ఆయన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్న నేత.. ఆయనే ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి.. మొదటి నుంచి పార్టీకి, అధినాయకుడు చంద్రబాబుకి అండగా వస్తూ వస్తున్నారు. మొన్న ఎన్నికల్లో, అంత బలమైన వైసీపీ గాలి వీచినా, తట్టుకుని గెలిచారు. ఆయన ఎంత బాగా లాజిక్ మాట్లాడతారో అందరికీ తెలిసిందే. గోదావరి వెటకారంతో పంచ్ వేస్తె, అవతలి వారు సైలెంట్ అయిపోవటమే. అసెంబ్లీలో కూడా గోరంట్ల ఎలా ఫైట్ చేస్తారో చూస్తున్నాం. అయితే, ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి, చంద్రబాబుకి, పార్టీకి అండగా ఉన్నా, ఆయనకు ఇప్పటి వరకు మంత్రి పదవి మాత్రం రాలేదు. ఎందుకో అందరికీ తెలిసిందే. సామాజిక న్యాయం అనే ఉచ్చులో పడిన చంద్రబాబు గారు, ఇలాంటి వారికి అన్యాయం చేసారు అనే విమర్శలు ఉన్నాయి. అయినా బుచ్చయ్య చౌదరి గారు, ఎప్పుడూ బాధ పడలేదు. పార్టీకి పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కూడా, ఇదే నా చివరి ఎన్నిక అని కూడా చెప్పేశారు.

ఇక యువతకు, నా స్థానం ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్పారు. సహజంగా, ఇలా చివరి ఎన్నికలు అంటే, అందరూ రిలాక్స్ అయిపోతారు. అయితే, గోరంట్ల మాత్రం, మరింత దూకుడుగా వెళ్తున్నారు. యువతకు దగ్గర కావటం కోసం, సోషల్ మీడియా వేదికగా పంచులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం సోషల్ మీడియా. టిడిపి అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి, పార్టీ తన సోషల్ మీడియా వ్యూహాన్ని మార్చింది. టిడిపి, నారా లోకేష్, మరియు చంద్రబాబు నాయుడు యొక్క ట్విట్టర్ ఖాతాలు ఈ రోజుల్లో మరింత చురుకుగా ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి సూటిగా ఉన్నాయి, అయినప్పటికీ, వైయస్ఆర్ కాంగ్రెస్ డిజిటల్ మీడియాను ఎదుర్కోవటం కష్టం అనే చెప్పాలి.

ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ తన సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క అకస్మాత్తుగా, టిడిపి సీనియర్ నాయకుడు మరియు ఎమ్మెల్యే గోరంట్లా బుచయ్య చౌదరి ట్విట్టర్ ఖాతా గత రెండు నెలల్లో చురుకుగా పని చేస్తుంది. .చమత్కారమైన ట్వీట్లు మరియు వ్యంగ్యంతో అద్భుతమైన ట్రాక్షన్ పొందుతోంది. రాజకీయ నాయకుల తీవ్రమైన ట్వీట్ల మాదిరిగా కాకుండా, ఈ ఖాతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాలతో పోస్ట్ లు చేస్తుంది. చాలామంది టిడిపి కార్యకర్తలు, ఈ టిడిపి ఖాతా అన్నికంటే బాగుందని, ఇలాగే వ్యంగ్యంతో కొట్టాలని అంటున్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ఖాతాల కంటే, బుచ్చయ్య ట్విట్టర్ ఖాతా ఎక్కువ ఆకట్టుకుంటుందని, టిడిపి కార్యకర్తలు అంటున్నారు. గోరంట్లా బుచయ్య చౌదరి టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆరుసార్లు ఎమ్మెల్యే. ఎన్టీఆర్ పాలనలో పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2019 ఫిబ్రవరి 27 న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ పేరుతో, విశాఖపట్నం కేంద్రంగా, ప్రధాన కార్యాలయంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు ప్రకటించారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ ప్రకటన కేంద్రం నుంచి వచ్చింది. నాలుగైదు నెలల్లో ఈ జోన్ ఉనికిలోకి వస్తుందని అప్పట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు కూడా. కానీ అలాంటిదేమీ ఇప్పటి వరకు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం తాజగా ఇచ్చిన తన బడ్జెట్‌లో కొత్త రైల్వే జోన్ గురించి ప్రస్తావించలేదు. ఇప్పటికే ప్రకటించిన విశాఖ కొత్త జోన్ యొక్క మౌలిక సదుపాయాల కోసం ఎటువంటి కేటాయింపులు ఈ బడ్జెట్ లో కేంద్రం చెయ్యలేదు. అంటే విశాఖ జోన్ ప్రకటన అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు ఎన్నికల జిమ్మిక్ గానే మారిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. రాష్ట్ర రాజధాని ప్రణాళిక ప్రకారం కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంగా మార్చినట్లయితే, విశాఖపట్నం కోసం ఎక్కువ రైళ్లు అవసరం.

ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఆ అంశంలో ఉపయోగపడుతుంది. కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంటకల్ వంటి మూడు రైల్వే విభాగాలు ఉన్నాయి. ముఖ్యమైన వాల్టెయిర్ విభాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌కు వదిలిపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో, కేంద్రం తన బడ్జెట్ లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశం పెట్టక పోవటంతో, మళ్ళీ మొదటికి వచ్చినట్టే అయ్యింది. ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీజేపీ చేసిన హడావిడి అంతా, ఉట్టి మాటలగానే మిగిలి పోయాయి. ఆ రోజు ప్రధాని మోడి కూడా ఎన్నికల ప్రచారంలో ఈ విషయం పై గొప్పగా చెప్పారు. అయితే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత, ఇవన్నీ ఒట్టి మాటలే అని, ఎన్నికల ముందు చేసిన షో అని అర్ధమవుతుంది.

మరో పక్క, విభజన హామీల్లో ఒక్కటి కూడా, ఈ సారి కేంద్ర బడ్జెట్ లో పెట్టలేదు. 22 ఎంపీలతో, కేంద్రం మెడలు వంచి, కేంద్ర బడ్జెట్ నుంచి సాధిస్తాం అని చెప్పిన వైసీపీ, రాష్ట్రానికి తెచ్చింది "గుండు సున్నా". 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజి, పారిశ్రామిక రాయతీలు, పోలవరం, రాజధాని, రెవిన్యూ లోటు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం పోర్టు, విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యెక హోదా, జాతీయ విద్యాసంస్థలకు నిధులు ఇలా ఏ విషయంలోనే కేంద్ర బడ్జెట్ లో ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇలా ఇవ్వకపోగా, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర వాటా తగ్గిపోయింది. గతంలో 4.305 శాతం ఉండగా, ఇప్పుడు 4.111 శాతం అయ్యింది. దీని వల్ల, రాష్ట్రం రూ.1,521.30 కోట్లకు పైగా నష్ట పోతుంది.

