ఎన్నికల ఫలితాలు తరువాత, ఓటిమి పొందిన తరువాత, తెలుగుదేశం పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వీక్ గా ఉందని, ఆ పార్టీని తోక్కేస్తే, తామే ప్రతిపక్షంగా వ్యవహరించవచ్చని బీజేపీ అనుకుంటుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను అందరినీ చేర్చుకునే ప్లాన్ వేసింది. బీజేపీ నేతలు కూడా, చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చే సరికి, తెలుగుదేశం పార్టీ మిగలదు అని, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులూ అందరూ మా పార్టీలో చేరిపోతారని హడావిడి చేసారు. దీనికి తగ్గట్టే ముందుగా ఒకే రోజు, నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకుని, సంచలనం సృష్టించారు.

bjptdp 22072019 2

ఈ ఫ్లో చూసిన వాళ్ళు, నిజంగానే బీజేపీ అన్నంత పని చేస్తుందేమో అని అనుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ నలుగురు రాజ్యసభ సభ్యులను తప్ప, పెద్ద నేతలను ఎవరినీ లాగలేక పోయింది. చిన్న చిన్న నాయకులు మినహా పెద్దగా ఎవరూ వెళ్ళలేదు. తాజగా రాయపాటి, తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ, మళ్ళీ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో, ఇప్పటి వరకు ఈ వలసల పై మాట్లాడని చంద్రబాబు, ఈ విషయం పై తనను కలసిన నేతలతో ప్రస్తావించారు. నిన్న చంద్రబాబు నివాసంలో, తెలుగుదేశం పార్టీ ఎంపీలు చంద్రబాబుని కలిసి, పార్లమెంట్ జరుగుతున్న తీరు గురించి వివరించారు.

bjptdp 22072019 3

ఈ నేపధ్యంలో, బీజేపీలోకి వలసల పై, ఎంపీలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీని పై స్పందించిన చంద్రబాబు, మన పార్టీ నుంచి వెళ్ళిపోయే వారిని పోనివ్వండి, మనం ఆపితే ఆగరు కదా, వారు పొతే కొత్త నాయకత్వం తాయారు అవుతుంది, కొత్తవారితో పార్టీని బలోపేతం చేద్దాం అని చంద్రబాబు అన్నారు. అంతే కాదు, ఇలాంటి నేతలు ఎంత మంది వెళ్లి బీజేపీలో చేరినా, వారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోనూ బీజేపీ ఎన్ని విన్యాసాలు చేసినా వారు ఎదిగే అవకాసం లేదని అన్నారు. ఎవరు ఏమి చేసినా, మనం మన పని చేసుకుంటూ వెళ్దాం, ప్రజా సమస్యల పై ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉందాం, ప్రజలకు దగ్గరగా పని చేద్దాం అని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు చెప్పిన అభిప్రాయాన్నే టిడిపి అభిమానులు కూడా చెప్తున్నారు. ఇలాంటి నేతలు పోయినా, ఒక్క కార్యకర్త కూడా అటు వైపు చూడరని, ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వెయ్యరని అంటున్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో దాని స్థానం ఏంటో ప్రజలు చెప్పారని అంటున్నారు.

రాష్ట్రంలో విద్యుత పీపీఏల విషయం సెగలు రేపుతుంది. కేంద్రం వద్దు అంటున్నా, ఇన్వెస్టర్స్ వార్నింగ్ ఇస్తున్నా, ఎక్స్పర్ట్స్ అందరూ ఇది తప్పు అంటున్నా, చంద్రబాబు హయంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల పై సమీక్షించి తీరుతా అంటూ జగన్ మొండి పట్టుదల, రాష్ట్రానికి ఎసరు వచ్చేలా ఉంది. ఇలాగే వితండవాదం చేస్తే, రాష్ట్రానికి చీకట్లు అలుముకున్నా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు హయంలో కుదుర్చుకున్న రేట్ కంటే తక్కువకే ఇవ్వాలని, విద్యత్ కంపెనీలను జగన్ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే ఈ ఉత్తర్వుల పై గ్రీన్ కో కంపెనీ, ట్రిబ్యునల్ కు వెళ్ళటంతో, ట్రిబ్యునల్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ విషయం మీకు ఎందుకు రెగ్యులేటరీ కమిషన్ చూసుకుంటుంది అంటూ, ఆ నోటీసుల పై స్టే విధించింది.

