ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎప్పుడూ చిన్న చూపే. ఉద్యమ సమయంలో కేసీఆర్, మనల్ని ఎన్ని తిట్టాడో అందరికీ గుర్తు ఉంది. తినే తిండి దగ్గర నుంచి, మన సాహిత్యం దాకా, అన్నిటికీ ఎగతాళి చేసారు. అయితే ఉద్యమ సమయంలో, ఉద్రేక పరిస్థితిలో చేసారులే అని సరి పెట్టుకున్నాం. కాని, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా, ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టాడు. ఆంధ్రప్రదేశ్ తో మీ రాష్ట్రం పోటీ పడుతుంది కదా, అని ఒక ఇంటర్వ్యూ లో అడిగితే, ఆంధ్రప్రదేశ్ ఒక థర్డ్ గ్రేడ్ స్టేట్, దాంతో మా రాష్ట్రాన్ని పోల్చకండి, అంటూ కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. మొన్న జరిగిన తెలంగాణా అసెంబ్లీ సమావేశంలో కూడా కేసీఆర్, అమరావతి పై తనకు ఉన్న అక్కసును కక్కారు.

kcr 12102019 2

అమరావతి అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని, దాని పై ఎలాంటి ఖర్చు పెట్టవద్దు అని నేను చంద్రబాబుకి చెప్పాను అంటూ, ఒక కధ వినిపించారు. అయితే అదే అమరావతి శంకుస్థాపనకు వచ్చి, ఈ అమరావతికి భవిష్యత్తు ఉంది, హైదరాబాద్ అంత ఎదుగుతుంది, మేము వంద కోట్లు అమరావతికి ఇద్దాం అనుకున్నాం అని చెప్పిన విషయాలు అందరికీ గుర్తు ఉన్నాయి. అయితే అమరావతి ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న ఎవరూ స్పందించలేదు. మన రాజధానిని కించపరుస్తున్నా, వీరికి చలనం లేదు. అయితే, కేసిఆర్, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అంటూ, చేసిన వ్యాఖ్యల పై, చంద్రబాబు ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పందించారు.

kcr 12102019 3

ఓపెన్ మ్యగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చంద్రబాబు స్పందిస్తూ, "కేసీఆర్, మా అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, ఆయనకు ఇలా అనటం చాలా ఈజీ. నేను 1995లో సియంగా ఉండగా, హైదరాబాద్ ని డెవలప్ చెయ్యటం, ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఉంటె, ఈ రోజు తెలంగాణాకు ఇంత ఆదాయం వచ్చేదా ? హైదరాబాద్ ఆదాయంతోనే కదా తెలంగణా నడుస్తుంది. ఇప్పుడు కేసిఆర్ కు ఆ ఆదయమే కదా, ఫ్రీ గా పని చేసుకునేలా చేస్తుంది. నేను ప్రజల భవిష్యత్తు గురించి, తెలుగు రాష్ట్రాల ప్రగతి గురించి అలోచించి పని చేస్తున్నా. హైదరాబాద్ ఈ స్థాయిలో ఎదగడంలో నా పాత్ర ఉంది. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా, ఆంధ్రప్రదేశ్ కు కూడా, ఒక సిటీ కావాలని, అమరావతి ప్లాన్ చేసాం. కాని అమరావతిని అందరూ కలిసి, ఆదిలోనే చంపేస్తున్నారు" అంటూ చంద్రబాబు కేసీఆర్ వ్యాఖ్యల పై స్పందించారు.

మొన్నటి వరకు జగన్ ని పొగిడిన వారే, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. నిజంగానే, ఇది వైసిపీలో సరి కొత్త పరిణామం. ఇప్పటి వరకు పార్టీలో ఎన్ని ఉన్నా, వైసీపీ కార్యకర్తలు, ఎప్పుడు జగన్ పై విమర్శలు చెయ్యలేదు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన వెనుక ఉన్నారు. అయితే ఇప్పుడు మొదటిసారి, జగన్ తీసుకున్న నిర్ణయం పై, వైసిపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో, జగన్ కు నైతిక విలువలు లేవు అంటూ, వైసీపీ క్యాడర్, సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తుంది. ఎన్నికల్లో గెలుపు కోసం, గత 10 ఏళ్ళుగా జగన్ కోసం కష్టపడిన వారిని పక్కన పడేసి, పక్క పార్టీల నుంచి వస్తున్న వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని , ఇలాగే కొనసాగితే, పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. అసలు వైసిపీ క్యాడర్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే, రెండు కారణాలు ఉన్నాయి.

