ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, కనీసం చంద్రబాబుకు కూడా మాట్లాడే అవకాసం ఇవ్వరు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగాతి తెలిసిందే. అందుకు కారణంగా, చంద్రబాబు కూడా రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్ళలేదు. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో కూడా, తెలుగుదేశం పార్టీ ఎంపీలను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీలు. ఈ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పై గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరుపున పార్లమెంట్ లో స్పందించారు. ఈ సందర్భంగా, గత 8 ఏళ్ళుగా, రాష్ట్రానికి, కేంద్రం నుంచి సరైన సహాయం అందటం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని, ఈ సారి బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అని, అయితే ఈ సారి కూడా మా ఆశలు వమ్ము చేసారని గల్లా జయదేవ్, కేంద్రం పై ధ్వజమెత్తారు. తరువాత, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, అలాగే జగన్ మోహన్ రెడ్డి గత 8 నెలలుగా రాష్ట్రంలో సాగిస్తున్న పాలనను దేశం ద్రుష్టికి తీసుకు వచ్చారు.

గత 8 నెలలుగా రాష్ట్రం రివర్స్ లో వెళ్తుందని అన్నారు. విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్ కు, జగన్ చేస్తున్న పనులతో మరింత నష్టం జరుగుతుందని గల్లా అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ, నిర్ణయం తీసుకున్నారని, అది మూడు రాజధానులు కాదని, మూడు ముక్కల రాజధాని అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2015లో అమరావతిని రాజధానిగా నోటిఫై చేసామని చెప్పారని అన్నారు. అలాగే మ్యాప్ లో కూడా అమరావతిని పెట్టారని గుర్తు చేసారు. విభజన చట్టంలో కూడా, ఒక రాజధానికి సహాయం అని ఉంది కాని, మూడు రాజదానులు అని లేదని గల్లా జయదేవ్ అన్నారు. అలాగే కేంద్రం కూడా గతంలో ఒక రాజధానికి అని చెప్పే, 1500 కోట్లు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసారు.

జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ అని వేసి, గందరగోళ పరుస్తున్నారని అన్నారు. వాటికి అసలు చట్టబద్దత లేదని అన్నారు. ఒక రాజధానికి ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే, మూడు రాజధానులు ఎక్కడ నుంచి ఖర్చు పెడతారు అంటూ గల్లా నిలదీసారు. వివిధ పత్రికల్లో , జాతీయ చానల్స్ లో, జగన్ మోహన్ రెడ్డి ని ఒక తుగ్లక్ అంటూ చెప్తున్నారని అన్నారు. గల్లా ప్రసంగం ఉన్నంత సేపు, వైసీపీ ఎంపీలు, ఆయన ప్రసంగాన్ని అడ్డు చెప్పే ప్రయత్నం చేసారు. గల్లా ప్రసంగం మొదలు కాగానే, వైసీపీ ఎంపీ మాధవ్ వచ్చి, గల్లా వెనుక బెంచ్ లో కూర్చుని అడ్డు తగులుతూ వచ్చారు. ఈ దశలో పలుసార్లు వైసీపీ సభ్యులు గల్లా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా నందిగం సురేశ్ తదితరులు గల్లా ప్రసంగాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయితే గల్లా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో రంగుల పనులు ఎంత బాగా నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ప్రతి ఊరిలో ఉన్న పంచాయతీ భవనానికి, వైసీపీ పోలిన రంగులు వెయ్యమని, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక అధికారి ఇచ్చిన మెమోతో, రాష్ట్రంలో ఉన్న ప్రతి పంచాయతీ ప్రతి వార్డులోని భవనాలు వైసీపీ రంగులతో నింపేసిన సంగతి తెలిసిందే. అలాగే ప్రతి పంచాయతీ ఆఫీస్ కు జగన్ మోహన్ రెడ్డి ఫోటో కూడా ముందు బోర్డు మీద తగలించారు. ఒక్క పంచాయతీ ఆఫీస్ మాత్రమే కాదు, వాటర్ ట్యాంకులకు కూడా ఇదే పరిస్థితి. ప్రతి ప్రభుత్వ భవనానికి, ఇదే పరిస్థితి వచ్చింది. అయితే, కొంత మంది మరీ ఉత్సాహం ఎక్కువ ఉన్న వారు, కనిపించిన ప్రతి దానికి వైసీపీ రంగులు వెయ్యటం మొదలు పెట్టరు, బోరింగ్ పంపు, గద్దర్లు, పూల కుండీలు, ఆకులు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏది కనిపిస్తే అది రంగులతో నింపేశారు. అయితే, ఈ రంగుల పిచ్చ పై, చిరాకు పుట్టిన ఒక సామాజిక కార్యకర్త, గుంటూరుకు చెందిన వ్యక్తీ, హైకోర్ట్ లో ఒక పంచాయతీ విషయం పై, కోర్ట్ లో కేసు వేసారు.

