ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. దేశం మొత్తం, మన వైపు తిప్పుకునేలా చేస్తాను అంటున్న జగన్, నిజంగానే, దేశం మొత్తం మన గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు. విద్యుత పీపీఏల విషయం దగ్గర నుంచి, చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు దాకా, అన్నీ అయోమయ ప్రకటనలే. వీటి పై, జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జగన్ ను తుగ్లక్ అంటూ సంబోధిస్తూ, ఆర్టికల్స్ వస్తున్నాయి. అయినా జగన్ మాత్రం, ఏదో ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎవరి మాటలు పట్టించుకోవటం లేదు. ఎవరు ఏది చెప్పినా, వాళ్ళు చంద్రబాబుకి అనుకూలం అనే ముద్ర వేసి, తాను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా, ప్రజలను నమ్మించే పనిలో ఉన్నారు. ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా, జగన్ మాటకు భజన చేసే పరిస్థితి. దీంతో, తాను తీసుకున్న నిర్ణయం రైట్ అనే విధంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తాజగా మండలి రద్దు విషయంలో కూడా అదే జరిగింది.
తన నిర్ణయాన్ని సమర్ధించని, మండలి అవసరం లేదు అంటూ, జగన్ నిర్ణయం తీసుకుని, ఏకంగా మండలినే రద్దు చెయ్యటం సంచలనంగా మారింది. అయితే మండలి రద్దు పై, ఖర్చు అంశాన్ని జగన్ తెర మీదకు తీసుకు వచ్చారు. మండలి సమావేశాలకు, ఏడాదికి 60 కోట్లు అవుతాయని, మనకు ఇది అవసరమా అనే చర్చ పెట్టరు. అయితే దీని పై విపక్షాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీరు ప్రతి వారం కోర్ట్ కు వెళ్ళటానికి, 60 లక్షలు అవుతాయి అన్నారు, అంటే 5 ఏళ్ళకు 150 కోట్లు అవుతాయి, మీరు సియంగా అవసరమా అంటూ కౌంటర్ ఇచ్చాయి. అయితే, ఇదే అంశం పై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. జగన్ శాసనమండలి రద్దు, దానికి ఖర్చు సాకుగా చెప్పటం పై, తెలంగాణా వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ అత్యంత సన్నిహితుడు అయిన కె.కేశవరావు, జగన్ మండలి పై తీసుకున్న నిర్ణయం పై స్పందించారు. మండలి ఖర్చు వృధా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ, "అబ్సల్యూట్ నాన్సెన్స్" అంటూ ఘాటుగా స్పందిన్కాహారు. పెద్దల సభ రాష్ట్రాలకు అవసరం అని కేశవరావు అన్నారు. గతంలో ఎన్టీఆర్ మండలిని రద్దు చేస్తే, తాము అందరం పోరాడామని గుర్తు చేసారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కూడా, ఏపిలో జరుగుతున్న మూడు రాజధానులు, మండలి రద్దు పై విలేఖరులు స్పందన కోరగా, ఆ పంచాయతీ గురించి మనకెందుకు అంటూ, వ్యాఖ్యానించారు. మొత్తానికి, జగన్ తీసుకున్న నిర్ణయం పై, తనకు సన్నిహితంగా ఉండే పార్టీలే, విమర్శలు గుప్పిస్తున్నాయి.