సోమవారం ఉదయం టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రూ. 10వేలు ఆర్థికసాయం, రైతులకు పెట్టుబడి సాయం పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వృద్ధాప్య, వికలాంగ, ఇతర సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అన్నదాతలకూ ఆర్థిక వరం ప్రకటించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

cabinet 19012019

దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ఇప్పటికే మొదలైంది. ప్రతి రైతుకు పెట్టుబడి సాయం చేసేందుకు కొత్త పథకానికి ఏపీ సర్కార్ యోచిస్తోంది. రైతుబంధు మాదిరి కాకుండా కౌలు రైతులకూ వర్తింపు చేయాలని భావిస్తోంది. ఈనెల 21న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకంపై చర్చించి, ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రైతు పెట్టుబడి సాయంపై ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్‌ నుంచే అమలు చేయాలని ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పంటల భీమాతో రైతులకు ఉపయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు ఆ పథకం పనితీరుమీద నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. దీనికితోడు పంట కుంటల ఏర్పాటు ద్వారా వచ్చిన ఫలితాలను నెమరవేసుకుని వ్యవసాయ రంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. రైతు రుణమాఫీ ప్రకటిస్తే ఏమిటి ? లేదా ప్రత్యామ్నాయంగా ఎటువంటి కార్యక్రమాన్ని అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ? అనే అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘమైన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

cabinet 19012019

జనవరి నెలాఖరులోగా మరో కొత్త, అతిపెద్ద సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. బహుశా అది రుణమాఫీకి సంబంధించిన పథకమే అయ్యే అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల భొగట్టా. అదేవిధంగా జెడ్‌బీఎన్‌ఎఫ్‌ (జీరో బడ్జెట్‌ నాచరుల్‌ ఫామింగ్‌)పై రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయం ఖరీదుగా మారిన నేపథ్యంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల వ్యయాన్ని తగ్గించడంతోపాటు ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో కేటాయింపులు, ఖర్చులను పరిశీలించి ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి చేయాల్సిన హామీలపై నిపుణులు, ఆయన సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు అంశం ప్రధానమైనదైనప్పటికీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్రంలో ఎన్ని కల వాతావరణం అలముకున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ చతురతకు పదును పెడుతూ ప్రత్యర్ధి పార్టీలకు రోజుకో సవాల్‌ విసురుతున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం అమరావతి చేరుకున్న చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకవైపు గెలుపు గుర్రాలను అన్వేషిస్తూనే మరోపక్క అభివృద్ధి, సంక్షేమంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్లను రెట్టింపుచేసి అందరినీ ఆశ్చర్యపర్చిన చంద్రబాబు రోజుకో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ ఎన్నికల రేసులో ముందుకు దూసుకెళ్తున్నారు. సామాజిక భద్రత పింఛన్ల రెట్టింపు కార్యక్రమాన్ని ప్రకటించిన 24 గంటల్లో గృహ వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల తగ్గించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

cbnn 19012019

మరో 24 గంటల సమయం తీసుకుని వ్యవసాయ విద్యుత్‌ను 7 గంటల నుండి 9 గంటలకు పెంచేయోచనలో ఉన్న అంశాన్ని వెల్లడించారు. పండుగ అనంతరం కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత కాన్పులు, ప్రమాద భీమా రూ. 5 లక్షలకు పెంపు వంటి పథకాలను ప్రకటించారు. ఇలా రోజుకో అంశంపై సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రత్యర్ధి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కారణమైన ఆదరణ పథకాన్ని ఆదరణ – 2 పేరుతో తిరిగి జీవంపోయడంతోనే ఆయన సంక్షేమ పథకాలపై దృష్టిసారించినట్లు అర్థమౌతుందని రాజకీయ విశ్లేషకులు, పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అక్కడి నుండి ప్రారంభమైన సంక్షేమ పథకాల పరంపర రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది.

cbnn 19012019

ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లోనూ రుణమాఫీ అమలు చేస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సంగతి పాఠక విధితమే. ఈనేపథ్యంలోనే రైతాంగ సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కసరత్తుచేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పంటల భీమాతో రైతులకు ఉపయుక్తమైన కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు ఆ పథకం పనితీరుమీద నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో గెలుపు అంశం ప్రధానమైనదైనప్పటికీ, రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఒకవైపు అభ్యర్థుల ఎంపిక మరోవైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈనెల 30 నుంచి అసెంబ్లి సమావేశాలు ప్రారంభం కానుండడంతో, ఈవిషయమై వేగంగా పావులు కదుపుతున్నారు. ఒక పక్క మోడీ, జగన్, కేసీఆర్ నెగటివ్ అజెండాతో వస్తుంటే, చంద్రబాబు మాత్రం పోజిటివ్ అజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు.

తృణమూల్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఐక్య ర్యాలీ కోల్‌కతాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ శత్రఘ్ను సిన్హా పాల్గున్నారు. మోడీ పై రెబల్ గా ఉన్న శత్రఘ్ను సిన్హా, ఈ సమావేశానికి హాజరుకారని బీజేపీ భావించింది. కాని ఆయన హాజరై, బీజేపీకి షాక్ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రఫేల్ కుంభకోణంపై విపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి బీజేపీ రెబల్ ఎంపీ శత్రఘ్ను సిన్హా డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఎవరు బాగుపడ్డారో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. పేద, సమాన్య ప్రజలు పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. అంత ఇబ్బందులు పడినందుకు ఏమైనా మంచి జరిగిందా అంటే అదీ లేదన్నారు.

bjp 19012019

జీఎస్టీతో చిన్న వ్యాపారుల పరిస్థితి ఏమైందో మోడీకి తెలియదా అని నిలదీశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జీఎస్టీని వ్యతిరేకించిన మోడీ... ఆయన ప్రధాని అయిన తర్వాత అమలు చేయటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అందుకే కేంద్రంలో కొత్త నాయకత్వం రావాలి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ " కాపలాదారే దోచుకున్నారు" అంటున్నారు అందుకు మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ ఊహించని పరిణామం నుంచి తేరుకున్న బీజేపీ, సొంత ఎంపీ పైనే ఎదురు దాడి మొదలు పెట్టింది. ఐక్యతా ర్యాలీకి భాజపా ఎంపీ శత్రుఘ్న సిన్హా హాజరుకావడంపై భాజపా నేత రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

bjp 19012019

‘కొంతమంది తెలివి వేరే విధంగా ఉంటుంది. కొంతమంది భాజపా స్టాంప్‌తో అధికారంలోకి వచ్చి అన్ని సౌకర్యాలు పొందుతారు. అందుకే అలాంటి వాళ్లు తమ సభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అదే విధంగా వేదికలపైకి ఎక్కి సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశవాదుల్లాగా మారతారు. భాజపా వారిని పరిగణనలోకి తీసుకుంటుంది’ అని రూడీ.. సిన్హాను హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా చేపట్టారని, దాని వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ప్రజలు చూశారు. రానున్న ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌తో వైకాపా అధినేత జగన్ స్నేహం అంశం ప్రస్తుతం రాయలసీమలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మైత్రి ఓట్ల పంట పండిస్తుందా అన్న చర్చ జోరందుకుంది. అయితే కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రులను అసభ్య పదజాలంతో దూషించిన కేసీఆర్‌ను సీమ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలవకుండా అడ్డుకున్నారన్న కారణంగా రాయలసీమలోనూ కేసీఆర్‌కు వ్యతిరేక పవనాలు ఉన్నాయని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమలో బలంగా ఉన్న వైకాపా అధినేత జగన్ ఆ పట్టును నిలుపుకుంటారా అన్న ప్రశ్నకు కేసీఆర్‌తో జత కట్టడం జగన్‌కు నష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

jagan 19012019

రాష్ట్ర విభజన సమయంలో పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్, హంద్రీ-నీవా కాలువలు మూసివేయాలని డిమాండ్ చేసిన కేసీఆర్ విభజన చివరి దశలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు సైతం వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు జగన్‌తో ఏ రకంగా స్నేహం చేసినా ఆ ప్రభావం వైకాపాపై ఖచ్చితంగా ఉంటుందని వారంటున్నారు. గత కొంతకాలం వరకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా వైకాపాపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదని, అయితే తాజాగా కేటీఆర్ జగన్ చర్చలు, భవిష్యత్తులో కలిసి ముందడుగు వేయడానికి సంకేతాలు ఇవ్వడం వంటి చర్యల నేపథ్యంలో జగన్ తీరుపై సీమ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారంటున్నారు. విభజన సమయంలో ఏం మాట్లాడినా పట్టించుకోని జనం ఇటీవలి తెలంగాణ ఎన్నికల సమయంలో పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులపై వ్యతిరేకత ప్రదర్శిస్తూ రాయలసీమ నేతలను వ్యక్తిగతంగా దూషించడాన్ని తప్పుబడుతున్నారని స్పష్టం చేస్తున్నారు.

jagan 19012019

రాయలసీమకు వరప్రసాదినిగా ఉన్న మూడు ప్రధాన ప్రాజెక్టుల విషయంలో భవిష్యత్తులో కేసీఆర్, నరేంద్ర మోదీ ఒత్తిడితో జగన్ మెత్తబడితే రాయలసీమకు తీరని నష్టం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని విశే్లషకులు పేర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోయినా గత నాలుగేళ్లలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి హంద్రీ-నీవా, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి కాలువల నిర్మాణ పనులను దాదాపుగా పూర్తి చేయించగలిగారని వారు వెల్లడిస్తున్నారు. దీని వల్ల అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని రైతుల్లో ఆనందం కనిపిస్తోందని, అయితే ఈ నీరు చంద్రబాబుకు ఓట్ల రూపంలో ప్రతిఫలాన్ని ఇస్తుందో లేదో కానీ జగన్, కేసీఆర్ స్నేహంతో సీమ ప్రజలు చంద్రబాబుకు మద్దతు తెలిపే అవకాశాలు మెరుగవుతాయని వారంటున్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్, జగన్ ఒకే నావలో పయనిస్తున్నారన్న టీడీపీ విమర్శలకు జగన్ బలాన్నివ్వడమే ఇందుకు కారణమని వారంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read