హేళన చేసారు.. పప్పు అన్నారు.. అనని మాటను అంటూ, మంగళగిరిని మందలగిరి అన్నారని తప్పుడు ప్రచారం చేసారు... ఎంత చేసిన కుటుంబం నేర్పిన సంస్కారంతో, ప్రత్యర్ధి ఎదురు పడినా, గౌరవంగా అభివాదం చేసారు, తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీల్లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన నారా లోకేశ్, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరికి ఒకరు ఎదురుపడి కరచాలనం చేసుకున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ లోకేశ్ టీడీఎల్పీ కార్యాలయం వైపు వెళ్తుండగా, ఎదురుపడిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పలకరించారు., అభివాదం చేసారు, గెలిచినందుకు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇంత మంచి వాతావరణం లోకేష్ సృష్టించినా, ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు.
కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయడుని ఖాళీ చేయిస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వెంటనే ఇళ్ళు ఖాళీ చెయ్యటానికి రెడీగా ఉండాలని అన్నారు. అలాగే, అమరావతి పనులు ఆగిపోయిన విషయం మీడియా ప్రస్తావించగా, రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని చెప్పారు. పనులు ఎందుకు ఆపేశారో అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టర్లు సమాధానం చెప్పాలన్నారు. కాంట్రాక్టర్లుకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని అన్నారు. సీఆర్డీఏ ఛైర్మన్‌గా సీఎం ఉంటారని, ఆ పదవి తనకు ఇస్తారన్న విషయం తనకు ఇంకా తెలియదని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.