గత రెండు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. మహిళా ఎంపీడీవో ఇంటి పై దాడి చేసారనే ఆరోపణలతో, ఆయన పై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ విషయం పెద్దది అవుతూ ఉండటంతో, జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగి, కోటంరెడ్డి పై వస్తున్న ఆరోపణలు నిజం అయితే యాక్షన్ తీసుకోండి అంటూ పోలీసులును కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ రోజు ఉదయం పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేసారు. ఇంకేముంది, జగన్ మోహన్ రెడ్డి సూపర్ అంటూ ఆ పార్టీ కార్యకర్త నుంచి సామాన్యుడి దాకా అనుకున్నారు. అనుకున్నంత సేపు పట్టలేదు, కేసుని తుస్సు మానిపిస్తూ, బెయిల్ పై బయటకు వచ్చేశారు కోటంరెడ్డి. మహిళా ఎంపీడీవో కేసు ఫైల్ చెయ్యటానికి రెండు గంటలు పడితే, కోటంరెడ్డి బెయిల్ పై రావటానికి, గంట కూడా పట్టలేదు. ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి రాక ముందే, ఏదో మమ అనిపిస్తూ, ప్రభుత్వ ఉద్యోగి పై దాడి చేసినా, బెయిల్ వచ్చేలా చేసి, వదిలి పెట్టారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది.

kotamreddy 06102019 2

కోటంరెడ్డి అరెస్ట్ తరువాత, మీడియాతో మాట్లాడిన మాటలు, ఒక మహిళా ఎంపీడీవో పై దాడి దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య వివాదంగా మార్చేసారు. అంటే జరిగిన ఇష్యూని డైవర్ట్ చేస్తూ, కొత్త చర్చను ప్రజల ముందు పెట్టారు. ఆరెస్ట్ తరువాత కోటంరెడ్డి మాట్లాడుతూ, తనపై నమోదైన కేసును రాజకీయకుట్రగా చెప్తూ, ఈ కేసు వెనుక వైసీపీ మండల అధ్యక్షుడు ఉన్నాడని, ఆ మండల అధ్యక్షుల వెనుక ఉన్న వైసీపీ పెద్ద తలకాయ ఎవరో జగన్ గారు విచారణ చేయాలని కోటంరెడ్డి కోరారు. తన ఇంటి పై దాడి చేసారని చెప్తున్న సరళ, ఆ రోజు, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఎస్పీకి కూడా ఇందులో పాత్ర ఉందని, ఆయనకు తన పై వ్యక్తిగత కక్ష ఉందంటు కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

kotamreddy 06102019 3

తమ బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఒక లే ఔట్ వేశారని, దానికి అన్ని అనుమతులు ఉన్నాయని, లేఔట్‌కు నల్లా కనెక్షన్ ఇవ్వాలని రెండు నెలలుగా అడుగుతున్నామని చెప్పారు. ఇదే విషయమై ఎంపీడీవోను అడిగితే ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నారని చెప్పారని, ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేస్తే, ‘‘నీకు తెలీదు శ్రీధరా..ఇప్పుడు కుదరదు" అన్నారని అని చెప్పుకొచ్చారు. అంతటితో తాను సైలెంట్ అయిపోయానని, ఇప్పుడు ఉన్నట్టు ఉండి కేసు పెట్టారని, ఆమె ఇంటి పై నేను దాడి చేసినట్టు తెలిస్తే, తనను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని జగన్ ను కోరతానని అన్నారు. అయతే ఈ కొత్త ట్విస్ట్ పై తెలుగుదేశం పార్టీ స్పందిస్తూ, ఇదంతా ఒక కొత్త డ్రామా అని, జరిగిన విషయం ఒక మహిళా ఎంపీడీవో ఇంటి పై దాడి అయితే, ఒక పార్టీలో ఉండే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల గొడవగా చిత్రీకరిస్తూ, విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిన్నంతా ఈ విషయం పై చెప్పని కోటంరెడ్డి, పై నుంచి వచ్చిన ఆదేశాలు ప్రకారం, కొత్త స్క్రిప్ట్ చదివారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.

