పాత తరం ప్ర‌ముఖ హీరో సుమ‌న్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ పై హీరో సుమ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓడిపోవడానికి పవన్‌కల్యాణే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పుట్టిన తర్వాత చూసిన ఎన్నికల్లో, ఒకే పార్టీకి ఇన్ని సీట్లు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. సినిమా పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి అన్ని విధాలా ఆదుకోవాలని జగన్‌కు సూచించారు. శనివారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సుమన్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే సుమన్ చేసిన వ్యాఖ్యలపై అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

మరో పక్క పవన్ పై రోజా కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ 2019 ఎన్నికల్లో జనసేన నుంచి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయినా గెలిచివుంటే బాగుండేదని, వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి మొదటి కారణం, వాళ్ళ అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీనే అన్నారు. 2009లో చిరంజీవి అధ్యక్షడిగా ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీచేసి, అప్పట్లో 18 మంది ఎమ్మెల్యేలు గెలిచినా, ఆ పార్టీ నడపలేక అధినేత చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేశారని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా పవన్ అదే రకంగా విలీనం చేస్తారేమో అని ప్రజల్లో సందేహం వల్లే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ను ప్రజలు దూరంగా పెట్టారని చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబెర్ పదవికి మామూలు డిమాండ్ కాదు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తరుణంలో, టిటిడి బోర్డులో చోటు కోసం అటు తెలంగాణా, ఇటు ఏపి రాష్ట్రాల్లో కూడా పోటీ తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు, అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదుకోసం పైరవీలు కూడా నడుస్తున్నాయి. జగన్, కేసీఆర్ మధ్య ఎంతో స్నేహం ఉన్న నేపథ్యంలో టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం టీఆర్ఎస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి దాక చంద్రబాబు వద్ద తమ పప్పులు ఉడకకపోవటంతో, జగన్ వద్ద తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలంగాణాలో ఉన్న మంత్రుల ద్వారా సిఫారసు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జగన్‌కు ఒక సిఫార్సు లేఖ రాశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన తనకు బాగా పరిచయం ఉన్న, దొంత రమేష్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని ఈటల సిఫార్సు లేఖ రాసారు. తిరుమలలోని శ్రీవారికి భక్తులకు 18 ఏళ్లుగా రమేష్ సేవ చేస్తున్నారని ఈటల తన లేఖలో పేర్కొన్నారు. స్వామి వారికి సేవ చెయ్యటంతో పాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని ఆ లేఖలో వివరించారు. మరి ఈ లేఖ పై జగన్ ఏ విధమైన నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. టీటీడీ బోర్డు కొత్త చైర్మన్, సభ్యులను త్వరలోనే జగన్ నియమిస్తారని సమాచారం. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దాని పై వివాదం కూడా రేగింది.

అటు పార్లమెంట్‌, ఇటు రాజ్యసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీల పై బీజేపీ టార్గెట్ పెట్టిందని, వారిని తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటకల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీ పార్టీ మైనారిటీలో ఉంది. దీంతో, ఈ సభలో టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారని గ్రహించి, వారి పై ఫోకస్ పెట్టారు. వారిని తమ పార్టీలో కలుపుకొని, తమకు తగ్గిన తమ బలాన్ని కొంత మేరకు అయిన భర్తీ చేసుకొనే విధంగా ప్లాన్ వేసారు. ఇందు కోసం టిడిపి రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి మోహన్‌రావు, తోటసీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్‌, కనకమేడల పై బీజేపీ నేతలు కన్ను వేసినట్లు ఢిల్లీ నుంచి వస్తున్న విశ్వసనీయవర్గాల సమాచారం. వీరిలో కొంత మందితో, ఇప్పటికే పరోక్షంగా మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే లోక్‌సభకు టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలుగా ఎన్నిక కాగా, వారిలో ఎవరెవరు తమ పార్టీలోకి చేరతారన్న విషయం పై కూడా బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే, పార్లమెంట్‌ భవనంలో ఉన్న టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని వేరే పార్టీలకు కేటాయించే విషయం పై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్లమెంటరీ సెక్రటేరియట్‌ అధికారి ఒకరు టిడిపి నేతలకు ఫోన్‌ చేసి, మీకు అంత పెద్ద గది ఎందుకు ?అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీపీ ఆఫీస్, లైబ్రరీకి వెళ్లే దారిలో నంబర్‌ 5 గది టీడీపీపీ కార్యాలయంగా ఉంది. ఇది వరకు, సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే ఈ గదిని అన్నాడీఎంకేకి కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఈ గదితో తెలుగుదేశం పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అప్పట్లో తెలుగుదేశం వాదించడంతో, సుమిత్రా మహాజన్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు టిడిపి నుంచి ముగ్గురు ఎంపీలే ఎన్నిక కావడంతో, తిరిగి ఈ అంశం తెర పైకి వచ్చింది.

మాట తడబటం, మానవ నైజం.. కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట తడబడ్డారు అంటే, సోషల్ మీడియా కాలంలో, ఫుట్ బాల్ ఆడుకుంటారు నెటిజెన్ లు. గతంలో, చంద్రబాబు, లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా మాట తడబడితే, అప్పట్లో వైసీపీ నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చివరకు పేపర్ లో, టీవీల్లో కూడా వేసుకుని, ఆనందం పొందే వారు. ఇప్పుడు వారు అధికారంలోకి రావటంతో, అందరి ఫోకస్ వారి పైనే ఉంటుంది. తాజగా, అప్పట్లో టిడిపి నేతలని ఎగతాళి చేసిన కర్మ ఫలం, ఇప్పుడు వైసీపీ అనుభవిస్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మీడియాతో మాట్లాడుతూ, మాట తడబడ్డారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పుష్ప శ్రీవాణి సొంత జిల్లా విజయనగరం వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వచించారు.

మీడియాతో మాట్లాడిన ఆమెడిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట తడబడ్డారు. జగన్ పాలన గురించి ప్రస్తావిస్తూ, "మా ముఖ్యమంత్రి ఒకటే లైన్‌తో వెళుతున్నారు. అవినీతి పాలన అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం" అని పుష్పశ్రీవాణి తడబడ్డారు. అయితే ఆమె పక్కనే ఉన్న అనుచరులు, తప్పుగా మాట్లడారు అని అలెర్ట్ చేయడంతో తప్పు తెలుసుకున్న డిప్యూటీ సీఎం మాటమార్చారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో పెద్దఎత్తున షేర్లు కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా, ఈ వీడియో పోస్ట్ చేసారు. https://www.facebook.com/176339886320125/videos/355419888497830/

Advertisements

Latest Articles

Most Read