నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి, గుంటూరు జిల్లా పొనుగుపాడులో, వైసీపీ నేతలు చేసిన విధ్వంసం పై మాట్లాడారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసారని, వారి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టిన వ్యవహారం పై సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వానికి 48 గంటల డెడ్లైన్ కూడా విధించారు. ఈ అంశం పై, సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. అయితే అంతకంటే ముందే, క్షేత్ర స్థాయిలో వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవటానికి, తెలుగుదేశం సీనియర్ నేతలను చంద్రబాబు అక్కడకు పంపించారు. జరిగిన సంఘటన పై నిజనిర్ధారణ చేసి, రావాలని, పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్‌ రెడ్డి, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ తదిరులను చంద్రబాబు ఈ రోజు అక్కడకు పంపించారు.

guntur 27072019 2

ఈ నేతలు ఈ రోజు అక్కడకు బయలుదేరి వెళ్లారు. అసలు అక్కడ ఏమి జరిగింది, వైసీపీ చేసిన అరాచకం ఏంటి, ఇవన్నీ ప్రజలకు కళ్ళారా చూపించాలని, మీడియాను కూడా వెంట పెట్టుకుని అక్కడకు వెళ్లారు. అయితే, పోలీసులు మాత్రం, వీరిని అక్కడ దాకా కూడా వెళ్ళనివ్వలేదు. వారిని, నరసారావుపేట దగ్గరే అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరు అక్కడకు వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని, అందుకే తెలుగుదేశం నేతలను అక్కడకు వెళ్ళనివ్వం అంటూ పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసారు. అంతే కాదు, తెలుగుదేశం నేతలు అక్కడకు వచ్చి, అక్కడ జరిగిన అనాగరిక చర్య ప్రపంచానికి తెలిసేలా చేస్తారని గ్రహించి, అక్కడ ముందుగానే 144 సెక్షన్ పెట్టారు.

guntur 27072019 3

అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, మేము అక్కడకు గొడవ చెయ్యటానికి వెళ్ళటం లేదని, అసలు ఏమి జరిగిందో చూసి, తెలుగుదేశం సానుభూతి పరులను పరామర్శించి, అక్కడ జరిగిన విషయాన్ని మీడియాకు చూపిస్తామని అన్నారు. అక్కడ ఎలాంటి ఆందోళనలు చెయ్యమని చెప్పనా, మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, మిమ్మల్ని అక్కడకు పంపించే ప్రసక్తే లేదు అంటూ, పోలీసులు వెళ్ళడించారు. అయితే వీరిని అరెస్ట్ చేసారని తెలియటంతో, పొనుగుపాడులో తెలుగుదేశం శ్రేణులు అందోళన చేపట్టాయి. అయితే వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఎన్నికల తరువాత, పొనుగుపాడులో, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసరనే నెపంతో, వైసీపీ వర్గీయులు రోడ్డు అడ్డంగా గోడకట్టారు. గోడకు అవతల వైపు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇళ్ళు ఉండటంతో, వారికి ఇబ్బందిగా మారింది. దీని పై స్పందించిన చంద్రబాబు, ఈ రోజు అక్కడకు పార్టీ నేతలను పంపించారు.

ఒక మంత్రి నన్ను హింస పెడుతున్నాడు అంటూ, ఒక మహిళ ఉత్తరం రాసి, సూసైడ్ చేసుకుని, హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుకుంటుంటే, అలాంటి మంత్రుల అరాచకాలు, ఈ ముఖ్యమంత్రికి కనిపించటం లేదా అంటూ, జగన్ మోహన్ రెడ్డిని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మంత్రి పెర్ని నాని తనను ఇబ్బంది పెడుతున్నారని, ఒక మంత్రి ఆత్మత్యాయత్నం చేసిన ఘటన పై చంద్రబాబు స్పందించారు. ఒక మంత్రి ఇలా అరాచకాలు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేస్తుంది, హోం మంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేస్తూనే ఉన్నారని అన్నారు.

