ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడటానికి బీజేపీ ఎన్నో ప్లాన్లు వేస్తుంది. ఇందు కోసం అతి పెద్ద ప్లాన్ వేసి, ఇప్పటికే సగం ఇంప్లిమెంట్ చేసింది కూడా. అదే చంద్రబాబు దించి జగన్ ను ఎక్కించటం. చంద్రబాబు ఉండగా తాము ఎదగటం కష్టమని, జగన్ అయితే తాము చెప్పినట్టు వింటాడు అనేది బీజేపీ భావన. ఇందులో భగంగానే బీజేపీ, జగన్ ను టార్గెట్ చేస్తూ క్యాంపైన్ మొదలు పెట్టింది కూడా. ఇది పక్కన పెడితే, నిన్న అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక విధాలుగా తెలుగుదేశం నాయకులను టార్గెట్ చేసిన బీజేపీ, వారిని ఎలా అయినా తమ పార్టీలో చేర్చుకోవాలని స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా, అసెంబ్లీ లాబీల్లో ఎదురు పడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు , సోము వీర్రాజు నవ్వుతూనే బంపర్ ఆఫర్ ఇచ్చారు.

buddha 27072019 2

త్వరలో మా ప్రభుత్వం ఇక్కడ వస్తుంది, నువ్వు మా పార్టీలోకి వచ్చేయ్, నీకు మంత్రి పదవి ఇస్తాను అంటూ సోము వీర్రాజు ఆఫర్ ఇచ్చారు. దీనికి స్పందించిన బుద్దా వెంకన్న, మీకు ఇక్కడ అంత అవకాసం లేదు, మీ పార్టీని, మా పార్టీతో కలవమని చెప్పండి, ఇద్దరం కలిసి పోరాడి అధికారంలోకి వద్దాం, అప్పుడు చంద్రబాబుతో చెప్పించి, మీకే మంత్రి పదవి ఇస్తాను అంటూ, బుద్దా వెంకన్న రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే దీనికి సంబందించిన సోము వీర్రాజు, గతంలో మేము మీతో కలిసే ఉన్నాం, మీరే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, మా పార్టీని కూడా నాశనం చేసారు అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బదులు ఇచ్చిన బుద్దా వెంకన్న, భార్యాభర్తలు కొట్టుకోవటం, కలుసుకోవటం సహజం అంటూ కౌంటర్ ఇచ్చారు.

buddha 27072019 3

దీని పై స్పందించిన సోము వీర్రాజు, ఆ పార్టీ పొతే ఈ పార్టీ, ఈ పార్టీ పొతే ఆ పార్టీ కాదు, మీ ఇద్దరినీ తొక్కి మేము వస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు. మేము ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలి అంటే, తెలుగుదేశం పార్టీ చితకాల్సిందే. టీడీపీ చితికిపోతేనే రాష్ట్రంలో బీజేపీ ఎదిగేది అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాం మాధవ్ వైసీపీ పై చేసిన వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోనవసరం లేదని, అవి రొటీన్ గా చేసేవే అంటూ, సోము వీర్రాజు వైసిపీని వెనకేసుకు వచ్చేలా మాట్లాడారు. దీని పై బుద్దా వెంకన్న, ముందు నోటాతో పోటీ పడి దాని కంటే ఎక్కువ తెచ్చుకోండి, అప్పుడు మమ్మల్ని చితికే అంశం గురించి ఆలోచించ వచ్చు అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్న మరో పార్టీ జనసేన. మొన్న ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒక్క సీట్ మాత్రమే వచ్చింది. అత్యంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ పవన్ ప్రచారం సాగించారు. నన్ను 2014 ఎన్నికల్లో వాడుకుని వదిలేసారని, నా వల్లే అప్పుడు గెలిచారని, 2019 ఎన్నికల్లో నేను గెలవకపోయినా పరవాలేదు, మళ్ళీ చంద్రబాబు సియం కాకూడదు అంటూ చెప్పారు. ఆయన అభిమానులు కూడా అలాగే జనసేన కంటే, ఎక్కువ వైసీపీకి వేసి, వారిని గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ఓటమిలో, పవన్ కళ్యాణ్ ఫాక్టర్ కూడా ఒకటి ఉందని చెప్పటంలో సందేహం లేదు. ఇలా నెగటివ్ పాలిటిక్స్ మాత్రమే చేసే పవన్ కళ్యాణ్, ఎన్నికల తరువాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు.

