మనం కొన్ని తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం... బలవంతుడు, బలహీనుడు పై ఎన్ని విధాలుగా తనకు ఉన్న కక్ష తీర్చుకుని, ఆధిపత్యం ప్రదర్శిస్తాడో.. ఆ బలహీనుడు, పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా, న్యాయం దక్కదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అలాగే బిక్కు బిక్కు మంటూ, ఆ బలవంతుడుకి లొంగిపోయి జీవతం గడిపేస్తూ ఉంటాడు... సరిగ్గా లాంటి సంఘటనలే నేడు రాష్ట్రంలో జరుగుతున్నాయి... మొన్నటి మొన్న 100 మందిని ఊరు బయటకు గెంటేసిన వార్తలు విన్నాం.. చీని తోటల నరికివేత చూసాం... దీనికి తోడు, హత్యలు, కొట్టటాలు, ఇలా అనేకం... ఇదంతా వైసీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తరువాత, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం.. ఊళ్ళలో తెలుగుదేశం అనే వాడిని ఎన్ని విధాలుగా హింస పెట్టాలో, అంతలా హింస పెడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి.

తాజగా, ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో, టిడిపి మద్దతుదారులు ఉండే ఇళ్ళ వైపు రోడ్డుకు అడ్డంగా వైసీపీ కార్యకర్తలు గోడ కట్టారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లకు వెళ్లే మార్గం లేకుండా వైసీపీ కార్యకర్తలు గోడను నిర్మించారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా ఒక్కరు కూడా రాలేదని, మమ్మల్ని పట్టించువడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇళ్లకు వెళ్లే దారికి అడ్డంగా రోడ్డును నిర్మిస్తూ, మేము వెళ్ళే దారి లేకుండా చేస్తున్నారని, మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని, మా బ్రతుకులు మేము స్వేచ్చగా బ్రతికేలా చూడాలని ఫిరంగిపురం పోలీసులను కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, తెలుగుదేశం పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, వైసీపీ నేతల దౌర్జన్యాలను, పోలీసుల పక్షపాతాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించేందుకు ఆయన నివాసం ఉండవల్లి బయలు దేరిన గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెం చెందిన గ్రామస్థులను మంగళవారం స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఇటీవల ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసారు. అయితే పోలీసులు మాత్రం వైసీపీ కార్యకర్తలను వదిలేసి, ఆ సాకుతో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలను పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. అయితే వైసీపీ నేతలను వదిలేసి, బాధితులు అయిన తెలుగుదేశం వాళ్ళనే పోలీసులు తీసుకువెళ్లటంతో, గ్రామస్థులు ఆగ్రహనికి లోనయ్యారు. ఈ పరిస్థితి చూసిన గ్రామస్థులు, పోలీసుల వైఖరిని, వైసీపీ పార్టీ చేస్తున్న ఆగడాలను వివరించేందుకు, గ్రామస్థులు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ పొందారు.

చంద్రబాబుని కలవటం కోసం, మంగళవారం గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు, మహిళలు వాహనాల్లో ఆయన వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, స్థానిక పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్ళటానికి వీలు లేదని, మీ ఇళ్లకు వెళ్లపొండి అని సూచించారు. దాంతో గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారి వైఖరికి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మాటలు విని, వారి సూచనల మేరకు తమను స్టేషన్‌కు పిలిపించి అకారణంగా కొడుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మా బాధలు చంద్రబాబుకు చెప్పోకోవటానికి వెళ్తున్నా, పోలీసులు ఒప్పుకోవటం లేదని అంటున్నారు. పిడుగురాళ్ల రూరల్‌ సీఐ రత్తయ్య సంఘటనా స్థలానికి వచ్చి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, అక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించారు. సమావేశాలు ముగిశాక వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటంతో గ్రామస్థులు శాంతించారు.

ఎన్నికల సంవత్సరం ముందు, అంటే ఆగష్టు 2018లో, విశాఖ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కొత్త రాజకీయపార్టీని విజయవాడలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జనజాగృతి పార్టీ పేరుతో ఆమె కొత్త పార్టీ పెట్టారు. మహామహా యోధులే పార్టీలను పెట్టి, నడపలేక ఆపసోపాలు పడుతుంటే, కొత్తపల్లి గీత పార్టీ పెట్టటం ఆశ్చర్యం కలిగిస్తుందని, రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే అన్నారు. అయితే ఈమెతో పార్టీ పెట్టించింది బీజేపీ పార్టీ అని, అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఓట్లు చీల్చటం కోసమే, ఆమె చేత కొత్త పార్టీ పెట్టుస్తున్నారని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే ఆమె టార్గెట్ అనే వార్తలు వచ్చాయి. దీనికి తగట్టే, ఆమె పార్టీ పెట్టిన కొత్తలో , బీజేపీ ఐటి సెల్, ఆమె కోసం పని చేసిన సంగతి తెలిసిందే. దళిత, గిరిజన సామాజిక వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసే ఆలోచనలో ఈమెతో పార్టీ పెట్టించి, విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబుని ఓడించటంలో సక్సెస్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఎన్నికలు అవ్వటం, చంద్రబాబుని ఓడించే టార్గెట్ పూర్తి కావటంతో, ఆమె ఇక పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. అంతే కాదు, తన జన జాగృతి పార్టీని త్వరలోనే బీజేపీ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని కొత్తపల్లి గీత అన్నారు. బీజేపీ నేత రాంమాధవ్‌తో కలిసి బీజేపీలో చేరినట్లు ఆమె చెప్పారు. ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్నానని, కాని అది నెరవేరకపోవడంతో, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరానని చెప్పారు. బీజేపీ ద్వారానే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు.