cbnjagan 27072019 2

ప్రతి రోజు ఎక్కడో ఒక చోటు, తెలుగుదేశం కార్యకర్తలని టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ రెండు నెలల్లో, జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు అనే అండ చూసుకుని, తమ పార్టీ నేతలపై 285 దాడులు, 7 హత్యలు జరిగాయని చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా సాక్షాత్తు మా ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసారని అన్నారు. ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, బాల వీరాంజనేయస్వామిపైనా వైసిపీ నేతలు దాడి చేసారని అన్నారు. స్పీకర్ కు, సభ్యులు హక్కలు పై దాడులు చేస్తుంటే, కనిపించటం లేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం నేతల పై జరుగుతున్న దాడులు విషయంలో పోలీసులు కూడా అసలు పట్టించుకోవటం లేదని అన్నారు. రెండు రోజుల్లోగా తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసిన వారిని పట్టుకుని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

cbnjagan 27072019 3

పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వైసిపీ చెప్పినట్టు కాదని చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లలో ఒక మహిళను వివస్త్రను చేసి నడి రోడ్డు పై హింసించారని, మహిళా హోం మంత్రికి ఇవన్నీ పట్టవా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాడిపత్రిలో మా కార్యకర్తను చంపి, తిరిగి అతని కుటుంబ సభ్యులు మీదే మళ్ళీ కేసు పెట్టారని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారులే నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఈ దాడులు ఆపాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యింది. ఈ రెండు నెలల్లో జగన్ మార్క్ పరిపాలన ఏమైనా చూసామా అంటే, ఏమి లేదనే చెప్పాలి. యువకుడుని అని చెప్పుకుంటూ, జగన్ మొహన్ రెడ్డి, ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్లి, అధికారం సంపాదించుకున్నారు. అయితే ఈ రెండు నెలల్లో మాత్రం, చెప్పుకోదగ్గ మార్పు, లేకపోతే సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు, కనిపించే స్పష్టమైన పాలసీ చేంజ్ అయితే కనిపించలేదని చెప్పాలి. 5గురు డిప్యూటీ సియంలు అంటూ మొదలు పెట్టిన జగన్, తరువాత తరువాత, మొత్తం చంద్రబాబు పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ప్రజా వేదిక ఇవ్వమని అడిగితే, వెళ్లి దాన్ని కూల్చేసారు. చంద్రబాబు పై ప్రతి విషయంలో ఎంక్వయిరీ కమిషన్ కు వేసుకుంటూ వెళ్తున్నారు.

moneycontrol 26072019 2

ఇక గత రెండు వారాలుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో, అధికార పక్ష ప్రవర్తన చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి రెండు నెలలు అధికారం పూర్తీ చేసుకోవటంతో, సహజంగానే ఆయన పాలన పై విశ్లేషణలు వస్తాయి. ఇదే కోవలో ప్రముఖ బిజినెస్ ఛానెల్, మనీ కంట్రోల్, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పాలన పై, ఎడిటోరియల్ కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు, దేశానికీ ఎలా శాపంలాగా అయ్యాయి అంటూ, ఆ ఎడిటోరియల్ నడిచింది. ముఖ్యంగా జగన మోహన్ రెడ్డి తీసుకున్న మూడు నిర్ణయాల పై మనీ కంట్రోల్ తన విశ్లేషణను అందించింది. కేవలం సంక్షేమం అంటూ, కూర్చుని, యాంటీ కరప్షన్ అని చెప్పుకుంటే, దాన్ని పరిపాలన అనరు అంటూ విమర్శలు గుప్పించింది.

moneycontrol 26072019 3

చంద్రబాబు ప్రభుత్వంలో, ప్రాజెక్ట్ లు ఇచ్చి, ఇప్పటికి 25 శాతం అవ్వకపోతే, పనులు ఆపెయ్యాలి అని జగన్ మొహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు బట్టింది. ఇప్పటికే అమరావతిలో, ఎల్ అండ్ టీ సంస్థ, ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోయిందని చెప్పింది మనీ కంట్రోల్. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు, అందుకే అమరావతిని ఇలా ఆపేస్తున్నారు అని విమర్శించింది. మరో పక్క చంద్రబాబు హయంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చెయ్యటం, అతి పెద్ద తప్పుగా అభివర్ణించింది. ఇది కూడా చంద్రబాబు మీద రాజకీయ కక్షతో చేస్తున్న పని అని, దీని వల్ల పెట్టుబడి దారులు రారని చెప్పింది. ఇక రెండు రోజుల క్రిందట, పరిశ్రమల్లో 75 శాతం లోకల్ రిజర్వేషన్లను, పొలిటికల్ స్టంట్ గా అభివర్ణించింది. దీని వల్ల పెట్టుబడులు రావని, మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే ఆలోచిస్తే, పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయం వేస్తుందని, మనీ కంట్రోల్ విశ్లేషించింది. మరి జగన్ గారు, వీరు చెప్పినవి పాజిటివ్ గా తీసుకుంటారో, లేక ఆ రెండు పత్రికల్లో, దీన్ని కూడా చేర్చి బ్యాన్ చేస్తారో చూడాలి.

