తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ, "వైసిపి ప్రభుత్వ పాలనగురించి దేశం ప్రపంచం, రాజకీయ పార్టీలు, ప్రజలు ఏమనుకుంటున్నారో జాతీయ మీడియాలో వచ్చిన ఆర్టికల్సే రుజువులు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ఇది నాకెందుకు అనుకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజల్లో చైతన్యం రావాల్సివుంది. అందరూ ఒక్క నిముషం ఆలోచించాలి. ఎక్కడికి పోతోందీరాష్ట్రం, ఎటు పోతోందీ రాష్ట్రం అనేది అందరూ ఆలోచించాలి. ఇక్కడ రాస్తే ఎల్లో జర్నలిజం అంటున్నారు, కులముద్ర వేస్తున్నారు. కానీ జాతీయ మీడియాలో వచ్చే వార్తలకు ఏం సమాధానం చెబుతారు. జాతీయ పత్రికలకు ఇదే అంటకడతారా..? మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి, నియంతృత్వ పోకడలు మానుకోవాలి అని టెలిగ్రాఫ్ రాసింది. 3రాజధానుల నిర్ణయాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తప్పు పట్టింది. అమరావతిని నిర్వీర్యం చేయాలన్నదే జగన్ ఆలోచనైతే అది అసమర్ధ నిర్ణయంగా పేర్కొంది. అమరావతి ప్రాజెక్టు రద్దు, పిపిఏల రద్దు అవివేక నిర్ణయాలు అమలు చేయకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలి. ‘‘జగన్ తన చపలచిత్తాల వల్ల ఏపి పెట్టుబడులను అడ్డుకుంటున్నారని’’ బిజినెస్ స్టాండర్డ్ రాసింది. జగన్ ఒక తుగ్లక్ గా ఆర్గనైజర్ పత్రిక పేర్కొంది, కేంద్రం జోక్యానికి ఇదే సరైన సమయంగా చెప్పింది. రాజకీయ కారణాలతో అమరావతిని అడ్డుకుంటున్నారని హిందూస్థాన్ టైమ్స్ రాసింది. "

‘‘లక్షలాది కోట్లతో సాగే విద్యుత్ ప్రాజెక్టులు, అమరావతి ప్రాజెక్టులు అడ్డుకోవడం దేశంలోనే పెట్టుబడుల వాతావరణాన్ని అడ్డుకోవడమని’’ అమెరికా పత్రిక బ్లూం బర్గ్ రాసింది. 3రాజధానుల ఆలోచన అంత తేలిక కాదు, రైతులను ఆదుకోవాలని’’ ద హిందూ బిజినెస్ లైన్ చెప్పింది ‘‘జగన్ ప్రభుత్వానిది తిరోగామ దృక్ఫథం, అమరావతి ఆపేయడం దేశంలో పట్టణాభివృద్దికే విఘాతమని’’ ఎకనామిక్ టైమ్స్ చెప్పింది. ‘‘ఘర్షణాయుత వాతావరణం వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది, కక్ష సాధింపే జగన్ ప్రధాన దృష్టిగా కనిపిస్తోందని’’ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. పరి పాలన కన్నా తన ఇగోకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఒక జాతీయ పత్రిక రాసింది. 3రాజధానుల వల్ల జరిగే నష్టాలను సౌతాఫ్రికా ప్రధాని చెప్పారు. 3చోట్ల ఇళ్లు ఉండాలని, 3కార్లు ఉండాలని అన్నారు. 3 రాజధానులు సరైన నిర్ణయం కాదని శేఖర్ గుప్తా అన్నారు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఆర్టికల్స్ రాశాయి జాతీయ పత్రికలన్నీ. ఇన్ని ఎడిటోరియల్స్ రాశాయి, ఇంతమంది ఈ రకంగా మాట్లాడారు, వీటన్నింటికి జవాబివ్వాల్సిన బాధ్యత మీకు లేదా..? ఒకప్పుడు దావోస్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు ఏపి మార్కెటింగ్ ఏమోకాని ఏవిధంగా మాట్లాడారో వినాలి. విశాఖలో రూ 70వేల కోట్ల అదాని డేటా సెంటర్ ఎందుకు పోగొట్టారో చెప్పాలి. ఫిన్ టెక్ ఎందుకు ఆపేశారు..? ఫార్ట్యూన్ 500కంపెనీల్లో ఒకటైన ప్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎందుకు పోగొట్టారు..?"

