మన రాష్ట్రంలో ఒక బ్యాచ్ ఉంది. రాష్ట్రం బాగుంటే ఏడుస్తారు, రాష్ట్రం ఏడిస్తే నవ్వుతారు. పక్క రాష్ట్రంలో మనల్ని కుక్కలు అన్నాడు గెలిస్తే, సంబరాలు చేసుకుంటారు. ప్రక్రుతి విపత్తులు వస్తే, మమ్మల్ని ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది అంటూ, సంబర పడతారు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించాలి. అయితే నిన్న రాష్ట్రంలో జరిగిన సంఘటనతో మరో మారు ఈ బ్యాచ్ ఆక్టివేట్ అయ్యింది. నిన్న పోలవరం జీవనాడి పోలవరంలో మొదటి గేటు బిగింపు ప్రక్రియ మొదలైంది. దీంతో ఒక పార్టీ ఏమో అసలు, పోలవరంలో పునాదులు కూడా అవ్వలేదు అంతా షో అంటూ, తన పత్రికలో రాసుకుంది. ఇంకో పార్టీ కోతి మూక ఏమో, అసలు పోలవరంలో గేటులు ఎందుకు, అంటూ తిక్క సేనతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ, వికృత ఆనందం పొందుతున్నారు. ఎవరైనా రాష్ట్రంలో శుభం జరుగుతుంటే సంతోషిస్తారు, కాని మనకు మాత్రం ఏడుస్తారు. రాష్ట్రానికి మంచి జరిగినా ఏడుపే, ఎందుకంటే ఆ మంచి చేస్తుంది చంద్రబాబు కదా. అందులోనూ పోలవరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణాకు ఇబ్బంది కదా, అందుకే ఏపిలో పార్టీ టైం రాజకీయాలు చేసే, ఈ బ్యాచ్ మన మీద పడి ఏడుస్తూ ఉంటారు.

polaavaram 25122018 2

అయినా, మొదటి గేటుకే ఇన్ని ఆర్తనాదాలు ఉంటే, ఇంకా 48 ఉన్నాయి, ఇవన్నీ పూర్తవుతూ ఉంటే ఏమైపోతారో. ఇక ఈ గేట్ల వివరాలు తెలిస్తే, మతి పోతుంది. స్పిల్‌వేలో మొత్తం 52 బ్లాకుల్లో 48 గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ గేట్ల తయారీకి 18 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నారు. దేశంలోనే అతిపెద్దదైన ఈ ప్రాజెక్టులో ఎక్కడా లేని విధంగా అతి భారీ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. క్కొక్క గేటుకు 300 టన్నుల ఐరన్‌ వాడుతున్నారు. గేటు వెడల్పు 16 మీటర్లు కాగా.. ఎత్తు 20 మీటర్లు. ఒక గేటు తయారీకి సుమారు నెల రోజుల సమయం పడుతుంది. అదే గేటును స్పిల్‌వేలో బిగించడానికి 60 రోజులు పడుతుంది. కాగా.. అన్ని గేట్ల బిగింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగనుంది. ఇప్పటికే గేట్ల తయారీ పనులు 62.48 శాతం పూర్తయ్యాయి. ఇందుకు అవసరమైన 192 హారిజాంటల్‌ ఆగర్స్‌ సిద్ధం చేశారు. ఇంకోవైపు.. జపాన్‌ నుంచి రావలసిన 96 బుష్‌లు ఇప్పటికే వచ్చేశాయి. జర్మనీ నుంచి హైడ్రాలిక్‌ సిలిండర్లు రావలసి ఉంది. 00 టన్నుల బరువున్న గేటును పైకి లేపడానికి అత్యంత సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తున్నారు. దీని కోసం స్పిల్‌వేలోనే ఒక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేసి దీనిలో కంట్రోల్‌ ప్యానెల్‌ స్కాడా సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు.

polaavaram 25122018 3

ఈ స్కాడా సిస్టమ్‌లో ప్రాజెక్టు నుంచి.. పెరిగిన గోదావరి పరివాహక ప్రాంతం మొత్తాన్నీ ఫీడ్‌ చేస్తారు. దీనివల్ల ఎగువన ఎంత వర్షం కురుస్తుంది.. ఎంత వరద ఎన్ని గంటల్లో పోలవరం జలాశయాన్ని చేరనుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. దీంతో గేట్లు ఎంత మేర పైకి లేపి.. దిగువకు వరదనీరు విడుదల చేయాలో తెలిసిపోతుంది. ఆటోమేటిగ్గా స్కాడా సిస్టమ్‌ ద్వారా గేట్లను పైకి లేపుతారు. బెకం కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇక నెలకు ఆరు గేట్లు చొప్పున గేట్లు బిగింపు పని ప్రారంభించి పనులు వేగం చేసి 48 గేట్లు ఏర్పాటు పూర్తి చేస్తామని, జలవనరుల కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అన్నారు. ప్రాజెక్టును పూర్తిచేసి జూన్‌లో గ్రావిటీ ద్వారా నీరందిస్తామని స్పష్టం చేశారు. 2016 డిసెంబరు 30న స్పిల్‌వేలో కాంక్రీటు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఈ రెండేళ్లలో ఎంతో పని జరిగిందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలపాలని చంద్రబాబు ముందుచూపుతో ఆలోచించారని.. ఆ దిశగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించారని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

