రాష్ట్రంలో మూడు రాజధానులు పై మంత్రులు, అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు నున్నిత పరిస్థితులకు దారి తీసే వ్యాఖ్యలకు స్వస్తి చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక దేశాలు జారీ చేసారు. శనివారం ఆయన విజయవాడ విమనాశ్రయం నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరడానికి ముందు పలువురు మంత్రులతో మాట్లాడినట్లు సమాచారం. రాజధానికి సంబంధించి బోస్టన్ కన్సల్టింగ్ కంపెనీ నివేదిక వచ్చేంత వరకు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సాధ్యమైనంత మేరకు మౌనంగా ఉండాలని జగన్ సూచించినట్లు నమాచారం. అయితే ఇదే సందర్భంలో విపక్షాలు పరిధికి మించి విమర్శలు చేస్తే దీటుగా బదులు చెప్పాలని ఆయన ఆదేశించినట్లు చెబుతున్నారు. బిసిజి నివేదిక రావడానికి మరికొద్ది రోజులు పట్టే అవకాసం ఉన్నందున ముందుగానే మంత్రులు మీడియా వలు అంశాలపై మాట్లాడితే విపక్షాలు నూతన ఎత్తుగడలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి అన్నట్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. రాజధాని అంశంపై హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏపి కేబినేట్ నిర్ణయించింది. ఈ నివేదిక వచ్చిన తరువాత అంతకు ముందు ప్రభుత్వం దగ్గరకు వచ్చిన మూడు కమిటీల నివేదికలను కలిపి అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్పినాని వెల్లడించిన విషయం తెలిసిందే.

jaagn 29122019 2

ఇందుకు హైవవర్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. ఆయన అన్నట్లుగానే రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బోస్టర్ కంపెనీ ఎక్కడదనే ప్రశ్నపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. రాజధానిపై ఆ కంపెనీ ఎలాంటి అధ్యయనం చేపట్టడం పట్ల ప్రజల్లో చర్చ మొదలైంది. నివేదికలో ఏం చెప్పబోతుంది. ఈ నివేదిక ప్రభుత్వ వాదన సమర్థి స్తుందా, రాజధానులు మూడు ఏర్పడతాయా! వంటి ప్రశ్నలు తీవ్ర ఉత్కంఠతను దారి తీస్తు న్నాయి. మూడు కమిటీల నివేదికలను కాదని ఈ కమిటీ ఏమీ కొత్త విషయాలను చెబుతుందనే సంశయం వలువరిలో ఉంది. దీనికి తోడు బిసిజి సంస్థ నిర్వాహకులతో అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లునికి సంబంధాలున్నట్లు విపక్షాలు ప్రచారం సాగించాయి. మొదటిసారి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలకమైన రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్ పనిచేస్తోంది. నిజానికి రాష్ట్ర రాజధానిపై అధ్యయనం అంటే ప్రభుత్వం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి వుందంటున్నారు.

