కొద్ది రోజుల క్రితం సీబీఐ అంతర్గత పోరు వ్యవహారంలో హైదరాబాద్ వ్యాపారి సాన సతీశ్ బాబు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదుతోనే సీబీఐ అడిషనల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై కేసు నమోదైంది. తరువాత జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. అయితే, ఈ సతీష్ సానాను మనీ లాండరింగ్ కేసులో సిబిఐ రెండు రోజుల క్రిందట అరెస్ట్ చేసింది. అయితే ప్రతి వ్యవహారాన్ని చంద్రబాబుకి లింక్ చేసే వైసీపీ పార్టీ, ఈ సతీష్ సనా కూడా చంద్రబాబు బినామీ అని, చంద్రబాబు అవినీతి డబ్బులు అంతా మనీ లాండరింగ్ ద్వరా, విదేశాలకు తరలించింది ఇతనే అంటూ, సతీష్ సానా, చంద్రబాబు రిలేషన్ పై సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలాని, వైసీపీ ఏ2 విజయసాయి రెడ్డి, ఈ రోజు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ చంద్రబాబు పై విమర్శలు చేసారు.

buddha 29072019 2

అయితే దీని పై అదే రీతిలో బదులు ఇచ్చారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. సతీష్ సానా వైసీపీ నేతలకు ఎలా సహయం చేసింది, అప్పట్లో వచ్చిన పత్రికా కధనాలు పోస్ట్ చేస్తూ, బుద్దా వెనకన్న ఘాటుగా బదులు ఇచ్చారు. "విజయసాయి రెడ్డి గారు, ఎక్కువ లాగకు, తెగుద్ది. మనీ లాండరింగ్ కింగ్ వి నువ్వు. ఇలాంటి వాడితో, నీకే పని ఎక్కువ. దేశంలో ఏ దరిద్రం జరిగినా, దాని వెనుక నువ్వు, నీ బాస్ ఉంటారనేది, ఇప్పటికే ఈ దేశం ఎన్నో సార్లు చూసింది. తొందరలోనే టైటానియం కేసులో అమెరికా వెళ్ళటానికి మీ ఆత్మ రెడీగా ఉన్నాడు. పిఎంఓలో దూరి అది ఆపే సంగతి చూడు." అంటూ విజయసాయి రెడ్డి గాలి మొత్తం తీస్తూ, సాతీష్ సానాకి వైసిపీ నేతలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, బుద్దా వెంకన్న ట్వీట్ చేసారు.

buddha 29072019 3

ఎవరీ సతీష్ సానా ? జగన్ కేసుల్లో ఒకటైన నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ గ్రూప్‌ కంపెనీల్లో కొద్ది రోజులు సతీశ్ బాబు డైరెక్టర్‌గా పని చేశారు. 2007 నుంచి దాదపుగా 24 కంపెనీల్లో సతీష్ సానా డైరెక్టర్‌గా పని చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీఎస్ జ్యూవెలర్స్‌కు చెందిన సుకేశ్ గుప్తాను అప్పట్లో సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనకు బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్‌లో సతీశ్ బాబు ఢిల్లీ వెళ్లాడని ఈడీ ఒక ఛార్జిషీట్‌ కూడా పెట్టింది. అంతే కాదు, నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ, షబ్బీర్ ఆలీ తోపాటు సతీశ్ బాబు పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. వై.ఎ స్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో చోటుచేసుకున్న ఎమ్మార్‌ కుంభకోణంలో మొయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్‌ను ఈడీ నిందితుడిగా చేర్చింది. నాటి సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఖురేషీ మధ్య మెసేజీల్లో ప్రదీప్ కోనేరు, సతీశ్ బాబుల ప్రస్తావన ఉంది. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో, అంతకు ముందు ఈడీ కేసులో సతీశ్ పేరు ఉంది.

కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల బందర్ పోర్ట్. ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబు, భూసేకరణ చేసి, ఎట్టకేలక పోర్ట్ పనులు ప్రారంభించారు. అయితే కొత్త ప్రభుత్వం రావటంతోనే పనులు ఆగిపోయాయి. అక్కడ నుంచి యంత్రాలు అన్నీ, కాంట్రాక్టు సంస్థ నవయుగ తరలించి వేసింది. ఈ నేపధ్యంలో జగన్, కేసిఆర్ మధ్య ఉన్న స్నేహంతో, బందర్ పోర్ట్ పై ఇది వరకే తెలుగుదేశం నేతలు చేసిన ఆరోపణలు నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం, పోర్ట్ విషయంలో ఒక రహస్య జీఓ ఇచ్చారు. అది తెలంగాణాకు బందర్ డ్రై పోర్ట్ గా వాడుకోవటానికి అంటూ వార్తలు రావటం, పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో, ఆ రహస్య జీఓ కాన్సల్ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకీ ఆ జీఓలో ఏముందో ఎవరికీ తెలియదు.

