వైసీపీ నేతలు కార్మికుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి సమాధానం చెప్పాలి. కార్మిక సమాజం వైసీపీ నేతలను చూసి అసహ్యించుకుంటున్నారు. కోటి మంది కార్మికులను వైసీపీ రోడ్డున పడేసింది వాస్తవం కాదా? ఇసుక కొరత సృష్టించి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడేందుకు వైసీపీ కారణం కాదా? చంద్రబాబు గారి పాలనలో ఏరోజూ కార్మికులు రోడ్డు ఎక్కలేదు. నేడు లక్షలాది మంది కార్మికులు రోడ్డెక్కారు. నేడు కార్మికులు తినడానికి తిండి లేక, అనారోగ్యం పాలైతే చికత్స తీసుకోలేక అవస్థలు పడుతున్నారన్న సంగతి వెల్లంపల్లి మర్చిపోయారా? టీడీపీ హయాంలో చంద్రన్న బీమా పథకం తీసుకువస్తే.. నేడు ఆ పథకాన్ని రద్దు చేశారు. కార్మికులకు పెద్దన్నగా చంద్రన్న నిలిచారు. నేడు కార్మికులకు రక్షణ లేకుండా చేసిన ఘనత వైసీపీది. కార్మికులు అనే పదం పలికే అర్హత వైసీపీకి లేదు. అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అన్యా క్యాంటీన్ల మూసివేతపై రేపటి నుంచి మేం ఆందోళనలు చేస్తున్నాం.
రూ.15కే మూడు పూటలా అన్నం పెట్టాం. నేడు కార్మికుల పొట్ట కొడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయి. అమరావతిలోనే లక్ష మంది కార్మికులు పనిచేసేవారు. వీరంతా రోడ్డున పడ్డారు. దీనికి బాధ్యులు వైసీపీ కాదా? వెల్లంపల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తే.. కార్మికుల అవస్థలు తెలుస్తాయి. అచ్చెంన్నాయుడు గారు నిబద్ధత గల వ్యక్తి. వెల్లంపల్లి ఇప్పటివరకు ఎన్ని జెండాలు మార్చారో అందరికీ తెలుసు. తన స్థాయి ఏంటో వెల్లంపల్లి తెలుసుకుని మాట్లాడాలి. ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్. అమ్మవారి నవరాత్రుల సందర్భంగా బ్లాక్ లో టికెట్లు, దొంగ టికెట్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. పోస్టింగ్ ల కోసం అధికారుల వద్ద డబ్బులు వసూలు చేసింది వాస్తవం కాదా? బీసీలకు చెందిన రూ.4వేల కోట్ల నిధులను దారిమళ్లిస్తే అచ్చెంన్నాయుడు గారు అడగటం తప్పా?
ఆదరణ పథకాన్ని రద్దు చేశారని అడగడం తప్పా? అచ్చెంన్నాయుడు గారికి భయపడి ఆయనపై బురద జల్లుతున్నారు. ఈఎస్ఐ విషయంలో విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా అచ్చెంన్నాయుడు గారి పేరు లేదు. టెలి హెల్త్ సర్వీస్ లో కూడ అచ్చెంన్నాయుడు గారి పేరు లేదు. కొనుగోళ్లకు సంబంధించి ఆయన పాత్ర ఎక్కడా లేదు. 51 జీవోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ మాదిరిగా చేయాలని లేఖ రాశారు. దీనిని పట్టుకుని బురద జల్లుతున్నారు. లేఖలో అధికారులను నిబంధనలు పాటించవద్దని ఎక్కడా చెప్పలేదు. ఆధారాలు లేకుండా వైసీప నేతలు బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా వెల్లంపల్లి శ్రీనివాస్ జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ధ్వజమెత్తారు.