దళితముద్రతో ఎంపీగా గెలిచిన నందిగం సురేశ్‌ తనస్వార్థం కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని, దళితుల ఆత్మన్యూనతభావాన్ని పోగొట్టేందుకు, వారిని ఎవరైనా కులంపేరుతో కించపరిస్తే అటువంటివారిపై మాత్రమే ఆ చట్టాన్ని మోపాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్‌ ఆలోచనల్ని సురేశ్‌లాంటివా రు తమ స్వార్థానికి వినియోగించడం బాధాకరమని టీడీపీ మహిళానేత, మాజీఎమ్మెల్యే, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. చంద్రబాబు, లోకేశ్‌లు తమపై దాడిచేయించారంటున్న సురేశ్‌, టీడీపీకార్యకర్తలు నిజంగా దాడిచేయాలనుకుంటే, వారికి ఒకరుచెప్పాల్సిన పనిలేదని, వారెప్పుడూ న్యాయ బద్ధంగా ధర్మంవైపే నిలుస్తారని విషయాన్ని ఎంపీ తెలుసుకోవాలన్నారు. వైసీపీప్రభుత్వం చేస్తున్న పన్నాగాలు, కుట్రలపై ప్రజలంతా ఇప్పటికే కోపంతో ఉన్నారన్నారు.

పువ్వులిచ్చి జై అమరావతి అనాలని కోరడం తప్పెలా అవుతుందో, తనపై దాడిచేశారంటున్న సురేశ్‌, దాడి జరిగిందని దుష్ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా స్పష్టంచేయాలన్నారు. సురేశ్‌ తనపై తానే దాడిజరిగినట్లు సృష్టించి, పువ్వులివ్వడాన్ని కూడా తప్పుపట్టే స్థితికి దిగజారాడన్నారు. లోకేశ్‌, చంద్రబాబు చెప్పారనే టీడీపీనేతలు, కార్యకర్తలు మౌనంగా ఉంటున్నారనే విషయాన్ని సురేశ్‌ గ్రహించాలన్నారు. గతంలో సురేశ్‌ అమరావతి రైతులు, భూములు విషయంలో రాద్ధాంతం చేశాడని, అయినా ఆప్రాంత ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారని, ఇప్పటికైనా ఎంపీ రైతుల మనస్సులు తెలుసుకుంటే మంచిదన్నారు. నందిగం సురేశ్‌ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానుకొని, ఇప్పటికైనా తనుపెట్టిన తప్పుడుకేసుల్ని ఉపసంహరించుకోవాలని అనిత హితవుపలికారు.

తప్పుడు కమిటీల రిపోర్టుల్ని దాచిపెట్టి, విశాఖలోని భూములధరలు పెంచుకోవడం కోసం స్వార్థ, సంకుచిత రాజకీయాలు చేస్తున్నవైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అనిత హెచ్చరించారు. టీడీపీనేతలుగా మేము ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సక్రమంగానే వినియోగించామని, వైసీపీవారిలా ప్రతిదానికీ ఆచట్టాన్ని దుర్వినియోగం చేయడంలేదన్నారు. రాష్ట్రంలో దిశాచట్టం అమల్లోఉందో లేదోనన్న సందేహం కలుగుతోందని, ఆచట్టం వచ్చాకే ఆడబిడ్డలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు.

బడుగు, బలహీనవర్గాల సంక్షేమాన్ని సమాధిచేసిన జగన్‌సర్కారు, ఆయావర్గాలను బలిపీఠంపైకి ఎక్కించిందని, సొంతకాళ్లపై నిలబడిమనుగడ సాగించేలా వారికి అవసరమైన ఆర్థికచేయూతను అందించకుండా అన్నమో రామచంద్రా అనేస్థితికి దిగజార్చిందని, టీడీపీసీనియర్‌నేత, మాజీమంత్రి కాలవశ్రీనివాసులు మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. జగన్‌సర్కారు బడుగు, బలహీనవర్గాలపై కక్షపూరితధోరణితో వ్యవహరిస్తోందన్న ఆయన, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందాల్సిన పింఛన్లలో భారీకోత విధించిందన్నారు. ఎన్నికలవేళ 45ఏళ్లు నిండిన బీసీ, ఎస్టీ, ఎస్సీ, మహిళలకు, 45ఏళ్లు పైబడిన చేనేతమహిళలకు పింఛన్లు ఇస్తానన్న జగన్‌, తరువాత అనకాపల్లిసభ లో మేనిఫెస్టోలో లేదంటూ ఆనిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అధికారంలోకి రాకముందే మాటతప్పాడన్నారు. నిన్నటికి నిన్న పంపిణీచేసిన పింఛన్ల లోకూడా రాష్ట్రప్రభుత్వం భారీగాకోతపెట్టిందన్నారు. చంద్రబాబుప్రభుత్వం 54లక్షల 14వేల 592మందికి పింఛన్లు పంపిణీచేస్తే, జగన్‌సర్కారు జనవరిలో వాటిని 48లక్షలకే పరిమితం చేసిందన్నారు.

