జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అందరూ చూసాం.. అందులో కేంద్రం, మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని, 75 వేల కోట్లు రాష్ట్రానికి రావాలని తేల్చారు... అందులో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు... అయితే, ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వివరాలు చెప్పిన పవన్ కళ్యాణ్, తరువాత ఆ విషయం మర్చిపోయారు... అనూహ్యంగా, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై పోరాడుతున్న చంద్రబాబు పై రివర్స్ అయ్యారు... అంతే కాదు, మార్చ్ నెల నుంచి ఎన్నో మీటింగ్ లు పెట్టినా, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ లోని అంశాలు కనీసం ప్రస్తావించ లేదు...

jp 08012019 2

అసలు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అనేది, మర్చిపోయారు... తరువాత ఏమి చెయ్యాలి అనే కార్యాచరణ లేదు... దీంతో ఆ కమిటీలో జయప్రకాశ్ నారాయణ లాంటి పెద్దలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు... పవన్ కళ్యాణ్ రాజకీయ గేమ్ ఆడాడు అని, కేంద్రం ఆడించిన డ్రామా అని గుర్తించారు... దీంతో జయప్రకాశ్ నారాయణ స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసారు... ఇందులో అందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, నిపుణులు మాత్రమే ఉన్నారు... జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలాగ, ఉండవల్లి, పవన్ కళ్యాణ్ లాంటి స్వార్ధ పరులని ఇందులో తీసుకోలేదు.. తాజాగా జేపీ, ఈ కమిటి రిపోర్ట్ బయట పెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు అంతంత మాత్రంగానే జరిగిందని, ఇంకా చాలా నిధులు ఆంధ్రప్రదేశ్‌కు రావలసి ఉందని నిపుణుల కమిటీ వెల్లడించింది. హామీలు యథాతథంగా అమలు జరిగితే పోలవరం ప్రాజెక్టు నిధులు మినహా ఇంకా రాష్ర్టానికి రూ.75 వేల కోట్లు రావలసి ఉంటుందని స్పష్టంచేసింది.

jp 08012019 3

విభజన చట్టంలో సంపూర్ణంగా అమలు కావాల్సిన అంశాలు, బిల్లు చర్చ సందర్భంగా రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలుపై లోతైన అధ్యయనం చేసిన జయప్రకాష్‌ నారాయణ్‌ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ పది ముఖ్యమైన అంశాలపై సమగ్ర నివేదిక విడుదల చేసింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్రం ఉదారంగా ఆదుకోవాలని సూచించింది. కొన్ని హామీల అమలుకు కేంద్రం చూపుతున్న కారణాలు సహేతుకం కావని పేర్కొంది. విభజనకు ముందు తలసరి ఆదాయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉండగా... విభజన అనంతరం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున నిలిచిందని తెలిపింది. కేంద్రం గ్రాంట్లు, ప్రత్యేక సాయం రూపంలో నిధులివ్వాలని సూచించింది. ప్రత్యేక హోదా బదులుగా ఇస్తామన్న ప్రత్యేక సాయం.. పేరుకే తప్ప అమల్లో ఏ రకంగా ఉపయోగం లేదని అభిప్రాయపడింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎలా అమలు చేయొచ్చో వివరించింది. రెవిన్యూ లోటుపై కేంద్రం వాదన ఎలా తప్పో కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కేంద్రాన్ని ఎందగాట్టాటమే కాదు, ఎలా చెయ్యాలో కూడా చెప్పి, సంపూర్ణ నివేదిక ప్రజల ముందు ఉంచుంది.

ఆంధ్రప్రదేశ్‌కు జీవన్మరణ సమస్యగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఆపటానికి ప్రయత్నాలు చేస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పోలవరం పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి మనసు లేదని, పోలవరం శాస్వతంగా ఆగిపోయే కుట్ర జరుగుతుందని, అందుకే భారతదేశంలోనే అత్యున్నతమైన, ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టుకు డిజైన్లు, తుది అంచనాలను కేంద్రం ఆమోదించడం లేదని విమర్శించారు. సంవత్సరం క్రితం కాంట్రాక్టర్ ను మార్చటం దగ్గర నుంచి, డీపీఆర్ - 2 ఆమోదించకుండా కాలయాపన చేస్తున్న ప్రాతి విషయం చెప్పారు. పోలవరం డిజైన్ అనుమతులు ఎలా కాలయాపన చేస్తుంది వివరించారు. ఖర్చు రాష్ట్రం పెట్టుకుంటుంటే, కేంద్రం అవి ఇవ్వటానికి సంవత్సరాలు తీసుకుంటుందని, దీని వల్ల రాష్ట్రం పై వడ్డీ భారం పడుతుందని అన్నారు. గడ్కరీ పోలవరం వచ్చిన సందర్భంలో, ముందుగా 10 వేల కోట్లు ఇవ్వమంటే, ఇస్తామని చెప్పి వెళ్లిపోయారని, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదని, మన పనులు ఆపకుండా, మన నిధులు ఖర్చు పెడుతున్నామని అన్నారు.

