రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ఒక కన్ను వేసింది. ముఖ్యంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి జరుగుతున్న అంశాలను తెలుసు కునే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని కేంద్రం పెద్దలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతున్న తీరు, మండలి రద్దు తదితర అంశాలను నిశి తంగా కేంద్రం పరిశీలిస్తోంది. శాసనమండలిలో మంత్రులే పోడియంను చుట్టుముట్టడం, సభాపతి టేబుల్ పై ఉన్న పేపర్లను చింపివేయడం తదితర పరిణామాలకు సంబం ధించిన వీడియో ఫుటేజ్ ఇప్పటికే కేంద్రానికి చేరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించినట్లుగా చెబుతున్నారు. గవర్నర్ నుంచి నివేదిక కోరినట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యం లోనే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంతో, మండలి చైర్మన్ ఎం.ఎ.షరీ తో విడివిడిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
శనివారం సాయంత్రం స్పీకర్ తమ్మినేనితో భేటీ అయిన గవర్నర్ ఆదివారం మధ్యాహ్నం మండలి చైర్మన్ షరీఫ్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీ పరిణా మాలపై స్పీకర్ తమ్మినేనితో గవర్నర్ ఏకాంతంగా చర్చించారు. సభ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు సైతం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలియ వచ్చింది. మూడు రాజధానులు, సీఆర్డీయే ఉప సంహరణ బిల్లుల ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ స్పీకర్‌ను అడిగి క్షుణ్ణంగా తెలుసుకు న్నారు. మరోవైపు ఈ రెండు బిల్లులు మండలిలో ఆమోదం పొందకుండా సెలక్ట్ కమిటీకి పంపడం పై మండలి చైర్మన్ గవర్నరు వివరణ ఇచ్చారు.
బిల్లులు తిరస్కరించడం జరగలేదని కేవలం ప్రజాభిప్రాయ సేకరణకే పంపడం జరిగినట్లుగా చైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు వివరించారు. ఇదే సందర్భంగా అధికార, విపక్ష ఎమ్మెల్సీలు, మంత్రు లు మధ్య జరిగిన వాగ్వాదం, ప్రత్యక్ష ప్రసారాల నిలుపుదల, ఇతర అంశాల గురించి గవర్నర్ నిశితంగా సమాచారం. సేకరించారు. త్వరలో కేంద్రానికి నివేదిక.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజా పరిణామాలతో పాటు మూడు రాజధానుల ప్రకటన నాటి నుంచి జరుగుతున్న విషయాలను కేంద్రం దృష్టికి ఆయన తీసుకు వెళ్ళనున్నారు. శాసనమండలిలో మంత్రులు బల్లలు ఎక్కటం, చైర్మెన్ ని బెదిరించటం, టిడిపి సభ్యుల పైకి దూసుకురావటం తదితర వీడియోలు చంద్రబాబు, గవర్నర్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే.