"సచివాలయంలోని ఒక విభాగాన్ని కర్నూలుకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈనెల 26వ తేదీ వరకు ఆగమని చెప్పాము కదా. అంత తొందర ఏమొచ్చింది? దీనిపై ఇప్పుడే ఉత్తర్వులు ఇస్తాము " అని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పై హైకోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. " సచివాలయంలో సరిపడినంతగా జాగా లేనందువల్లనే, పాలనా సౌలభ్యం కోసం కొన్ని విభాగాలను మార్చవలసి వచ్చిందని అడ్వ కేట్ జనరల్ చెప్పారు. సచివాలయంలో జాగా లేకపోతే, పక్కనే ఇంకొకటి నిర్మించుకోండి, అంతేగాని వేరే చోటుకి ఎలా మారుస్తారు ? అని ధర్మాసనం ప్రశ్నించింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ, విజిలెన్స విభాగాలను కర్నూలు తరలిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తాళ్లాయపాలెంకు చెందిన కొండేపాటి గిరిధర్ అనే రైతు హైకోర్ట్ లో ప్ర జప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే తరహాలో మరో రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం నిన్న లంచ్ మోషన్లో వాటిని విచారణకు స్వీకరించింది.

తొలుత గిరిధర్ తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డియే రద్దు బిల్లులు చట్టం కానందున ప్రభుత్వం కుట్రపూరితంగా ఆయా బిల్లులలోని అంశాలపై ఈ విధంగా దొడ్డిదారిన జీవో జారీ చేస్తున్నదని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దానిపై అడ్వకేట్ జనరల్ శ్రీరాం మాట్లాడుతూ చట్టం కాకుండా బిల్లులోని అంశాలపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోదని, ఈ తరలింపు కేవలం జాగా సరిపోనందునే చేయాల్సి వచ్చిందని, దీనిలో రాజకీయపరమైన అజెండా ఏమి లేదని ధర్మాసనానికి వివరించారు. ఒక దశలో న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు. అడ్వకేట్ జనరల్ పలుమార్లు జోక్యం చేసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇదే అంశంపై దాఖలైన ' పిల్ ' తరపు న్యాయవాదులు సైతం వారి వాదనలు వినిపించాయి. ఈ స్థితిలో కొంత సందిగ్ధత తలెత్తింది. ప్రభుత్వం తరపున కొన్ని ఉత్వర్వులను అందజేయాల్సి ఉన్నందున కేసును వాయిదా వేయాల్సిందిగా అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో హైకోర్ట్ ధర్మాసనం కేసును ఈ రోజుకి వాయిదా వేసింది. ఈ రోజు ఈ కేసు పై వాదనలు ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా, పిటీషనర్ తమ వాదనలకు సంబధించి, డాక్యుమెంట్లు ఇవ్వాలని, హైకోర్ట్ ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా, ఓరల్ ఆర్గుమెంట్ చెయ్యటం సబబు కాదని కోర్ట్ చెప్పింది. అలాగే, ఏ కారణాల చేత, ఆఫీసులు కర్నూల్ తరలిస్తున్నారో, అఫిడవిట్ రూపంలో చెప్పాలని, ప్రభుత్వాన్ని, హైకోర్ట్ ఆదేశించింది. దీని పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్, విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది.

జగన్మోహన్‌రెడ్డి వచ్చాక రాష్ట్రం ఆకలిరాజ్యంలా మారిందని, గతప్రభుత్వం అమలు చేసిన సంక్షేమపథకాలు అన్నీ నిలిపివేసిన ఏపీప్రభుత్వం, పేదలు, మధ్యతరగతిపై అదనంగా ధరలభారం మోపి, వారిని మరింత కుంగదీసిందని, దీనికితోడు పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగించి, ఆయావర్గాలను వీధినపడేసిందని టీడీపీనేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధానిమార్పు, పథకాలరద్దు సహా, పరిపాలనకుసంబంధించిన అనేక అంశాలపై జగన్మోహన్‌రెడ్డి పూటకోఅబద్ధం చెబుతున్నాడన్నారు. కేంద్రం నిన్నటికినిన్న ఏపీరాజధాని అమరావతే అని స్పష్టంగా చెప్పిందని, దీనికిసంబంధించి గతప్రభుత్వం 2015లోనే నోటిఫై చేసిందని కేంద్రమంత్రి తేల్చిచెప్పినా వినిపించుకోకుండా జగన్‌ ఇప్పటికీ తనవాదనే నెగ్గాలనే మొండివాదనతోనే ఉన్నాడని ఉమా దుయ్యబట్టారు. చేతగాని పాలనావైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చు కునే క్రమంలో ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూనే ఉన్నాడన్నా రు.