cbn 08012019 2

పోలవరం కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించిన నేపథ్యంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన పైలాన్‌ ఆవిష్కరించారు. జాతీయ మీడియా ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘పోలవరం కాంక్రీట్‌ పనుల్లో ప్రపంచ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది. 24 గంటల్లో నిర్విరామంగా 32,315.5 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేసి ప్రపంచానికి తెలుగువారి సత్తా చూపాం. మరెవరూ ఈ రికార్డును బ్రేక్‌ చేయలేరు. ప్రాజెక్టు సామర్థ్యం, సమయం దృష్టిలో ఉంచుకుని ఈ విషయం చెబుతున్నాను. ఇది ఒక్క రోజులోనే సాధించిన విజయం కాదు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చేసి సమీక్షిస్తున్నా. సీడబ్ల్యూసీ, పీపీఏతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించినవారందరికీ ధన్యవాదాలు. డయాఫ్రమ్‌వాల్‌ విషయంలో నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు ప్రాజెక్టు నిర్మాణం జరిగేది కాదు. కెల్లర్‌, ఎల్‌అండ్‌టీ, నవయుగ వంటి సంస్థలు వెనక్కు తగ్గితే ఈ దశకు వచ్చేది కాదు. నవయుగ ఒక యాగంలా ప్రతిరోజూ పని చేస్తోంది. ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికం. 670 అవార్డులు వచ్చినా రాని తృప్తి పోలవరం ప్రాజెక్టుతో వచ్చింది. మార్చిలో 65,000 క్యూబిక్‌ మీటర్ల బెంచ్‌మార్కును సాధించాలి. రాష్ట్రానికి జీవన రేఖలాంటి ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంపై చాలా అసంతృప్తితో ఉన్నాం."

cbn 08012019 3

"ప్రాజెక్టు తుది అంచనాలో రూ.33,000 కోట్లు భూసేకరణ, సహాయ పునరావాసానికి, రూ11,000 కోట్లు ప్రధాన ప్రాజెక్టుకు, రూ.45,000 కోట్లను కుడి, ఎడమ పవర్‌ హౌస్‌లకు చెల్లించాలి. పెరిగిన భూమి ధరలు చెల్లించడం లేదు. రూ.58,000 కోట్ల అంచనా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రాజెక్టు విషయంలో పీపీఏ, సీడబ్ల్యూసీ సహకరించాయి. కేంద్రానికే దయలేదు. జాతీయ ప్రాజెక్టుగా డీపీఆర్‌ను ఆమోదించండి. కాలయాపన చేస్తే జాతి క్షమించదు. మేం ఈ ప్రాజెక్టును ఆపేస్తే ఆదే ఈ ప్రాజెక్టుకు ముగింపు అవుతుంది. 2019 జూన్‌ నాటికి గ్రావిటీతో నీళ్లిస్తాం. భవిష్యత్తులో ఐదు నదులను అనుసంధానం చేస్తాం. ఎక్కడ కరువుంటే అక్కడకు నీరు పంపొచ్చు. 24 ప్రాజెక్టులు త్వరలోనే జాతికి అంకితమిస్తాం. 2019 జూన్‌లో వర్షాలు పడగానే పోలవరం నుంచి నీళ్లిస్తాం’ అని తెలిపారు.

