జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఈ రోజు కేంద్ర హోం మంత్రి అధ్యకతన జరిగే సమావేశంలో హాజరయ్యేందుకు జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. జగన్ తో, పాటుగా అధికారుల బృందం కూడా ఢిల్లీ వెళ్ళింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యకతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ రోజు జరిగింది. ఇందులో, మన రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలతో పాటు, ఏవోబీలో నక్సల్స్ ఉనికి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాల పై చర్చించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో, రాష్ట్రానికి కావాల్సిన సహాయం గురించి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోం మంత్రికి ఒక నివేదిక ఇచ్చారు. ఈ సమావేశం తరువాత, జగన్ మోహన్ రెడ్డి, వివిధ కేంద్ర మంత్రులను కలిసారు.

delhi 26082019 2

ముందుగా జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో, విడిగా భేటీ అయ్యారు. దాదపుగా 40 నిమషాల పాటు అమిత్ షా తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్తితుతల పై, జగన్ మోహన్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా పోలవరం రీటెండరింగ్ విషయం పై చర్చించారు. ఏ సందర్భంలో వెళ్ళింది వివరించారు. అలాగే హైకోర్ట్ అక్షింతల పై కూడా అమిత్ షా కు జగన్ వివరించారు. అలాగే, విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై, అన్ని ఒప్పందాలు కాకుండా, కొన్ని ఒప్పందాలు మాత్రమే చూస్తున్నామని అన్నారు. ఇక విజయసాయి రెడ్డి, అన్ని విషయాలు మోడీ, అమిత్ షా లకు చెప్పే చేస్తున్నామని, వారి ఆశీర్వాదంతోనే అన్ని పనులు చేస్తున్నాం అన్ని చేసిన వ్యాఖ్యల పై, బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉందని గ్రహించిన జగన్, ఆ విషయం పై కూడా అమిత్ షా కు వివరణ ఇచ్చారు.

delhi 26082019 3

ఏ సందర్భంలో, విజయసాయి రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసింది వివరించారు. ఇక అమిత్ షా తో భేటీ తరువాత, కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి ఇచ్చిన జర్క్ తో, జగన్ అవాక్కయ్యారు. గజేంద్ర సింగ్ షెకావత్‌తో పోలవరం విషయం, రీటెండరింగ్ విషయం, కోర్ట్ విషయాలు అన్నీ చర్చించి, భేటీ పూర్తయి జగన్ బయటకు వస్తున్న సమయంలో, జగన్ కు కేంద్ర మంత్రి జర్క్ ఇచ్చారు. ఇప్పుడు హోం మంత్రి, జల శక్తి మంత్రిని, కలిసిన జగన్, రేపు ఆంధ్రప్రదేశ్ వెళ్లి, మాకు వాళ్ళ ఆశీర్వాదం ఉందని చెప్తారు అంటూ, జగన్‌ పై ఛలోక్తులు విసిరారు. దీంతో జగన్ అవాక్కయ్యారు. ఆయన ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వి వచ్చేశారు. అయితే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, కేంద్రం ఎంత ఆగ్రహానికి గురైంది అని చెప్పేదానికి, ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు, కేంద్ర మంత్రి చేసిన ఈ కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ మూడు నెలల కాలంలో, రివెర్స్ టెండరింగ్, ఆపివేతలు, కూల్చివేతలు, ఎంక్వయిరీలు, ఇలా సాగుతుంది పాలన. జగన్ చెప్పిన నవరత్నాలు, ఇంకా మొదలు కాలేదు. వాలంటీర్లు వ్యవస్థ రాగానే, పల్లెలు మారిపోతాయి అన్నారు కాని, వీళ్ళు కూడా పెద్దగా మార్పు ఏమి చూపించలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఒక మార్క్ పాలన అయితే చూపించే కుతూహలం ఉంటుంది. అలాంటి మార్క్ ఏమి ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపించలేదనే చెప్పాలి. పాలన అంతా రొటీన్ గా సాగుతుంది. విజయవాడ ధర్నా చౌక్ ప్రతి రోజు బిజీగానే ఉంటుంది. ఈ క్రమంలో, జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గం పై ఒక యనాలసిస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన మంత్రి వర్గంలో మంత్రులకు, పదవీ కాలం కేవలం రెండున్నర ఏళ్ళే అని ఇది వరకే చెప్పారు.

