రెండు రోజుల క్రితం, రెండు మీడియా సంస్థలకు చెందిన వారు, తమని పైడ్ ఆర్టిస్ట్ లు అన్నారు అంటూ, ఆ మీడియా సంస్థల ప్రతినిధుల పై, రాజధాని రైతులు వారి పై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వారి పై ఎదురు తిరిగి, అక్కడ నుంచి వెనక్కు వెళ్ళే దాకా, తరిమారు. అయితే, జరిగిన ఈ సంఘటన పై , సదరు మీడియా ప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో, నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు, రైతుల ఇళ్ళల్లోకి వెళ్లి మారీ, వారిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంట్లో ఆడవాళ్ళు అడ్డు పడటంతో, ఏమి చెయ్యమని, ఎంక్వయిరీ అవ్వగానే, తీసుకు వస్తామని చెప్పారు. అయితే, వారిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకంటే పోలీసులు వారి డ్యూటీ వాళ్ళు చెయ్యాలి కాబట్టి. అయితే, ఈ రైతులు పై, హ-త్యా-యత్నం కేసు పెట్టటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. నెల రోజుల క్రితం, చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు, చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సు పై, రాళ్ళతో దా-డి చేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో బస్సు అద్దం కూడా పగుళ్ళు వచ్చింది. అయితే అప్పుడు డీజేపీ సవాంగ్, ఇది భావప్రకటనా స్వేఛ్చ అని చెప్పారని, ఇప్పుడు మాత్రం, తమ పై హ-త్యా-యత్నం కేసు పెట్టారని, రైతులు వాపోతున్నారు. తాము రైతులం అని, రౌ-డీలు, గుండా-లం కాదని వాపోయారు. అయితే, నిన్న ఎంత సేపటికీ అరెస్ట్ చేసిన వారిని న్యాయమూర్తి ముందు ప్రావేశ పెట్టక పోవటంతో, అన్ని పార్టీల నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసారు. దీంతో వారిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అయితే ఈ సందర్భంలో, న్యాయమూర్తి, పోలీసుల పై ఫైర్ అయ్యారు. రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టడం సరికాదని మంగళగిరి కోర్ట న్యాయమూర్తి ఆక్షేపించారు.
హ-త్యా-యత్నానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కేసును నాన్ బెయిలబుల్ నుంచి బెయిలబుల్ కేసుగా మార్చారు. దీంతో ఈ రోజు మధ్యానం రైతులకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. రైతులను అరెస్ట్ చెయ్యటం పై, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఫైర్ అయ్యారు. "రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలి. భూములు కోల్పోయి, రాజధానిపై ఆందో-ళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులా..? నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు హేయం. దొంగలు, గుం-డాల మాదిరిగా భూములిచ్చిన రైతులపై దాడు-లా..? జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా..? రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా...?" అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు.