఆమె తెలుగుదేశం నుంచి వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చారు. అక్కడి జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనుచరురాలిగా వ్యవహరించిన రజనీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత ఆమె చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. సామాజికవర్గ పరంగా చిలకలూరిపేట ప్రాంతంలో ఉన్నారు రజనీ. ఈమెను ఉప ముఖ్యమంత్రి చేస్తారనే వాదన విన్పిస్తుంది. అయితే ప్రాంతీయ దామాషాలో ఆ అవకాశం దక్కకపోవచ్చుననే వాదన ఉంది. రజనికి కాకుండా ప్రస్తుతం మంత్రివర్గంలోనే ఉన్న మరొకరికి ఈ అవకాశం దక్కే అవకాశం ఉంటుందంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదా కాకున్నా మంత్రి వర్గంలో విడుదల రజనీ స్థానం దక్కే వీలు ఉందని అధికారపార్టీవర్గాలు భావిస్తున్నాయి. అయితే జగన్ కచ్చితంగా వీరికే మంత్రులుగా అవకాశం ఇస్తారని చెప్పలేమనే వాదన ప్రచారంలో ఉందంటున్నారు. ఈ నెలాఖరు జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ చర్చ ముగిసే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరును సీఎం జగన్‌ తప్పుబట్టిన వేళ.. ఆ పార్టీ నాయకులు కూడా విమర్శల వర్షం కురిపించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికల వాయిదా పై మాట్లాడుతూ, వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని స్పీకర్ దారుణ వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోమనండి..?. ఏం తమాషా చేస్తున్నారా?. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వ్యక్తులు కుల,మతాలకు అతీతంగా ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా వాయిదా నిర్ణయం ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. రమేశ్ కుమార్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రమేశ్ కుమార్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. మునిగిపోతున్న తెదేపా నావను కాపాడేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ఆరోపించారు. కనకపు సింహాసనం పై, శునకాన్ని కూర్చోపెట్టినట్టు, రమేష్ కుమార్ ని కూర్చో పెట్టారు అంటూ, ఏకంగా ఈసీని కుక్కతో పోల్చారు.

రమేశ్ కుమార్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. రమేష్ కుమార్​ను చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ పదవిలో నియమించారని.. ఆ రుణం తీర్చుకోవడానికే ఎన్నికలు వాయిదా వేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. రమేశ్ కుమార్ నిర్ణయాన్ని రాజకీయ కుట్రగా మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభివర్ణించారు.వికేంద్రీకరణ బిల్లును మండలిలో ఛైర్మన్ ద్వారా ఎలా అడ్డుకున్నారో.. ఎన్నికల సంఘాన్ని కూడా అదే రీతిలో చంద్రబాబు కనుసన్నల్లో నడిపించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కనీసం రాష్ట్ర అధికారాలతో సంప్రదింపులు జరపకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కరోనా వైరస్​ వల్ల వాయిదా పడలేదని.. క్యాస్ట్​ వైరస్​ వల్ల వాయిదా పడ్డాయని వైకాపా నేత అంబటి రాంబాబు ఆరోపించారు.

ఎన్నికలు వాయిదా నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. తెదేపాకు అనుకూలంగా ఎన్నికల కమిషనర్​ ప్రక్రియ నిలిపేశారని విమర్శించారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్​ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైకాపా నేత డొక్కా మాణిక్య వరప్రసాద్​ అన్నారు. పేదలకు మంచి చేకూర్చే ఇళ్ల పంపిణీని కోడ్​ సాకుతో నిలిపేశారని.. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్​ కరోనా వైరస్​ కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని రాష్ట్ర మంత్రి అనిల్​కుమార్​ యాదవ్​ తీవ్రంగా తప్పుపట్టారు. ఒక వ్యక్తి కోసమో, తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలనో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. త్రి ఫోన్​ కాల్​ వస్తే ఉదయం సమావేశం పెట్టి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపులో కీలక మలుపు చోటు చేసుకుంది. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంతో పాటు ఎన్నికల కోడ్ ఈ ఆరు వారాలు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ మే నెల చివరి వరకు సాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపుకి కోడ్ అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మే లో వేసవి సెలవులు ప్రారంభమై జూన్ లో పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం అవుతాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడం కూడా తరలింపుకి మరో అడ్డంకి కానుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. రాజధాని తరలింపు ప్రక్రియ జూన్ లోపు అయితేనే, సచివాలయ ఉద్యోగులు, పిల్లల అడ్మిషన్ లకు అవకాసం ఉంటుంది.

amaravati 16032020 2

ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన రాజధాని అమరావతి ప్రాంత రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. రైతులు తమ వాదనను మరోసారి హైకోర్టుకు వినిపించనున్నారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ప్ర తి ఒక్కరిలో నెలకొని ఉంది. వీటన్నిటికి తోడు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ఈ నెలలోనే ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు ప్రక్రియ దాదాపు ఏడాది వరకు సాధ్యం కాదన్న అభిప్రాయం విశ్లేషకులనుంచి వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఈ నెల 18వ తేదీన అమరావతిలో సమావేశం కానున్నారు.

amaravati 16032020 3

ఈ సమావేశంలో ఉద్యోగులనుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం విశాఖకు రాజధాని తరలింపుకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే వివిధ రాజకీయ పక్షాలు మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా చేసే పనులతో, ఇటు ప్రజలు, అటు ఉద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక ప్రణాళిక లేకుండా, రూల్స్ ప్రకారం వెళ్ళకుండా, తనకు ఏది తోస్తే అది చేస్తే, ఇలాగే పర్యవసానాలు ఉంటాయని, ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి రూల్స్ ప్రకారం నడుచుకోవాలని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read