పింఛన్‌దారుల వయస్సుని 65 నుంచి 60ఏళ్లకు తగ్గించిన ప్పుడు నిజంగాఅర్హులసంఖ్య పెరగాలన్నారు. అలానే టీడీపీ ప్రభుత్వం అనంతపురంలో అమలుచేసిన 10ఎకరాలమెట్టభూమి ఉన్న రైతులకు ఇచ్చేపింఛన్‌ని, తాను అధికారం లోకొస్తే, రాష్ట్రమంతా అమలుచేస్తాననిచెప్పిన జగన్‌, ఇప్పుడు దానిఊసే ఎత్తడంలేదన్నా రు. 60ఏళ్ల నిబంధనను అమలుచేస్తే, ప్రభుత్వలెక్కలప్రకారమే పింఛన్‌కు అర్హులైనవారు 6లక్షలమంది ఉంటారని, ఆసంఖ్య అదనంగా పింఛన్లజాబితాకు ఎందుకు జతకాలేదని మాజీమంత్రి నిలదీశారు. అదేవిధంగా 10ఎకరాలమెట్టభూమి నిబంధనను అమలు పరిచిఉంటే, దానిప్రకారం పింఛన్‌దారులసంఖ్య మరో 6లక్షలమంది ఉండేవారన్నారు. 01-01-2020నాటికి 53లక్షలమందికి మాత్రమే జగన్‌సర్కారు పింఛన్లు ఇచ్చి, లక్షపింఛన్లను కోసేసిందన్నారు. ఫిబ్రవరి జాబితాను పరిశీలిస్తే, పాతవి 48లక్షల 57వేలుంటే, కొత్తగా వైసీపీపాలనలో 6లక్షల11వేల పింఛన్లను జతచేయడం జరిగిం దన్నారు.

టీడీపీప్రభుత్వంలో 54లక్షలుగా ఉన్న పింఛన్‌దారుల సంఖ్య, వైసీపీవచ్చాక 48.57లక్షలకు ఎలా తగ్గిందో చెప్పాలని, అలానే 60ఏళ్లనిబంధనప్రకారం అర్హులైన వారు, 10ఎకరాలమెట్టభూమి నిబంధనదృష్ట్యా అదనంగాకూడవలిసిన పింఛన్‌దారుల సంఖ్య ఎలా తగ్గిందో, దానిలోని మతలబు ఏమిటో జగన్‌ చెప్పాలని కాలవ డిమాండ్‌ చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీచేయడం తనకెంతో గర్వకారణంగా ఉందని చెబుతున్న సీఎం, నిబంధనలపేరుతో పింఛన్లలో భారీగా కోతవిధించాడన్నారు. 300యూనిట్లు విద్యుత్‌వాడకం దాటినా, ఆధార్‌అనుసంధానంలేకపోయినా, రేషన్‌కార్డు లో వయసులో తప్పులున్నాయని, ఒకేరేషన్‌కార్డులోని సభ్యుల్లో ఒక్కరికే పింఛన్‌ఇస్తామనే నిబంధనలు సాకుగాచూపి, ప్రభుత్వం చాలామంది అర్హులనోట్లో మట్టిగొట్టిందన్నారు. ప్రభుత్వతప్పులు, సాంకేతికకారణాలవల్ల అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల కు న్యాయం జరగలేదన్నారు. పింఛన్లపై ఆధారపడి బతికేవారందరికీ జగన్‌ ఏంసమా ధానం చెబుతాడని కాలవ నిలదీశారు. వాలంటీర్లు తమఅనుకున్నవారికే పింఛన్లు మంజూరుచేశారని, రాజకీయకారణాలు, వ్యక్తిగతవిబేధాలకారణంగా పింఛన్లపంపిణీలో అనేక అవతవకలు జరిగాయన్నారు.

