పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ, ఇప్పటికీ పనులు మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం, ఎప్పటికి మొదలు పెడుతుందో చెప్పలేని పరిస్థితికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు తాజగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, జగన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును, పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుని, అందరికీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావు చాలా సీనియర్ అధికారి, వైఎస్ఆర్ హయంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక బాధ్యతలు ఆయనే చూసుకునే వారు. ఆయన్ను తప్పించటం పై, అందరూ ఆశ్చర్యపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గా ఉన్న వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

polavaram 28082019 2

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా వెంకటేశ్వరరావు ఉన్నారు. వెంకటేశ్వరరావును పోలవరం ప్రాజెక్టు బాధ్యతల నుంచి మాత్రమే కాకుండా, ఆయన్ను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కూడా తొలగించటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా జలవణరుల శాఖా అధికారులు, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ప్రస్తుతం, అటు కేంద్రానికి, రాష్ట్రానికి ఈ విషయంలో వార్ నడుస్తుంది. మరో పక్క, కోర్ట్ లో కూడా ఈ విషయం ఉంది. న్యాయ పరమైన విషయాలు ఎప్పటికి తెలుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ నేపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ లో మొదటి నుంచి, ఉన్న ఇలాంటి సీనియర్ అధికారులను తప్పించటం పై అందరూ షాక్ అయ్యారు.

polavaram 28082019 3

వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్ హయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు చూస్తున్నారు. తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా అయన సేవలను పోలవరం ప్రాజెక్ట్ లో ఉపయోగించుకున్నారు. కేంద్రం నుంచి వివిధ పర్మిషన్ లు తీసుకు రావటంలో, నిధులు తీసుకురావటంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ఈయన సేవలు, పోలవరం ప్రాజెక్ట్ కు అవసరం లేదని భావించి, ఆయన్ను, రాష్ట్ర నీటి పారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా మాత్రమే కొనసాగిస్తున్నారు. మరోప్ అక్క వెంకటేశ్వర రావు స్థానంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా సీఈ సుధాకర్‌బాబును ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన్ను ఎందుకు తప్పించారు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, వైసీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వరదలు సాకుగా చూపి, అక్కడ నుంచి రాజధాని తరలించే ఆలోచనలో ఉంది. అయితే ఈ విషయం పై, ప్రతిపక్షాలకు, అధికార పక్షానికి మధ్య మాటల దాడి జరుగుతున్న సందర్భంలో, మంత్రి బొత్సా సత్యన్నారాయణ, తెలుగుదేశం నేత, సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ వియ్యంకుడి పై ఆరోపణలు చేసారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏమన్నా కొత్త విషయాలు బయట పెడతారు అనుకుంటే, అప్పట్లో సాక్షి పేపర్ లో వచ్చిన కధనాలే, ఇప్పుడు మళ్ళీ బొత్సా చెప్పుకొచ్చారు. చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి, జగ్గయ్యపేట మండలం జయంతీపురం గ్రామంలో, ఎకరా లక్ష చొప్పున, 493 ఎకరాలు ప్రభుత్వం అప్పనంగా ఇచ్చి, దాన్ని రాజధాని ప్రాంతంలో కలిపారని ఆరోపణ చేసారు.

bharat 28082019 2

అయితే, బొత్సా చేసిన ఆరోపణల పై, బాలయ్య వియ్యంకుడి కుటుంబం తరుపున, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్‌ స్పందిస్తూ, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. బొత్సా ఆరోపణలకు సంబంధించి, పూర్తీ ఆధారాలతో సహా, మీడియా ముందుకు వచ్చి, దాదపుగా 25 డాక్యుమెంట్లు మీడియా ముందు పెట్టి, బొత్సా వ్యాఖ్యలను ఖండించారు. అసలు ఈ భూమి మాకు ఇచ్చింది వైఎస్ఆర్ హయంలోనే అంటూ బాంబు పేల్చారు భరత్. దానికి సంబధించి ఆధారాలు ఇచ్చారు. అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఉందని, దీని పై బొత్సా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్ పవర్ ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు.

bharat 28082019 3

తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయంలో, దీని పై జీవో వచ్చిందని, అప్పట్లో కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో బొత్స మంత్రిగా ఉండగానే భూములు కేటాయించారని స్పష్టంచేశారు. అయితే ఈ భూమి పై, న్యాయపరమైన వివాదం రావటంతో, ఇప్పటికీ ఈ భూమి మా కంపెనీకి అప్పచెప్పలేదని అన్నారు. ఎప్పుడో రాష్ట్ర విభజనకు ముందు ఇవన్నీ జరిగాయని, బాలకృష్ణ గారి కుటుంబంతో సంబంధాలు పెట్టుకోక ముందే, తన పెళ్లికి ఆరేళ్ల ముందే తాము ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించామన్నారు. ఈ వ్యవహారంలో అసలు ఎక్కడా తెలుగుదేశం పాత్ర లేదని భరత్ చెప్పారు. అమరావతిని తప్పుదోవ పట్టించి, చంద్రబాబు పై బురద చల్లి, ఎదో ఒక విధంగా ప్రజలను మభ్యపెట్టె ఆలోచన చేస్తున్నారని భరత్ అన్నారు. ఒక మంత్రి హోదాలో ఆరోపణలు చేసేప్పుడు, ఆధారాలతో ఆరోపణలు చెయ్యాలని అన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, 2007 నుంచి ఇప్పటి వరకు ఉన్న వివిధ డాక్యుమెంట్లు భరత్ బయట పెట్టారు.

కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పై, రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ లో భాగంగా, సుజనా చౌదరి, సెంట్ భూమి కూడా అమరావతిలో లేదని చెబుతున్నారని, కాని ఆయనకు చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయని, అలాగే సుజనా సోదరుడి కుమార్తె రుషికన్యకి వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయని బొత్సా చెప్పారు. సుజనాచౌదరికి ఉన్న 120 కంపెనీల్లో ఒకటైన గ్రీన్‌టెక్‌ కంపెనీ పేరుతొ, అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసారని ఆరోపించారు. అయితే బొత్సా వ్యాఖ్యల పై అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు సుజనా చౌదరి. బొత్సా ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే, వివిధ ఛానెల్స్ లో మాట్లాడిన సుజనా, బొత్సా వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

sujana 27082019 2

బొత్సా ఎందుకు ఇంత లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదని అన్నారు. సీనియర్ అయిన బొత్సా తలతిక్క మాటలు మాట్లాడుతూ, ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని బొత్సా అన్నారు. వాళ్ళ ప్రభుత్వ లోపాలు , కప్పిపుచ్చుకునే పాట్లు లాగా ఇవి కనిపిస్తున్నాయని సుజనా అన్నారు. నాకు 120 కంపెనీలు ఉన్నాయని బొత్స అన్నారని, కాని ఆయన చెప్పిన కంపెనీ పేరు మాత్రం నాకు ఉన్న కంపెనీల్లో లేదని అన్నారు. అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి, కృష్ణా జిల్లాలో లెక్కలు చెప్తున్నారని అన్నారు. బొత్సకు సీడ్‌ కేపిటల్‌ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదని సుజనా కౌంటర్ ఇచ్చారు. వీరులపాడు మండలం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అక్కడ మాకు ఎప్పటి నుంచి భూములున్నాయో తెలుసుకోవాలని అన్నారు.