పంచాయతీ ఆఫీస్ లకు వైసీపీ రంగుల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తీరును ఆక్షేపించిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే హైకోర్ట్ సీరియస్ అవ్వటంతో, పంచాయతీకి వేసిన రంగులు వైసీపీ ర్టీ రంగులు వేర్వేరని ప్రభుత్వ లాయర్ హైకోర్ట్ కు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చసారు. దీని పై హైకోర్ట్ తీవ్రంగా స్పందించింది. హైకోర్ట్ వేసిన ప్రశ్నలకు ప్రభుత్వ లాయర్ అవాక్కయ్యారు. రంగులను మేము గుర్తుపట్టగలమన్న న్యాయమూర్తి, పార్టీ జెండా, గుర్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసారు. ఇక అలాగే, పంచాయతీ ఆఫీస్ లమీద సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని జడ్జి, ప్రభుత్వ తరపున వచ్చిన లాయర్ ని ప్రశ్నించారు.

రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ముద్రించినట్టు లాయర్.. వెల్లడించారు. అయితే, దీని పై కూడా లాయర్ మీద మండి పడ్డారు న్యాయమూర్తి. పార్లమెంట్ మీద మోడీ, సుప్రీం కోర్టు మీద సీజేఐ ఫోటో ముద్రించారా అని న్యాయమూర్తి ప్రశ్నలు వెయ్యటంతో, ప్రభుత్వ లాయర్ అవాక్కయ్యారు. ఈ సంప్రదాయం ఎక్కడుందో చూపాలన్న న్యాయమూర్తి అడగటంతో, అవాక్కయ్యారు. ఇక్కడతో కేసు రేపటికి వాయిదా పడింది. ఈ విషయం పై కోర్ట్ రేపు ఏమి స్పందిస్తుందో చూడాలి. ఒక పక్క స్థానిక ఎన్నికలు వస్తున్న తరుణంలో, ఎన్నికలు ఎక్కువగా పంచాయతీ ఆఫీస్ లలోనే జరుగుతాయి. ఇక్కడ ఒక పార్టీ రంగులు వెయ్యటం, అలాగే జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండటం, ఇవన్నీ ఎన్నికల కోడ్ కిందకు వస్తాయి. అన్నీ తెలిసినా, ప్రభుత్వం ఇలా ఎందుకు చేసిందో మరి.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వణికిస్తోందని, చైనాలో వేలాదిమంది వైరస్‌బారిన పడ్డారని, ఆదేశంలో అనధికారికంగా 10వేలమంది వరకు చనిపోయారని, మిగిలిన దేశాలు, రాష్ట్రాలు వైరస్‌పై ప్రజలకు అవగాహనకల్పిస్తూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి జగన్‌మాత్రం కరోనావైరస్‌కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖతో, ఇతరఅనుబంధశాఖలతో ఒక్కటంటే ఒక్క సమీక్షాసమావేశం కూడా నిర్వహించకపోవడం విచారకరమని టీడీపీనేత, ఆపార్టీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వాపోయారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయ ంలో విలేకరులతో మాట్లాడారు. కరోనావ్యాప్తిపై జిల్లాకలెక్టర్లతో, వైద్య, ఇతరశాఖల సిబ్బందితో సమీక్షలు నిర్వహించకుండా, రాష్ట్రంలో నమోదైన కరోనాకేసులను విచారిం చకుండా, తనస్వార్థప్రయోజనాలకోసమే జగన్‌ పాకులాడుతున్నాడని పట్టాభి మండిపడ్డా రు. చైనాలో చిక్కుకున్న తెలుగువిద్యార్థులు, ఉద్యోగులను తక్షణమే వారివారి స్వస్థలాలకు తరలించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు జనవరి 31న కేంద్రవిదేశాంగమంత్రికి లేఖరాస్తే, బాధ్యతగల ముఖ్యమంత్రిపదవిలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి, కనీసం లేఖకూడారాయకపోవడం బాధాకరమన్నారు.