సోషల్ మీడియా ఎంత కలుషితం అయిపోయిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో, స్పెషల్ టీంలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం, తెలుగుదేశం పార్టీ వెనకుబడి ఉంది. టెక్నాలజీ ప్రేమికుడిగా ఉన్న చంద్రబాబు, ఎందుకోగాని, అసలు సోషల్ మీడియాను పట్టించుకోటం లేదు అనే అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. చేసిన మంచి చెప్పుకోవటానికి కాని, ప్రత్యర్ధుల ఆరోపణలు తిప్పి కొట్టటానికి కాని స్పెషల్ టీంలు లేవు. ప్రభుత్వ పరంగా మాత్రమే, ట్విట్టర్, ఫేస్బుక్ లో చంద్రబాబుకి ఒక టీం పని చేస్తుంది. అయితే, తెలుగుదేశం పార్టీకి భిన్నంగా, అటు జగన్, ఇటు పవన్ స్పెషల్ టీంలు పెట్టుకుని, బురద చల్లుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి, దేశంలోనే నెంబర్ 1 పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ టీంని తెచ్చి పెట్టుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో, జగన్ ఏమి చేస్తాడో చెప్పటం కంటే, చంద్రబాబుని, లోకేష్ ని టార్గెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇక జనసేన కూడా, చింతలబస్తీ దేవ్ ని తీసుకొచ్చి, ఆయన ఆధ్యర్యంలో 800 మందితో హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసి మరీ, విషం చిమ్ముతున్నారు.

manikyalarao 25122018

లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు చెప్తూ, సోషల్ మీడియా మొత్తం కలుషితం చేస్తున్నారు. లోకేష్ ఏదన్నా స్పీచ్ ఇస్తున్నాడు అంటే, ఒక టీం ఏకంగా ఆయన స్పీచ్ ఫాలో అవుతా, ఎక్కడన్నా మాట తూలతారేమో అని చూసి, లోకేష్ ని హేళన చేస్తూ అనేక వీడియోలు చేస్తున్నారు. అదే విధంగా చంద్రబాబుని కూడా టార్గెట్ చేస్తూ నడుస్తున్నాయి. అయితే, ఏపి రాజకీయాల్లో బీజేపీ ఎంటర్ అయిన దగ్గర నుంచి, కుల గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కులాల మధ్య చిచ్చు పెడుతూ, రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోషల్ మీడియాలో కూడా, ఈ విధంగా నడుస్తున్నాయి. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుంటూ, మరో కులం పై తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారు.

manikyalarao 25122018

ఈ క్రమంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, సీఎం చంద్రబాబును కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మాట్లాడని మాటలు మార్ఫింగ్‌ చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని, ఓ సామాజికవర్గానికే పని చేస్తామని చంద్రబాబు చెప్పినట్టు తప్పుడు పోస్ట్‌లు పెడుతున్నారని వర్ల పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ విశ్వసనీయతను దెబ్బతీసేలా మార్ఫింగ్‌ చేసి పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. సైబర్ నేరం కింద కేసు నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం, వర్ల రామయ్య పై కూడా కులం పేరుతో దుషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన విషయం, ఆ విషయం పై కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

గత ఏడాది వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై వివరణ కోరుతూ ఒడిశా, కేంద్రప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం ట్రిబ్యునల్ సోమవారం జిల్లాకు వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య జల వాటాలు, ముంపు గ్రామాలు, వరదపోటు వంటి అంశాలపై జరగుతున్న విదానానికి చివరి మజిలీ ఆరంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన వంశధార ట్రిబ్యునల్ సోమవారం మరోసారి శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ ప్రాంతాలైన హిరమండలం, కొత్తూరు, భామిని ప్రాంతాల ప్రజలతో నేరడి బ్యారేజీ నిర్మాణంపై గల అభిప్రాయాలను రికార్డు చేసారు. గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణ ప్రాంతాన్ని ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందకమ్ శర్మ, సభ్యులు పరిశీలించారు. అక్కడ సైడ్‌వీయర్ నిర్మాణం జరిగితే ఒడిషా రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వ్యవసాయభూములు వరదపోటుకు గురవుతాయన్న వివరాలను అడికి తెలుసుకున్నారు. ఏ మేరకు ఒడిషా నుంచి దిగువప్రాంతానికి వచ్చే నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకుంటుందన్న అంశాలను కలెక్టర్ ట్రిబ్యునల్‌కు వివరించారు.