jagan 26082019 2

90 శాతం మంది మంత్రులను మార్చేసి,కొత్త వారికి అవకాసం ఇస్తానని జగన్ చెప్పారు. ఈ క్రమంలో, జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గంలో ఉన్న మంత్రుల పని తీరు పై, సన్నిహితులతో చర్చించారు. ఎవరు సమర్ధవంతంగా పని చేస్తున్నారు ? ఎవరు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబు ఇస్తున్నారు ? ఎవరు ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతూ అపోహలు తొలగిస్తున్నారు, వంటి వాటిని బేరీజు వేసుకుని, జగన్ మోహన్ రెడ్డి టాప్ 5 మంత్రులను గుర్తించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అయుదుగురు మంత్రులు ఇలాగే పని చేస్తే, వీరికి పూర్తీ కాలం, అంటే 5 ఏళ్ళ పాటు మంత్రులుగా కొనసాగిస్తారని చెప్పినట్టు సమాచారం. 25మంది మంత్రులలో, ఈ ఐదుగురు పని తీరు, జగన్ కు బాగా నచ్చిందని చెప్తున్నారు.

jagan 26082019 3

ముందుగా, మోపిదేవీ వెంకటరమణ పేరు వినపడుతుంది. మోపిదేవి వెంకట రమణ రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్. జగన్ కేసుల్లో ఈయన కూడా జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపధ్యంలోనే మోపిదేవీ వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మోపిదేవీ వెంకటరమణ బాగా పని చేస్తున్నారని జగన్ నమ్ముతున్నారు. ఇక తరువాత, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మూడో స్థానంలో, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి, నాలుగో స్థానంలో ఉత్త‌రాంధ్ర‌లో కీల‌క నేత‌ బొత్సా సత్యనారాయణ, అయిదవ స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఉన్నారని తెలుస్తుంది. ఈ అయిదుగురి పై, జగన్ ఎంతో నమ్మకంతో ఉన్నారని, వీరికి ఫుల్ టైం మంత్రి పదవి లభిస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్, అమరావతి మార్పు వార్తలు. వారం రోజుల క్రితం బొత్సా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అమరావతి పై ప్రకటనలు చెయ్యటం పై, రాజధాని అమరావతి రైతులు రోడ్డెక్కారు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఒక పక్క కౌలు డబ్బులు ఇవ్వటం లేదని, ఇప్పుడు ఏకంగా రాజధానినే మార్చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. రాజధాని తరలించాలి అంటే, మా శవాల పై తీసుకువెళ్ళండి అంటూ, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేసారు. అమరావతికి వరద ముంపు అంటూ కొత్త రాగం అందుకున్నారని, మేము ఇక్కడ తరతరాలుగా ఉండటం లేదా, అప్పుడు లేని వరద, ఇప్పుడు వస్తుందా అంటూ జగన్ ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీకి చెందిన సానుభూతి పరులు కూడా ఈ ధర్నాలో పాల్గున్నారు.

botsa 26082019 2

అయితే రాజధాని రైతుల ఆందోళన పై, బొత్సా ఈ రోజు స్పందించారు. వాళ్ళు ఆందోళన చేసేది కౌలు డబ్బులు కోసం అని, అమరావతి రాజధాని గురించి కాదని, అన్నారు. ఒక రకంగా, రైతులను హేళన చేసారు. ఇదే సమయంలో అమరావతి పై మళ్ళీ అవే వ్యాఖ్యలు చేసారు. అమరావతికి ముంపు ఉందని, ముంగిపోతుందని బొత్సా అన్నారు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన చేసిన వ్యాఖ్యల పై కూడా బొత్సా స్పందించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అమరావతిలో అతి పెద్ద భూకుంబకోణం జరిగిందని, ఇన్‌సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని బొత్సా అన్నారు. ఆ చిట్టా సరైన సమయంలో బయట పెడతామాని అన్నారు.