టీడీపీప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల వారి ఆర్థికస్వావలంబనకోసం అనేకవిధాలుగా చేయూతనందిస్తే, జగన్‌సర్కారు ఆయావర్గాలవారు 'అన్నమో రామచంద్రా' అనేస్థితిని కల్పించిందని కాలవ మండిపడ్డారు. ఆయావర్గాలకు సబ్సిడీరుణాలు, పనిముట్లు అందించకుండా, ఆర్థికసహాకార సంస్థల కార్యక్రమాలను జగన్‌ప్రభుత్వం పూర్తిగా స్తంభింపచేసిందన్నారు. బీసీకార్పొరేషన్‌ నుంచి రూ.3432 కోట్లను, కాపుకార్పొరేషన్‌ నుంచి రూ.568కోట్లను, మైనారిటీకార్పొరేషన్‌నుంచి రూ.442కోట్లను, ఎస్టీకార్పొరేషన్‌నుంచి రూ.395 కోట్లను, ఎస్సీకార్పొరేషన్‌నుంచి రూ.1271కోట్లను, మొత్త 6,108కోట్లను అమ్మఒడికి మళ్లించా రని కాలవ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమనిధుల్ని అమ్మఒడి పథకానికి మళ్లించడంద్వారా, ఆయావర్గాలకు అందాల్సిన ఆర్థికసహాయాన్ని జగన్‌ దారిమళ్లించా డన్నారు. తానుప్రకటించిన పథకానికి ప్రత్యేకంగా నిధులివ్వడంచేతకాని జగన్‌, ఆయావర్గాల నిధులుమళ్లించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల వార్షిక ఆదాయానికి గండికొట్టాడన్నారు. జగన్‌కేబినెట్‌లోని ఆయావర్గాల మంత్రులు, శాసనసభ్యులు దీనిపై ఏం సమాధానం చెబుతారని, వారంతా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని కాలవ సూచించారు. అసెంబ్లీలో జగన్‌ను పొగుడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులంతా, తమతమసామాజికవర్గాలవారు ఎంతనష్టపోతున్నారో, ఏవిధంగా నష్టపోతున్నారో తెలుసుకోవాలని టీడీపీనేత హితవుపలికారు.

రూ.3,400కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు నిలిపివేసిన జగన్‌సర్కారు, విద్యార్థు ల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. జగన్‌ తప్పిదంకారణంగా ప్రైవేటుకళాశాల ల విద్యార్థులు, వసతిగృహాల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చాలా మంది అప్పులుచేస్తూ నెట్టుకొస్తున్నారని కాలవ తెలిపారు. అనేకచోట్ల లెక్చరర్లే ఇన్‌ఛార్జ్‌ వార్డెన్లుగా ఉన్నారని, ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారంతా దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారన్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఏడాదికి ఒక్కోవిద్యార్థికి రూ.20వేలు ఇస్తానన్న జగన్‌, ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా ఇవ్వలేదన్నారు. స్కాలర్‌షిప్పులపై ఆధారపడి విద్యనభ్యసించేవారంతా జగన్‌నిర్ణయం కారణంగా రోడ్డునపడే దుస్థితి వచ్చిందన్నారు. దీనిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖలను చూస్తున్న మంత్రులు ఏంసమాధానం చెబుతారని శ్రీనివాసులు నిగ్గదీశారు. జగన్‌ ప్రకటనలకు , ప్రభుత్వ చేతలకు ఎక్కడా పొంతనలేదన్నారు. ఈవిధంగా నిరుపేదలసంక్షేమానికి సమాధికట్టిన జగన్‌సర్కారు, బడుగు, బలహీనవర్గాలను, దళితులు, మైనారిటీలను బలిపీఠంపై నిలబెట్టిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఒక నేరస్థుడికి కూడా చేతులు ఎత్తి దండం పెట్టా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు, గత ఎనిమిది నెలలుగా, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై, జరుగుతున్న పరిణామాల పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు అభివృద్ధిలో, ఇటు సంక్షేమంలో వెనుకబడి పోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు, అసెంబ్లీలో జరిగిన వీడియో వేసి, చంద్రబాబు చూపించారు. "చిన్నవాడివైనా చేతులు జోడింది దండం పెడుతున్నా, తొందర పాటు నిర్ణయాలు వద్దు అండి. భావి తరాలను ద్రుష్టిలో పెట్టుకోండి" అంటూ ఆ వీడియోలో ఉంది. తరువాత చంద్రబాబు మాట్లాడుతూ, ఆవేదనతో మాట్లాడారు. ఇంత అనుభవం ఉన్న నేను, ఒక నేరస్థుడికి, వారం వారం కోర్ట్ కు వెళ్ళే వ్యక్తికి, చేతులు జోడించి దండం పెట్టానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూసి, ప్రజల కోసం, అలా చేసానని, అయినా ఈ మనిషి మారలేదు అంటూ, చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.

