విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని వస్తుంది అంటూ, గత 20 రోజులుగా వైసీపీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రతిపాదన చేసారు. అయితే, క్యాబినెట్ మీటింగ్ లో అధికారికంగా నిర్ణయమే ఫైనల్ అనుకున్న టైంలో, ఈ నిర్ణయం ప్రకటించటానికి, మరి కొంత సమయం పడుతుందని, బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత, హై పవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. అయితే ఇది అనూహ్య పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే, అంతా ఫైనల్ అని అందరూ అనుకున్న టైంలో జగన్ వెనక్కు తగ్గారు. మరో పక్క విశాఖ ఉత్సవ్ లో పాల్గునటానికి వచ్చిన జగన్, కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడకుండ వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తుంటే, ఏదో జరుగుతుంది అనే సందేహం అందరిలో వ్యక్తం అవుతుంది. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే జగన్ వెనక్కు తగ్గారని, త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని, అక్కడ అంతా వివరించి, దీనికి ఢిల్లీ స్థాయిలో కూడా మద్దతు సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

visakha 30122019 2

అయితే ఇప్పుడు విశాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న మరో షాకింగ్ నిర్ణయం, అందరినీ ఆశ్చర్య పరిచింది జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో విశాఖపట్నం గురించి ప్రస్తావిస్తూ, విశాఖకు పెద్దగా ఏమి చెయ్యనవసరం లేదని, విశాఖకు రోడ్లు వెడల్పు చేసి, ఒక మెట్రో ట్రైన్ వేస్తే సరిపోతుందని, మెట్రో ట్రైన్ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే మెట్రో ట్రైన్ పై దాఖులు అయిన బిడ్ ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. బిడ్ రద్దు చెయ్యటం కంటే, మరో డీపీఆర్ తయారు చెయ్యమని కోరటం, ఆశ్చర్యం. ఎందుకంటే, ఇప్పుడు విశాఖ మెట్రో రైల్ పై మరో డీపీఆర్ ని ఒక కన్సల్టన్సీ తయారు చెయ్యాలి అంటే, చాలా సమయం తీసుకునే అవకాసం ఉంటుంది.

visakha 30122019 3

వీళ్ళు డీపీఆర్ తయారు చేసి, బిడ్డింగ్ కు పిలిచి, పనులు అప్పగించాలి అంటే, అసలు ఇప్పుడప్పుడే అయ్యే పని కాదు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, విశాఖను పరిపాలనా రాజధాని చెయ్యాలి అంటే, మెట్రో రైల్ లాంటివి వేస్తె సరిపోతుంది అని చెప్పటం, అయితే ఇప్పుడు ఆ మెట్రో కు వచ్చిన బీడ్ ను రద్దు చెయ్యటం చూస్తుంటే, ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడే కార్యరూపం దాల్చే అవకాసం లేదనే చెప్పాలి. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎస్సెల్ ఇన్ ఫ్రా సంస్ధ, ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. అయితే, ఒకే బీడ్ దాఖలు కావటం, ధర పైన చేసిన ప్రతిపాదనలకు, ఆ కంపెనీ ముందుకు రాక పోవటంతో, ఆ ఫైనాన్షియల్ బిడ్ రద్దు చేస్తూ, తాజాగా మరో డీపీఆర్ తయారీ కోసం కొత్త కన్సెల్టెంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రానికి చెందిన, వైసీపీ ఎమ్మెల్యే తమ భూమిలో, ఇది తన భూమి అంటూ బోర్డులు పెట్టారని, వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం మాది అంటూ, ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలోనే కొంత మంది ఫిర్యాదు చెయ్యటం సంచలనంగా మారింది. వంద కోట్లు విలువ చేసే ఈ స్థలం విషయం పై, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భూమి నాది అని వైసీపీ ఎమ్మేల్యే చెప్పటం, కాదు ఇది మేము ఎప్పుడో కొనుక్కున్నాం అంటూ అవతలి వారు చెప్తూ, స్థలం కాగితాలు చూపిస్తూ ఉండటంతో, ఇప్పుడు ఈ వివాదం పై తెలంగాణా పోలీసులు నిజం ఏమిటి అనే దాని పై విచారణ చేసే పనిలో ఉన్నారు. తాము 20 ఏళ్ళ క్రితమే ఈ భూమి కొన్నాం అని వారు చెప్తుంటే, వైసీపీ ఎమ్మేల్యే తాను 2008లో కొన్నాని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ లోని హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట వద్ద 40 ఎకరాలు భూమి ఉంది.