"లులూ అయితే ఇక ఏపికి రామని చెప్పే పరిస్థితి ఎందుకు తెచ్చారు..? ఒంగోలులో రూ 25వేల కోట్ల పేపర్ ఇండస్ట్రీని పోగొట్టారు. తిరుపతిలో వేలాది మందికి ఉపాధి కల్పించే రిలయన్స్ పోగొట్టారు. అమరావతి నుంచి సింగపూర్ వెళ్లిపోయేలా చేశారు. కియా 17ఆగ్జిలరీ యూనిట్లు వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వైసిపి ఎంపి కియా అధికారులను కొట్టేట్లు బెదిరించారు. వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంక్ రూ 5వేల కోట్ల పెట్టుబడులు వెనక్కిపోయేలా చేశారు. 130సంస్థలకు 1250ఎకరాలు ఇస్తే రూ 45వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాయి. వాళ్లందరినీ తరిమికొట్టే పరిస్థితి తెచ్చారు. ‘‘ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, పోతే పొండి ఉంటే ఉండండి’’ అని నీచంగా చూసే పరిస్థితి. ప్రాంతీయ విద్వేషాలు తెచ్చి ఏవిధంగా అభివృద్ది సాధిస్తారు..? ఇక్కడ ల్యాండ్ పూలింగ్ క్యాన్సిల్ చేస్తాం అంటారు, అక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తామంటారు. ఎవరిచ్చారు ఈ అధికారం మీకు..? విశాఖలో కొన్నివేల ఎకరాలు చేతులు మారాయి, రేపోమాపో అవన్నీ బైటకు వస్తాయి. అనునిత్యం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నీతికి మారుపేరైన దేశాలపై బురద జల్లుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ రద్దు చేశారు. గుండ్రేవుల, భైరవాని తిప్ప, మేము టెండర్లు పిలిచిన ప్రాజెక్టులన్నీ ఏమయ్యాయి.? ఈ 9నెలల్లో ఒక్క రూపాయి ఖర్చు చేశారా ప్రాజెక్టులపై..? 3రాజధానులు పెట్టే హక్కు మీకెక్కడ ఉంది..? "

