ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై ఎన్ఐఏ విచారణ, కోడి ఈక కూడా పీకలేక పోయింది. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో ఎన్ఐఏ చార్జిషీట్లో పలు అంశాలు పేర్కొంది. సిట్ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్ఐఏ చెప్పింది. కోడి కత్తితో శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని సెక్షన్ 307 ప్రకారం సిట్ అభియోగాలు నమోదు చేసింది. శ్రీనివాసరావు.. జగన్ అభిమాని అని తెలిపింది. సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టంచేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్ఐఏ దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. సర్.. మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్ఐఏ చార్జిషీట్లో వెల్లడించింది. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు చార్జిషీట్లో పేర్కొంది.
ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా తెలిపింది. పార్టీ నేతలతో కలిసి జగన్ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.. వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్లు స్పష్టం చేసింది. ఎడమ భుజంపై గాయం అయిందని డాక్టర్ ఇచ్చిన నివేదికను ఎన్ఐఏ ప్రస్తావించింది. సెంటి మీటర్ పొడవు.. అర సెంటిమీటర్ వెడల్పు.. మూడున్నర సెంటిమీటర్ లోతు గాయమైనట్లు తెలిపింది.
వైజాగ్ లో కోడి కత్తితో 0.5 cm దాడి చేపించుకున్న తరువాత, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్. హైదరాబాద్ వెళ్ళగానే 0.5 cm గాయం కాస్తా 9 cm గాయం అయ్యి, కుట్లు కూడా పడ్డాయి. అంతే మనోడు మంచానికి అడ్డం పడుతూ స్టిల్స్ ఇచ్చి, లోటస్ పాండ్ కు వెళ్ళిపోయాడు. దాదపు 20 రోజుల తరువాత వచ్చి మీటింగ్ పెట్టారు. 0.5 cm గాయం అంటే ప్రతి రోజు మన ఇంట్లో ఆడవాళ్ళకు కూరాగయలు కోసే సమయంలో అయ్యే గాయం అంత.. దానికి 20 రోజులు డ్రామా ఆడి, మోడీతో కలిసి ఎన్ఐఏకి కేసు బదిలీ అయ్యేలా చేసారు. కాని, అక్కడ ఒక్క సాక్ష్యం కూడా చంద్రబాబు మీద తోయ్యటానికి లేకపోవటంతో, రిస్క్ ఎందుకులే అనుకుని కేసు మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి, ఎన్ఐఏ ని అడ్డు పెట్టుకుని, మరో డ్రామా ఆడాలని చూసిన జగన్ బాబు మరో డ్రామా ఇలా ఫెయిల్ అయ్యింది.