ycp 30122019 2

ప్రస్తుతం, ఇక్కడ ఎకరం రెండు కోట్లు పైనే ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం, ఈ భూమి కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందిన భూమి అంటూ, బోర్డులు వెలిసాయి. అక్కడ ఇది వరకు 40 ఎకరాల భూమిలో వెంచర్‌ వేసి ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. అయితే కొన్ని రోజుల క్రితం అక్కడ ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. అలాగే, లోపాలకి వెళ్ళే వీలు లేకుండా, కందకాలు తవ్వారు. దీంతో అక్కడ ఫ్లాట్లు కొన్న 828 మంది అవాక్కయ్యారు. ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి దగ్గర, జీపీఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించారని, ఆ ప్లాట్ ఓనర్లు చెప్తున్నారు. ఇవి కొన్న వాటిలో, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెప్తున్నారు.

ycp 30122019 3

అయితే తాము 20 ఏళ్ళ క్రితమే కొన్న ఫ్లాట్లలో, ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి, బోర్డును ఏర్పాటు చేసి, హద్దు రాళ్ళు తీసి వేసి, కందకాలు తవ్వారని, ఈ భూమిని ఆక్రమించే ఆలోచనలో వారు ఉన్నారని, తాము ఏమైపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌, యాదాద్రి డీసీపీ దృష్టికి తీసుకువెళ్ళి, కేసీఆర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసారు. అయితే దీని పై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే, ఈ భూమిలో తనకు కూడా వాటా ఉందని, 2008లో తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. నెల రోజులు నుంచి తనకు ఫోన్లు చేస్తున్నారని, ఇది తన భూమి అని చెప్పారు. తన కంటే ముందే కనుక ఈ భూమిని అమ్మినట్టు ఆధారాలు చూపిస్తే, వారికే ఈ భూమి ఇచ్చేస్తాను అంటూ, వైసీపీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మరి నిజంగానే ఇచ్చేస్తారా ? మీడియా ఒత్తిడితో ఇలా చెప్పారా ? అనేది చూడాలి.

అమరావతిని నిర్వీర్యం చేస్తూ, విశాఖపట్నంకు సెక్రటేరియట్ ను తరలిస్తున్నారు అంటూ, గత 13 రోజులుగా అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు, వారి వద్దకు ఒక్క మంత్రి కాని, ప్రభుత్వం తరుపు నుంచి ఒక్క అధికారి కాని వచ్చి, రాజధాని రైతులతో మాట్లాడ లేదు సరికదా, కనీసం వారిని పట్టించుకొను కూడా పట్టించుకోవటం లేదు. అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనే, మూడు రాజధానుల పై నిర్ణయం అధికారికంగా జరిగిపోతుంది అని అందరూ అనుకున్నారు. అయితే, ఏమైందో ఏమో కాని, రాత్రికి రాత్రి నిర్ణయం మారిపోయింది. భారీ పోలీస్ బందోబస్తు, అలాగే విశాఖలో జగన్ కు భారీ ఏర్పాట్లు చూసి, ఇక ప్రకటన లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే ఎవరి ఒత్టిడో కాని, రాజధాని నిర్ణయం అయితే వాయిదా పడింది. అయితే ఇప్పుడు రాజధానికి సంబందించి మరో నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. నిన్న ఆదివారం అయినా సరే, ఒక హై పవర్ కమిటీని నియమిస్తూ, జీవో జారీ చేసింది.

dgp 30122019 2

ఈ కమిటీలోని సభ్యులు అందరూ జగన్ మాట వినే వారే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కమిటీలో జగన్ సహచర మంత్రులు అయిన, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నాని ఉన్నారు. అయితే ఇదే కమిటీలో డీజీపీ గౌతం సవాంగ్ ని కూడా పెట్టటం పై అందరూ ఆశ్చర్య పోయారు. సహజంగా ఇలాంటి కమిటీల్లో ఐఏఎస్ అధికారులను పెడతారు. అలాగే ఈ కమిటీలో కూడా ఒకరిద్దరు ఉన్నారు, సొంత పార్టీ మంత్రులు ఉన్నారు, మరి రాజధానిని డిసైడ్ చేసే కమిటీలో డీజీపీ ఎందుకు ఉన్నారు అనే సందేహం వ్యక్తం అవుతుంది.