"ఫిబ్రవరి 26దాకా కార్యాలయాల తరలింపు చేయరాదని హైకోర్టు చెప్పింది. ఒకవేళ చేస్తే అధికారుల జేబుల్లో నుంచి రాబడతామని కోర్టు చెప్పింది. అయినా కార్యాలయాలను ఎలా తరలిస్తారు..? ఇది కోర్టు ఆదేశాల ధిక్కరణ కాదా..? గతంలో సీఎస్ ను బెదిరించి, దౌర్జన్యం చేసి, పంపేస్తారా..? ఒక సీఎస్ తో ప్రవర్తించే తీరు ఇదేనా..? ఇదేనా పరిపాలనా తీరు..? మీకు కావాల్సిన అధికారులను పెట్టుకుని ఇష్టానుసారం చేస్తారా..? పిపిఏలపై తప్పుడు డాక్యుమెంట్లు ఐఏఎస్ లతో విడుదల చేయిస్తారా..? అధికారులు హుందాతనం లేకుండా వ్యవహరిస్తారా..? అడ్వయిజర్లు రాజకీయ ఉపన్యాసాలు చేస్తారా..? ప్రజావేదిక కూల్చి ఎన్నినెలలైంది, కనీసం శిధిలాలను కూడా ఇప్పటిదాకా తొలగించరా..? అసెంబుల్డ్ స్ట్రక్చర్స్ తీసుకెళ్లి మరోచోట వాడుకోకూడదా..? ఏం పాపం చేసింది ప్రజా వేదిక..? ప్రజల సొమ్మును ఇలా ధ్వంసం చేస్తారా..? ఎవరిచ్చారు ఈ అధికారం మీకు..? కేంద్రమంత్రి ఆర్ కె సింగ్ ఏమని లేఖ రాశారు మీకు..? ఊహాగానాలతో పిపిఏలపై చర్యలు తీసుకోవద్దని చెప్పలేదా..? దీనివల్ల పెట్టుబడులు రావు, ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనలేదా..? జపాన్ అంబాసిడర్ ఏమని చెప్పారు. ఏపిలో వ్యాపారం తిరోగమించేదిగా ఉందని అనలేదా..? ఒకవ్యక్తి మూర్ఖత్వం వల్ల, చపలచిత్తం వల్ల, ఉన్మాదం వల్ల రాష్ట్రానికి ఇంత చేటు తెస్తారా..? భావితరాల భవిష్యత్తు ఏమవుతుంది..? ఇంకా ఎవరైనా వస్తారా పెట్టుబడులు పెట్టడానికి..? మీవల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు రావు, వేరే రాష్ట్రాలలో మనవాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేశారు. మీ భేషజాలతో రాష్ట్రాన్ని దెబ్బతీస్తారా..? పబ్జి గేములు ఆడుకున్నంత తేలికకాదు పరిపాలన." అని చంద్రబాబు అన్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, గత 50 రోజులుగా సాగుతున్న మూడు ముక్కల రాజధాని రగడ, ప్రస్తుతానికి, మండలిలోని సెలెక్ట్ కమిటీ వద్ద, కోర్ట్ ల వద్ద ఆగి ఉంది. జగన్ మోహన్ రెడ్డి, ఆఘమేఘాల మీద, అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసి, సెక్రటేరియట్ ని తీసుకుని వెళ్ళి, విశాఖపట్నంలో పెట్టాలని, ఎంత స్పీడ్ గా ఈ విషయం జరిగితే తనకు అంత మంచిది అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా, అసెంబ్లీలో ప్రకటన చెయ్యటం, తరువాత క్యాబినెట్ నిర్ణయం, అసెంబ్లీలో బిల్లు, ఇలా అన్నీ చెకచెకా జరిగిపోయాయి. మధ్యంలో వచ్చిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్, బోస్టన్ కమిటీ రిపోర్ట్ కూడా తమ పాత్ర పోషించాయి. అయితే, ఇంత స్పీడ్ లో వెళ్తున్నప్పుడు సహజంగా బ్రేక్ అనేది పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. జగన్ స్పీడ్ ని, శాసనమండలి ఆపింది. రాజధానిని మూడు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయం పై, శాసనమండలి , సెలెక్ట్ కమిటీకి రెఫెర్ చేస్తూ తీర్మానం చేసింది. అయితే, శాసనమండలిలో సహజంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వైట్ ఉండటంతో, వారు జగన్ దూకుడుకు బ్రేక్ వేసారు.

sharif 030202020 2

అయితే జగన్ మాత్రం ఆగలేదు. తన నిర్ణయానికి ఆడ్డు వచ్చిన, శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్ పెట్టారు. అయితే ఇది పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు, మండలి ఉంటానే ఉంటుంది. ఈ నేపధ్యంలోనే, శాసనమండలి చైర్మెన్, సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపించాల్సిందిగా అన్ని పార్టీలకు లేఖలు రాసారు. అయితే వైసీపీ ప్రభుత్వం, మండలి సెక్రటరీ మీద ఒత్తిడి తెచ్చి, ఈ ప్రక్రియ ముందుకు వెళ్ళనివ్వటం లేదు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇపుడు అన్ని పార్టీల వారు, శాసనమండలి చైర్మెన్ కు సెలెక్ట్ కమిటీ సభ్యులను పంపుతూ, పేర్లు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ కు చెందిన పార్టీలు, చైర్మెన్ కు లేఖలు ఇచ్చారు. కాని అధికార వైసీపీ మాత్రం, సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వలేదు.

