సోమవారం ఉండవల్లిలోని నివాసంలో తెదేపా ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. 15 రోజులుగా జాతీయ, రాష్ట్రస్థాయి పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పీపీఏలను రద్దుచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అభ్యంతరం చెప్పారని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు పేరు మార్పు తప్పు కాదని, అయితే పథకాలను తొలగించడం సరికాదని భేటీలో నేతలు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అవినీతి గురించి చెబితే సన్మానాలు చేస్తానని సీఎం జగన్ చెప్పడం.. టీడీపీ హయాంలో అసలు అవినీతి జరగలేదని ఒప్పుకోవడమేనని నేతలు వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన పనులన్నీ టీడీపీ ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి కొన్నింటిని పూర్తి చేసిందని, మరికొన్ని చివరిదశకు వచ్చాయని నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటిని ఆపేసి అవినీతి బురదల జల్లడం కరెక్ట్ కాదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇస్తామన్న జగన్.. ఇప్పుడు మళ్లీ తామే చేస్తామనటాన్ని కూడా ఈ భేటీలో ప్రస్తావించారు.

jagan 11062019

ఇప్పటికే రైతులు ఒక పంట కాలాన్ని కోల్పోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4వేల కోట్లు తెచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్రలో సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో నీటి కొరత నివారణకు అనేక ప్రాజెక్టులు ప్రారంభించిందని, ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా అవన్నీ రద్దు చేస్తామనడం కరెక్టు కాదని అన్నారు. రైతులకు రావాల్సిన రుణమాఫీ 4వ విడత, 5వ విడత కిస్తీలను వెంటనే చెల్లించేలా ఒత్తిడి తేవాల్సిఉందన్నారు. అదేవిధంగా రైతు భరోసా కూడా అక్టోబర్ 15 నుంచి అంటున్నారని, ఇది సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల ఈ ఖరీఫ్‌లోనే రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం అందకుండా పోతుందని, ఈ నిర్ణయం సరికాదన్నారు.

jagan 11062019

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, ఇతర పనులన్నీ నిలిచేపోయే పరిస్థితి తెచ్చారని అన్నారు. పీపీఎలను రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేర్కొంటే.. కేంద్ర ఇంధన కార్యదర్శే దానికి అభ్యంతరం చెప్పడాన్ని నేతలు ఈ భేటీలో గుర్తుచేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు నిలిచిపోయేలా చేయవద్దని కొత్త ప్రభుత్వానికి సూచనలు చేశారు. ప్రభుత్వాలు మారినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని, అభివద్ధి కార్యక్రమాలు, పేదల సంక్షేమంలో ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ భేటీలో నేతలంతా ముక్త కంఠంతో స్పష్టం చేశారు.

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలు, కొత్త ప్రభుత్వం నిర్ణయాలపై చర్చించారు. ‘ఒక్కసారి జగన్‌కు అవకాశం’ అనే నినాదం బాగా పనిచేసిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలు, సంక్షేమ విషయాల్లో అసంతృప్తి కనబడలేదని చంద్రబాబుతో నేతలు చెప్పుకొచ్చారు. 1989, 2004 ఎన్నికల సమయంలో ప్రభుత్వం వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, ఈసారి ఆ వ్యతిరేకత లేకపోయినా పార్టీ ఓడిపోయిందన్నారు. సామాజిక సమీకరణాలు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఈ ఎన్నికల్లో పనిచేశాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సీఎం జగన్ 10 రోజుల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపై ఈ భేటీలో చర్చించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

jagan palana 11062019

తమ హయాంలో ప్రారంభమైన పనులను పక్కన పెట్టేందుకే కొత్త ప్రభుత్వం ఈ తరహా ఆలోచనలు చేస్తోందని నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలపై అవినీతి ముద్ర వేయడానికే టెండర్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని నేతలు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా గత ప్రభుత్వానికి ఇరిగేషన్ క్రెడిట్ దక్కకూడదనే వ్యూహం కూడా ఆ నిర్ణయం వెనుక ఉందన్నారు. తన సొంత పథకాల కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ప్రతిపక్షంగా ఎక్కువ కాలం మౌనంగా ఉండటం కూడా మంచిది కాదని పలువురు నేతలు తమ అభిప్రాయాలను పార్టీ అధినేత చంద్రబాబు ముందు వెలిబుచ్చారు.

jagan palana 11062019

ఇదే సమయంలో స్పందించిన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలపై దాడుల విషయంలో నేతలు అండగా నిలవాలని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరగడం, నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడి, నరసరావుపేట, రేపల్లె, గురజాల, అనంతపురం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలను ఈ సమావేశంలో నేతలు ప్రస్తావించగా.. వీటికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి సమాచారాన్ని తెప్పించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చించాలని, తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఆ బేటీలోనే నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా అమలులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల పేర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులుగా ఆగమేఘాలపై మారిపోతున్నాయి. ఇదే సమయంలో కోటీ 50లక్షల కుటుంబాలు ప్రతి నెలా నిత్యావసర సరుకులు తీసుకునే రేషన్ కార్డుల రంగులు కూడా మారతాయని అంటున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కోన శశిధర్ రేషన్ కార్డుల మార్పునకు సంబంధించిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే రేషన్ కార్డు రంగు, దీనిపై ఉండాల్సిన చిహ్నాలు, ఫొటోలు, తదితర అంశాలన్నింటినీ పొందుపరచి ఐదు రకాల కార్డు నమూనాలను కమిషనర్‌కు అందించినట్లు తెలిసింది. కమిషనర్ శశిధర్ వాటిని పరిశీలించి రేపోమాపో తన ప్రతిపాదనలను ముఖ్య కార్యదర్శికి అందించనున్నారు.

27 days

అయితే ఈ లోప మంత్రివర్గం ఏర్పడటం, కొడాలి నాని సంబధిత శాఖకు మంత్రి అవ్వటంతో, ఇప్పుడు ఈ విషయం ఆయన వద్దకు వెళ్ళింది. అన్నీ ఒకే అయితే, కొడాలి నాని చేసే మొదటి పని ఇదే అని అంటున్నారు. రంగు మార్చి, వైసిపీ రంగు కార్డులు పెడతారా, ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇక పాత కార్డులను రంగు సహా మార్చడానికే పరిమితం అవుతారా? లేక అర్హులకు కొత్త కార్డులు అందచేస్తారా? అనే దానిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోటీ 43లక్షల 81వేల 896 రేషన్ కార్డులు చలామణిలో ఉన్నాయి. గత జనవరిలో జరిగిన జిల్లా కలెక్టర్ల చివరి సదస్సు నాటికి కొత్త రేషన్ కార్డుల కోసం 53,901 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో 6,777 దరఖాస్తులను తిరస్కరించారు. ఇక మిగిలిన వాటిపై కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా భేటీ జరిగింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై నిశితంగా చర్చించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. మర్యాదపూర్వకంగానే హోం మంత్రితో భేటీ అయ్యానన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగానే ముందుకు సాగుతున్నాయని గవర్నర్ మీడియాకు వివరించారు.

sushama 11062019 1

తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలుత భవనాల సమస్యలను పరిష్కారించామని.. త్వరలోనే మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. అయితే కొత్త గవర్నర్లు నియామకం ఎప్పుడు జరుగుతుంది..? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వచ్చే గవర్నర్లు ఎవరు..? ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణకు లేదా ఏపీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తారా..? లేకుంటే ఇద్దర్నీ కొత్తవారినే కేంద్రం నియమిస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుష్మా‌స్వరాజ్ నియమితులయ్యారని, ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

sushama 11062019 1

దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుష్మా నియామకంపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మకు ట్విటర్ వేదికగా తొలుత అభినందనలు తెలిపారు. ఇంతలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోవడంతో మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా తాను నియమితులైనట్లు వచ్చిన వార్తలపై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఈ వార్త అబద్ధమని తేల్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. ట్విట్టర్ లో గవర్నర్ ని చేసిన నాకు థాంక్స్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

Advertisements

Latest Articles

Most Read