port 290720198 2

ఈ నేపధ్యంలోనే, మళ్ళీ ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తన సొంత పేపర్ లో, బందర్ పోర్ట్, కేసీఆర్ కు ఇచ్చేస్తే కలిగే ప్రయోజనాలు రాస్తే, ప్రజలు నమ్మరని గ్రహించి, ఈ రోజున, వేరే పేపర్ లో, బందర్ పోర్ట్, కేసీఆర్ కు ఇస్తే, మనకు పండగే పండగ అంటూ ఒక వార్తా వడ్డించారు. తెలంగాణ కనుక బందర్ పోర్ట్ నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తే మన అదృష్టం అంటూ ఆ వార్తను రాసి, ప్రజలను మానసికంగా సిద్దం చేస్తున్నారు. కంపెనీలకు, ప్రభుత్వాలకు మధ్య క్విడ్ ప్రోకో చూసాం కాని, ఇప్పుడు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి క్విడ్ ప్రోకో ఇది. అక్కడేమో మనం గోదావరి నీళ్ళ కోసం ఖర్చు పెట్టాలి అంట, ఇక్కడేమో కేసిఆర్ వచ్చి మన పోర్ట్ కట్టి, తాను వాడుకుంటాడు అంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఆంధ్రులకు ఉంటుందా ? ఈ వార్తా చూసిన చంద్రబాబు, ఘాటుగా స్పందించారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు.

port 290720198 3

మన రాష్ట్రానికి సాగర తీరం, పోర్టులు ప్రకృతి ఇచ్చిన వరమన్నారు. జగన్ మోహన్ రెడ్డి స్నేహాలకు, సొంత ఆస్తుల లాగా, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. నారా లోకేష్ కూడా ఈ విషయం పై స్పందించారు.‘‘బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్‌ చేతుల్లో పెడతారా’’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో, లోకేష్ ఈ విషయం ప్రస్తావిస్తూ, బందర్ పోర్ట్ ను కేసిఆర్ కు ఇచ్చేస్తారు అంటే, బందరు పోర్ట్ తీసుకువెళ్ళి హైదరాబాద్ లో దాచుకుంటారా, బస్సులో తీసుకువెళ్తారా ? అంటూ అప్పట్లో వైసీపీ నేతలు హేళన చేసారు. ఈ రోజు లోకేష్ చెప్పిందే నిజం అవుతుంది.

కొత్తగా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అమరావతి, పోలవరం, బందర్ పోర్ట్, ఇలా అతి పెద్ద ప్రాజెక్ట్ లే కాకుండా, చిన్న చిన్న పనులు కూడా ఆగిపోయాయి. మరో పక్క గతంలో కట్టినవి కూడా నిబంధనల పేరుతొ కూల్చేస్తున్నారు. మొన్నటి మొన్న ప్రజా వేదిక కూల్చివేత మన కళ్ళ ముందే కనిపిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే మళ్ళీ నిబంధనల పేరుతో ఎత్తేసారు. పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు హయంలో మొదటి గేటు బిగించిన సంగతి తెలిసిందే. వరద వచ్చే అవకాసం ఉంది, గేటు ఉండకూడదు అంటూ, చంద్రబాబు హయంలో బిగించిన మొదటి గేటు ఎత్తేసారు. చంద్రబాబు హయంలో బెకమ్‌ కంపెనీకి పోలవరం గేటుల తయారీ పనులు అప్పచెప్పారు. మొత్తం 48 గేట్ల ఫ్యాబ్రికేషన్‌ వర్కు ఆ కంపెనీ పూర్తి చేసింది.

gate 29072019 2

చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, డిసెంబర్ 25 2018న మొదటి గేటు బిగించారు. పిల్లర్ల పని పూర్తయితే మిగతా వాటిని బిగించేయవచ్చనే అంచనాతో పనులు సాగాయి. అయితే ఎన్నికల కోడ్ రావటం, ప్రభుత్వం మారటంతో మొత్తం తారు మారు అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రబాబు హయంలో బిగించిన ఆ ఒక్క గేటు కూడా ఎత్తేసారు. వరదలు సాకుగా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, అంత ఎత్తున వరదలు వచ్చే అవకాసం ఉండదని, పోలవరంలో చంద్రబాబు ముద్రను చేరిపెయటానికి చేసే ప్రయత్నాలు అని చెప్తున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఇగోకి, స్పిల్ వే కూడా చంద్రబాబు హయంలో కట్టింది కాబట్టి, దాన్ని కూడా పడగొట్టి, మళ్ళీ కడతారేమో అని అంటున్నారు.