botsa 26082019 3

ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ పై, ఇటు బీజేపీ పై కూడా బొత్సా మండి పడ్డారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఛాలెంజ్ విసిరారు. రేపు సుజనా చౌదరి, బీజేపీ పార్టీ తరుపున, రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించే సమయంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బొత్స మాట్లాడుతూ, నిన్న ఒక కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ, ఆయనకు ఇక్కడ ఒక్క సెంట్ కూడా భూమి లేదని అన్నారు, ఆయనకు ఇదే మా ఛాలెంజ్. మీకు ఇక్కడ భూమి ఉందొ లేదో, మీరు దమ్ముంటే మమ్మల్ని చూపమని అడగండి, మేము చూపిస్తాం. ల్యాండ్ రికార్డ్స్ కూడా చూపిస్తాం, రెడీనా అంటూ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ చేసారు. మరి రేపు, అమరావతిలో పర్యటించే, సుజనా చౌదరి, ఈ ఛాలెంజ్ పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

జగన్ మోహన్ రెడ్డి సచివాలయంలో అడుగు పెడుతూ, పెట్టిన మొదటి సంతకం, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.10వేలు చేస్తున్నామని. అయితే ఇలా పెంచి, దీని పై ఎన్నో ఆంక్షలు పెట్టారు. గ్రేడింగ్ విధానం అంటూ, ఆశా వార్కర్లకు నెత్తి మీద పిడుగు వేసారు. అయితే దీని పై, ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమకు పెంచిన జీతం, బకాయలు వెంటనే చెల్లించాలని ఆశావర్కర్లు ఆందోళ నిర్వహించారు. ఈ రోజు ఛలో విజయవాడ పిలుపుతో, విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ లో ఉన్న ధర్నా చౌక్ కు భారీ సంఖ్యలో ఆశావర్కర్లు చేరుకుని ఆందోళన చేసారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని, అలాగే తమకు కనీస వేతనం రూ.10వేలు వెంటనే ఇవ్వాలని, గ్రేడింగ్‌ విధానం ఎత్తేయాలంటూ ఆశా వర్కర్లు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.

asa workers 26082019 2

మరో పక్క ఛలో విజయవాడకు వెళుతున్న ఆశా వర్కర్లను రాష్ట్రంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల ఆశా వర్కర్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కొంత మందిని అరెస్ట్ చేసారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను, ఇలా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసారు. అయితే ఈ రోజు ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన, ప్రభుత్వం వారిని పెడుతున్న ఇబ్బందులు, అలాగే ఆశా వర్కర్లు అరెస్ట్ ల పై, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆశా వర్కర్లను నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉందని చంద్రబాబు అన్నారు. ఆశా వర్కర్లకు జీతం పెంచామని ఫోటోలకు ఫోజ్లు ఇచ్చి, ఇప్పుడు గ్రేడింగ్ విధానం అంటూ, వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారని అన్నారు.

asa workers 26082019 3

చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేసాం అంటూ ఫోటోలకు ఫోజులా? మరో పక్క ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా? వాళ్ళ కష్టానికి గ్రేడ్ లు ఏంటి? చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు? ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? అంటే వాళ్ళను మీ ఇష్టానుసారం వేధించాలనేగా? ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి. ఒక వేళ మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఆయుధం సిద్ధంగానే ఉందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క ఫోన్ కొట్టండి మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి. ఆందోళన చేస్తున్న ఆశాకార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథ సృష్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది మామూలే కదా!"

Advertisements

Latest Articles

Most Read