seci 22072019 2

తాజగా, జగన్ ప్రభుత్వం కోరినట్టు, విద్యుత్ యూనిట్ ధర తగ్గించే ప్రసక్తే లేదని, కేంద్ర సంస్థ అయిన, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐ) స్పష్టంగా చెప్పేసింది. కడప జిల్లాలోని గాలివీడు మండలంలోని సోలార్‌ పార్కు నుంచి ఏపీ సౌత్‌ పవర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ కు 400 మెగావాట్ల విద్యుత్‌ ను ఈ కంపెనీ అందిస్తుంది. అయితే, ఈ కేంద్ర సంస్థ సరఫరా చేసే యూనిట్‌ ధరను తగ్గించాలని ప్రభుత్వం కోరింది. అయితే ఈ కంపెనీ మాత్రం, యూనిట్ ధర తగ్గించడం కుదరదని తేల్చి చెప్పింది. అలాగే ఈ రోజు జరిగే విద్యుత్ సమీక్షకు కూడా ఈ కంపెనీ హాజరు కాలేదు. మేము ఈ సమీక్షకు హాజరు కావటం లేదు అంటూ, ఏపీఎస్పీడీసీఎల్‌కు లేఖ రాసింది. ఈ కంపెనీతో పాటు ఎన్టీపీసి కూడా ఈ రోజు జరిగిన సమీక్షకు హాజరు కాలేదు.

seci 22072019 3

విద్యుత్ సరఫరా చేసే, యూనిట్‌ ధరను ఇప్పుడు చెల్లిస్తున్న, రూ.4.5 నుంచి రూ.2.44లకు తగ్గించాలని జగన్ ప్రభుత్వం, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ను కోరింది. అయితే, ఇవన్నీ ఎప్పుడో అయిపోయాయి అని, ఇంధన చట్టం ప్రకారం కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ నిర్వహించిన తర్వాతే యూనిట్‌ ధరను రూ.4.5లుగా నిర్ణయించామని, అందుకే మీరు కోరినట్టు యూనిట్ రేట్ తగ్గించే ప్రసక్తే లేదని ఎస్‌ఈసీఐ తేల్చిచెప్పింది. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై సంతకాలు చేసామని, ఇప్పుడు ఎలా తగ్గిస్తామని అంది. మరి జగన్ ప్రభుత్వం ఈ సమీక్షల పై ఏ నిర్ణయం తీసుకుంటుంది ? ఒప్పందాలు రాద్దు చేసి మోడీ ప్రభుత్వాన్నే ఛాలెంజ్ చేస్తుందా ? చంద్రబాబు మీద కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, తన గొయ్యి తానే తవ్వుకుంటుందా అనే చూడాలి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో, గాలి జనార్ధన్ రెడ్డిని నా పెద్ద కొడుకు అని చెప్పే వారు. అలాగే గాలి జనార్ధన్ రెడ్డికి, ఓబులాపురంలో గనులు కేటాయించి తవ్వుకోమన్నారు. చివరకు అది పెద్ద స్కాం అయింది. ఓబులాపురం మైనింగ్ లో, గాలి జనార్ధన్ రెడ్డి పిచ్చ పీకుడు పీకారు. చివరకు బంగారపు సింహాసనం కూడా చేపించుకుని, దాని పై కూర్చునే వారు కూడా. సిబిఐ మొదటి సారి దాడులుకు వెళ్ళినపుడు, ఇవన్నీ చూసి షాక్ అయ్యారు. 2007లో ఓబులాపురం మైనింగ్ పై, సిబిఐ కేసు పెట్టింది. అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి, చాలా ఏళ్ళు జైల్లో కూడా ఉన్నారు. గాలి జనార్ధన్ రెడ్డి కేసు తరువాత, జగన్ కేసులు కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి హయంలో, అవినీతి చేసారని కేసులు నమోదు అయ్యాయి.

ed 22072019 2

తరువాత కాలంలో ఇద్దరికీ బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. అయితే కాలం కలిసి వచ్చి, జగన్ ఏకంగా సియం అయిపోయారు. గాలి జనార్ధన్ రెడ్డి మాత్రం, బీజేపీ పార్టీలో ఆయన ఉండటంతో, ఆయన పై కేసులు కొంచెం స్లో అయ్యాయి అనే భావన అందరికీ కలిగింది. ఇప్పటికి కేసు పెట్టి 12 ఏళ్ళు అయినా, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో, బీజేపీ వ్యవహరించిన తీరుతో, మళ్ళీ గాలి జనార్ధన్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయిని అందరూ అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కాని, మళ్ళీ గాలి జనార్ధన్ రెడ్డి పై విచారణ మొదలైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గాలి జనార్ధన్ రెడ్డికి షాక్ ఇస్తూ, ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని ఆదేశించారు.