jaagn 29122019 3

అయితే బోస్టన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం విశేషం. బోస్టన్ కన్సలింగ్ గ్రూప్ ఇదివరకే మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఏపి ఆర్ధిక పరిస్థితి రీత్యా గ్రీన్ ఫీల్డ్ కేపిటల్ కంటే బ్రౌన్ ఫీల్డ్ కేపిటల్ ఉత్తమం అని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. శుక్రవారం నాటి కేబినేట్ భేటీలో దీనిపై చర్చ జరిగనట్టు తెలుస్తోంది. అయితే బోస్టన్ తుది నివేదిక వచ్చిన తరువత దీనిపై పూర్తి స్థాయిలో కేబినేట్ చర్చించే అమాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బిసిజి నివేదికలో ఎటువంటి అంశాలు వస్తాయో చూడాలి. జగన్ కుడా ఈ నివేదిక వచ్చిన తరువాత, హైపవర్ కమిటీ ఏర్పాటు జరిగిన తరువాత సంబంధిత నివేదికలు వచ్చేంత వరకు మంత్రులు, సీనియర్ ఎంఎల్‌ఎలు వేచిచూసే వైఖరిని అవలంబించాలని ఆదేశించారంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్ సైడ్ ట్రెడింగ్ గురించి ప్రజలకు విస్తృత స్థాయిలో వివరించాలని జగన్ వారికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే, ఇది వరకు ఎంతో గర్వంగా చెప్పుకునే వారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్, విదేశీ పెట్టుబడులో నెంబర్ వన్, ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ వన్, నదులు అనుసంధానంలో నెంబర్ వన్, రియల్ టైం గవర్నన్స్, వేగంగా పూర్తీ అవుతున్న పోలవరం జాతీయ ప్రాజెక్ట్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం, ఇలా అన్ని విషయాల పై దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో వివిధ దేశాలు కూడా మనల్ని పొగడటం చూసాం. అలాగే పక్క రాష్ట్రాలతో పోటీ తట్టుకుని మరీ, మనం పెట్టుబడులు ఆకర్షించాం. అలాగే మనలను కించ పరుస్తూ, మనల్ను తక్కువ చేసి మాట్లాడుతున్న తెలంగణా రాష్ట్రానికి కూడా, మనం పనితనంతోనే సమాధానం చెప్పాం. అయితే, మారిన రాజకీయ పరిస్థితిలో, ప్రభుత్వం మారింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన నవరత్నాలకే ప్రాధాన్యత ఇవ్వటంతో, పెట్టుబడులు రావటం లేదు, ఆదాయం లేదు, గ్రోత్ తగ్గిపోయింది, పీపీఏ లాంటి విషయంలో దేశంలో పరువు పోయింది.

harish 29122019 2

ఇలా అనేక నిర్ణయాలతో దేశంలో చులకన అయ్యాము. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయంతో, మరో అనిశ్చితి పరిస్తితి ఏర్పడింది. ఇప్పటికే పెట్టుబడులు లేక, ఆదాయం తగ్గిపోతుంటే, ప్రధాన ఆదాయ వనరు అయిన రియల్ ఎస్టేట్ కూడా డమాల్ మంటుంది. ముఖ్యంగా అమరావతిని అన్యాయం జరుగుతూ ఉండటంతో, ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. దీంతో హైదరాబాద్ దిశ తిరిగింది. ఇక్కడ ఆశాజనిక వాతావరణం సరిగ్గా లేకపోవటంతో, అందరూ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో దేశం అంతటా అన్ని నగరాలతో పోలిస్తే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది. ఇదే విషయం నిన్న తెలంగాణాలో జరిగిన క్రెడాయ్‌ తెలంగాణ సమావేశంలో పాల్గుని, మంత్రి టి.హరీశ్‌రావు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

harish 29122019 3

దేశంలో రియల్ ఎస్టేట్ రంగం మందగమనంలో ఉంటే, హైదరాబాద్ లో మాత్రం పరుగులు పెడుతుందని, ఇది మన కేసీఆర్ నాయకత్వం అంటూ గొప్పగా చెప్పారు. ఇంతే కాదు, పక్క రాష్ట్రంలో జరుగుతున్న పనులు మీరు చూస్తున్నారు, ఇది కూడా మనకు చాలా అనుకూలం అయ్యింది అంటూ హరీష్ నవ్వుతూ చెప్పారు. ఆ నవ్వులోనే, మన రాష్ట్రాన్ని ఎంత హేళనగా చూస్తున్నారో అర్ధం అవుతుంది. పక్క రాష్ట్రాలకు ఆంధ్రల పరిస్థితి, నవ్వులాటగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో, మనలను హేళన చేసిన వారికి సమాధానం చెప్పాల్సిన ఆంధ్రులు, ఈ రోజు వారి చేతిలో మరోసారి హేళనకు గురి కావాల్సి వచ్చింది. మన చేతకాని పరిస్థితి, వారికి సానుకూలం అయ్యింది. మన ప్రభుత్వం, మనలను తల ఎత్తుకునేలా చెయ్యాలి కాని, ఇలా ఇతర రాష్ట్రాలు నవ్వేలా చేయ్యవద్దు అని కోరుకుందాం. ప్రభుత్వ పెద్దలు ఆంధ్రుల గురించి ఆలోచించాలి, ఆంధ్రులు అందరి ముందు తల ఎత్తుకునేలా చెయ్యాలి. తరువాత మనం మనం రాజకీయం చేసుకుందాం. ముందు మన రాష్ట్ర పరువు నిలబెట్టటం ముఖ్యం.

