గత మూడు రోజుల నుంచి రాయలసీమ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, గురువారం, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రోజు, పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లె టొమాట మార్కెట్ వెళ్లి, అక్కడ పరిస్థితిని, రెట్లు పెరుగుదల పై క్షేత్ర స్థాయిలో పర్యటన చేయ్యదలిచారు. అయితే, ఈ పర్యటనకు, పవన్ కళ్యాణ్ కు అనుమతి నిరాకరించారు. పవన్ పర్యటనకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. అయితే, జనసేన పార్టీ మాత్రం, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతోనే, పవన్ అంటే భయపడి, ఆయనకు మార్కెట్ సందర్శించే అవకాసం ఇవ్వటం లేదని జనసేన ఆరోపిస్తుంది. మరో పక్క విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ కూడా, ఈ విషయం పై తీవ్రంగా స్పందించారు. మార్కెట్ కు వెళ్లి రైతులతో మాట్లాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రైతులను కలిసి, వారి కష్టాలు తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వకపోతే, చేతులు ముడుచుకుని కూర్చోమని, ఏమి చెయ్యాలో అదే చేస్తామని పవన్ అన్నారు.

pk 05122019 2

తాను మార్కెట్ కు వచ్చి తీరుతానని, ఎవరు తనని ఆపుతారో చూస్తానని, పవన్ అన్నారు. మార్కెట్ ముందే కూర్చుని రైతులతో మాట్లాడతానని, రైతుల కష్టాలు తెలుసుకుంటానని, ఆపుకుంటే ఆపుకోండి అంటూ పవన్ సవాల్ విసిరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావాలను పునికి పుచ్చుకున్నవాళ్లమని, ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను మార్కెట్‌కు వచ్చి తీరుతానని, పోలీసులు వస్తారో,ఏ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి అడ్డుకుంటాడో చూస్తానని సవాల్ విసిరారు. ఇందుకోసం జనసైనికులు అంతా సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే పవన్ పర్యటన ఏ టర్న్ తీసుకుంటుంది, ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీస్తుందో, అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు.

pk 05122019 3

రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తిరుపతి రైతు బజారు కు వెళ్లి, అక్కడ ఉల్లిపాయలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయన్ని, క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నారు. అయితే పవన్ పై మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వ్యక్తిగతంగా విమర్శలు చేసారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ప్రతి విమర్శలు చెయ్యటంతో, మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చేస్తున్న రాయలసీమ పర్యటన, ప్రతి నిమిషం ఉత్కంఠను రేపుతోంది. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, బీజేపీతో తాను కేవలం హోదా విషయంలోనే విభేదించానని, తాను ఎప్పుడు బీజేపీతో కలిసే ఉన్నాని చెప్పారు. అలాగే, రాష్ట్రంలో జరుగుతున్న భారీ మత మార్పిడులు, ఎవరి అనుమతితో జరుగుతున్నాయో అందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా తయారు అయ్యిందా ? ఒక పక్క ఆదాయం లేక, ఇష్టం వచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలతో, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుంది. ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన వార్త చూస్తే, మన రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ తెలుస్తుంది. ఆ ప్రముఖ పత్రిక కధనం ప్రకారం, రాష్ట్ర అప్పులు తారా స్థాయికి చేరుకున్నాయి. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలను వాదేసుకుంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు విలువ అక్షరాల రూ.33,617 కోట్లు. ఈ అప్పు అంతా, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందే. గతంలో చంద్రబాబు పై, అప్పులు చేస్తున్నారు అంటూ, ప్రతి రోజు ప్రచారం చేసి చేసి, ఇప్పుడు కేవలం ఆరు నెలల సమయంలోనే, 33 వేల కోట్లు అప్పు చేసి, అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా కూడా, ఏపి ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా మారిందని, కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి.

appu 04122019 2

అయితే ఇప్పుడు ఈ అప్పులు వార్త చూస్తే, రాష్ట్ర పరిస్థితి పై ఆందోళన కలగక మానదు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా, ప్రతి వారం, మార్కెట్ బారోయిరగ్స్‌ ద్వారా రుణాలకు, వేలం నిర్వహిస్తుంది. వివిధ రాష్ట్రాలు, ప్రభుత్వాల సెక్యూరిటీలను తనఖా పెట్టి, లోన్స్ ఇస్తూ వస్తుంది. అయితే గత నెల, అంటే నవంబర్ నెలలో, అయుదు సార్లు, ఇలా వేలం నిర్వహించగా, అయుదు సార్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, వేలంలో పాల్గుని, అయుదు సార్లు రుణాలు పొందింది. ప్రతి వేలంలోను ఒకేసారి రుణం తీసుకోకుండా, రెండేసి సార్లు రుణాలు తీసుకుని, సరి కొత్త రికార్డును, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు చెయ్యని విధంగా, అప్పుల్లో రికార్డు సృష్టించింది, అందర్పదేశ్ ప్రభుత్వం.