చంద్రబాబు మాట్లాడుతూ, "నాపై కక్షతో రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని అడిగాను. ఒక నేరస్తుడికి దండం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు పెట్టానంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం పెట్టాను. కక్షలు, కార్పణ్యాలకు రాష్ట్రాన్ని నెలవుగా చేస్తారా..? రాజధాని అమరావతిపై ఎన్ని కమిటిలు వేస్తారు..?కేబినెట్ కమిటి, పీటర్ కమిటి, జిఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి, హై పవర్ కమిటి దేనికి ఇవన్నీ..? ఎందుకీ ప్రాంతంపై ఇంత కక్ష నీకు..? ఇది రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం కాదా..? విశాఖకు, కర్నూలుకు చేయాల్సినవన్నీ చేద్దాం. ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మిస్తే కనీసం విమానాలు తేలేక పోయారు. విశాఖకు వచ్చిన కంపెనీలన్నీ తరిమేశారు, పెట్టుబడులు, ఉద్యోగాలు పోగొట్టారు. ఒక వ్యవస్థను కుప్పకూల్చారు. ఒక సానుకూల వాతావరణాన్ని నాశనం చేశారు. తెనాలిలో తగులపెట్టిన జెఏసి శిబిరాన్ని సందర్శించే స్వేచ్ఛ నాకు లేదా..? అదే మా గ్రామంలో మీటింగ్ పెట్టేందుకు వైసిపి వాళ్లకు అనుమతిస్తారా..? 30వ తేదీదాకా నన్ను తెనాలి వెళ్లవద్దని అంటారా..? నేను రేపు తెనాలి వెళ్తున్నాను. మాజీమంత్రి జవహర్ పై ఆంక్షలు పెడతారా..? అక్రమ కేసులు బనాయిస్తారా..? ఇక్కడ మద్యం రేట్లు ఎందుకు పెంచావు..? నీకు కమిషన్లు ఇచ్చే బ్రాండ్లే అమ్ముతావా..?"

"తెలంగాణ, కర్ణాటక నుంచి మద్యం అక్రమ సరఫరా అవుతోంటే చోద్యం చూస్తున్నారా..? ఆర్టీసి ఛార్జీలు రూ 700కోట్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్లు రూ 500కోట్లు పెంచారు. పేదల నడ్డి విరిచేలా భారాలు మోపుతారా..? ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుక ధర మూడునాలుగు రెట్లు పెంచేశారు. ఇదొక రద్దుల ప్రభుత్వం..ఉచిత ఇసుక, అన్నా కేంటిన్లు, కాపు రిజర్వేషన్లు, పండుగ కానుకలు, ఫుడ్ బాస్కెట్ రద్దు, విమాన సర్వీసులు రద్దు, దివ్య దర్శనం రద్దు. భరోసా ఇస్తామని రైతులకు ఆంక్షలు పెడతారా..? కేంద్రం ఇచ్చేదానితో కలిపి రూ 18,500ఇస్తామని చెప్పి 13,500ఇచ్చి, రూ 5వేలు ఎగ్గొడతారా.. ? 14లక్షల మంది కౌలు రైతులకు ఇస్తామని చెప్పి కనీసం 3లక్షల మందికైనా ఇచ్చారా..? ఇంతవరకు స్కాలర్ షిప్ లు పైసా ఇచ్చారా విద్యార్దులకు..? అమ్మవడి కింద కార్పోరేషన్ల సొమ్ము ఇస్తారా..? బిసి, ఎస్సీ,ఎస్టీ కార్పోరేషన్ల సొమ్ము మళ్లిస్తారా అమ్మవడికి..? 7లక్షల మందికి పించన్లు ఎగ్గొడతారా..? మీరు టిడిపి కాబట్టి పెన్షన్ ఇవ్వం అంటారా..? పేదరికానికి పార్టీ ఉంటుందా..? పేదల పొట్టకొట్టడమే మీ వాలంటీర్ల పనా..? మీ వాలంటీర్ కు ఏడాదికి రూ 96వేలు ఇస్తూ పేదవాడికి నెలకు రూ 3వేలు పెన్షన్ ఇవ్వలేరా..?" అని చంద్రబాబు అన్నారు.

దేశంలో ఏరాష్ట్రానికి మూడురాజధానులు, ఇద్దరుముఖ్యమంత్రులు లేరని, ఆ దురదృష్టం ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని, విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను ఏలుతూ, రాష్ట్రప్రజలపాలిట డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజులు సామంతరాజుల్ని నియమిం చుకున్నట్లు, జగన్‌ విజయసాయిని నియమించుకున్నాడన్నారు. గతకొద్దిరోజులుగా విజయసాయి సాగిస్తున్న భూకుంభకోణలీలలు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నాయని, ఆకోవలోనే మరో కుంభకోణం వెలుగుచూసిందన్నారు. విశాఖపట్నంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడంకోసం ల్యాండ్‌పూలింగ్‌విధానంలో జనవరి25న జీవోనెం-72ను విడుదలచేశారన్నారు. ఆజీవో ప్రకారం జగన్‌సర్కారు ఆక్రమించుకున్న భూములకుకూడా పరిహారం ఇవ్వడానికి సిద్ధమైందన్నారు. 10ఏళ్లకు పైగా ఆక్రమణలోఉన్నభూమికి ఎకరాకు 450గజాలు, 5 నుంచి 10 ఏళ్లమధ్యన ఆక్రమణలోఉన్న భూమికి ఎకరాకు 250 గజాలు తిరుగుభూమిని ఇస్తామని సదరు జీవోలో పేర్కొనడం జరిగిందన్నారు. ఆ జీవోప్రకారం మొత్తం విశాఖపట్నం పరిసరప్రాంతాల్లో 6వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయించారని, అందులోభాగంగా దాదాపు 2,400ఎకరాల ఆక్రమితభూమిని ల్యాండ్‌పూలింగ్‌ విధానంలో తీసుకున్నారని పట్టాభి పేర్కొన్నారు.

2,500ఎకరాల అసైన్డ్‌భూములను కూడా సేకరించారని, అవీఇవీ కలిపితే 5000ఎకరాలున్నాయని, సమీకరించాలనుకున్నదానిలో 80శాతంపైగా అలాంటిభూములే ఉన్నాయన్నారు. జీవో నెం-72కు ముందు జీవోనెం-294ను నవంబర్‌21న విడుదలచేశారని, దానిలో 10వ పాయింట్‌గా ఆక్రమితభూములను పక్కనపెడుతున్నట్లు స్పష్టంచేసిన ప్రభుత్వం , తరువాత మరోజీవోద్వారా వద్దనుకున్నవాటిపైనే కన్నేసిందన్నారు. విజయసాయి, బొత్స, జగన్మోహన్‌రెడ్డిలు తమనిర్ణయాన్ని రెండునెలల్లోనే ఎందుకు మార్చుకున్నారని పట్టాభి ప్రశ్నించారు. జీవోనెం-72లో స్పెషల్‌కేసు అని ఉదహరిస్తూ, దాన్ని విశాఖ నగరానికే ఎందుకు వర్తింపచేశారో, అధికారం ఆజిల్లా కలెక్టర్‌కే ఎందుకు అప్పగించారో స్పష్టంచేయాలన్నారు. విజయసాయి, జగన్‌లు రెండునెలల సమయాన్ని అడ్డంపెట్టుకొని విశాఖనగరం, చుట్టపక్కలప్రాంతాల్లోని భూములను కబ్జాచేసి, సెటిల్‌మెంట్లు, దందాల తో కాజేసి, వాటిని కూడా ల్యాండ్‌పూలింగ్‌ విధానంలోచూపి, వాటితాలూకూ, ప్రభుత్వం నుంచి ప్లాట్లను పొందడానికి ప్రయత్నంచేశారని టీడీపీనేత దుయ్యబట్టారు. జీవోల ముసుగులో 2,400ఎకరాల స్కామ్‌ జరిగిందని, అందుకు మూలకారకుడు విజయసా యిరెడ్డేనని, జీవోనెం-72లో ప్రత్యేకంగా విశాఖనగరాన్నే ఎందుకు చేర్చారని, ప్రభుత్వ మిచ్చిన జీవోలద్వారా విజయసాయి భూభాగోతం బట్టబయలైందన్నారు.