jupudi 11102019 2

నెల రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో నుంచి చేర్చుకున్న తోట త్రిమూర్తులు, దళిత ద్రోహి అంటూ, పోరాటాలు చేసామని, ఇప్పుడు అతన్ని తీసుకు వచ్చి, పార్టీలో రెడ్ కార్పెట్ వేసారని అంటున్నారు. అయితే, ఈ బాధ మర్చిపోక ముందే, ఇప్పుడు జూపూడి ప్రభాకర్ ను పార్టీలోకి తీసుకోవటంతో, వైసీపీ కార్యకర్తలు గోల గోల చేస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీలోకి బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా రాని వ్యతిరేకత, జూపూడి చేరికను మాత్రం వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. నేను తప్పిపోయిన గొర్రె లాగా, పార్టీ మారాను అని, ఇప్పుడు జగన్ నాకు మెస్సయ్యలా కనిపిస్తున్నారని, జూపూడి చేసిన వ్యాఖ్యలతో, వైసిపీ కార్యకర్తలకు చిర్రేత్తుకొచ్చింది. టీవీ డిబేట్లలో జూపూడి జగన్‌పై, వైఎస్‌పై చేసిన విమర్శలు, ఇంకా చెవిలో తిరుగుతూనే ఉన్నాయని అంటున్నారు.

jupudi 11102019 3

అలాంటి వ్యక్తిని తిరిగి పార్టీలో చేర్చుకుని తమ మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియా సాక్షిగా జగన్ నిర్ణయాన్ని తప్పు బడుతుంది. పార్టీ ఇంత బలంగా ఉంటె, ఇలాంటి వారిని చేరుచుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందని, ప్రశ్నిస్తున్నారు. జగన్ తల్లిని బూతులు తిట్టిన, జేసి సోదరులను కూడా చేర్చుకోండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే, పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతాం అని అంటున్నారు. ఇక మరో పక్క, టీడీపీ శ్రేణులు కూడా జూపూడి పై విరుచుకు పడుతున్నారు.జగన్ సైకో మనస్తత్వం తెలిసే వైఎస్ కూడా దూరం పెట్టారని వ్యాఖ్యానించిన జూపూడి, ఇప్పుడు జగన్ ను మెస్సయ్య అంటున్నారు అంటే, ఇతను ఎలాంటి వాడో తెలుస్తుందని అంటున్నారు.

జగన్ మోహన్ రెడ్డికి అటు వ్యక్తిగతంగా, ఇటు ప్రభుత్వ పరంగా, ఇబ్బందులు అధికం అవుతున్నాయి. మొన్నటి దాక మా వెనుక కేంద్రం ఉంది, మా వెనుక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ శా ఉన్నారు, మేము తీసుకునే ప్రతి నిర్ణయం వారికి చెప్పే చేస్తున్నాం అని చెప్పిన జగన్, విజయసాయి రెడ్డిలకు, ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. అయుదు రోజుల క్రిందట, జగన్ మోహన్ రెడ్డి, ప్రాధాని మోడీని కలిసి, దాదపుగా గంట సేపు, అన్ని విషయాలు చెప్పి, వినతులు ఇచ్చారు. అయితే, ప్రధాని మోడీ మాత్రం, ఏ విషయంలోనూ జగన్ కు హామీ ఇవ్వలేదు. చివరకు రైతు భరోసా ప్రారంభోత్సవానికి రమ్మని చెప్పినా, నాకు వేరే పనులు ఉన్నాయి, రావటం కుదరదు అని ప్రధాని మోడీ చెప్పారు. అయితే ఆ రోజు హోం మంత్రి అమిత్ షా తో కూడా, జగన్ మీటింగ్ ఉంది. అయితే అమిత్ షా వేరే పనుల్లో బిజీగా ఉండటంతో, జగన్ కు కుదరలేదు.

amit 11102019 2

దీంతో ఆయన ప్రధానిని కలిసి, తిరిగి విజయవాడ వచ్చేసారు. అయితే, రెండు రోజుల క్రిందట, అమిత్ షా శుక్రవారం, జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చారని, జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారని నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. అమిత్ షా తో పాటు, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మిగత కేంద్ర మంత్రులను కూడా జగన్ కలుస్తారాని, మీడియాకు చెప్పారు. అయితే, అనూహ్యంగా, శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన సీఎం జగన్ పర్యటన రద్దు అయింది. కేంద్రమంత్రి అమిత్‌షా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, అందుకే అపాయింట్మెంట్ రద్దు అయినట్టు జగన్ కు తెలియ చేసారు. అందువల్ల ఢిల్లీ పర్యటనను జగన్ వాయిదా వేసుకున్నారు. మళ్ళీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే దాకా, జగన్ వైట్ చెయ్యాల్సిందే.