స్వదేశంలో, స్వరాష్ట్రంలో ఉన్న వారిని జగన్‌ ఎలాగూ పట్టించుకోవడంలేదని, కనీసం విదేశాల్లో ఉన్నవారి గురించికూడా పట్టించుకోకపోతే ఎలాగని పట్టాభి నిలదీశారు. నిఫావైరస్‌ 2018లో దేశంలోకి ప్రవేశించినప్పుడు, జిల్లాలవారీగా చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించి అన్నిరకాలుగా ముందుజాగ్రత్తలు తీసుకొని రాష్ట్రం నిఫాబారినపడకుండా చర్యలు తీసుకున్నారని పట్టాభి తెలిపారు. కాకినాడలో కరోనావ్యాపించడంతో ప్రభుత్వా సుపత్రి వైద్యులు భయంతో విధులకు వెళ్లడంమానేశారని, అయినా ప్రభుత్వంలో చలనంలేదన్నారు. జగన్‌ ముఖ్యమం త్రయ్యాక డెంగ్యూబారినపడి అనేకమంది మరణించినా, దోమలనిర్మూలనకు ప్రభుత్వం ఎలాంటిచర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాననగరాల విమానాశ్రయాల్లో కరోనాను గుర్తించే స్కానర్లు, పరికరాలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని, ఆవైరస్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే, జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

డెంగ్యూ విషయంలో మాదిరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కరోనా ఉధృతంగా వ్యాప్తి చెందుతుందని, దానివల్ల ప్రాణనష్టం తప్పదని పట్టాభి హెచ్చరించారు. జగన్‌ ఇప్పటికైనా తనమొద్దునిద్రను వీడి, చంద్రబాబు మాదిరే అత్యవసరంగా సమీక్షలు నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించి, అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్‌చేశారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేపరికరాలు, స్కానర్లు ఏర్పాటుచేసి, వ్యాధిలక్షణాలున్న వారికి అత్యవసర వైద్యసేవలు అందించాలని టీడీపీనేత సూచించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న జగన్‌సర్కారు తక్షణమే స్పందించి, కరోనావ్యాప్తికి అడ్డుకట్టవేసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్‌చేశారు.