చంద్రబాబు టార్గెట్ గా విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై , జగన్ మొండి వైఖరి పై అటు కోర్ట్ ల నుంచి, ఇటు బిజినిస్ అనలిస్ట్ లు దాకా, అందరూ విమర్శలు గుప్పిస్తూ, హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా జగన్ మాత్రం తన పంధా మార్చుకోవటం లేదు. ఇప్పటికే కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఈ విషయం పై జగన్ కు లేఖ రాసారు. అయినా జగన్ వినలేదు. తరువాత కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి జగన్ కు లేఖ రాసారు. అయినా జగన్ వినటం లేదు. మరో పక్క విద్యుత్ సంస్థలు కోర్ట్ లకు వెళ్తున్నాయి, ట్రిబ్యునల్ దగ్గరకు వెళ్తున్నాయి. ఏదైనా తేడా జరిగితే, ప్రభుత్వానికి భారీగా జరిమానా పడే అవకాసం ఉంటుంది. అందుకే ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో జగన్ వ్యవహార శైలి పై, కేంద్ర విద్యుత శాఖా మంత్రి, ఆర్‌కే సింగ్‌, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసారు.

shah 27072019 2

విద్యుత్ ఒప్పందాల విషయంలో సమీక్ష చేస్తే అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నా, జగన్ వినిపించుకోవటం లేదని, మీ జోక్యం కావాలని, కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి, అమిత్ షా ను కోరారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో, ఆంధ్రప్రదేశ్ లోనే కాదని, దేశంలోనే పెట్టుబడుల వాతావరణం దెబ్బ తింటుందని, అమిత్ షాకు వివరించారు. ఇప్పటికే తమ శాఖ కార్యదర్శి, నేను కూడా , జగన్ మోహన్ రెడ్డికీ, లేఖలు రాసి అంతా వివరించామని, అయినా జగన్ ముందుకు వెళ్తున్నారని అమిత్ షా కు తెలిపారు. విద్యుత్ ఒప్పందాలు పూర్తిగా రెగ్యులేటరీ అథారిటీ చేస్తుందని, దీంట్లో రాష్ట్రానికి, కేంద్రానికి కూడా సంబంధం ఉండదని, చెప్పినా, జగన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఇప్పటికే కోర్ట్ ల వరకు వీ విషయం వెళ్లిందని, ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోకపొతే, దేశానికే ఈ రంగంలో పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదం ఉందని, కేంద్ర విద్యుత్ మంత్రి, అమిత్ షా కు వివరించారు.

shah 27072019 3

ఈ వివాదం మరింత ముదరకుండా, ఉన్నత స్థాయిలో రాజకీయ జోక్యం కోసమే, కేంద్ర మంత్రి, అమిత్ షా కు చెప్పారని, అధికారులు అంటున్నారు. ఇప్పటికే అనేకసార్లు జగన్ కు చెప్పి చూసామని, సాక్షాత్తు కేంద్ర మంత్రి, కేంద్రం తరుపున, అన్ని ఆధారాలు ఇచ్చారని, అంతా వివరంగా చెప్పారని, అయినా జగన్ వినకపోవటంతో, ఈ విషయం అమిత్ షా వరకు వెళ్ళాల్సి వచ్చింది ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. జగనే మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, అమిత్ షా ఈ దేసంలూ, రెండో పవర్ ఫుల్ మ్యాన్ అని, మరి ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయం వెనక్కు తీసుకుంటారో లేదో ?

Advertisements

Latest Articles

Most Read