రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఇప్పటికే అమరావతి ఉద్యమం, తీవ్రంగా ఉంది. ప్రతి రోజు రణరంగా పరిస్థతులు ఉన్నాయి. మహిళలను ఎలా పోలీసులు ట్రీట్ చేస్తున్నారో చూస్తున్నాం. మొన్నటి దాక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు నిత్యం ఏదో ఒక సంఘటనతో అదుపు తప్పుతూనే ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న కాకినాడకులో కూడా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. నిన్న కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడిన మురికి భాష అందరూ చూసారు. చంద్రబాబు పై, పవన్ కళ్యాణ్ పై, లోకేష్ పై, లంXXX అనే బూతులతో ఆయన విరుచుకు పడ్డారు. పక్కన మహిళా ఎంపీ కూడా, ఈయన మాట్లాడిన భాషకు, ఆవిడ కూడా నోటి మీద చెయ్యి వేసుకున్నారు. ఇంతలా మాట్లాడారు, ఆ వైసీపీ ఎమ్మేల్యే. అయితే, ఆయన ఏదో ఆవేశంలో మాట్లాడారు, పెద్ద హుందా పదవిలో ఉన్నారు, ఆయన క్షమాపణ చెప్తారని అందరూ అనుకున్నారు. అయితే ఆయన క్షమాపణ చెప్పకపోగా, ఈ రోజు నిరసన చేస్తున్న జనసేన కార్యకర్తల పై రాళ్ళతో, కర్రలతో కొట్టారు.
తమ అధినేత పై ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అసభ్య వ్యాఖ్యలను చేసారని చెప్తూ, ఆయన వ్యాఖ్యలకు నిరసనగా, భానుగుడి సెంటర్‌లో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని చెప్తూ, ఆయన ఇంటికి బయలుదేరిన జనసేన కార్యకర్తల పై, రాళ్ళ దాడి చేసారు, వైసీపీ కార్యకర్తలు. జనసేన కార్యకర్తలు వస్తున్నారని తెలిసి, అప్పటికే అక్కడ వైసీపీ కార్యకర్తలు ద్వారంపూడి ఇంటి వద్దకు చేరుకొని, జనసేన కార్యకర్తల పై వైకాపా వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ నాయకులను వైసీపీ నేతలు వెంటాడి మరీ కొట్టారని.. ఇదంతా పోలీసుల ఎదుటే జరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకోలేదని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్పెషల్ బ్రాంచి పోలీసులను భారీగా మోహరించారు. కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బూతులు మాట్లాడిన ఎమ్మెల్యేని కాదని, తమను ఆర్రేస్ట్ చేస్తున్నారని, వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రశాంత పరిస్థితి ఉండనిచ్చే పరిస్థితి లేదని, కావాలనే అందరినీ రెచ్చగోడుతున్నారని వాపోతున్నారు. వైసీపీ నాయకులు ఇలా బూతులు మాట్లాడటం ఇది మొదటి సారి కాదు. మంత్రులు, స్పీకర్, ఎమ్మేల్యేలు, ఇలా అందరూ, ఇష్టం వచ్చినట్టు, బూతులు తిడుతూ, ప్రత్యర్ధుల పై విరుచుకు పడుతున్నారు. వీళ్ళు బూతులు తిడుతూ, వీళ్ళను ఎదురు ఎవరైనా ఏమైనా అంటే, వారిని తీసుకువెళ్ళి లోపల వేస్తున్నారు. పోలీసులు కూడా, ఏమి చెయ్యాలని పరిస్థితి.