ముఖ్యమంత్రి మూడురాజధానుల ప్రకటనచేశాక, రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు 50వరోజుకి చేరాయని, ఎన్నోమలుపులు తిరిగిన ప్రజాఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేయరానిపనులన్నీ చేసిందని, వేయాల్సిన కుప్పిగంతులన్నీ వేసిందని, మహిళలను, రైతులను పోలీసులతో దారుణంగా కొట్టించి, వారిపై లేనిపోని సెక్షన్లకింద కేసులు పెట్టిందని, చివరకు ఏమీచేయలేక జగన్‌సర్కారు తోకముడిచిందని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆఖరికి ఉద్యమకారుల్ని నిలువరించడానికి పోలీసులు గోళ్లతో రక్కినా, గిచ్చినా, మొక్కవోని ధైర్యంతో నేటికీ ఆందోళనలు కొనసాగుతు తుండటం అభినందనీయమని రామయ్య తెలిపారు. విజయవాడలోని పోలీస్‌స్టేషన్లన్నం టినీ రాజధాని మహిళలతో నింపేసి, వారిపై కర్కశంగా లాఠీలు ఝుళిపించినా వారి పోరాటం ఆగలేదన్నారు. ప్రభుత్వవ్యవహారశైలిని పట్టించుకోకుండా ఆందోళనలు కొనసాగించాలని చెప్పడానికే టీడీపీఅధినేత, జేఏసీసభ్యులతో కలిసి రాజధాని ప్రాంతం లో పర్యటిస్తున్నారని వర్ల చెప్పారు. తానుపట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా జగన్‌ ఎందుకు వ్యవహరిస్తున్నాడని, ఆందోళనలకు పరిష్కారం చూపకుండా కృత్రిమ ఆందోళనలు చేయించడం ద్వారా ముఖ్యమంత్రి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుం టున్నాడని వర్ల ప్రశ్నించారు.

వైసీపీవారితో రోడ్లపై ఊరేగింపులు చేయించడం, శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నవారిపై కవ్వింపుచర్యలకు పాల్పడటం ఎంతవరకు సబబని, దానివల్ల సభ్యసమాజానికి జగన్‌ ఏంసందేశం ఇవ్వాలనుకుంటున్నాడని వర్ల ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించకుండా అగ్నిలో ఆజ్యంపోసినట్లుగా వ్యవహరిం చడం ప్రభుత్వానికి ఎంతవరకు భావ్యమన్నారు. నారావారిపల్లెలో సభపెట్టి, ఏడుగురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు వెళ్లినా చివరకు ఖాళీకుర్చీలే మిగిలాయని, ప్రజాఉద్యమాన్ని వదిలేసి, మద్ధతులేని వాటికి వంతపాడటం ముఖ్యమంత్రికి తగునా అని రామయ్య ప్రశ్నించారు. వైసీపీవిద్యార్థి, యువజన విభాగాలతో మాట్లాడిన ముఖ్య మంత్రి, వారికి కావాల్సిన వనరులిచ్చి, పైఖర్చులకు డబ్బులిచ్చి వారిని రోడ్లపైకిపంపి, ఉద్యమాలు చేయిస్తూ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యక్షయుద్ధానికి తెరతీయడం సమంజసం కాదని వర్ల హితవుపలికారు. వైసీపీయువజన విభాగం 6వతేదీన మానవహారాలనిర్వహ ణ, 7న కొవ్వొత్తులర్యాలీ, 8న ప్రతిపక్షనేతకు మంచిబుద్ధి ప్రసాదించాలని విన్నపాలు చేయనున్నారని, 8న వైసీపీవారు చేసేకార్యక్రమంస్థానంలో, ఉద్యమకారులు కూడా అదేరోజున జగన్మోహన్‌రెడ్డికి మంచిబుద్ధి ప్రసాదించాలని నిరసనతెలుపుతారని, ఎవరెక్కువమంది ఉన్నారో రిఫరెండం నిర్వహించాలని, దీనికి జగన్‌, ఆయనసర్కారు సిద్ధమేనా అని వర్ల నిగ్గదీశారు. చేసేదేమీలేదని తెలిసికూడా జగన్మోహన్‌రెడ్డి, వారిపార్టీ వారిని సంతోషపెట్టడానికి సకలవనరులు సమకూర్చాడన్నారు.