70-80 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం ఏనాడు ముంపునకు గురికాకపోయినా , మునిగిపోతుందని చెప్పడం, ఐఐటీచెన్నై నివేదిక పేరుతో నిర్మాణాలకు పనికిరాదని దుష్ప్రచారంచేయడం, రూ.లక్షా9వేలకోట్లవరకు ఖర్చవుతుందని చెప్పడం జగన్‌విష ప్రచారంలో భాగమేనని ఉమా స్పష్టంచేశారు. సెల్ఫ్‌ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయిన అమరావతి నిర్మాణానికి ప్రభుత్వఖజానా నుంచి రూపాయికూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేదని తెలిసీ కూడా జగన్‌, అదేపాట పాడుతున్నాడంటే, కేవలం విశాఖలోని తనభూముల్ని అమ్ముకో వడానికి తప్ప, సాగరతీరనగరంపై ప్రేమతోకాదన్నారు. జగన్‌ నియమించిన జీ.ఎన్‌. రావు కమిటీనే విశాఖనగరం ఎందుకూపనికిరాదని చెప్పిందని, అలాంటి ప్రకటనల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయో ప్రభుత్వం చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రే ఇలా అబద్ధాలు చెబుతుంటే, ప్రజలకు మేలు ఎలా కలుగుతుందన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఆదాచేశామని డబ్బాలుకొట్టుకుంటున్న జగన్‌, ఖజానాకు రూపాయి కూడా మిగల్చలేదన్నారు. పోలవరం అంశంలో రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లి, రూ.700 కోట్లు ఆదాచేశామంటున్న వైసీపీసర్కారు, ఇసుకధర పెరిగిందంటూ కాంట్రాక్ట్‌సంస్థకు అప్పనంగా రూ.500కోట్లు ఇచ్చేసిందన్నారు. అధికారంలోకివస్తే, సంక్షేమపథకాల అమల్లో రికార్డులు సృష్టిస్తామని ప్రగల్భాలు పలికి, మాటతప్పను, మడమతిప్పనని చెప్పిన జగన్‌, సంక్షేమపథకాలు అమలుచేయకుండా అష్టవంకర్లు పోతున్నాడన్నారు. అమ్మఒడి, వాహనమిత్ర, రైతుభరోసా పేరుతో అరకొరగా, తూతూమంత్రంగా కుడిచేత్తో నిధులిస్తూ జగన్‌ప్రభుత్వం ఎడంచేత్తో వాటిని లాగేసుకుంటోందన్నారు. రాష్ట్రప్రభుత్వం నిరంకుశనిర్ణయాలు, పింఛన్లు, రేషన్‌కార్డుల తొలగింపుని నిరసిస్తూ, సోమవారం రాష్ట్రంలోని అన్నినియోజకవర్గకేంద్రాల్లో పెన్షన్లు, కార్డులు పునరుద్ధరణకోసం టీడీపీఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు బొండా తెలిపారు.

అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 13 పై అమరావవతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని ప్రభుత్వ, కార్యాలయాలను కర్నూలుకు, తరలించాలని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో అమరావతి నుంచి కమిషనర్ ఆఫ్ ఎంక్వరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమి షనర్ కార్యాలయాలను తర లించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ జీవో చట్టవిరుద్ధమని రైతులు ఆరోపిస్తూ , పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్‌డీఏ చైర్శ తో పాటు సిఆర్‌డీఏ కార్యాలయాన్ని అందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీనిపై విచారణను మంగళవారం చేపట్ట నున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఈ రోజు విచారణ చేసిన న్యాయస్థానం, ప్రభుత్వం పై, ఆగహ్రం వ్యక్తం చేసింది. మేము ఆదేశాలు ఇచ్చాం, ఫిబ్రవరి 26 వరకు తొలగించవద్దు అని ఆదేశాలు ఇచ్చాం, పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే, ఎందుకు కార్యాలయాలు తొలగించారని హైకోర్ట్ రాష్ట్రాన్ని ప్రశ్నించింది.

దీని పై స్పందించిన ప్రభుత్వ లాయర్, ఈ కార్యాలయాల తరలింపు అనేది ఏపి ప్రభుత్వ నిర్ణయమని, అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగాలేదని కోర్ట్ కు తెలిపారు. ఇక్కడ ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చు కదా అని కోర్ట్ ప్రశ్నించింది. విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై స్టే విధించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు. కాగా పలు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు, కర్నూలుకు తరలిం చేందుకు ముఖ్యమంత్రి జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో మిలినియం టవర్ బి నిర్మాణం కోసం 19.23 కోట్లు కేటాయించారు. విశాఖ మిలినియం టవర్స్ లోనే నచివాలయాన్ని తరలించాలని జగన్ నిర్ణ యించారు. అయితే ఈ అంశంపై కూడా గతం లోనే రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కార్యాలయాల తరలింపును నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదే శిం చింది. అతిక్రమిస్తే ఆయా శాఖాధిపతులపై విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జగన్ తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపలేదు. విశాఖకు నిధులు కేటాయించడం ద్వారా కార్యాలయాల తరలింపు జరగడం ఖాయమన్న సందేశాన్ని ఇచ్చారు. మరో పక్క అమరావతి రైతులు ఉద్యమాలు కొనసాగి స్తూనే ఉన్నారు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందిం చికపోయినా భారతీయ జనతా పార్టీ నేతలు, ఆ పార్టీ మద్దతు తెలిపిన జనసేన అధ్యక్షుడు పవన్ అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రసక్తి లేదని ప్రకటనలు చేస్తున్నారు. దీనితో అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం వివాదాస్పదంగా మారింది.

సాగునీటి రంగంపై స్పష్టతలేని రాష్ట్రప్రభుత్వం, రాయలసీమకు తీరని అన్యాయం చేసిందని, సీమకరవుకు శాశ్వతంగా విముక్తిచూపతానని గతంలో ప్రకటించి, ఇప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న జగన్‌ను రాయలసీమద్రోహిగా భావిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మంగళగి రిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణసమయంలో ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి, మిగులుజలాల ఆధారిత ప్రాజెక్టులపై, రాష్ట్రంలోని కరవుప్రాంతాలకోసం నీటిహక్కులు కోరబోమని లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడం జరిగిందన్నారు. ఆనాడు ఆయనతీసుకున్న నిర్ణయం అనేకసాగునీటిప్రాజెక్టులకు సమాధికట్టిందన్నారు. చంద్రబాబునాయుడు కలలుగన్న నదులఅనుసంధానాన్ని, జగన్‌ ఒక ప్రహసనంగా మార్చాడని, 2019 డిసెంబర్‌నాటికి పోలవరంనుంచి గ్రావిటీద్వారా నీళ్లు తేవాలని చంద్రబాబు అనుకుంటే, వైసీపీప్రభుత్వం వచ్చాక పోలవరాన్ని నిలిపివేసిందన్నారు. 2020 డిసెంబర్‌నాటికి కూడా పోలవరం నీళ్లువస్తాయో, రావోనన్న సందేహం అందరిలోనూ ఉందన్నారు. గోదావరి నీళ్లను ఏపీ భూభాగంలోనుంచే బొల్లాపల్లికి తరలించి, అక్కడ్నుంచి పెన్నానదికి పంపాలని గతప్రభుత్వం భావిస్తే, జగన్‌సర్కారు అదేప్రాజెక్టును తెలంగాణకు మేలుచేసే విధంగా మార్పులు చేసిందన్నారు.

గోదావరి జలాలను పంచుకునే ఒప్పందంలో భాగంగా జగన్‌, కేసీఆర్‌కు హామీఇచ్చాడని, ఆనీటిని దేవాదులనుంచి సాగర్‌కు తరలించి, అక్కడనుంచి రాయలసీమకు తరలించేలా ఒప్పందం చేసుకున్నాడన్నారు. తరువాత మరలా తననిర్ణయం మార్చుకొని, బొల్లాపల్లి నుంచే తరలించేలా చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. తాజాగా కేసీఆర్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన ఇరిగేషన్‌శాఖ సమీక్షలో ఏపీముఖ్యమంత్రి మరలా ప్లేటు ఫిరాయించాడని కాలవ ఎద్దేవాచేశారు. నాగార్జున సాగర్‌కు గోదావరి జలాలు తరలించి, అక్కడనుంచి వాటిని శ్రీశైలానికి, తరువాత రాయలసీమకు తరలిస్తామని చెబుతున్నాడని, బొల్లాపల్లి-బనకచర్ల ప్రాజెక్ట్‌ని కాదని ఉమ్మడిరాష్ట్రంలోని ప్రాజెక్ట్‌ నమూనాలను అమలు చేయడంద్వారా ఎవరికి మేలుచేయాలని జగన్‌ భావిస్తున్నాడన్నారు. కేసీఆర్‌ని కలిసి రాగానే జగన్‌మదిని పురుగు తొలిచిందని, పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో పనిచేస్తూ, రాయలసీమ ప్రయోజనాలను ఆయనకు తాకట్టు పెట్టడానికి జగన్‌ సిద్ధమయ్యాడన్నారు. హంద్రీనీవా, గాలేరునగరి పథకాల భవిష్యత్‌ గోదావరి-పెన్నా అనుసంధానంతోనే ముడిపడిఉందన్నారు. రాయలసీమకు కృష్ణాజలాలే దిక్కని, కృష్ణానదిలో నీళ్లుతగ్గిపోతున్న తరుణంలో గోదావరి జలాలను కరవుసీమకు తరలించడానికి గతప్రభుత్వం పూనుకుందన్నారు.

