వైఎస్ వివేక కేసులో సిబిఐ దూకుడు పెంచింది. కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తూ, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలిసిందే. అలా కేసు హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యిందో లేదో, ఇలా కేసులో కదలిక వచ్చింది. ఎప్పటి నుంచో, కడప ఎంపీ, జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇస్తుంది అంటూ, ప్రచారం సాగింది. విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారని, పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రచారం జరిగిన ప్రతి సారి, ఏదో ఒక వంకతో, సిబిఐ ముందుకు వెళ్ళలేక పోయింది. అయితే ఈ సారి మాత్రం, సిబిఐ సైలెంట్ గా పని కానిచ్చేసింది. రెండో కంటికి తెలియుకుండా, సైలెంట్ గా, అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది. నోటీసులు పంపించిన తరువాత మీడియాకు చెప్పింది. అయితే దీని కంటే ముందు, నిన్న ఉదయం, సిబిఐ పులివెందులలో, అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించి, అక్కడ కొంత సమాచారం సేకరించింది. సాయంత్రానికి నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ కు, విచారణకు రావాలి అంటూ, సిబిఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే నిన్న ఈ వార్త వచ్చిందో లేదో, అవినాష్ రెడ్డి వెంటనే స్పందించారు. తాను ఈ రోజు విచారణకు రాలేనని ట్విస్ట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయని,  ఐదు రోజులు సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. మరి దీని పై సిబిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. సహజంగా సిబిఐ నోటీసులు వరకు వెళ్ళింది అంటే, అరెస్ట్ తప్పదేమో అనే ప్రచారం జరుగుతుంది.

పీపుల్స్‌ పల్స్‌ పొలిటికల్ రీసెర్చ్‌ సంస్థ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఏడు ఎస్టీ నియోజవకర్గాల్లో ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించ‌గా వైసీపీ 6, టిడిపి 1 గెలవ‌చ్చ‌ని అంచ‌నా వేసింది. ఈ పీపుల్స్ ప‌ల్స్ సంస్థ ఎవ‌రిదో కాదు..వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి ఆంత‌రంగికుడుగా, జ‌గ‌న్ సాక్షిలో కీల‌క ప‌ద‌విలో ఉన్న వ్యక్తి. ఆయన చేసిన పీపుల్స్‌ పల్స్‌ పొలిటికల్ రీసెర్చ్‌ సంస్థ  ట్రాకర్‌ పోల్‌ సర్వే పేరుతో ఫ‌లితాలు విడుద‌ల చేశాడు. ఎంత స్వామి భ‌క్తి చాటుకున్నా వైసీపీ గెల‌వ‌లేద‌ని ఇచ్చిన లెక్క‌లే తేల్చేశాయి. ఏడు గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో  వైసీపీకి  44.25 శాతం, టిడిపికి 39.39 శాతం, జనసేన 8.19 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. టిడిపి జ‌న‌సేన పొత్తు ఉంద‌ని వైసీపీ వాళ్లే చెబుతున్నారు. రెండూ క‌లిసి పోటీచేస్తే ఈ సర్వే ప్రకారం చూసినా  వైసీపీకి  44.25 శాతం, టిడిపి+జ‌న‌సేనకి 47.58 శాతం (టిడిపి 39.39+జనసేన 8.19 ) ఓట్లు పోల‌వుతున్నాయి. అంటే 2019లో ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఒక్క‌టి గెల‌వ‌ని టిడిపి జ‌న‌సేన పొత్తుతో వైసీపీకి కంటే 3 శాతం అధిక ఓట్ల‌తో సీట్ల‌న్నీ గెలుచుకోబోతోంద‌ని వైసీపీ సానుభూతి చేసిన స‌ర్వేనే తేట‌తెల్లం చేయ‌డం విశేషం. వైసీపీ కోసం వైఎస్ కుటుంబ అభిమాని పీపుల్స్ ప‌ల్స్ సంస్థ‌తో చేయించిన స‌ర్వేలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపికి  సగటున దాదాపు 9.6 శాతం ఓట్లు అధికంగా వ‌స్తున్నాయి. జ‌న‌సేన‌కి ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రాస‌రి వ‌చ్చే 8.19 శాతం వ‌చ్చే ఓటింగ్ని క‌లిపితే దాదాపు 17 శాతం అద‌న‌పు ఓట్లు టిడిపి అల‌యెన్స్ కొల్ల‌గొట్ట‌నుంది. అంటే గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 39 శాతం+ పెరిగిన 17 శాతం ఓటింగుతో వైసీపీ అత్యంత బ‌లంగా ఉంద‌ని భావించే ఏడు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో టిడిపి, జ‌న‌సేన క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ స‌ర్వేనే వెల్ల‌డించ‌డం రాష్ట్రంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కి అద్దం ప‌డుతోంది.

