ఒక కట్టడటం కట్టాలి అంటే, ఎంతో కష్టపడాలి. అదే కూల్చాలి అంటే, రాత్రికి రాత్రి తోసి అవతల పడేయవచ్చు. చంద్రబాబు ఎంతో కష్టపడి, ప్రజల నుంచి వినతలు తీసుకోవటానికి, సమీక్షలు జరపటానికి, కట్టిన ప్రజా వేదికను, జగన్ ప్రభుత్వం రాగానే, రాత్రికి రాత్రి కూల్చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అవినీతి చేసారు, అక్రమ కట్టడం అంటూ కూల్చే పడేసారు. అయితే, ఈ నిర్ణయం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చక్కని బిల్డింగ్, వాడుకోవటం ఇష్టం లేకపోతే, ఏ హాస్పిటల్ గానో, ఇంకా దేనికో దానికి ఉపయోగించు కోవచ్చు కదా, ఇలా కూల్చేటం ఏంటి అని ప్రశ్నించారు. మీకు దమ్ము ఉంటే, కరకట్ట మీద ఉన్న ప్రైవేటు భవనాలు కూడా కూల్చాలి, అంటూ వాదనలు వినిపించాయి. దీంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత రాకుండా, కరకట్ట మీద ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. వారంలో సమాధానం చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటాం అని. అయితే అన్ని అనుమతులు, వైఎస్ఆర్ హయంలో ఇచ్చిన విషయం ప్రస్తుత ప్రభుత్వానికి తెలిసినా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా చెయ్యటం కోసం, నోటీసులు ఇచ్చారు.

అయితే ఈ నోటీసుల పై, కరకట్ట మీద ఉన్న బిల్డింగ్ యజమానాలు అందరు కోర్ట్ కు వెళ్లారు. సీఆర్‌డీఏ మూడు వారల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకో కూడదు అని, సీఆర్‌డీఏ ని కూడా ప్రమాణ పత్రం దాఖలు చెయ్యాలని కోర్ట్ కోరింది. తాము అన్నీ పక్కాగా చేసామని, అయినా నోటీసులు ఇచ్చారని, చందన కేదారిష్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై వాదనలు వినిపిస్తూ, ఈ భవనం 2006లో నిర్మించామని, నోటీసు ఇచ్చే అధికారం సీఆర్‌డీఏ క్యాపిటల్‌ సిటీ జోన్‌ కమిషనర్‌కు లేదని చెప్పారు. సీఆర్‌డీఏ చట్టం-2014 రాకముందే, ఇక్కడ నిర్మాణాలు చేసామని చెప్పారు. నోటీసును నిలుపుదల చెయ్యాలని కోరారు. ప్రభుత్వం కూడా దీని పై వాదిస్తూ, ఏదైనా ఉంటె అప్పీలేట్‌ అథార్టీ దగ్గరకు రావాలని, హైకోర్ట్ కు రాకూడదని వాదించారు. వాదనలు విన్న కోర్ట్, అఫిదివిట్ దాఖలు చెయ్యమని కోరుతూ, నోటీసుల పై మూడు వారల స్టే విధించింది.

జగన్ ఆప్తుడు, వైసిపీ నెంబర్ 2 లీడర్, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డి పై తెలుగుదేశం పార్టీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమిస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, ఆయన ఆఫీస్ అఫ్ ప్రాఫిట్ పదవిని, 13 రోజులు అనుభవిస్తూనే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, అందుకే ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు, తెలుగుదేశం పార్టీ పిటీషన్ సమర్పించింది. రాజ్యాంగం లోని 102వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వారు, ఎవరూ, కేంద్ర ప్రభుత్వం, లేదా రాష్ట్ర ప్రభుత్వంలో, లాభం వచ్చే పదవుల్లో ఉండ కూడదు అని, ఆ రూల్ ని అధిగమించి, 13 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి, విజయసాయి రెడ్డి పై అనర్హత పిటీషన్ వెయ్యాలని, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, గళ్ళ జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌, కేశినేని నాని, సంతకం చేసి, రాష్ట్రపతికి పిటీషన్ సమర్పించారు.