మద్యపాననిషేధం ముసుగులో జగన్మోహన్‌రెడ్డి భారీదోపిడీకి తెరలేపారని, రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న దుకాణాల నిర్వహణను చేప్టిన ప్రభుత్వం ప్రతి 100కేసులమద్యం కొనుగోలుపై ఉచితంగా వచ్చే 30కేసులుఅమ్మగా వచ్చే ఆదాయం మొత్తం ఏపీసీఎం జేబులోకే వెళుతోందని ఎమ్మెల్సీ బుద్దావెంకన్న ఆరోపించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మ్లాడారు. మద్యం దుకాణాల్లో వైసీపీనేతలకు చెందిన లిక్కర్‌కంపెనీల్లో తయారే 3, 4రకాల బ్రాండ్లనే అమ్ముతున్నారని, వాిపై కూడా క్వార్టర్‌కు రూ.30 నుంచి రూ.40వరకు అదనంగా వసూలుచేస్తున్నారన్నారు. నిషేధం మాటున పేదలు, మధ్యతరగతిని జగన్‌సర్కారు కల్తీమద్యానికి బానిసల్ని చేస్తోందన్నారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువధరకు అమ్ముతూ, పెంచినధరలద్వారా వచ్చే మొత్తాన్ని ఏ1- ఏ2లు తమజేబుల్లో వేసుకుంటు న్నారని వెంకన్న మండిపడ్డారు. పగలంతా రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడి సంపాదిం చుకున్న సొమ్ముని, శ్రమజీవుల రక్తాన్ని జగన్‌ప్రభుత్వం జలగలా పీల్చేస్తోందన్నారు. మామూలుగా పెంచినరేట్లద్వారా ప్రభుత్వఖజానాకు రూ.2 వేలకోట్ల వరకు ఆదాయం వస్తోందన్నారు.

ఆ ఆదాయం అలాఉంటే, దుకాణాలకు చెల్లించే అద్దెరూపంలో, ఉచితంగా వచ్చే మద్యంఅమ్మకాల ద్వారావచ్చే ఆదాయాన్ని తోడుదొంగలైన జగన్‌, విజయసాయిలు చెరిసమానంగా పంచుకుంటున్నారని బుద్దా స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే, దుకాణాలు మూసేసినతర్వాత రాత్రి8గంటలనుంచి, ఉదయం 10మధ్యలో క్వార్ట్‌ర్‌కు రూ.30, రూ.40వరకు అదనంగా అమ్ముతూ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు తమజేబులు నింపుకుంటున్నార న్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలుచేస్తే, జగన్మోహన్‌రెడ్డి థలవారీగా చేస్తానం టూ, జే-ా్యక్స్‌ రూపంలో, ఉచితంగా వచ్చే మద్యంఅమ్మకాలద్వారా రూ.10వేల కోట్లవరకు జగన్‌, విజయసాయిల జేబుల్లోకి వెళుతున్నాయన్నారు. పదవుల్లోకి రాకముందే లక్షలకోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నవారికి ఇలాటంవన్నీ వెన్నతో ప్టిెన విద్యలని బుద్ధాఎద్దేవా చేశారు. పన్నులరూపంలో ప్రజలసొమ్ము ప్రభుత్వానికి వెళుతు ంటే, అవేసొమ్ముని ప్రజలకు ఇచ్చినట్టేఇస్తూ, తిరిగి మద్యంరూపంలో జగన్‌సర్కారు స్వాహాచేస్తోందన్నారు.

మద్యపాననిషేధం జగన్‌కు ఆదాయవనరుగా మారిందనడానికి ఇంతకంటే రుజువులే ముాంయన్నారు. ప్రభుత్వం ఇప్పికైనా మద్యందుకాణాలను ప్రైవేటువ్యక్తులకే అప్పగించాలన్నారు. అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండి... అర్థణాకు ఎక్కువ, బేడాకు తక్కువైన అన్నాబత్తుని శివకుమార్‌ శిఖండిలా ప్రవర్తిస్తూ, రాజకీయ పితామహుడైన చంద్రబాబు నాయుడిపై నోరుపారేసుకుంటున్నాడని, అతను తననోిని అదుపులో పెట్టుకోకపోతే తగినవిధంగా బుద్ధిచెబుతామని వెంకన్న హెచ్చరిం చారు. సౌమ్యుడిగా పేరున్న అన్నాబత్తుని సత్యనారాయణ కడుపున చెడబ్టుిన శివకు మార్‌, తనతండ్రికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడన్నారు. శివకుమార్‌ తాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, అతనంత మగాడయితే, తెనాలో ఎక్కడకు రమ్మాండో చెప్పాలని వెంకన్న సవాల్‌ విసిరారు. నోరుందికదా అని రెచ్చిపోతున్న వైసీపీనేతలు తమ పదవులు శాశ్వతం కావనే విషయాన్ని తెలుసుకోవాలని, రెచ్చిపోయేవారందరి జాబితాను చంద్రబాబునాయుడు సిద్ధంచేస్తున్నాడని, వారందరి అంతుచూసి తీరుతామని వెంకన్న తేల్చిచెప్పారు.

