నిన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా అంటూ సభ సాక్షిగా చేసిన వ్యాఖ్యల పై లోకేష్ స్పందించారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఆ రోజు చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అడ్డుకోవటానికి ఎలాంటి పోరాటం చేసారు అని ప్రస్తావిస్తూ, ఆ రోజు ఏకంగా సాక్షి తెలంగాణ ఎడిషన్ లో, చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అడ్డు పడుతున్నారు అంటూ అక్కడ తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టే విధంగా రాసిన పేపర్ క్లిప్పింగ్ తో పాటు, ఇతర పేపర్ లో వచ్చిన వార్తలు కూడా జగన్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘‘కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ, జగన్ గారు సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరం పై చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది."
"ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు. ఎందు కంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో అని లోకేష్ అన్నారు. నిన్న కాళేశ్వరం పై చర్చలో జగన మాట్లాడుతూ, కేసీఆర్ ఎంతో దయా హృదయంతో, మనకు నీళ్ళు ఇస్తున్నారని, అందుకే ఆ ప్రాజెక్ట్ తెలంగాణా భూభాగంలో కట్టటానికి ఒప్పుకున్నామని జగన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళినా, వెళ్ళకపోయినా అక్కడ ఓపెనింగ్ ఏమి ఆగేది కాదని, అందుకే వెళ్లానని జగన్ అన్నారు. ఇదే సందర్భంలో జగన మాట్లాడుతూ, కాళేశ్వరం కడుతుంటే, అప్పుడు చంద్రబాబు సియంగా ఉన్నారని, అప్పుడు ఆపకుండా, గాడిదలు కాసరా అని జగన్ అన్నారు. దీని పై తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను, జగన్ లాంటి వ్యక్తి, గాడిదలు కాస్తున్నాడా అని అంటారా అని, తీవ్ర అభ్యంతరం చెప్పారు.