అమరావతి పై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతికి ఎప్పుడు వెళ్ళినా తనకు ఎక్కడా రాజధాని కనిపించలేదని అన్నారు. అమరావతికి వెళ్తుంటే, ఏదో రాజస్థాన్ ఏడారికి వెళ్లినట్లు ఉంటుందని స్పీకర్ అన్నారు. ఇది అందరిలో ఉండే అభిప్రాయమే అని, కొంతమంది బయటకు చెప్పలేకపోతున్నారని, తాను మాత్రం తన అభిప్రాయాన్ని బయటకు చెప్పానన్నారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించే వాతవరణం ఉండాలని, అమరావతిలో అది తనకు కనిపించలేదన్నారు స్పీకర్. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. అయితే స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తీ, ఒక రాజధాని పై, ఒక ప్రాంతం పై, ఇలా వ్యాఖ్యలు చెయ్యటం పై ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఇంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఇలా ఒక ప్రాంతాన్ని కించ పరుస్తూ, అదే ప్రాంతంలో నాలుగు రోజులు నుంచి ఆందోళన చేస్తున్న రైతులు గురించి మాత్రం, ఏమి మాట్లాడక పోవటం గమహర్హం.
స్పీకర్ ఇలా మాట్లాడటం మొదటి సారి కాదు. వివిధ సందర్భాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. టిడిపి వాళ్ళను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అని ఒకసారి, అలాగే అగ్రిగోల్ద్ విషయం మాట్లాడుతూ, చంద్రబాబుని గుడ్డలు ఊడదీస్తాం అని, చంద్రబాబు అనుభవం మడిచి ఎక్కడో పెట్టుకోవాలని, అలాగే సోనియా గాంధీ విషయంలో, మాట్లాడుతూ, టిడిపి రాజకీయ XXXX చేసింది అంటూ, మాట్లాడారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, స్పీకర్ వైఖరి పై తప్పు బడుతూనే ఉంది. ఇప్పుడు స్పీకర్ అమరావతిలోకి వెళ్తుంటే, రాజస్థాన్ ఏడారికి వెళ్లినట్లు ఉంది అంటూ, అమరావతి ప్రాంతాన్ని కించ పరుస్తూ, స్పీకర్ చేసిన వ్యాఖ్యలు, అమరావతి కోసం ఆందోళన చేస్తున్న రైతులను రెచ్చగొట్టేలా ఉన్నాయి.
అమరావతి పై వైసీపీది మొదటి నుంచి ఇదే ధోరణి. అమరావతి శంకుస్థానకు రాను అని జగన్ చెప్పిన దగ్గర నుంచి, అమరావతిని కించ పరుస్తూనే ఉన్నారు. అమరావతిని భ్రమరావతి అంటూ సంబోధించటం, అలాగే అమరావతిని స్మశానం అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులే అనటం, ఇంకో మంత్రి అమరావతిలో పందులు, కుక్కలు తిరుగుతాయి అని చెప్పటం, ఇలా అమరావతి పై వైసీపీ వైఖరి ఎప్పుడు ఒకేలా ఉంది. ఇప్పుడు ఏకంగా అమరావతిలో అసెంబ్లీ తప్ప ఏమి ఉండవు అంటూ, జగన్ చేసిన ప్రకటనతో, ఇక అమరావతి గురించి మర్చి పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే భూములు ఇచ్చిన రైతులు మాత్రం, తమకు చెప్పిన విధంగా రాజధాని కట్టాలి అంటూ, ఆందోళన చేస్తున్నారు.