ed 22072019 3

దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి జనార్ధన్ రెడ్డి పై ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విదేశాలకు పెద్ద ఎత్తున తరలించిన నగదు పై, గాలి జనార్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం సిబిఐ విచారణకు మాత్రమే హాజరయిన గాలి జనార్ధన్ రెడ్డి, మొదటి సారి ఈడీ ముందుకు రావటంతో, ఏమి జరుగుతుందా అనే సస్పెన్స్ నెలకొంది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీ అరుణకు కూడా ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డి కూడా ఉన్నారు. అయితే సిబిఐ కాకుండా, ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగటం చూస్తుంటే, మళ్ళీ గాలి అండ్ కో కి బ్యాడ్ డేస్ ఏమైనా మొదలయ్యయా అనే వాదన మొదలైంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు అమరావతి రుణం పై జరిగిన చర్చలో, జగన్ ప్రభుత్వం అమరావతి పై చూపిస్తున్న వివక్ష పై చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ తీసుకునే ప్రతి చర్య అమరావతికి నష్టం చేసి, హైదరాబాద్ కి లాభం అయ్యేలా ఉన్నాయని అన్నారు. అంతే కాదు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఛాలెంజ్ చేసారు. అమరావతి పై జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్య సరైనదే ఇక్కడ రైతులు ఎవరు చెప్పినా సరే, నేను దేనికైనా సిద్ధం అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు. దేనికైనా సిద్ధమని, ఇక్కడ రైతుల చేత జగన్ చేసేది కరెక్ట్, నేను చేసింది తప్పు అని చెప్పేస్తే, దేనికైనా, ఎటువంటి శిక్షకు అయినా నేను సిద్ధం అని చంద్రబాబు ఆవేదనతో మాట్లాడారు. ఈ రోజు కూడా అమరావతిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్నారని అన్నారు.

cbn jagan 22072019 2

గతంలో వైసిపీ నేతలు అమరావతికి రుణం ఇవ్వద్దు అంటూ ప్రపంచ బ్యాంక్ కు లేఖలు మీద లేఖలు రాసారని, ఇప్పుడు అదే వారి మెడకు చుట్టుకుందని అన్నారు. వీరు అధికారంలోకి రాగానే, అమరావతి రుణం ఇవ్వం అని చెప్పారని, అన్నారు. అమరావతి నిర్మాణానికి అడుగడుగునా జగన్ అడ్డు అడ్డారాని అన్నారు. ఇక్కడ రైతులు రెచ్చగొట్టటం మొదలు, పంట పొలాలు నిప్పు పెట్టటం, వంటివి ఎన్నో చేసారని అన్నారు. రైతులకు ఇవ్వగా, ప్రభుత్వానికి మిగిలేది 7 వేల ఎకరాలని, ఆ భూమితో అమరావతి ప్రాజెక్ట్ పూర్తీ చెయ్యొచ్చ అని అన్నారు. అలాంటి బంగారమైన అవకాసం, వీళ్ళు చేతులారా నాశనం చేసారని అనంరు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు మనకు వద్దా అని చంద్రబాబు అన్నారు.

cbn jagan 22072019 3

జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, రాజధాని భూములు రేట్లు ఎలా పడిపోయాయో చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి వారికే అర్ధం కావటం లేదని, వారి భవిష్యత్తు ఏంటా అని దిగులు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. అమరావతి రుణం ఇవ్వటం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్ బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి వివరాలు తీసుకున్నారని అన్నారు. అమరావతి పై జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దుర్మార్గమైన నిర్ణయాల కారణంగా,కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసిందని అన్నారు. మరో పక్క బుగ్గన చెప్పిన అబద్ధాలను కూడా చంద్రబాబు కడిగేసారు. హెల్త్ ప్రాజెక్ట్ కు లోన్ మా ప్రభుత్వంలో సాంక్షన్ అయితే, వీరి వల్ల వచ్చింది అంటూ, హడావిడి చేస్తున్నారని, ఇలా ప్రజలను మభ్యపెట్టలేరని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read