జగన్‌ వ్యవహారశైలి ఎమర్జెన్సీని తలపిస్తోందని, ఆనా ఎమర్జన్సీలో సెక్షన్‌ 144, సెక్షన్‌-30లు విశృంఖలం గా అమలుజరిపారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తోందని, ప్రతిపక్షనేత, ఇతరసభ్యులు ఎక్కడికివెళ్లే అక్కడ 144సెక్షన్‌ పెట్టడం ఏరాష్ట్రంలోనూ లేదన్నారు. ఎమర్జన్సీ పెట్టినవారికి ఏగతిపట్టిందో, జగన్‌ ప్రభుత్వానికికూడా అదేగతిపట్టనుందన్నారు జగన్‌సర్కారు నిర్లక్ష్యం కారణంగా 42మంది రైతులుచనిపోయారని, అయినా మానవత్వ ంలేని ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. చివరకు రాజధానిప్రాంతలోని శాసనసభ్యులు నోరెత్తకుండా, జగన్‌ భజనలో మునిగితేలుతున్నారన్నారు. చనిపోయిన వారిని పరామర్శిచండంలో పేటెంట్‌హక్కులున్న జగన్‌, చనిపోయినవారి కుటుంబాలను ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదన్నారు.

ఒకవైపు రైతులంతా ఆందోళనలు చేస్తుంటే, 20మంది రాజధాని రైతులు ఎమ్మెల్యే ఆర్కే ద్వారా జగన్‌ను కలిశారని, ఆరైతులు ఎవరో, ఏఊరివారో, ఎక్కడినుంచి వచ్చారో , చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు. వచ్చినరైతులకు తనకార్యాలయంలో పకోడిలుపెట్టి సత్కరించిన జగన్‌, ఇతరరైతులను కూడా అదేమాదిరి ఎందుకు పట్టించుకోవడంలేద న్నారు. పత్రిక, ఛానల్‌ ఉన్నాయికదా అని, ఇష్టమొచ్చినట్లు ప్రచారంచేసుకుంటుంటే ప్రజలు నమ్మరని వర్ల తెలిపారు. అమరావతి రైతులపేరుతో జగన్‌ని కలిసినవారిలో పెద్దరైతు ఆళ్ల రామకృష్ణారెడ్డయితే, ఇతరులు వైసీపీ మాజీజడ్పీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్కే లాయర్‌ చోడిశెట్టి నిర్మల, ఆర్కే చిన్నాన్న బోసురెడ్డి, బోసురెడ్డి బావమరిది సాంబిరెడ్డి, మాజీజడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి బాబాయి నాగిరెడ్డి, ఆర్కే బావమరిది వేణుగోపా ల్‌ రెడ్డి, ఆర్కేడ్రైవర్లు ఉన్నారని, వీరంతా రైతులా అని వర్ల మండిపడ్డారు. రైతులపేరుతో తన బంధువుల్ని తీసుకెళ్లిన ఆర్కే, నిన్న జగన్‌సమక్షంలో తనడ్రామాను బాగా రక్తికట్టిం చాడన్నారు.

ముఖ్యమంత్రికి తెలిసోతెలియకో, ఆయన ఆర్కే కుటుంబసభ్యులకు పకోడీలు పెట్టి, టీపార్టీ ఇస్తే, దాన్ని సాక్షిమీడియా ఆకాశానికి ఎత్తేసిందన్నారు. సీఎం జగన్‌ తమతో రెండుగంటలు మాట్లాడాడని, తమకు ఏసమస్యలేకుండా చూస్తానని హామీ ఇచ్చాడని, ఇలాంటి చర్యలద్వార జగన్‌ తనకుతానే మోసంచేసుకుంటున్నాడని వర్ల ఎద్దేవాచేశారు. జగన్‌ను కలిసినవారికి భూములుఉంటే ఉండవచ్చుగానీ, ఇలాంటి చర్యలవల్ల అమరావతి ఉద్యమాన్ని మరింత బలపడేలా, ఉవ్వెత్తున ఎగసేలా చేశారన్నారు. మీడియాసిబ్బందిపై నిర్భయకేసులు పెట్టడంద్వారా, వారిని బెదిరించి దారికి తెచ్చుకోవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నాడని, మీడియాసిబ్బందిపై, మహిళలు, రైతులపై పెట్టిన తప్పుడుకేసులను తక్షణమే ఎత్తివేయాలని వర్ల డిమాండ్‌చేశారు.

Advertisements

Latest Articles

Most Read