వైసీపీ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి తిరుగు లేదు అనే భావన ఉంటుంది. ఇది కొంచెం నిజం కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నవి చూస్తూనే అర్ధమవుతుంది. మూడు రాజధానులు అంటూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో, ఎవరూ సంతోషంగా లేరు. అమరావతి రైతులు అయితే, 12 రోజులుగా రోడ్డున పడి ఆందోళన చేస్తున్నారు. చివరకు ఎప్పుడూ లేనిది, ఉద్యమంలోకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు కూడా రోడ్డున పడ్డారు. ఇవన్నీ చూస్తుంటేనే, ఉద్యమం ఏ స్థాయిలో ఉందొ అర్ధమవుతుంది. అయితే అనూహ్యంగా, అక్కడ వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం, అడ్డ్రెస్ లేరు. తాడికొండ ఎమ్మెల్యే కాని, మంగళగిరి ఎమ్మేల్యే కాని, కనీసం వారికి మద్దతు పలకలేదు, లేదా జగన్ తో మాట్లాడుతాం అని కూడా చెప్పలేదు. చివరకు కృష్ణా, గుంటూరు జిల్లా ఎమ్మేల్యేలు సమావేశం అయ్యి, జగన్ నిర్ణయానికి జై కొట్టారు. వైసీపీలో పరిస్థితి ఇది. అయితే, అనూహ్యంగా ఒక్కరు మాత్రం, జగన్ నిర్ణయాన్ని అసలు లెక్క చెయ్యనట్టు కనిపిస్తారు.

raghu 28122019 2

ఆయనే ఎంపీ రఘురామ కృష్ణం రాజు. పార్లమెంట్ లో తెలుగుకు జై కొట్టి జగన్ ను ఇబ్బంది పెట్టటం, విజయసాయి లేకుండా ఎవరినీ ఢిల్లీలో కలవద్దు అని చెప్పినా, పదే పదే అందరినీ కలవటం, పైగా పార్టీకి సంబంధం లేకుండా, ఢిల్లీలో అందరికీ విందు ఇవ్వటం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. అదేమని అడిగితె, తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటూ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రఘు రామ కృష్ణం రాజు, మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తూ, దీని పై సిబిఐ కాని, ఇంకా ఏమైనా న్యాయ విచారణ చేస్తామని, నిన్న క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని, ప్రకటించిన సంగతి తెలిసిందే.

raghu 28122019 3

ఇన్సైడర్ ట్రేడింగ్ పై, సిబిఐ విచారణ అంటూ జగన్ చెప్పటం పై, రఘు రామ కృష్ణం రాజు, ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దానికి చట్ట పరంగా బలం లేదని తేల్చి చెప్పారు. అమరావతి రాజధానిగా వస్తుందని, శంకుస్థాపన చేసిన తరువాత, ఎవరికైనా తెలుస్తుంది, డబ్బు ఉన్న వాడు భూమి కొనుక్కుంటాడు, దాంట్లో తప్పు ఏమి ఉంది. ఇదేమీ న్యాయ పరంగా తప్పు కాదు, కాని నైతికంగా తప్పు అని చెప్పచ్చు. అయినా, ఇదేమి న్యాయం ముందు నిలవదు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేదానికి చట్టం అనేది లేదు. ఒకవేళ జగన్ ఏమైనా దీని పై చట్టం తెస్తే తప్పితే, దీని పై జరిగేది ఏమి ఉండదు అంటూ, తేల్చి చెప్పారు. అయితే అమరావతి పై ఒక బూచిగా వైసీపీ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ చెప్తుంటే, సొంత పార్టీ నేత మాత్రం, అసలు అది పస లేని వాదన, దానితో ఏది కాదు అని తేల్చి చెప్పారు.