gate 29072019 3

ఇక మరో పక్క పోలవరంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నవయుగ కంపెనీ ఇప్పటికే అక్కడ నుంచి భారీ యంత్రాలను తరలించేసింది. చిన్న చిన్న పనులు తప్ప అక్కడ ఏమి జరగటం లేదు. వర్షాల వల్ల ఆపేసాం అని చెప్తున్నా, ప్రభుత్వం మళ్ళీ టెండర్లు పిలుస్తుంది, కాంట్రాక్టర్ ను మార్చేస్తుంది అనే వార్తలు రావటం, ఏ పనులు జరగటం లేదు. మరో పక్క, త్రివేణి సంస్థ ఇప్పటికే పోలవరం సైట్ ఖాళీ చేసింది. నవయుగ సంస్థ మాత్రం, పూర్తిగా వెళ్లకపోయినా, భారీ యంత్రాలు తరలించింది, అలాగే కార్మికులను కూడా వేరే సైట్ లకు తరలించేసింది. పోలవరం పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనంత వరకు, ఏ పని జరిగే అవకాసం లేదు. జగన్ మోహన్ రెడ్డి, నేను రివర్స్ టెండరింగ్ కు వెళ్తాను అంటే, కేంద్రం అనుమతి ఇవ్వాలి. ఒక వేళ కేంద్రం ఒప్పుకోకపొతే, ఇక పోలవరం సంగతి కూడా మర్చిపోవచ్చు.

చంద్రబాబు ఇచ్చిన 5 శాతం కాపు రిజర్వేషన్ ని, అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జగన్ ఎత్తేసిన సంగతి తెలిసిందే. బీసిలకు అన్యాయం జరగకుండా, కేంద్రం ఇచ్చిన 10 శాతం అగ్రవర్ణాల రిజర్వేషన్లో, కాపుల జనాభాను బట్టి, చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అది రాజకీయంగా తమకు ఇబ్బంది అని తెలిసినా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అనుకున్నట్టే, అది రాజకీయంగా ఇబ్బంది అయ్యింది. కాపులను దగ్గరకు తీస్తున్నారని, అటు బీసిలు దూరం అయ్యారు. మా పవన్ అన్న ఉన్నాడు అంటూ, కాపులు అటు వెళ్లారు. దీంతో చంద్రబాబుకు భారీ రాజకీయ దెబ్బ తగిలింది. అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే, కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు అని నిర్ణయం తీసుకున్నారు.

mudragada 29072019 2

అప్పటి నుంచి అందరి కళ్ళు ముద్రగడ మీదే ఉన్నాయి. చంద్రబాబుని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన ముద్రగడ, ఇప్పుడు జగన్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారా అనే అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుని ప్రతి రోజు ఇబ్బంది పెట్టిన విధంగా, ఈ రోజు కూడా ఆయన వైఖరి ఉంటుందా అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో ముద్రగడ, ఈ రోజు జగన్ కు ఒక లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్‌లో, 5 శాతం కాపులకు ఇవ్వటానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాని అది అమలు చేయడానికి కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, ఈ రిజర్వేషన్ ఇవ్వలేక పోతున్నాం అని, జీవో కూడా ఇచ్చారని పత్రికల్లో చూసాను, ఈ 5 శాతం రిజర్వేషన్ ఇవ్వద్దు అని ఏ గౌరవ కోర్టు చెప్పింది, ఏ కోర్ట్ లో కేసు ఉందొ తమరు తెలిపితే సంతోషిస్తాను అంటూ లేఖలో ప్రస్తావించారు.

mudragada 29072019 3

నిజంగా అలాగే కోర్ట్ లో స్టే ఉంటే, మళ్ళీ ఎన్నికల వరకు మా డిమాండ్లు, హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటా, మేము మీ బానిసలు లాగా బ్రతకాలా ? హోదా పై మెడలు వంచుతా అని, ఇప్పుడు మడం తిప్పిన మీరు బానిసలుగా బ్రతుకుతూ, మా జాతి పై నీళ్ళు చల్లుతారా అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇదే లేఖలో షర్మిల విషయం కూడా ప్రస్తావించారు. "అయ్యా.. ఆ మధ్య తమరి సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో బూతులు ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయిన ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు. వాటికి బెదిరిపోవడానికి నేనేమీ ఎన్ఆర్ఐను కాదండి. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను" అని ముద్రగడ లేఖలో రాసారు.

Advertisements

Latest Articles

Most Read