jd pk 27072019 1

ఫలితాలు వచ్చిన తరువాత, ఒక రెండు రోజులు సమీక్షలు అంటూ హడావిడి చేసినా, తరువాత అడ్డ్రెస్ లేరు. అయితే, మొన్న అమెరికాలో రాం మాధవ్ తో చర్చలు జరపటం ఆసక్తికర పరిణామం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తన పార్టీని ఆక్టివ్ చేస్తాను అంటూ ప్రకటించారు. మరి ఈ సారైనా ఆక్టివ్ పాలిటిక్స్ చేస్తారో, లేక పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారో చూడాలి. ఈ నేపధ్యంలోనే తన పార్టీకి సంబందించిన కమిటీలు ప్రకటించారు. అయితే, తన పార్టీలో కొంచెం ఇమేజ్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయనే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ. మొన్నటి ఎన్నికల్లో విజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా తరువాత, ఆయన ఎదో ఒక కార్యక్రమంలో ప్రజల మధ్య ఉంటూనే ఉన్నారు. ఇంతటి ఇమేజ్ ఉన్న మాజీ జేడీని పవన్ కళ్యాణ్ తాను ప్రకటించిన కమిటిల్లో ఎక్కడా చోటు ఇవ్వలేదు.

jd pk 27072019 1

11 మందితో పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో కాని, పోలిట్ బ్యూరోలో కాని, క్రమశిక్షణా సంఘంలో కాని ఎక్కడా జేడీ లక్ష్మీనారయణకు చోటు ఇవ్వలేదు. దీంతో ఈ చర్య అందరినీ ఆశ్చర్య పరిచింది. లక్ష్మీనారయణను కావాలని పక్కన పెట్టారా అనే అంశం కూడా చర్చకు వస్తుంది. లక్ష్మీనారయణ తన పార్టీ మారిపోతారని పవన్ కళ్యాణ్ కు సంకేతాలు ఉండటంతోనే, ఆయనకు ఏ కమిటీలో కూడా చోటు లేదని తెలుస్తుంది. మరి, ఏది నిజమో, అటు పవన్ కాని, ఇటు లక్ష్మీనారయణ కాని క్లారిటీ ఇస్తే కాని తెలియని పరిస్థితి. అయితే ఎప్పటి లాగే, నాదెండ్ల మ‌నోహ‌ర్‌కే ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చారు. తోట చంద్ర‌శేఖ‌ర్‌, తన సోదరుడు నాగబాబు, మాదాసు గంగాధరం లాంటి వారికి పార్టీలో కీలక పదవులు వచ్చాయి.

ఒకప్పుడు ఆయన, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి మంచి స్నేహితుడు. అలాంటి నేత కూడా, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసి, విమర్శలు చేసే పరిస్థితి. ఆయనే పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. తులసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటూ, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పరిపాలన చూసి ఒక సలహా ఇచ్చారు. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి వాడే ట్రేడ్ మార్క్ పదాల గురించి మాట్లాడుతూ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తరువాత నేను ఒకటి చెప్తున్నా, దయచేసి, ‘మాట తప్పను’, ‘మడమ తిప్పను’,‘విశ్వసనీయత’ వంటి పదాలు నువ్వు వాడమాకు ఆయ్యా జగన్ అంటూ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పదాలు వాడే అర్హత నీకు లేదని చెప్పారు.

tulasireddy 27072019 2

జగన్ ప్రభుత్వానికి, మాట తప్పడం, మడం తిప్పడం ప్రతి రోజు ఒక దిన చర్యగా మారిపోయిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఆచరణలో పెట్టే వరకు, ఆ మాటలు వాడొద్దు అంటూ తులసి రెడ్డి సూచించారు. రైతులను జగన్ సర్కార్ అడ్డంగా మోసం చేసిందని అన్నారు. జగన మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రైతులకు 12500 ఇస్తాం అన్నారని, తరువాత కేంద్రం కూడా 6 వేలు దేశ వ్యాప్తంగా రైతులకు ఇస్తాం అన్నారని, దీంతో రైతులు 18500 వస్తాయని ఆశ పడ్డారని, కాని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, నేను 6500 మాత్రమే ఇస్తాను, మిగతా 6 వేలు కేంద్రం నుంచి తీసుకువచ్చి ఇస్తాను అంటూ, రైతులను మోసం చేసారని అన్నారు. అది పూర్తిగా కేంద్ర పధకం అని, దాని లబ్దిదారులకు, రాష్ట్ర లబ్దిదారులకు తేడా ఉంటుందని, రైతులను మోసం చెయ్యటం కాదా అని తులసి రెడ్డి జగన్ ను ప్రశ్నించారు.