ఉదయం నుంచి జగన్, విశాఖపట్నం పర్యటన పై, అందరి ఫోకస్ ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ప్రకటన చేసారని, జగన్ మోహన్ రెడ్డికి భారీగా స్వాగతం పలకాలని, మా ప్రాంతాన్ని రాజధానిగా చేసినందుకు, ఘన స్వాగతం పలకాలి అంటూ, విజయసాయి రెడ్డి ఏకంగా, కల్లెక్టరేట్ లనే రివ్యూ పెట్టి, హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 24 కిమీ మేర, మానవహారం ఉంటుందని, 40 వేల మంది జగన్ కు స్వాగతం పలుకుతారని, కనీవినీ ఎరుగని స్వాగతం పలుకుతారని విజయసాయి రెడ్డి చెప్పటంతో, ఈ రోజు జగన్ విశాఖపట్నం పర్యటన పై ఆసక్తి వచ్చింది. విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో పల్గునటానికి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నం వచ్చారు. విజయసాయి చెప్పినట్టు ఘనమైన ఏర్పాట్లు, 24 కిమీ మానవహారం కాకపోయినా, సెంటర్లలో బాగానే జన సమీకరణ చేసి, జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి, జగన్ మోహన్ రెడ్డి, విశాఖ ఉత్సవ్ కార్యక్రమం జరిగే ప్రదేశానికి హాజరు అయ్యారు.

jagan 28122019 2

ఆయన ఈ కార్యక్రమంలో పాల్గుని, విశాఖ ఉత్సవ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, జగన్ మోహన్ రెడ్డి అజెండా అంటూ ఒక షార్ట్ ఫిలిం ని ప్లే చేసారు. విశాఖలో ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రత్యేకతలు తెలిసేలా ఆ షార్ట్ ఫిలిం కొనసాగింది. విశాఖ కోసం జగన్‌ కట్టుబడి ఉన్నారంటూ, ఆ ఫిలిం లో చూపించారు. ఈ ఫిలింని, అక్కడకు వచ్చిన ప్రజలు, అతిధులు తిలకించారు. తరువాత లేజర్ షో ఒక పది నిమిషాలు జరిగింది. జగన్ తో పాటుగా, కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామి రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గున్నారు. లేజర్ షో అయిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడతారని, విశాఖపట్నంను పాలనా రాజధానిగా తాను అసెంబ్లీలో చేసిన ప్రతిపాదన పై చెప్తారని అందరూ అనుకుని, జగన్ సందేశం కోసం ఎదురు చూసారు.

jagan 28122019 3

అయితే వారందరికీ జగన్ షాక్ ఇచ్చారు. అనూహ్యంగా, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. లేజర్ షో అవ్వగానే, అందరికీ అభివాదం చేసి, వెనుదిరిగారు. ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే జగన్ వెనుదిరిగారు. ఆర్కె బీచ్ నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు జగన్. రేపు విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ బిశ్వ భూషణ్ హాజరుకానున్నారు. అయితే ఇంత భారీ హంగామా, ఇంత హడావిడి చేసి, కనీసం ఒక్క ముక్క కూడా జగన్ మాట్లాడకుండా వెళ్ళిపోవటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక వ్యూహం ఏమిటో ఎవరికీ అర్ధం కవాటం లేదు. కనీసం విజయసాయి రెడ్డి దగ్గర ఉండి, ఇంత హంగామా చేసినందుకు అయినా, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడి ఉండాల్సింది అని, అంటున్నారు. మొత్తానికి, ఇంత హడావిడి చేసి, జగన్ మాట్లాడకుండా వెళ్ళిపోయారు.

Advertisements

Latest Articles

Most Read