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ-త్య కేసు విచారణని సీబీఐ మ‌ళ్లీ మొద‌లు పెట్టింది. కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు  వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. పులివెందుల వైసీపీ కార్యాలయానికి  వ‌చ్చిన‌ సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయ‌డంతో ఒక్క‌సారిగా ఈ కేసులో నిందితులు, అనుమానితుల్లో గుబులు మొద‌లైంది.  పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాల‌ను కూడా సీబీఐ పరిశీలించ‌డంతో  కార్యాలయానికి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. ఇటీవ‌ల క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తార‌ని వార్త‌లు రావ‌డంతో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న దేశ‌రాజ‌ధానిలో పెద్ద‌లు క‌లిసి వెళ్లొచ్చాక అవినాశ్ రెడ్డి అరెస్టు ఆగిపోవ‌డం యాధృచ్చిక‌మేనా అన్న అనుమానాలు వ‌చ్చాయి. మ‌ళ్లీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్క‌ర్ రెడ్డి కోసం సీబీఐ రావ‌డం, అరెస్టు ఊహాగానాలు ఊపందుకోవ‌డంతో వైఎస్ జ‌గ‌న్  రెడ్డి మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌క త‌ప్ప‌క‌పోవ‌చ్చంటున్నారు విశ్లేష‌కులు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి వైసీపీ స‌ర్కారు నోటీసులు ఇవ్వ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌భుత్వంపై ఉద్యోగులు గవర్నర్‍కు ఫిర్యాదు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ముఖ్య‌మంత్రి చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌తో  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ర‌ద్దు చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. జారీ చేసిన నోటీసుల్లో సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొన‌డంతో ఒక్క‌సారిగా సంఘ నేత‌లు ఉలిక్కిప‌డ్డారు. ఇటీవ‌లే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు  రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం లేదంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి.  12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడిందని ఉద్యోగుల జిపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం 500 కోట్లు డ్రా చేసిందని ఉద్యోగ‌సంఘాలు ఆరోపించాయి. ఉద్యోగుల ఫిర్యాదుపై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వాన్ని వివ‌ర‌ణ అడ‌గ‌డంతో ర‌చ్చ మొద‌లైంది. ఉద్యోగ‌సంఘాల‌లో ఏపీ ఎన్జీవో, స‌చివాల‌య ఉద్యోగులు సంఘం, రెవెన్యూ స‌ర్వీసెస్ వైసీపీ స‌ర్కారు చెప్పుచేత‌ల్లో ఉన్నాయి. ఒక్క ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం ఇలా గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కి వెళ్లి ఫిర్యాదు చేయ‌డంపై స‌ర్కారు గుర్రుగా ఉంది.  ప్ర‌భుత్వంపై ప్ర‌భుత్వ ఉద్యోగులు గ‌వ‌ర్న‌ర్కి ఫిర్యాదు చేయ‌డం దేశంలోనే తొలిసారి. ఇప్ప‌టికే అన్నిరంగాల్లో ఏపీ ప‌రువు పోయింద‌ని, ప్ర‌భుత్వ ఉద్యోగులు రోడ్డెక్క‌డంతో మ‌రీ డ్యామేజీ అయ్యామ‌ని వైసీపీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘాన్నే ర‌ద్దు చేసేందుకు పావులు క‌దుపుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read