tulasireddy 27072019 3

అలాగే సున్నా వడ్డీ రుణాలు 3500 కోట్లు ఇస్తాం అని చెప్పిన జగన్, ఇప్పుడు బడ్జెట్ లో మాత్రం, కేవలం వంద కోట్లు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు. అప్పట్లో కేసిఆర్ కడుతున్నవి అక్రమ ప్రాజెక్ట్ లు అని, దాని వల్ల ఏపి రైతులు నష్టపోతారని హంగామా చేసి, ఇప్పుడేమో, అదే ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి అతిధిగా వెళ్ళటానికి సిగ్గులేదా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడేమో 20 మంది ఎంపీలు ఉంటే, మోడీ మెడలు వంచుతా అని చెప్పిన జగన్, ఇప్పుడేమో ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ మాట మార్చరాని అన్నారు. ప్రతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి వంచన చేస్తూ, నేను మాట తప్పను, మడం తిప్పను అంటూ, విశ్వసనీయత అంటూ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

పగ కూడా వారసత్వంగా వస్తుందని సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, లైవ్ గా చూస్తున్నాం. ఆ రెండు పత్రికలూ అంటూ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ల పై, తీవ్రమైన ఆంక్షలు పెట్టే వారు. కారణం, తన ప్రభుత్వ వైఫల్యాలు చెప్తున్నారని. ఆ కసితోనే, కొడుకు చేత సాక్షి అనే పేపర్, టీవీ పెట్టించారు. సియంగా ఉండగా, తన కొడుకు చేత, పేపర్, టీవీ పెట్టించిన ఘన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. అప్పటి నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేర్లు అంటేనే ఇంత ఎత్తున ఎగిరి పడేవారు. అదే వారసత్వంగా, తండ్రి చూపిన మార్గంలోనే జగన్ నడుస్తున్నారు. తాను ప్రతిపక్షంలో ఉండగా, తన గురించి ఒక్క వార్తా కూడా కవర్ చెయ్యకూడదు అని, అసలు మా ఆఫీస్ లోకే రాకూడదు అని ఆంధ్రజాతిని బ్యాన్ చేసారు జగన్.

assembly 27072019 2

అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి ఆయన ఇష్టం. కాని ఇప్పుడు అధికారం వచ్చింది. సియం అయ్యారు. ప్రభుత్వం అనేది ఆయాన సొత్తు కాదు. ప్రజలది. ప్రజలకు ప్రభుత్వం గురించి తెలుసుకునే హక్కు ఉంటుంది. అలాగే పత్రికలకు కూడా. కాని వారిని కూడా ఎలా అయినా ఇబ్బందులు పెట్టాలని డిసైడ్ అయ్యి, ముందుగా ప్రభుత్వ ప్రకటనల విషయంలో ఇబ్బందులు మొదలు పెట్టారు. ఆంధ్రజ్యోతికి పూర్తిగా ఆపేసినా, ఈనాడుకు మాత్రం నిబంధనల ప్రకారం కొద్దిగా ఇస్తున్నారు. సాక్షికి మాత్రం ఫుల్ ఫ్లో లో ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న సందర్భంలో, నిబంధనలు అతిక్రమించాని, ఏకంగా మూడు ఛానెల్స్ అయిన, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లకు అసెంబ్లీలోకి అనుమతి లేకుండా షాక్ ఇచ్చారు.

assembly 27072019 3

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో, బయట జరుగుతున్న ప్రెస్ మీట్ ఇచ్చారని అభియోగం. అయితే, దీని పై సదరు ఛానెల్స్ స్పీకర్ కు వివరణ ఇచ్చాయి. అచ్చెంనాయుడుని సస్పెండ్ చేసిన టైంలో, ఆయన బయటకు వచ్చి మాట్లడటంతో లైవ్ ఇచ్చాం అని, కాని కేవలం ఒక నిమిషం 30 సెకండ్లు మాత్రమే ఇచ్చామని, అప్పటికే అది తప్పు అని తెలుసుకుని ఆపేసామని, మరోసారి ఇలా జారగాకుండా చూసుకుంటాం అని చెప్పారు. అయితే వివరణ లేఖలు ఇచ్చిన తరువాత కూడా అసెంబ్లీ లోపలకు అనుమతించలేదు. శుక్రవారం మరిన్ని ఆంక్షలు పెట్టారు. ఈ మూడు చానల్స్ ని అసెంబ్లీ లోపలకి అనుమతించకపోయినా, ఐ & పీఆర్ ఇస్తున్న లైవ్ ఫీడ్ తీసుకుని, ఒక ఛానెల్ లైవ్ ఇస్తే, అది కూడా కుదదరు అంటూ, ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒక చిన్న నిబంధన పట్టుకుని, ఏకంగా మూడు ఛానెల్స్ పై ఆంక్షలు విధించారు. ఇవే నిబంధనలు జగన్ గారి సాక్షి పై అప్పట్లో చంద్రబాబు అమలు చేసి ఉంటె, ఈ పాటికి సాక్షి ఛానెల్ ఎక్కడ ఉండేదో ?

Advertisements

Latest Articles

Most Read