sharif 030202020 3

తాము సెలెక్ట్ కమిటీలో ఉండదలుచుకాలేదని, పేర్లు ఇవ్వం అని, సెలెక్ట్ కమిటీ ప్రక్రియ అనేది, రాజ్యాంగ విరుద్ధమని, అందుకే ఈ ప్రక్రియలో తాము, భాగస్వాములు అవ్వదలుచుకోలేదు అని చెప్తూ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మండలి చైర్మెన్ కు లేఖలు రాశారు. ఈ నేపధ్యంలో వైసీపీ లేకుండా సెలెక్ట్ కమిటీ తన పని ప్రారంభించే అవకాసం కనిపిస్తుంది. మొత్తం రెండు సెలెక్ట్ కమిటీల్లో, ఒక్కో దాంట్లో, 8 మంది సభ్యులు ఉంటారు. సీఆర్డీఏకు సంబంధించిన కమిటీలో టిడిపి తరుపున దీపక్‌రెడ్డి, బీదా రవిచంద్ర, బచ్చుల అర్జునుడు, గౌరవాని శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు కమిటీలో, లోకేష్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, గుమ్మడి సంధ్యారాణి పేర్లను టీడీపీ పంపించింది. బీజేపీ నుంచి ఒక కమిటీకి మాధవ్‌, సీమరో కమిటీకి సోము వీర్రాజు పేర్లు పంపించారు. పీడీఎఫ్‌ నుంచి కేఎల్‌ లక్ష్మణరావు,ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లను ఛైర్మన్‌కు పంపారు. బుధవారం నాడు, ఈ కమిటీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా, హేళన చెయ్యటానికి, వైసీపీ వేసిన ప్లాన్, అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నేషనల్ మీడియాని కూడా తీసుకువచ్చి, వారి ముందు చంద్రబాబుకి ఈ రాష్ట్రంలోనే కాదు, ఆయన సొంత ఊరిలో కూడా బలం లేదు అని, హేళన చెయ్యటానికి వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అమరావతి రైతులకు అన్యాయం చెయ్యకండి అంటూ, జగన్ మోహన్ రెడ్డి పై, పోరాటం చేస్తున్నారు. రైతుల పోరాటానికి, మద్దతు తెలుపుతున్నారు. మరో పక్క, ఇప్పటికే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ నిర్ణయం అంటూ, దేశ వ్యాప్తంగా మీడియాలో వస్తుంది. ఈ నేపధ్యంలోనే, చంద్రబాబు వాదన తప్పు, మా వాదనే కరెక్ట్ అని చెప్పే విధంగా, వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్లాన్ వేసింది. చంద్రబాబు స్వగ్రామం అయిన, నారావారి పల్లెలో, పెద్ద బహిరంగ సభ పెట్టారు. చంద్రబాబు సొంత ఊరిలోనే , ప్రజలను ఆయనకు అనుకూలంగా లేరు చూసారా అంటూ, చెప్పాలని అనుకుంది.

media 03022020 2

దీంతో, నిన్న ఉదయం నుంచి అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది. నారా వారిపల్లెతో పాటు, చుట్టు పక్కల ఉళ్లు అన్నీ, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే గ్రామలు కావటంతో, ఎలాంటి పరిస్థితి వస్తుందో అని పోలీసులు కూడా టెన్షన్ పడ్డారు. వైసీపీ సభ పై, ఎక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చిన అడ్డుకుంటారో, ఎలాంటి పరిస్థితి వస్తుందో అని, పోలీసులు టెన్షన్ పడ్డారు. దీంతో పోలీసులు ఉదయం నుంచి, ఎక్కువ పోలీస్ ఫోర్సు పెట్టటంతోగా, అటు వైపు రాకపోకలు సాగించే వాహనాలు కూడా తనిఖీలు చేసారు. దీంతో నిన్న ఉదయం నుంచి ఆ ప్రాంతంలో హంగామా నెలకొంది. ప్రశాంతంగా ఉండే గ్రామంలో, ఒక పక్క మీడియా, మరో పక్క పోలీసులు హడావిడితో, నారావారి పల్లె దద్దరిల్లి పోయింది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని అనుకున్నారు.

media 03022020 3

అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమనం పాటించటంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే సమయంలో, వైసీపీ డొల్లతనం బయట పడింది. భారీ ఎత్తున సభ పెడుతున్నాం అని హడావిడి చెయ్యటంతో, అందరూ ఏదో అనుకుంటే, చివరకు తుస్సు మానిపించారు. సభ ప్రారంభం అయిన, 15 నిమిషాలకే, సభలో కుర్చీలు అన్నీ ఖాళీ అయిపోయాయి. పట్టుమని 500 మంది కూడా లేరు. ప్రభుత్వంలో ఉండి, డ్వాక్రా మహిళలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని బలవంతంగా రప్పించినా, చివరకు 15 నిమిషాల్లోనే అందరూ వెళ్ళిపోయారు. దీంతో సభకు హాజరైన మంత్రులు, సభ నిర్వహించిన చెవిరెడ్డి షాక్ అయ్యారు. చంద్రబాబుని దెబ్బ తీద్దాం అని జాతీయ మీడియాని పిలిపిస్తే, వారి ముందే వైసీపీ పరువు పోయింది. అందుకే అంటారు, చెరపకురా చెడేవు అని.

విజయవాడ ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రెండు హైవేలు వెళ్ళే సిటీ కూడా బహుసా, ఈ దేశంలో విజయవాడ ఒక్కటే ఏమో. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో, దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం, ప్రజలు ఉద్యమాలు చేసినా, ఎవరూ పట్టించుకోలేదు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం, ప్రభుత్వం కార్యకలాపాలు ఇక్కడ నుంచే మొదలు కావటం, ఆ తరువాత అమరావతి రాజధానిగా చెయ్యటం, గన్నవరం నుంచి పెరిగిన ట్రాఫిక్ ఇవన్నీ, ద్రుష్టిలో ఉంచుకుని, కేంద్రంతో పోరాడి, అటు దుర్గ గుడి ఫ్లైఓవర్ తో పాటుగా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పనులకు ఒకే చెప్పించారు. చంద్రబాబుతో పాటుగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి ఈ ప్రాజెక్ట్ లో ఎంతో ఉంది. ముఖ్యంగా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ముందుగా కేవలం నిర్మలా కాన్వెంట్ సెంటర్ వరుకే అని అనుకున్నారు. తరువాత కేశినేని నాని, కేంద్రంతో పోరాడి, వినాయక దియేటర్ వరకు ఫ్లైఓవర్ వచ్చేలా చేసారు. తరువాత చంద్రబాబు, దీన్ని రామవరప్పాడు వరకు తీసుకు వెళ్ళాలని చూసినా, కుదరలేదు.

benz 0302020 2

అయితే ఒక పక్క కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఇంకా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు లేట్ గా మొదలైన బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తయ్యింది. ఎన్నికల ముందే 95 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు పూర్తీస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ ట్రాఫిక్ లో ఇబ్బంది పడే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా గన్నవరం వైపు నుంచి వచ్చే లారీలు, ఇక నుంచి సిటీలోకి ఎంటర్ అవ్వకుండా, వినాయక ధియేటర్ వద్ద నుంచి ఫ్లైఓవర్ ఎక్కి, కిందకు దిగుతాయి. దీంతో, బెంజ్ సర్కిల్ మీద అధిక ఒత్తిడి తగ్గే అవకాసం ఉంది. అయితే, రెండో వైపు ఫ్లైఓవర్ మాత్రం, ఇంకా టెండర్ వరకు కూడా రాలేదు. అది కూడా అయితే కాని, పూర్తీ స్థాయిలో ఉపయోగం ఉండదు.

benz 0302020 3

ఇది ఇలా ఉండగా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కేవలం, ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కు మాత్రమే. టు వీలర్స్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళటానికి లేదు. ఈ రోజు మొదలు కానున్న ఫ్లైఓవర్ పై వెళ్ళటానికి, హుషారుగా వచ్చిన యువత, ఈ వార్త తెలుసుకుని, అవాక్కయ్యారు. ప్రాజెక్ట్ ఇంప్లెమెంటేషన్ డైరెక్టర్ విద్యా సాగర్ మాట్లాడుతూ, ఈ ఫ్లై ఓవర్ పై, కేవలం ఫోర్ వీలర్స్, హెవీ వెహికల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని, టు వీలర్స్ కు ఫ్లైఓవర్ పై అనుమతి లేదని చెప్పారు. పోలీసులు ఈ విషయం పై, అక్కడ అవగాహన కలిగిస్తారని చెప్పారు. "three-lane road with paved shoulder " ఉన్న కారణంగా టువీలర్స్ కు అవకాసం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం ట్రయిల్ రన్ మాత్రమే జరుగుతుందని, లోపాలు ఏవైనా ఉంటే సరి చేసి, త్వరలో కేంద్రం మంత్రి గడ్కరీతో, ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు.

Advertisements

Latest Articles

Most Read