కేంద్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వనికి బయటకు సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం, కేంద్రం నుంచి ఏ చిన్న సహకారం కూడా రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులతో, కేంద్రం ఎన్ని అభ్యంతరాలు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టు చెయ్యటమే కారణంగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. చివరకు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్ల డిప్యుటేషన్ కు కూడా కేంద్రం ఒప్పుకోలేదు. ఇక పోలవరంతో పాటు, విద్యుత్ పీపీఏల విషయంలో అయితే సరే సరి. విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఒక చిన్న సైజు యుద్ధమే నడుస్తుంది. కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వానికి, ఎన్నో లేఖలు వచ్చాయి. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్లి, ఇప్పుడు కరెంటు కూతలకు కారణం అయ్యింది. ఈ నేపధ్యంలో, కేంద్రం నుంచి జగన్ కు మరో ఘాటు లేఖ వచ్చింది.

rksingh 05102019 2

ఈ ఆర్ధిక సంవత్సరం, డిస్కంల నష్టాలు భారీగా పెరిగిపోయాయని, ఇలాగే కొనసాగితే చాలా కష్టం అంటూ, జగన్ కు, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాసారు. ఒక పక్క జగన్ ప్రభుత్వం, చంద్రబాబు వల్లే నష్టాలు అని చెప్తుంటే, గడిచిన ఆరు నెలల్లో, నష్టాలు అధికంగా పెరిగిపోయాయని కేంద్ర మంత్రి లేఖ రాయటంతో, వైసీపీ డిఫెన్సు లో పడింది అనే చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలో, ఇప్పటి చీఫ్ సెక్రటరీ పాలనలో రాష్ట్రం ఉంది, గడిచిన నాలుగు నెలలు, జగన్ ఉన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కంల వార్షిక నష్టాలు రూ. 1, 563 కోట్లకు వెళ్లాయని, ఇది 2018తో పోలిస్తే ఎక్కువుగా ఉందని, కేంద్ర మంత్రి లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వశాఖలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు రూ. 5, 542 కోట్ల రూపాయలకు చేరాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.

rksingh 05102019 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో భాగస్వామిగా ఉందని, డిస్కంల పనితీరును సమీక్ష చేసినప్పుడు, అవి రోజు రోజుకూ దిగజారుతున్నట్టుగా తేలిందని, కేంద్ర మంత్రి లేఖలో తెలిపారు. ప్రస్తుతం దిస్కంల నిర్వహణతో పాటుగా, ఆర్థికపరంగా కూడా వీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. డిస్కంల పరిస్థితి ఇలానే కొనసాగితే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్కే సింగ్ లేఖలో హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని వాటిని చక్కదిద్దాలని, ఆర్కే సింగ్ కోరారు. ఇప్పటికే విద్యుత్ విషయంలో, కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధం జరుగుతున్న వేళ, ఇప్పుడు దిస్కంల బాకీల పై, కేంద్రం మంత్రి హెచ్చరిక, రేపు ఎటు దారి తీస్తుందో చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి, ప్రధాని మోడీని కలిసే వేళ, కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంటూ, జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, మరిన్ని నిధుల విడుదల కోసం వెళ్తుంటే, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను కూడా ఆపేసి, తన మార్క్ చూపించింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయమై అనేక పరిణామాలు జరుగుతున్నాయి. చంద్రబాబు గత మూడు సంవత్సరాల్లో, పోలవరం పనులు 73 శాతానికి తీసుకు వెళ్తే, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఒక్క ఇంచ్ కూడా పనులు ముందుకు వెళ్ళలేదు. గడిచిన నాలుగు నేలల్లో పని చెయ్యకపోగా, టెండర్లను రద్దు చేసి, పనులు పరిగెత్తించిన నవయుగని పంపించేసి, రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ నుంచి, ఏపి ప్రభుత్వం ఖర్చు పెట్టిన 6 వేల కోట్లు, కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఈ నిధులలో సగం అయినా, కేంద్రం ఇస్తుందని అందరూ భావించారు.

jagan 05102019 2

అధికారులు కూడా ఇదే అనుకున్నారు. దీనికి తగ్గట్టే కేంద్ర అధికారుల నుంచి, 3 వేల కోట్ల దాకా విడుదల చేస్తున్నట్టు సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు 3 వేల కోట్లు రావటం తధ్యం అని అందరూ అనుకున్నారు. అయితే, ఈ 3 వేల కోట్లను నిలుపుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కేంద్రం నుంచి దాదాపు ఆరు వేల కోట్ల వరకు పాత బకాయిలు కేంద్రం నుంచి రావాల్సి ఉరది. ఈ నిధుల్లో దాదాపు మూడు వేల కోట్లను రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైందని, ఆ ఫైలును కూడా జలశక్తి శాఖ నుండి కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఆమోదానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆ నిధులు వస్తాయని, రాష్ట్రానికి ఎంతో కొంత ఊరట లభిస్తుందని రాష్ట్ర అధికారులు అనుకున్నారు.

jagan 05102019 3

ఒకటి, రెండు రోజల్లో ఈ 3 వేల కోట్లు, విడుదల అవుతాయని అందరూ అనుకుంటూ ఉండగా, ఆ ఫైలును ఆపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. అయితే సరిగ్గా, జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న వేళ, ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం. దీంతో ఈ విషయం జగన్ దృష్టికి వెళ్ళటంతో, ఈ విషయం ఈ రోజు ప్రధానితో మాట్లాడటంతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే దాదపుగా రెడీ అయిపోయిన నిధులు, జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైన తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం అధికారయంత్రాం గాన్ని విస్మయపరిచింది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్రం గుర్రుగా ఉండటం, తాము చెప్తున్నా వినకుండా, జగన్ దూకుడుగా వెళ్ళటంతో, కేంద్రం ఈ విధంగా తమ అసహనాన్ని తెలియ చేసిందా అనే అభిప్రాయం కలుగుతుంది.

జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే, తనకు కావాల్సిన వారందరికీ పోస్టింగ్ లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇక సాక్షి ఆఫీస్ లో పని చేసిన వారిని, చాలా మందిని తీసుకొచ్చి సెక్రటేరియట్ లో పెట్టటంతో, అది సిఎంఓనా, సాక్షి ఆఫీసా అనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఒక నియామకం ఆంధ్రప్రదేశ్ కంటే, ఢిల్లీలో ఎక్కువ చర్చనీయంసం అయ్యింది. అసలు సంబంధం లేని వ్యక్తికి, కీలక పదవి ఇవ్వటంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక పెద్ద కధే ఉందని చెప్తున్నారు. దీని వెనుక మొత్తం, విజయసాయి రెడ్డి స్కెచ్ ఉందని, ఆయన వేసిన ప్లాన్ ని, జగన్ అనుసరించారానే వాదన వినిపిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ పోస్టింగ్ వెనుక, ఏ ఉద్దేశాలు ఉన్నాయి ? వ్యక్తిగతంగా ఏమైనా లబ్ది ఉందా ? లేక కేవలం రాష్ట్రం కోసమే ఇలా చేసారా అనేదికి కూడా తెలియాల్సి ఉంది.

vediri 05102019 2

ఇక విషయానికి వస్తే, ఢిల్లీలో ఉండే ఒక ప్రైవేటు వ్యక్తికీ, ముఖ్య కార్యదర్శి హోదాలో, సలహాదారు పదవి ఇవ్వటం చూసి అందరూ ఆశ్చర్య పోయారు. డాక్టర్ చేకుపల్లి శిల్పకు ఆరోగ్య సలహాదారు పేరుతో పదవిని ఖరారు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. నామినేటెడ్ పదవిలో ఐఏయస్ అధికారి నిర్వహించే హోదాతో సమానంగా ఈ నియమాకం జరిగింది. అది కూడా ముఖ్య కారదర్సి హోదా, ఇవ్వటం ఎప్పుడూ లేదని అంటున్నారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఈమెను ఇక్కడ పదవి ఇవ్వటం వెనుక పెద్ద మర్మమే ఉందనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం పదవి కట్టబెట్టిన ఈ డాక్టర్ చేకుపల్లి శిల్ప అనే వ్యక్తి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారుగా ఉన్న బీజేపీ నేత వెదిరె శ్రీరామ్‌రెడ్డి సతీమణి.

vediri 05102019 3

అయితే ఎంతో కీలకమైన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారుగా ఉన్న, వెదిరె శ్రీరామ్‌రెడ్డిని ప్రసన్నం చేసుకోవటానికి, ఈ నియామకం జరిపారనే టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్ట్ ల విషయంలో కేంద్ర సహకారం అవసరం. అందులోనూ రేపటి నుంచి తెలంగాణాతో కలిసి, నదుల అనుసంధానం మొదలు పెట్టబోతున్నారు. వెదిరె శ్రీరామ్‌ నదుల అనుసంధానం, నదుల నిర్వహణ, గంగా పరిశుద్ధత, నీటి పారుదల ప్రాజెక్టులు తదితర అంశాలపై, కేంద్రానికి సలహాదారుడిగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ఈ నియామకం జరిగింది అని చెప్తున్నా, దీని వెనుక మరేదైనా కారణం ఉందా నే చర్చ కూడా జరుగుతంది. గతంలో కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల విషయంలో కూడా శ్రీరామ్‌ తెలంగాణ ప్రభుత్వానికి తగిన తోడ్పాటునందించారని ప్రచారం లో ఉంది. అయితే శ్రీరామ్‌ తో పాటు, ఆయన తండ్రి వెంకట రెడ్డి, గతంలో పోలవరం ఆపటం కోసం, పులిచింతల ప్రాజెక్ట్ ఆపటం కోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈయనకు పదవి ఇవ్వమని బీజేపీ కోరగా, చంద్రబాబు తిరస్కరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన డాక్టర్ కు, ఆంధ్రాలో పదవి ఇవ్వటం, ఇప్పుడు వివాదాస్పద నిర్ణయంగా మారింది.

Advertisements

Latest Articles

Most Read