ఎవరూ ఊహించని దారుణమైన ఓటమి ఒక వైపు... కుట్రలు ఒక వైపు... ప్రజలకు ఎంత సేవ చేసినా, ఎందుకు ఓడిపోయామా అని అధినేత ఆవేదన ఒక వైపు.. అసలకే బాధలో ఉంటే, కార్యకర్తల పై వైసీపీ దాడులు.. చంపటాలు, ఆస్తుల ధ్వంసాలు, ఇలా అనేకం... చంద్రబాబు అసెంబ్లీలో బిజీ.. లోకల్ నాయకులు, ఎందుకో కాని మౌనం... పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాధుడు లేడు... ఇలా బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న కార్యకర్తలకు, నేనున్నాను అంటూ, ఒక యంగ్ లీడర్ ముందుకొచ్చారు. సంక్షోభంలో నుంచే నాయకుడు పుడతాడు అనే మాట నిజం చేస్తూ, దేవినేని నెహ్రు వారసుడిగా, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, కష్ట కాలంలో, కార్యకర్తలు కోసం నిలబడ్డాడు దేవినేని అవినాష్. గుణదల నుంచి, గురజాల వెళ్లి, కార్యకర్తలను పరామర్శించి, వాళ్లకు ధైర్యం చెప్పి, భరోసా ఇచ్చారు. ఈ పరిణామంతో, తెలుగుదేశం కార్యకర్తలు సంతోషిస్తున్నారు.

గుంటూరు, దాచేపల్లి మండలం గామాలపాడులో తలదాచుకొన్న మాచవరం మండలం కొనంకి, జూలకలు, పిన్నెల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలను, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ పరామర్శించి వచ్చారు. ఈ సందర్భగా అవినాష్ మాట్లాడుతూ కొత్తగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ దాడులు పెరిగాయని అన్నారు. రాజకీయాల్లో గెలవటం ఓడిపోవటం సహజమన్నారు. అధికారంలోకి రాగానే కక్షసాధింపు చర్యలకు దిగటం మంచిది కాదన్నారు. ఇలాగే దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని దేవినేని అవినాష్‌ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో సంప్రదించి కార్యకర్తలకు మనోధైర్యం నింపేందుకు వచ్చినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులతో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, ఇతర నాయకులు మాట్లాతారన్నారు.

అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న దాడులు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని దాడులు చేసిన వైసీపీ, ఈ రోజు సామాన్యుల పై కూడా దాడికి తెగబడ్డారు. గుంటూరు జిల్లా, నరసరావుపేటలో ఈ దారుణం జరిగింది. సామాన్యుల పై వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పల్నాడు రోడ్డులో ఉన్న శ్రీ కార్తిక్ హాస్పిటల్ పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ దంపతుల పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో వీరి ఆగడాలు ఆగలేదు. కొట్టటమే కాకుండా, హాస్పిటల్ లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. వైసీపీ నేతలు చేసిన ఈ అరాచకం చూసి, ఈ పరిణామంతో హాస్పిటల్ లో ఉన్న రోగులు, వారితో పాటు ఉన్న బంధువులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక, ఎక్కడ వాళ్ళను కూడా చంపెస్తారో అని, అక్కడ ఉన్న రోగులు హాహాకారాలు చేశారు.

అయితే వివరాలు ప్రకారం, మామ ఇవ్వాల్సిన బెట్టింగ్ డబ్బులు కోసం అల్లుడి హాస్పిటల్ పై ఈ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. హాస్పిటల్ నిర్వాహకురాలు, డాక్టర్ రమ్య మాట్లాడుతూ జగన్ పార్టీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పోయిన ఎన్నికల్లో ఓటు వేసి జగన్ ని గెలిపించుకున్నామని, ఇలా చేసినందుకు మాకు తగిన బుద్ధి చెప్పారని, ఇలాంటి వాళ్లకు ఓటు వేసినందుకు, ‘మా చెప్పుతో మేం కొట్టుకుంటాం’ అని అన్నారు. కొట్టటమీ కాకుండా, కులంతో తిట్టారని, ఎస్సీ కులం వారికి ఆసుపత్రి ఎందుకని అంటూ హేలన చేశారని డాక్టర్ రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుక స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అండతోనే తమ పై, తమ హాస్పిటల్ పై దాడులు చేసారని ఆరోపించారు. ఇక్కడ హాస్పిటల్ ఎలా నడుపుతారో చూస్తానని సిఐ బిలాలూద్దీన్ కూడా బెదిరించారని, పోలీసులే ఇలా చేస్తుంటే, ఇంకా మేము ఎవరికీ చెప్పుకోవాలని డాక్టర్ రమ్య అన్నారు. స్వయానా ఎమ్మెల్యే గన్‌మెన్ సాయంతోనే వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read