కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే. తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తామేమీ చేతకానివారం కాదని అన్నారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడంతో కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తనకు గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ల తమ్ముడు, అవినీతిపరుడు.. జగన్మోహన్ రెడ్డి.. కోడికత్తిపార్టీని పెట్టుకున్నాడని, కేసీఆర్, జగన్ కలిసినా తనను ఏమీ చేయలేరన్నారు.

cbn counter 18012019

అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనలో పోటీ పడలేదని అన్నారు. అక్కడ తెలంగాణలో సెంటిమెంట్ మాట్లాడుతూ..ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఒకవైపు సీనియర్ మోదీ, ఇంకొపక్క తెలంగాణ మోదీ, మరోవైపు కోడికత్తి మోదీ ఉన్నారని... ఈ ముగ్గురు కలిసి ఏపీపై పడ్డారని, రాష్ట్రం అభివృద్ధిచెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కేంద్రసహాయనిరాకరణ చేశారని, అయినా తాము ముందుకుపోతున్నామని, అది మోదీకి మింగుడుపడడంలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతు రుణమాఫి తెలంగాణలో రూ. లక్ష ఇస్తే, ఏపీలో రూ. లక్షా 50వేలు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం ఇచ్చామని, అన్నా క్యాంటీన్లు పెట్టామని.. ఇలా ఏపీలో చేసిన అభివృద్ది, సంక్షేమకార్యక్రమాలను చంద్రబాబు వెల్లడించారు.

cbn counter 18012019

అభివృద్ధిలో పోటీపడలేక ఏపీపై దాడులు చేయడానికి వస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కేసీఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడన్నారు. కేసీఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీ దాడులా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలేది లేదన్నారు. విభజన జరిగినప్పుడు అందరూ భయపడ్డారని, విభజనతో దగా పడ్డాం.. నష్టపోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండగా ఉంటారని ఎన్డీఏలో భాగస్వాములయ్యామని, న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు.

విశాఖపట్నం జిల్లాలో తన పర్యటన ప్రారంభమైన నాటి నుంచి (3 నెలలుగా) విమానాశ్రయంలో సీసీ కెమెరాలు పనిచేయడం మానేశాయని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని విమానాశ్రయం డైరెక్టర్‌ జి.ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు ఖండిచారు. ఎయిర్ పోర్ట్ లో 65 సిసి కెమెరాలు ఉన్నాయని చెప్పారు. అవన్నీ పని చేస్తూనే ఉన్నాయని అన్నారు. ఒక్క కెమెరా ఆఫ్ అయినా, మాకు అలెర్ట్ వచ్చేస్తుందని చెప్పారు. ఏదన్నా రిపేర్ వచ్చినా, అరగంటలో రిపేర్ చేసేస్తామని అన్నారు. నెల రోజుల వరకు, ఉన్న ఫూటేజ్ బ్యాకప్ ఉంటుందని తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో సిసి కెమెరాలు లేవు అనేది అబద్ధపు ప్రచారమని చెప్పారు.

jagan 18012019

‘విశాఖ విమానాశ్రయంలో మొత్తం 65 సీసీ కెమెరాలు ఉన్నాయి. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఏదైనా కెమెరా పనిచేయకపోతే వెంటనే తెలిసిపోతుంది. అరగంటలో రిపేర్‌ చేస్తాం. విమానాశ్రయంలో నెల రోజుల ఫుటేజీ కూడా ఉంటుంది. జగన్‌పై దాడి జరిగిన రోజు(అక్టోబరు 25) కూడా సీసీ కెమెరాలు పనిచేశాయి. ఆ ఫుటేజీతోపాటు అంతకుముందు నెల రోజులు ఫుటేజీని పోలీసులకు అందజేశాం. మొత్తం 16 హార్డ్‌డి్‌స్కల సమాచారాన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఎవరో కావాలనే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అసత్య ప్రచారాలు, ఎయిర్ పోర్ట్ లో సిసి టీవీలు ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాయి. అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చాం’ అని ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.

jagan 18012019

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో ప్రముఖులు విశ్రాంతి తీసుకునే ప్రాంతాన్ని ‘వీఐపీ లాంజ్‌’గా పేర్కొంటారు. ఏఏఐ పరిభాషలో దానిని ‘రిజర్వుడ్‌ లాంజ్‌’గా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకూడదని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఎస్‌) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ లాంజ్‌లోకి వెళ్లే మార్గం, వచ్చే మార్గం సీసీ కెమెరాల పరిధిలో ఉంటాయి. కానీ లోపల ఏమి జరుగుతున్నదీ రికార్డు చేయడానికి ఎటువంటి కెమెరాలు ఉండవు. జగన్‌పై ఇదే లాంజ్‌లో దాడి జరిగింది. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ ఘటన రికార్డు కాలేదన్నారు.