water 25122018 2

గ్రామాలు, మండలాల వారీగా రైతులు, అక్కడ ప్రజలను ట్రిబ్యూనల్ పలు అంశాలపై వారి వాయిస్‌ను రికార్డులను చేసింది. 2012, 2013లో రెండు పర్యాయాల వచ్చిన ఈ ట్రిబ్యునల్ అప్పట్లోనే ఒడిశా అభ్యంతరాల్లో వాస్తవాలు లేవన్న విషయాన్ని గ్రహించింది. అందుకే, వంశధార జలవివాదంలో అనుకూలమైన తీర్పు పొందిన ఆంధ్రప్రదేశ్ ఇకపై ఒడిశాతో జలజగడం పూర్తిగా సమసిపోయేలా మరో వాదనను ట్రిబ్యునల్ ముందు వినిపించగా, సోమ, మంగళవారాల్లో ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో వంశధార జలవివాదానికి తెరవేసేలా తుది ప్రయత్నంలో జిల్లా అధికారులంతా నిమగ్నమయ్యారు. సోమవారం ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో హిరమండలం, గొట్టాబ్యారేజీ, కాట్రగడ్డ సైడ్‌వీయర్ నిర్మాణ జరిపే ప్రాంతాలతోపాటు నేరడి బ్యారేజీ ప్రాంతంలో గల ప్రజలతో ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ నేరుగా మాట్లాడారు. అలాగే, ఆయనతోవచ్చిన సభ్యులు కూడా పలు అంశాలపై ఆరా తీసి రికార్డు చేసారు. ఒడిశాకు కేవలం 200 క్యూసెక్కుల నీటివనరులు అవసరమని, అదే ఆంధ్రాలో 4000 క్యూసెక్కులు అరవై రోజులు నిల్వ చేసుకునే అవకాశం వంశధార అనుసంధానంతో కాట్రగడ్డ వద్ద సైడ్‌వీయర్ నిర్మాణంతో ఉంటోందని ట్రిబ్యునల్ ఛైర్మన్‌కు తెలిపారు.

water 25122018 3

2000 ఆయకట్టుకు మాత్రమే ఒడిశా సర్కార్ నీటివనరులు అడిగారని, అదేవిధంగా జలవాటాలు జరిగితే 15 టి.ఎం.సి.ల నీటిని అధనంగా నేరడి బ్యారేజీ వద్ద 30 టి.ఎం.సి.ల నీటి నిల్వలు చేసే అవకాశం శ్రీకాకుళం జిల్లాకు ఉంటోందని వివరించారు. ఆంధ్రా 30 టి.ఎం.సి.ల నీటిని వినియోగించుకునేందుకు అభ్యంతరాలు ఒడిశాకు ఏమీ లేవని, ఆ ప్రభుత్వానికి కలిగిన అపోహాలన్నీ తొలగించేలా ట్రిబ్యునల్ ముందు కలెక్టర్, వంశధార ఇంజనీర్లు అంశాలన్నీ వివరించారు. 74 - 76 మీటర్లు ఎత్తులో వంశధార రిజర్వాయర్‌లో నీటి నిల్వలు చేస్తే ఒడిషాలో భూములు ముంపునకు గురి అవుతాయన్నది అక్కడ అధికారుల అపోహాలని వాటి మూలంగా ముంపునకు గురైన గ్రామాలకు, వ్యవసాయ భూములకు పరిహారం ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించిందని, అటువంటి పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వానికి జరిగే నష్టం మరేవిధంగా లేదని కలెక్టర్ ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులకు వివరించారు. మంగళవారం ఒడిషా రాష్ట్రంలో ట్రిబ్యునల్ పరిశీలన అనంతరం వంశధార జలవివాదంపై తుది తీర్పు రానున్నది.

ఢిల్లీ స్థాయిలో మోడీ, షా డ్రామాలు ఆడుతూ, సీన్ పండిస్తుంటే, ఇక్కడ ఏపిలో కూడా అదే రకమైన డ్రామాలు మొదలు పెట్టారు బీజేపీ నేతలు. ఈ రోజు చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ, రాజీనామా లేఖ పంపించారు మాణిక్యాలరావు. 4 ఏళ్ళు చంద్రబాబు పక్కనే మంత్రిగా కూర్చుకుని, పదవులు అనుభవించి, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని.. దీనికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు చెప్తూ, 15రోజుల్లోగా స్పందించాలని, లేని పక్షంలో ఆమరణ దీక్ష చేస్తాను అంటూ లేఖలో రాసారు.

manikyalarao 25122018

తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు రాజీనామా పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏపీకి ఏం చేయని బీజేపీపై పోరాడకుండా కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాడేపల్లి గూడెం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడం తన బాధ్యత అని అన్నారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు.

manikyalarao 25122018

మాణిక్యాలరావు పోలవరంపై కేంద్రంతో పోరాడి... రాజీనామా చేస్తే బాగుండేదని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని, రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని అన్నారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. మంత్రిపదవికి రాజీనామా చేసి.. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక.. అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ప్రభుత్వం తమకు ఎంతో సహకారం అందించిందని మాణిక్యాలరావు చెప్పారు. ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులు కూడా ప్రస్తావించారు. నాలుగేళ్లుమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఏమీ స్పందించని మాణిక్యాలరావు.. ఇప్పుడు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న సమయంలో రాజీనామా డ్రామాకు తెర తీశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

 

Advertisements

Latest Articles

Most Read