మోడీ, షా ని తట్టుకోలేక, ఒక్కో పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మోడీ పై ఎదురు తిరిగిన దగ్గర నుంచి, ఎదురు లేదు అనుకున్న, మోడీ-షా పతనం మొదలైంది. తెలుగుదేశం పార్టీ, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కమలానికి కటీఫ్ చెప్పాయి. అటు శివసేన సైతం బీజేపీపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోంది. తాజగా, భారతీయ జనతా పార్టీకి మరో ప్రాంతీయ పార్టీ షాకిచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. అస్సాంకు చెందిన అసోం గణ పరిషత్ (ఏజీపీ) స్థానికి అధికా పార్టీ బీజేపీ నుంచి పొత్తు విరమించుకుంటున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు. పౌరసత్వ (సవరణ) బిల్లు 2016కు వ్యతిరేకంగా తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.

modi 07012019

బిల్లు విషయంలో ముందుకెళ్తే పొత్తు తెగతెంపులు చేసుకుంటామని గతంలోనే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విస్పష్టంగా చెప్పామని ఏజీపీ ప్రతినిధి దిలీప్ పత్గిరి మీడియాతో చెప్పారు. అయినప్పటికీ బీజేపీ ఆ బిల్లుపై ముందుకెళ్తామని ప్రకటించడంతో పొత్తుకు మంగళం పలుకుతున్నామని చెప్పారు. ‘‘పౌరసత్వ బిల్లు విషయమై బీజేపీ నుంచి ఏజీపీ వైదొలగాలని క్రిష్ణక్ ముక్త్ సంగ్రామ్ సమితి నేతృత్వంలో 70 సంస్థలు మాపై (ఏజీపీ) ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకుండా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేశాం. అయితే మంగళవారం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఈ విషయమై ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసుకుని వైదొలగుతున్నట్లు స్పష్టం చేశాం’’ అని పార్టీ అధికార ప్రతినిధి దిలిప్ పత్గిరి తెలిపారు.

modi 07012019

పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత్‌లో ఆరేడేళ్లుగా నివసిస్తుంటే..వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐతే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు..ముఖ్యంగా అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టంతో అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ప్రజల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఏజీపీ.. ఆ మేరకు కమలంతో కటీఫ్ చేసుకుంది.

ఏపీ విపక్షం వైసీపీకి కీలక నేత గుడ్‌ బై చెప్పనున్నారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరుడు, వైసీపీ క్రియాశీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఆదిశేషగిరిరావు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నారు. ఈ నేపథ్యంలో నేడో రేపో ఆయన రాజీనామా చేయనున్నారని తెలిసింది. సీఎం చంద్రబాబుకు ఆదిశేషగిరిరావు దగ్గర బంధువు. తన సోదరుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడు జయదేవ్‌ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

aadi 08012019

అయినా, బంధుత్వాన్ని పక్కనపెట్టి మరీ వైసీపీ విజయానికి 2014లో ఆయన కృషి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో కృష్ణ, మహేష్ బాబు అభిమానులంతా వైసీపీకి మద్దతివ్వాలని బహిరంగ ప్రకటన చేసిన ఆదిశేషగిరిరావు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఖాతాలో మరో వికెట్ పడిందని అంటున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేష్‌బాబుకు బాబాయ్‌ అని ఆదిశేషగిరిరావు... అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని‌కారణాలతో పార్టీలో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆదిశేశగిరిరావు... అందుకే కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని... ఏ పార్టీలో చేరే విషయం త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు.

aadi 08012019

ఇప్ప‌టికే ఈ విష‌యంపై ప‌లుద‌ఫాలుగా కుటుంబ‌స‌భ్యుల‌తోనూ, స‌న్నిహితుల‌తోనూ చ‌ర్చించిన ఆదిశేషగిరిరావు నేరుగా జగన్‌కు రాజీనామా లేఖ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్ప‌టికే సోద‌రుడి అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ తెలుగుదేశం పార్టీ ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ లో కొనసాగారు. కాని జగన్ వైపు నుంచి సరైన గౌవరం లేకపోవటంతో, ఇక ఏ మాత్రం పార్టీలో ఉండటం స‌హేతుకం కాద‌ని అందువ‌ల్లే రాజీనామాకు సిద్ధమైన‌ట్టు స‌మాచారం. అయితే త్వరలో టీడీపీలో ఆదిశేషగిరిరావు చేరనున్నారంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అయితే ఆదిశేషగిరిరావు మాత్రం, ఈ విషయం పై ఇంకా ఏమి చెప్పలేదు. అర్ధంత‌రంగా పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలపై ఈ రోజు మీడియాతో చెప్పనున్నారు.

Advertisements

Latest Articles

Most Read