 

వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

raitupadhkam 18012019

ఎకరాకు ఎంత మొత్తం ఇవ్వాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు, పథకం పేరును ఖరారు చేయాల్సి ఉంది. కేవలం భూ యజమానులకే కాకుండా... కౌలు రైతులకు కూడా మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. రైతులు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకోసం వెతుక్కునే అవసరంలేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం రైతుకు నేరుగా కొంత ఆర్థికసాయం చేయాలన్న ఉద్దేశంతో ఉంది. భూమిని స్వయంగా సాగుచేసుకునే వారితోపాటు, కౌలుకు తీసుకున్న రైతులకూ సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

raitupadhkam 18012019

రైతే భూమిని సాగు చేసుకుంటూ ఉంటే నేరుగా ఆయనకే లబ్ధి చేకూరుస్తారు. ఒకవేళ కౌలుకు ఇచ్చి ఉంటే... సహాయాన్ని ఇద్దరి మధ్య పంచితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇలా చేస్తే ఇద్దరికీ ఊరటగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రైతులకు సాయం చేయడంలో ఆదర్శ రాష్ట్రంగా ఉన్నామని... వారిని మరింతగా ఆదుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇన్‌పుట్‌ సబ్సిడీ, విత్తనాలు, ఎరువుల సరఫరా, పశుపోషణకు సాయం, సాగునీరు, కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా మద్దతు ధరతో పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి పథకాలు, చర్యల ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని... ఇంకా ఏం చేస్తే బాగుంటుందో పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం కొల్‌కతా వెళ్లనున్నారు. రేపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆధ్వర్యంలో కొల్ కతాలో నిర్వహిస్తున్న ర్యాలీలో ఆయన పాల్గొంటారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటే ఈ ప్రదర్శనకు చంద్రబాబుతో పాటు కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్‌ కేజ్రీవాల్, ఇతర పార్టీల నేతలు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విపక్షాల ఐక్యతను చాటే ఈ ర్యాలీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ సాయంత్రం కోల్‌కతా వెళ్లనున్నారు.

koklata 1801201

మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ దూరంగా ఉండగా, కాంగ్రెస్‌ తరఫు నుంచి మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు నేతలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు , కర్ణాటక, దిల్లీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, అరవింద్‌ కేజ్రీవాల్ పాల్గొననున్నారు. అలాగే శరద్‌ యాదవ్‌, స్టాలిన్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ హాజరుకానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకు మమతా బెనర్జీ నిర్వహించనున్నర్యాలీకి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర మంచ్‌ అనే రాజకీయ బృందం తరఫు నుంచి ఆయన హాజరవుతున్నట్లు ప్రకటించి కమలనాథులను షాక్ లో ముంచెత్తారు.

koklata 1801201

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19న కోల్‌కతాలో నిర్వహించే భారీ విపక్ష సభ భాజపాకు మృత్యుగంట మోగిస్తుందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా సీట్ల సంఖ్య 125కు మించదన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిచే సీట్లు భాజపా స్థానాలకన్నా ఎక్కువగా ఉంటాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తులుగా మారతాయన్నారు. సభను నిర్వహించే బ్రిగేడ్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను ఆమె గురువారం పరిశీలించారు. తానేమీ చెప్పదలచుకోలేదని, విపక్ష నేతలు మాట్లాడేదే వింటానని, అంతా ఏకాభిప్రాయంతోనే జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేజ్రీవాల్‌, కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు ఫరూఖ్‌అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌, డీఎంకే నేత స్టాలిన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌సింగ్‌, , జేవీఎం నేత బాబూలాల్‌ మరాండి తదితరులు హాజరుకానున్నారు.

Advertisements

Latest Articles

Most Read