amit 11102019 3

అయితే వారంలో రెండు సార్లు అమిత్ షా, అపాయింట్మెంట్ రద్దు చెయ్యటం వెనుక మర్మం ఏమిటో అర్ధం కావటం లేదు. ఈ రోజు మేఘా పై ఐటి దాడులు, అలాగే జగన్ కేసుల పై, సిబిఐ స్పీడ్ పెంచటం, ఇవన్నీ చూస్తుంటే, జగన్ కు వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్తితులే. రేపు సిబిఐ కోర్ట్ కనుక, జగన్ ప్రతి శుక్రవారం రావాల్సిందే అంటే మాత్రం, జగన్ పరువు మరింతగా దిగజారుతుంది. ఇక మరో పక్క, రాష్ట్రాన్ని ఆర్ధిక కష్టాలు చుట్టు ముట్టాయి. మొదటి మూడు నాలుగు నెలలు, చంద్రబాబు హయంలో వివిధ పధకాలు అట్టిపెట్టిన నిధులు ఖర్చు చేస్తే కాలం గడిపారు. ఇప్పుడు ఆదాయం పతనం అయిపోతుంది. కేంద్రం అరకోర నిధులు ఇస్తుంది, వీటి అన్నిటి పై, జగన్, అమిత్ షా తో మాట్లాడాలి అనుకున్నా, అటు వైపు నుంచి మాత్రం ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు.

రాష్ట్రంలో పదవుల పందేరం జరుగుతుంది. అర్హతలు, సామర్ధ్యం లాంటివి ఏమి చూస్తున్నారో కాని, తమకు అనుకూలమైన వారి కోసం, మాత్రం పదవులే పదవులు. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, సాక్షిలో పని చేసే ఉద్యోగులను, ప్రభుత్వంలో పెట్టే దాకా వెళ్ళింది. అయితే ఇప్పుడు తాజాగా చేసిన రెండు నియామకాలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వటం ఖాయం. చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పిన కొంత మందిని, తెలుగుదేశం కార్యకర్తలు పట్టుకున్న విషయం తెలిసిందే. అత్యంత పటిష్ట భద్రతలో ఉండే చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పటం, అది టీవీలకు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఆ పట్టుకున్న వారిని నిలదీయగా, తమను కిరణ్ అన్న పంపించారని, కిరణ్ అన్న, జగన గారికి అత్యంత సన్నిహితుడని, ఆయన డ్రోన్ తో చంద్రబాబు ఇంటిని షూట్ చెయ్యమంటేనే చేసామని అన్నారు.

kiran 11102019 2

అయితే ఆ కిరణ్ పై ఎన్ని కేసులు పెట్టినా, స్వయంగా చంద్రబాబు డీజీపీకి ఫోన్ చేసి, ఆ కిరణ్ ఎవడు నా ఇంటి పై డ్రోన్ తిప్పటానికి అని అడిగినా కూడా, అప్పుడు స్పందన లేదు. అయితే , ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తికి, కీలక పదవి కట్టబెట్టారు జగన్ మోహన్ రెడ్డి. కిరణ్ ను, ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా, ప్రభుత్వం నియమించింది. అంటే, ఎంత ధైర్యంగా, వీళ్ళు చేస్తున్నారు అనేది అర్ధమవుతుంది. ఏకంగా చంద్రబాబు ఇంటి పై డ్రోన్ తిప్పిన వ్యక్తికి, పదవి కట్టబెట్టి, ఇది మేము చేసేది, ఏమి చేసుకుంటారో చేసుకోండి అని చాలెంజ్ చేస్తున్నారు. అధికారం ఉంది కాబట్టి, ఎవరికీ పడితే వారికి పదవులు ఇవచ్చు. కాని, ప్రతిపక్ష నాయకుడు ఇంటి పై డ్రోన్ ఎగరు వేసి, చంద్రబాబు పై దాడికి కుట్ర పన్నారు అని టిడిపి ఆరోపిస్తుంటే, ఆ వ్యక్తికి పదవి ఇవ్వటం ఏంటో.

kiran 11102019 3

ఇక జగన్ టూర్లు అన్నిటికీ, డ్రోన్ తో రికార్డు చేసింది కూడా ఇతనే అని వైసిపీ అంటుంది. ఇలా ఫోటోగ్రాఫర్లని, తన ఆఫీస్ లో పని చేసే విలేకరులని, తీసుకొచ్చి, ప్రభుత్వంలో పెడుతున్నారు. ఇక మరో నియామకం గురించి మాట్లాడితే, గత నెల 30వ, జగన్ దేవుడి బిడ్డ, అంటూ బహిరంగ సభలో ప్రశంసలు కురిపించిన, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ కి కూడా బంపర్ ఆఫీసర్ ఇచ్చారు జగన్. ఆయన ఆ బహిరంగ సభలో తన పై కురిపించిన పొగడ్తలకో, లేక నిజంగానే ఆయన పై నమ్మకమో కాని, ఆయనకు అదనంగా మరిన్ని అధికారాలు కల్పిస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక శాఖ సీఈవో, లీడర్ షిప్ ఎక్సలెన్స్, గవర్నెన్స్ ఎండీగా అదనపు పదవి ఇచ్చారు. ఇలా తనకు ఇష్టమైన వారికి, ఇష్టమొచ్చిన పదవులు ఇచ్చేస్తూ, ప్రభుత్వంలో స్థానం కల్పిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read