ఈ పిటీషన్ సమర్పణ తరువాత, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియా ముందుకు వచ్చారు. జూన్‌ 22 న విజయసాయి రెడ్డిని, ఢిల్లీలో ఏపి ప్రత్యెక ప్రతినిధిగా నియమించారని, అప్పటి నుండి విజయసాయిరెడ్డి కేబినెట్‌ మంత్రి హోదా అనుభవిస్తూ, ఆయనకు ఏపీ భవన్‌లో కారు, డ్రైవర్‌, కార్యాలయం కేటాయించారని చెప్పారు. భారత రాజ్యాంగంలోని 103వ షడ్యుల్ ప్రకారం, పార్లమెంట్ సభ్యుడుని అనర్హుడిగా ప్రకటింటే అధికారం ప్రెసిడెంట్ అఫ్ ఇండియాకు ఉందని చెప్పారు. రూల్స్ ప్రకారం రాష్ట్రపతి తన నిర్ణయం ప్రకటించే ముందు, భారత ఎన్నికల కమిషన్‌ సూచనలు తీసుకుంటారని అన్నారు. 13 రోజులు పదవిలో ఉన్న తరువాత, అనర్హత వేటు పడుతుందని గ్రహించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినన్స్ తెచ్చి, ఈ పదవి లాభాపేక్ష పదవి కాదని చెప్పారని అన్నారు. అయినా సరే 102వ షడ్యుల్ ప్రకారం అనర్హత వేటుపడుతుందని రాష్ట్రపతికి వివరించినట్లు తెలుగుదేశం సభ్యులు చెప్పారు. మరి రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డికి, ఇది కేంద్రం నుంచి రెండో షాక్. చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా అవినీతి చేసరాని, అందుకే ఆయన హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అన్నీ సమీక్ష చేస్తామంటూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న హడవిడికి మరో సారి కేంద్రం సుతి మెత్తగా, తగ్గండి అంటూ లేఖ రాసింది. ఇప్పటికే ఈ అంశం పై , చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి, మీ సియంకు చెప్పండి అని చెపిన కేంద్రం, జగన్ వినకపోవటంతో, ఏకంగా జగన్ కే డైరెక్ట్ గా లేఖ రాసి, హితభోధ చేసింది. పీపీఏ (పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్) లను మరోసారి సమీక్షించాలనే మీ నిర్ణయం సరైంది కాదు, అంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్‌ జగన్ కు లేఖ రాసారు. అవినీతి రహిత పాలన, పారదర్సకత, ఇవన్నీ మా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా అని, అలగాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పొతే, పెట్టుబడులు వెనక్కు వెళ్ళిపోతాయని, మన నిర్ణయాలు పెట్టుబడుల పై ప్రభావం చూప కూడదని, లేఖలో స్పష్టం చేసారు. గతంలో అన్నీ పారదర్సాకంగానే జరిగాయని చెప్పారు.

మీకు అవినీతి పై ఆధారాలు ఉంటే , ద్దు చేసి ప్రాసిక్యూషన్‌ చేయండి, అంతే కాని అనుమానంతో ఎదో చెయ్యాలని చేస్తే కుదరదు అని స్పష్టం చేసారు. రేట్లు అన్నీ కేంద్ర, రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్లు డిసైడ్ చేస్తాయని, పీపీఏలు రద్దు చెయ్యటం చట్ట విరుద్ధం అవుతుందని చెప్పారు. ఇదే సందర్భంలో, వివిధ రాష్ట్రాల టారిఫ్ లు కూడా జగన్ కు పంపారు. ఇవి చూసి, ఏపి కుదుర్చుకున్న ఒప్పందాలు న్యాయమో, కాదో మీకే తెలుస్తుందని సింగ్ చెప్పారు. మన దేశంలో సాంప్రదాయ ఇంధన ప్రాజెక్ట్ లకు, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. సోలార్, విండ్ ఎనర్జీ సెక్టార్స్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి టైంలో, మీరు వారిని భయపెడుతూ, సమీక్షలు చేస్తాను అంటే, ఉన్న ప్రాజెక్ట్ లు ఆగిపోవటమే కాదు, కొత్తవి కూడా రావని, స్పష్టం చేసారు. ఈ విషయం పై ఇప్పటికే, కేంద్ర విద్యుత్‌ శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి లేఖ రసారు. అయినా, జగన్ మోహన్ రెడ్డి, వీటిని సమీక్షించాల్సిందే అని ఓ కమిటీని వేసారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి లేఖ రాసి ఆగమన్నారు. ఇప్పటికీ ఆగకుండా, చంద్రబాబుని ఎదో చేద్దాం, ఎదో ఇరికిద్దాం అనుకుంటే, ప్రధాని మోడీ సీన్ లోకి ఎంటర్ అవుతారు. అంత వరకు జగన్ వెళ్తారో లేదో మరి, చూద్దాం.

రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 45 రోజులు అవుతుంది, అప్పుడే మంత్రుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే దాక వెళ్లారు అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వం తప్పులు చేసిందని, మేము అన్ని విధాలుగా చూసుకుంటాం అని ప్రజలను నమ్మించి, ఓట్లు వేసుకుని, ఇప్పుడు వారి చావులకు కారణం అవ్వటం, నిజంగా ఆందోళనకరం. మచిలీపట్నంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నంలో నివసిస్తున్న జయలక్ష్మి అనే మహిళ, మంత్రి పేర్ని నాని తన చావుకు కారణం అంటూ సూసైడ్ లెటర్ రాసి, ఆత్మహత్యాయత్నం చేసారు. అయితే ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. జయలక్ష్మీ సూసైడ్ నోట్ ప్రకారం, మంత్రి పేర్ని నాని, మట్టా తులసి తనను వేధిస్తున్నారంటూ, ఇలాంటి బ్రతుకు తనకు వద్దు అని లేఖ రాసి నిద్ర మాత్రలు మింగారు.

nani 13072019 2

ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆంధ్రా హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. చికిత్స మొదలు పెట్టిన డాక్టర్లు, 24 గంటలు గడిస్తే కాని ఏమి చెప్పలేమని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ లో, ఈ ప్రభుత్వం ఒక ఆడదాని మీద కక్ష కట్టింది. మంత్రి పేర్ని నాని, ఒక ఆడ పిల్ల మీద కక్ష సాధింపు చేసే నాయుకుడు. నా చావుకి, పేర్ని నాని, మట్టా తులసి, అంగన్ వాడీ టీచర్ యేసు కుమారి, ఆశ వర్కర్ వెంకటేశ్వరమ్మ కారణం. వీరు నన్ను బ్రతకనివ్వటం లేదు. అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నా. నా భర్తను బాగా చూసుకోండి అంటూ లేఖ రాసారు. అయితే, ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంత్రి దీని పై ఏమని సమాధానం ఇస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read