క్యాపిటల్ షిఫ్ట్ పై కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలను కేంద్ర ప్రభుత్వం, ఒక్క దెబ్బతో తుస్సు మనిపించింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇచ్చిన బిల్డ్ అప్ చూసి, ఇంకా ఏముంది, బీజేపీ పార్టీ, కేంద్రం నుంచి చక్రం తిప్పుతుందని, జగన్ దూకుడుకు బ్రేక్ వేస్తుందని అందరూ అనుకున్నారు. కాని, అక్కడ అనుకున్నట్టు ఏమి జరగలేదు. కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన మాటలు, సుజనా చౌదరి చెప్పిన మాటలు, అన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. పార్లమెంట్ సమావేశాల్లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎంపి జయదేవ్ గల్లా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర ప్రభుత్వం తన రాజధానిని ఎక్కడ గుర్తించాలో అది రాష్ట్ర ప్రభ్తువం ఇష్టంగా పేర్కొంది. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవడానికి కేంద్రం కూడా నిరాకరించింది. గల్లా జయదేవ్ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సలహా ఇస్తుందో లేదో చెప్పాలని ప్రశ్న వేసారు.

ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రంలో పెట్టుబడి వాతావరణాన్ని ఇబ్బంది పెట్టటమే కాక, నిర్మాణానికి తమ భూమిని ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. అయినా కేంద్రం మాత్రం, ఈ వాదన గురించి పట్టించుకోలేదు. ఇక్కడ ఊరట కలిగించే విషయం మాత్రం, అమరావతిని 2015లోనే నోటిఫై చేసారు అనేది మాత్రమే. అయితే రాజధాని విషయంలో ఎక్కడ ఉండాలి అనేది, రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెప్పి తప్పించుకుంది. ఒక పాలసీ డెసిషన్ లేకుండా, కేంద్రమే ఇలా చెప్తే, ఇక ప్రభుత్వాలు మారిన ప్రతిసారి, రాష్ట్రాలు రాజధానులను తమకు ఇష్టం వచ్చిన చోటు పెట్టుకునే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్న నిర్ణయం చూసి, మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అయితే, ఇది మరింత ప్రమాద కరం అవుతుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిర్ణయం, అటు అమరావతి రైతులనే కాక, మిగతా రాజకీయ పార్టీలకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం ఎక్కువ నష్టపోయేలా చేస్తుంది. జనసేన ఇటీవల బిజెపితో పొత్తు పెట్టుకుని, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతుందని, అలా అవుతుందని హామీ ఇచ్చారు కాబట్టే పొత్తు పెట్టుకున్నాం అని పవన్ చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకోవటానికి నిరాకరించడం అంటే, ఈ అంశంపై జనసేన బిజెపిని ప్రభావితం చేయలేకపోయిందని, ఈ పొత్తు విఫలమైనదిగా అమరావతి రైతులకు కనిపిస్తుంది. అమరావతిని కొనసాగించడం కూటమికి ముందస్తు షరతు అని పవన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో కూడా ఎపికి ప్రత్యేక కేటాయింపులు లేవు, మరో పక్క అమరావతి మా పరిధిలోకి రాదు అని కేంద్రం అంటుంది. మరి జనసేన బిజెపితో ఎందుకు పొత్తు పెట్టుకుందో, ఇప్పుడు పవన్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. చూద్దాం, పవన్ ఏమి చేస్తారో ?

Advertisements

Latest Articles

Most Read