dgp 30122019 3

అయితే విశాఖపట్నంను రాజధాని చెయ్యటం పై, కొంత మండి సీనియర్ పోలీస్ అధికారులలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలుస్తుంది. విశాఖ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ఒరిస్సా బోర్డర్ లో, మావోయిస్టులకు బలమైన పట్టు ఉందని, పోయిన ఏడాది, ఏకంగా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను నక్సల్స్‌ హత్య చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే విశాఖ తీరం పై, పాకిస్తాన్ గురి పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే, ఈ సీనియర్ పోలేస్ అధికారులకు సమాధానంగానే, డీజీపీని కమిటీలో పెట్టారని, పోలీసు బాస్‌గా విశాఖ రాజధానికి అనువైన ప్రాంతమని ఆయన చెబితే, ఇక పోలీస్ డిపార్టుమెంటు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తుంది. ఏ వైపు నుంచి ఇబ్బంది, అసంతృప్తి లేకుండా, ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు అమరావతి రైతులను, గుంటూరు జిల్లా జైలులో చంద్రబాబు పరామర్శించారు. పార్టీ నేతలతో కలిసి చంద్రబాబు, జైలులో ఆ రైతులను కలిసి, ధైర్యం చెప్పారు. అనంతరం, గుంటూరు జైలు బయట చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. జడ్జి చీవాట్లు పెట్టిన తరువాత, రైతుల పై దొంగతం కేసు కింద ఇప్పుడు సెక్షన్లు బుక్ చేసారని, రాష్ట్ర రాజధాని కోసం, భూములు ఇచ్చిన రైతులు దొంగాలా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఒక టీవీ ఛానల్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకునే ఆ మీడియా, అమరావతి పై విషం చిమ్ముతుందని, అమరావతిలో కడుపు మండి ఆందోళన చేస్తున్న రైతులను, పైడ్ ఆర్టిస్ట్ లు అని, బిర్యానీ పొట్లాల కోసం చేస్తున్నారు అంటూ, ఆ ఛానెల్ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని అన్నారు. మీకు హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోండి కాని, ఇక్కడ అమరావతిని కించ పరిస్తే ఊరుకోమని అన్నారు.

cbn 30122019 2

ఇదే సందర్భంలో డీజీపీ పై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. డీజీపీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తున్నారని, నా పై రాళ్ళు వేసి కొడితే, భావ ప్రకటనా స్వేఛ్చ అంటూ చెప్పిన డీజీపీ, ఇప్పుడు ఎందుకు రైతుల పై దొంగతనం కేసు పెట్టారని, చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఏది చెప్తే అది, డీజీపీ చేస్తున్నారని, మండిపడ్డారు. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేస్తే, చూస్తూ కూర్చమని, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని, తరువాత మీరు రిటైర్డ్ అయినా, ఈ పాపం మొయ్యాల్సి ఉంటుందని, ఏదైనా చట్ట ప్రకారం చెయ్యండి కాని, ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం, తగిన మూల్యం వడ్డీతొ సహా చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇలా అక్రమ కేసులు పెడితే ప్రజలు తగ్గి పోతారని మీరు అనుకుంటున్నారని, వాళ్ళు ఆవేదనతో ఉన్నారని, ఇంకా రెచ్చి పోతారని హెచ్చరించారు.

cbn 30122019 3

ఎప్పుడు రోడ్డు మీదకు రాని వాళ్ళు కూడా, ఈ రోజు రోడ్డు మీదకు వచ్చారని, రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా, ఇంతలా ఉద్యమం చెయ్యలేదని, ఇప్పుడు ఆవేదనతో రోడ్డున పడ్డారని అన్నారు. మీరు నిజంగా, రాజధాని మార్పు పై ప్రజలు సానుకూలంగా ఉన్నారని నమ్మితే, ఎన్నికలకు రండి, ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పండి, అంటూ చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పరువు పోయిందని, అందరూ పిచ్చి తుగ్లక్ అని తిడుతున్నారని, మన రాష్ట్రాన్ని కూడా తక్కువగా చూస్తున్నారని అన్నారు. దాడులుని నేను ఎప్పుడు సమర్ధించను అని, కనీ అదే సమయంలో, టీవీలు వారు కూడా, ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తే, చూస్తూ ఊరుకోమని, మీ మ్యానేజిమెంట్ కోసం, మీరు బలి పశువు కాకండి అంటూ, మీడియాను కూడా కోరారు చంద్రబాబు.

Advertisements

Latest Articles

Most Read