ఇళ్లపట్టాల ముసుగులో జిల్లాకోరకంగా జీవోలు విడుదలచేస్తూ, అధికారులకు సైతం అర్థంకాకుండా భూస్వాహాకు పాల్పడుతున్న భూబకాసురులు జగన్‌, విజయసాయిలే నన్నారు. ల్యాండ్‌ అక్విజేషన్‌ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా 9,300ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దానిలో భాగంగా గుంటూరురూరల్‌లో ల్యాండ్‌ అక్విజేషన్‌ కింద 1100 ఎకరాలను, అర్బన్‌లో 1125ఎకరాలు కలిపి మొత్తం 2,225 ఎకరాలు తీసుకున్నారని, కృష్ణాజిల్లాలో 1800, పశ్చిమలో 900, తూర్పుగోదావరిలో 1400ఎకరాలను ల్యాండ్‌ అక్విజేషన్‌ పద్దతిలో తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖపట్నం రూరల్‌లో 280, అర్బన్‌లో48 ఎకరాలే తీసుకొని, కేవలం 320 ఎకరాలతో ఎందుకు సరిపెట్టారని కొమ్మారెడ్డి ప్రశ్నించారు. విశాఖజిల్లాలో ల్యాండ్‌పూలి ంగ్‌ విధానంతో చేయాల్సిన భూకుంభకోణం చేశారని, అడిగేవాడులేడుకదా అని విశాఖపై కన్నేశారన్నారు. విశాఖకేంద్రంగా వైసీపీ చేసిన భూకుంభకోణం జీవోలతో సహా బహిర్గతమైందన్నారు. విశాఖలో దోచుకున్న 4వేల ఎకరాలను, బిల్డ్‌ఏపీ కింద ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని, తద్వారా వచ్చే ఆదాయాన్ని జగన్‌, విజయసాయిలు తమ 420గ్యాంగుకి దోచిపెడుతున్నారని పట్టాభి ధ్వజమెత్తారు.

ఎగ్జిక్యూటివ్‌కేపిటల్‌ ముసుగులో, ఇళ్లస్థలాలకోసమంటూ పెద్దఎత్తున భూదోపిడీకి పాల్పడిన జగన్‌, ఆయన అనుచరులపై విశాఖ రైతులు తిరగబడుతున్నారన్నారు. అమరావతి భూములతోపాటు, విశాఖభూములపై సిట్టింగ్‌న్యాయమూర్తితో విచారణ చేపట్టే దమ్ము, ధైర్యం జగన్‌కు ఉన్నాయా అని పట్టాభి నిలదీశారు. న్యాయవిచారణ జరిపితే, తాముచేసిన కుంభకోణా లు బయటకువస్తాయన్న భయంతోనే జగన్‌ వెనడుగు వేస్తున్నాడన్నారు. అమరావతి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సంపూర్ణంగా న్యాయంచేసిందని, 2015 జనవరి1న విడుదలచేసిన జీవోనెం-1ద్వారా అసైన్డ్‌భూములున్న ప్రతి భూయజమానికి న్యాయం చేయడం జరిగిందన్నారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకుంటే, బిల్డ్‌ఏపీ కింద అమ్మాలనుకున్న భూముల్నే పేదవారికి ఎందుకు ఇవ్వడంలేదన్నారు. పేదలనోట్లో మట్టికొడుతూ, అసైన్డ్‌భూములు ఆక్రమించి, తిరిగివాటికి రిటర్న్‌గా ప్లాట్లు తీసుకుంటూ జగన్‌సర్కారు ఆడుతున్న భూనాటకం బయటపడిందన్నారు. దీనిపై ఎవరు స్పందించినా తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలుగుదేశంనేతలు, కార్యాల యాలపై దాడులుచేసినంత మాత్రాన విజయసాయి, జగన్‌ల భూముల భాగోతం మాసిపోదని, వైసీపీకార్యకర్తలకు ధైర్యముంటే తమనాయకులపైనే తిరగబడాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read