appu 04122019 3

నవంబర్ ఒకే తేదీణ, తొమ్మిదేళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు, 12 సంవత్సరాల కాల పరిమితితో వెయ్యి కోట్లు, నవంబర్‌ 7న 10, 12 సంవత్సరాల కాల పరిమితితో రెండు వేల కోట్లు, నవంబర్‌ 15న 11, 12 సంవత్సరాల కాలపరిమితితో రెండు వేల కోట్లు, నవంబర్‌ 22న అదే పరిమితితో మరో రెండు వేల కోట్లు రుణంగా తీసుకురది. ఇక నవరబర్‌ 29న పదేళ్ల కాలపరిమితితో 533 కోట్ల రూపాయలను రుణంగా తీసుకురది. మొత్తంగా పోయిన నెల నవంబర్‌లో, ఒక్క నెలలోనే రూ.8,513 కోట్ల అప్పు తీసుకుని, మొత్తం ఈ ఆరు నెలల్లో 33,617 కోట్ల అప్పుని రాష్ట్రం చేసింది. అయితే ఇక, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు ఉండగా, ఇకపై రాష్ట్రానికి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునే అవకాసం ఉంది. మరి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆదాయం ఎలా పెంచుతారో, ఏమిటో చూడాలి.

రేపు అనంతపురం జిల్లాలో, ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకోనుంది. చంద్రబాబు డ్రీం ప్రాజెక్ట్ ని, అలాగే ప్రతిపక్షంలో ఉన్నంత వరకు, వ్యతిరేకించిన ప్రాజెక్ట్ ని, రేపు జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు అనంతపురం జిల్లాలో, కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా, ఏర్పాట్ల పై, కలెక్టర్ తో పాటుగా, పోలీసులు కూడా సమీక్ష చేసారు. ఈ సమీక్షలో, కియా కంపెనీ లీగల్ హెడ్ జుడ్ కూడా పాల్గున్నారు. రేపు జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్లాంట్ టూర్, ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమాలు ఉంటాయని చెప్తున్నారు. రేపు జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం విమానాశ్రయం నుంచి, పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకొని, అక్కడ నుంచి కియా కంపెనీలో జరిగే కార్యక్రమనాకి, హాజరు అవుతారని, తగిన ఏర్పాట్లు, భద్రత చెయ్యాలని, కలెక్టర్, అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అయితే, ఇదంతా బాగానే ఉన్నా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కియా పర్యటన పై, అందరూ అవాక్కవుతున్నారు.

kia 04122019 2

గతంలో మూడు నెలల క్రిందట, కియా కంపెనీలో, మొదటి చారు లాంఛింగ్ కార్యక్రమానికి జగన్ హాజరు కావాల్సి ఉండగా, అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి, రావటం కుదరటం లేదు. అప్పట్లో, ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. అయితే ఇప్పుడు మళ్ళీ, రేపు కియా కంపెనీ లాంచింగ్ ఏంటి అంటూ, అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇప్పటికే కంపెనీ లాంచ్ అయ్యిందని, మొదటి కారు కూడా, వైసీపీ నేతల సారధ్యంలోనే లాంచ్ అయ్యిందని, ఇప్పటికే 15 వేల కార్లు దాకా బయటకు వెళ్లాయని, అలాగే కొన్ని చోట్ల అయితే, అప్పుడే ఈ కార్లు సెకండ్ హ్యాండ్ లో కూడా దొరుకుతున్నాయని, ఇలాంటి సమయంలో, జగన్ మోహన్ రెడ్డి, వచ్చి, లాంచింగ్ చెయ్యటం ఏంటో, అంటూ, అందరూ ఆశ్చర్యపోతున్నారు.

kia 04122019 3

కియా ప్లాంట్ కష్టం అంతా చంద్రబాబుది అని అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ లను కాదని, మన రాష్ట్రానికి కియా కంపెనీ రావటంలో, చంద్రబాబు కృషి ఎంతో ఉంది. అయితే, కియా కంపెనీ నుంచి, చంద్రబాబుని చరిపేసే దిశగా, వైసీపీ అడుగులు వేసింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే, ఈ క్రెడిట్ అంతా దివంగత వైఎస్ఆర్ ది అంటూ, ఆర్ధిక మంత్రి బుగ్గన ఒక ఉత్తరం చదివిన సంగతి తెలిసిందే. 2007లో వైఎస్ఆర్, అప్పటి కియా కంపెనీని పెట్టుబడులు పెట్టమని కోరారని, అందుకే మేము ఆంధ్రప్రదేశ్ లో పెట్టమంటూ, కియా కంపెనీ లేఖ రాసినట్టు అసెంబ్లీ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కియా నుంచి చంద్రబాబు గుర్తులు చెరిపేసే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉండగా, కియాను వ్యతిరేకించిన జగన్, రేపు ఆ కంపెనీ లాంచింగ్ కు వెళ్తున్నారు అంటే, ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏమో.

గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి, వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి, తన సమీప తెలుగుదేశం అభ్యర్ధి వల్లభనేని వంశీ పై, యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే, పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చింది. దీంతో తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై, వెంకట్రావ్ అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ, రెండు నెలల క్రిందట వంశీ మీడియాకు ఎక్కారు. గత ఎన్నికలకు ముందు ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో, ఎంఆరోవో సంతకం ఫోర్జరీ చేసారని, వంశీ ఎన్నిక రద్దు చెయ్యాలి అంటూ, కోర్ట్ లో కేసు వేసిన వెంకట్రావ్, పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే అప్పటి వరకు, తనని జగన్ ప్రభుత్వం వేధిస్తుంది అంటూ వచ్చిన వంశీ, తమ అధినేత చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ పంపించి, తమ అనుచరుల పై వేధింపులు తట్టుకోలేక పోతున్నాని, రాజకీయ సన్యాసం తీసుకుంటాని చెప్పారు. అయితే, అనూహ్యంగా, చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తున్న రోజు, ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు పై తిట్ల దండకం అందుకున్నారు.

yarlagadda 04122019 2

రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగటంతో, తెలుగుదేశం పార్టీ వంశీకి షోకాజ్ నోటీస్ ఇచ్చి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి వంశీ దూరం అయ్యి, జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడుస్తానాని చెప్పన సందర్భంలో, అప్పటి వరకు గన్నవరంలో వైసీపీ తరుపున బలంగా నిలబడ్డ వెంకట్రావ్ పరిస్థతి కన్ఫ్యూషన్ లో పడింది. వంశీ రాజీనామా చేస్తే, తనకు మళ్ళీ వైసీపీ టికెట్ వస్తుందా లేదా అనే ఆలోచనలో పడ్డారు. వంశీ రాకను, వెంకట్రావ్ అనుచరులు, పెద్ద ఎత్తున అడ్డుకుని, నిరసన తెలిపారు. అయితే, వెంకట్రావ్, జగన్ ని కలవటంతో, జగన్ ఇచ్చిన అభయం మేరకు, వెంకట్రావ్ ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు. వంశీ పార్టీలో చేరిన, రోజున చూద్దామని అన్నారు.

yarlagadda 04122019 3

అయితే, ఆ రోజు జగన్ తో జరిగిన రాజీలో భాగంగా, ఈ రోజు వెంకట్రావ్ కు, ఒక పదవి కట్టబెట్టారు జగన్. కృష్ణా జిల్లా డీసీసీబీ చైర్మన్ గా యార్లగడ్డ వెంకట్రావుని నియమించారు. అయితే, ఇంత చిన్న పదవి తీసుకోవటానికి, యార్లగడ్డ వెంకట్రావు ఒప్పుకున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ వెంకట్రావ్ ఒప్పుకుంటే, గన్నవరం వివాదం ముగిసిపోయినట్టే. ఒక వేళ ఒప్పుకోక పొతే మాత్రం, మళ్ళీ ఇబ్బందులు తప్పవు. ఈ పదవితో పాటుగా, ఎమ్మేల్సీ లాంటి పదవి కూడా ఏమైనా ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. మరో పక్క డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సందర్భంలో, వంశీ ఎటు వైపు కూర్చుంటారు ? అధికార పక్షం వైపా ? లేక తటస్థంగా ఉంటారా అనేది కూడా చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read