తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 21న ప్రాజెక్టుకును ప్రారంభించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర వెళ్లి సీఎం ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. అలాగే ఏపీలో కూడా వైఎస్ జగన్‌ను కూడా, ఈ రోజు విజయవాడ వచ్చి ఆహ్వానించబోతున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాజెక్ట్ వద్దు అంటూ ప్రతిపక్ష నేతగా జగన్ ఆందోళన చేసి, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు జగన్, ఏ మొఖం పెట్టుకుని, ఏపి రాష్ట్రానికి అన్యాయం చేసే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు అంటూ, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై భిన్న వాదనలు వినపడుతున్నాయి.

అంతే కాదు, జగన్ కాళేశ్వరంకు రావడం పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వై.ఎస్‌.జగన్‌కు, తెలంగాణ తాజా మాజీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం లేఖ రాశారు. అప్పట్లో తెలంగాణను సస్యశ్యామలం చేసి, నీరు ఇచ్చే ఉద్దేశంతో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలు పెట్టారని, ఇప్పుడు కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టి, దానికి పేరు మార్చి, డిజైన్ మార్చి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందిని, ఇలాంటి ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని, కేసీఆర్‌ చేస్తున్న అవినీతిని సమర్థించినట్లు అవుతుంది భట్టి అని లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో, నీతి ఆయోగ్ స‌మావేశంలో పాల్గొనేందుకు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ స‌మావేశానికి కంటే ముందే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను, జగన్ కలిసారు. జగన్ మొదటి ప్రెస్ మీట్ లో చెప్పినట్టు, ఈ దేశంలోనే టాప్ 2 పవర్ఫుల్ మ్యాన్ అయిన అమిత్ షా ను కలిసి, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుతానని చెప్పినట్టే, అడిగారు. ఎన్నిసార్లు ఢిల్లీ వస్తే అన్నిసార్లు హోదా గురించి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతానే ఉంటామని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అమిత్ షా ను కలిసిన సందర్భంలో కూడా, జగన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మనసు కరిగించండి అని అమిత్ షాను కోరినట్టు జగన్ చెప్పారు. మీరు ఈ మంచి మాట, మోడీతో చెప్పండి అని చెప్పినట్టు జగన్ చెప్పుకొచ్చారు. అయితే, ఈ రోజు ఇదే విషయం పై జగన్ కు క్లారిటీ ఇచ్చారు హోం మినిస్టరీ సహాయ మంత్రి.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. అమిత్ షా హోం మంత్రి అయితే, కిషన్ రెడ్డి హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న జగన్ మాట్లాడిన విషయం పై హోం శాఖ తరుపున క్లారిటీ ఇచ్చారు. ప్రత్యెక హోదా ముగిసిన చరిత్ర అని, కాని విభజన హామీల పరిష్కారానికి నావంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విభజన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మొత్తానికి జగన్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటున్నా, కేంద్రం ఎక్కడా కనికరం చూపుతున్నట్టు కనిపించటం లేదు.

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు దాటింది. చంద్రబాబు ఓడిపోయి , జగన్ వచ్చారు. చంద్రబాబు ఓడిపోవటం కూడా భారీ తేడాతో సీట్లు కోల్పోయారు. అలా చంద్రబాబుని ఓడించిన ప్రజలు, ఈ 20 రోజుల్లోనే, చంద్రబాబు ఉంటే, ఇలా ఉండేది కాదు అనే పరిస్థితి వచ్చేసింది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా ? కరెంట్ కోతల విషయంలో. గత 5 ఏళ్ళల కరెంట్ కోత అంటే ఏంటో తెలియని పరిస్థితి. అంత సుఖంగా, చంద్రబాబు హాయంలో ఎంజాయ్ చేసిన ప్రజలు, ఇప్పుడు 20 రోజులకే ఆపసోపాలు పడుతున్నారు. ఒక పక్క జూన్ మూడవ వారం వచ్చినా, చినుకు పడక, వేసవిని మించిన వాతావరణం. వేసవి వడగాడ్పులు అధికంగా ఉండటం ఒక వైపు, రాష్ట్రంలో పలుచోట్ల కరెంటు కోతలు ఒక వైపుతో ప్రజలు అల్లాడి పోతున్నారు. జూన్‌ మూడవ రం వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదుసరి కదా, దీనికి తోడు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలకు నరకం కనిపిస్తుంది. దీనితో విద్యుత్‌ వినియోగం కూడా పెరిగిపోయింది.

అంచనాలకు మించి విద్యుత్‌ వినియోగం పెరగడంతో, కొన్నిచోట్ల అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ వాడకం అధికంగా ఉండటంలో రాత్రిళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో సరఫరా ఆగిపోతోంది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ నుంచి మారు మూల పల్లెల దాకా ఈ అనుభవం ఎదురవుతోంది. ఇక విద్యుత్‌ సరఫరా ఆగిపోయిన సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు చనిపోవటం కలవరం రేపింది. వెంటిలేటర్‌ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కరెంట్ కోత వల్ల మరణించారని, సకాలంలో జనరేటర్‌ వేయకపోవడం కారణమని ఆందోళన చేసారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్లు ట్రిప్‌ అవ్వటం కూడా మరో కారణంగా అధికారులు వాపోతున్నారు. అయితే గత 5 ఏళ్ళు, వేసవి కాలంలో, ఈ సమస్య ఎప్పుడూ ఎదురు కాలేదని, చంద్రబాబు ఉంటే, కరెంటు కష్టాలు ఉండేవి కాదంటూ, ప్రజలు అనుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, ఎమ్మల్సీ నారా లోకేష్, జగన్ పార్టీ చేస్తున్న మారణ హోమం పై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై, వైసీపీ పార్టీ నేతలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాల పై స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి అని, అంతే కాని అరాచకాలకు మార్గం కాకూడదని లోకేష్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 20 రోజుల్లోనే, తెలుగుదేశం కార్యకర్తల పై రాష్ట్ర వ్యాప్తంగా, వందకు పైగా దాడులు జరిగాయని లోకేష్ అన్నారు. ఇలా దాడులు చేసి, చంపేయటమే రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన ఒక సంఘటన చెప్తూ, గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని, అక్కడి రైతులను ఐదేళ్ల పాటు గ్రామ బహిష్కరణ చేశారని లోకేష్ ఆరోపించారు.

ఇదే విధంగా నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదలు నివిసించే గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికల్లో వచ్చిన వార్తలు అటాచ్ చేశారు. పోలీసు యంత్రాంగం, ఈ దాడులు పై వెంటనే స్పందించి, ఇప్పటి నుంచి అయినా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని లోకేష్ కోరారు. రెండు రోజుల క్రితం జరిగిన వర్క్ షాప్ లో, టీడీపీ ఓడిన 3 వారాల్లోనే 100 చోట్ల దాడులు జరిగాయని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయం పై స్పందించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయని, వారి ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచినా, ఇలా ప్రత్యర్ధుల పై ఎప్పుడూ దాడులు చేయలేదని చంద్రబాబు చెప్పారు. గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలకు, అక్కడి నేతలు అండగా ఉండాలని చంద్రబాబు కోరారు

Advertisements

Latest Articles

Most Read