చంద్రబాబు పట్టిసీమను పూర్తిచేయకుంటే కృష్ణానదిజలాలపై ఆధారపడిన ఆయకట్టు పరిస్థితి మరోలా ఉండే దన్నారు. పట్టిసీమనీటిని సీమకు కూడా తరలించబట్టే, ఆప్రాంతంలో వేసవిలో కూడా కృష్ణాజలాలు ప్రవహించాయన్నారు. బచావత్‌ట్రైబ్యునల్‌ ప్రకారం 811 టీఎంసీలనీటి వాటాలోని 512టీఎంసీలకు అదనంగా 200, 300 టీఎంసీలను రాయలసీమకు, ప్రకాశం, నెల్లూరుజిల్లాలకు మళ్లించే అవకాశం రాష్ట్రానికి ఉందన్నారు. దీన్నిపక్కనపెట్టి ముఖ్యమంత్రి జగన్‌ నెలకోప్రకటన చేస్తున్నాడన్నారు. హంద్రీనీవాను వెడల్పుచేస్తానని, గాలేరునగరిని విస్తరిస్తానని చెబుతున్న జగన్‌, అవన్నీ ఎలాసాధ్యమవుతాయో చెప్పడం లేదన్నారు. టీడీపీప్రభుత్వం సాగునీటిరంగానికి 72వేలకోట్లు ఖర్చుచేస్తే, వాటిలో రాయలసీమసహా, ప్రకాశం, నెల్లూరుజిల్లాలకే రూ.40వేలకోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యావశ్యకమైన 62ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయం తీసుకుంటే, వాటిలో రాయలసీమవే 32వరకు ఉన్నాయన్నారు. సీమప్రయోజనాలకోసం గతప్రభుత్వ ం కృషిచేస్తే, జగన్‌సర్కారు వచ్చాక సీమపై శీతకన్నేసిందన్నారు. 8నెలల్లో రాయలసీమ ప్రాజెక్టులకు వైసీపీప్రభుత్వం ఎంతఖర్చుచేసిందో, ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చిందో చెప్పాలని కాలవ డిమాండ్‌చేశారు. హైకోర్టు ఇస్తే రాయలసీమ బాగుపడదని, సాగునీటితోనే సీమ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

కోర్టులొస్తే పేదవాడికి అన్నందొరకదన్నారు. బూటకపు ప్రచారంతో సీమకు ద్రోహంచేసే చర్యలను జగన్‌ ఇకనైనా మానుకోవాలన్నా రు. సీమభవిష్యత్‌ను నాశనం చేసేలా ఆలోచిస్తున్న జగన్‌, ఇప్పటికైనా ఏపీ భూభాగంలో నుంచే గోదావరి నీటిని పారించి, ఆనీళ్లను సీమకు తరలించాలని కాలవ హితవుపలికా రు. సీమప్రాజెక్టుల గురించి, సీమవాసులసంక్షేమం గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలంతా ఇదేఅంశంపై జగన్‌ను ఒత్తిడిచేయాలన్నారు. ఏపీలో కోటిఎకరాలను సస్యశ్యామలం చేయడంకోసం గతప్రభుత్వం రూ.లక్షా20వేలకోట్లతో అనేకసాగునీటి ిప్రాజెక్టులుచేపట్టిందని, జగన్‌సర్కారు వచ్చాక వాటిపరిస్థితి ఎలా ఉందో స్పష్టంచేయాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాలవ డిమాండ్‌చేశారు. వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణం తలపెట్టామని, తద్వారా నాగార్జునసాగర్‌ కుడికాలువకు నీటిని తరలించి, అదేనీటిని బొల్లాపల్లి మీదుగా సోమశిలకు తరలించడానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన ప్రతిసారీ, జగన్‌ ఈప్రతిపాదనను ఎందుకు మారుస్తున్నాడని కాలవ నిలదీశారు.

Advertisements

Latest Articles

Most Read