sujana 27082019 3

ఆ భూములు ఎప్పుడూ కొన్నమో, ఆ రికార్డులు ఏంటో చూసుకుని మాట్లాడితే బాగుండేది అని అన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఉంటే, కృష్ణా జిల్లా పరిధిలో నాకు ఉన్న భూములు పై ఆరోపణలు చేసి, ఏదో జరిగి పోయింది అంటూ, తల తోక లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజధాని అంటే 29 గ్రామాలు అని, ఇక్కడ అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారనే విషయం బొత్సా గ్రహించాలని సుజనా అన్నారు. ఒక పక్క రాజధాని పై రోజుకి ఒక గందరగోళ ప్రకటన ఇస్తూ, అక్కడ రైతులకు క్లారిటీ ఇవ్వకుండా, ఆ విషయం డైవర్ట్ చెయ్యటానికి నా పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇన్ని విషయాలు చెప్పారు కదా, నిజంగానే దీంట్లో తేడా ఉంటే, నా పైన కేసు పెట్టుకుని, విచారించుకోండి అంటూ బొత్సాకు ఛాలెంజ్ విసిరారు.

జగన్ ప్రభుత్వం, రాజధాని అమరావతిని తరలిస్తుంది అనే, ఏకంగా మంత్రులే ప్రకటన చెయ్యటం, ఇంత గొడవ జరుగుతున్నా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడక పొవటంతో, రాజధాని రైతులు ఆందోళన బాట పాట్టారు. రెండు రోజుల నుంచి, అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. నిన్న ఏకంగా జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ నే అడ్డుకునే ప్రయత్నం చేసారు. రాజధాని రైతులకు బీజేపీ, టిడిపి, జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు అండగా నిలిచాయి. రైతులు కూడా, అటు కన్నా, ఇటు పవన్, అలాగే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని కలిసి, వారితో పోరాటానికి కలిసిరావాలని వివిధ పార్టీలను కోరారు. దీనికి అనుగుణంగా, నిన్న బీజేపీ నేతలు, రాజధాని ప్రాంతంలో పర్యటించి, రైతుల ఆందోళనకు మద్దతు పలికారు. మరో పక్క, నిన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య, కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చారు.

venkaiah 28082019 2

స్వర్ణ భారతీ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గున్నారు. అలాగే ఉప రాష్ట్రపతి అయ్యి రెండేళ్ళు అయిన సందర్భంలో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, అమరావతి రైతులు, వెంకయ్యను కలిసి, తమ బాధలు చెప్పుకున్నారు. తమకు సొంత కుటుంబ సభులతో సమానమైన భూమిని, ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో, రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని, రాష్ట్రాభివృద్ధి కోసం, భూములు ఇచ్చామని అన్నారు. అటు రాష్ట్రం బాగుపడుతుంది, ఇటు మా జీవితాలు కూడా బాగుపదతాయని అనుకున్నామని వారు అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రాజధాని అమరావతి మారిపోతుందని, ప్రభుత్వంలోనే మంత్రులే ప్రతి రోజు చెప్తున్నారని, దీనికి తగ్గట్టుగా అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని రైతులు వెంకయ్య దృష్టికి తీసుకొచ్చారు.

venkaiah 28082019 3

తమకు న్యాయం చెయ్యాలని, అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, అమరావతి మార్చకుండా సూచనలు ఇవ్వాలని వారు ఉప రాష్ట్రపతి వెంకయ్యను కోరారు. దీని పై స్పందించిన వెంకయ్య నాయుడు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున, అమరావతి మార్పు పై ఎటువంటి అధికారిక ప్రకటన విడుఅల కాలేదు కదా, మీరు ఆందోళన చెందకండి అని అన్నారు. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను అని, రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నని, రాజకీయాలు మాట్లాడకూడదు అని, కాని, రాజ్యాంగబద్ధంగానే ఈ విషయం పై తన నిర్ణయం ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అని రైతులకు ధైర్యం చెప్పారు. మీ తరుపున ఏమి చెయ్యగలనో, ఎంత చెయ్యగలనో, అక్కడి వరకు వెళ్లి అన్నీ చేస్తానని వెంకయ్య అన్నారు.

Advertisements

Latest Articles

Most Read