గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్ మొహన్ రెడ్డి, ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై, ఎక్కువగా పోరాడింది, ఇసుక తవ్వకాల మీద. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దాని వల్ల చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన చంద్రబాబు, దాని పై పెద్దగా ఆదాయం కూడా రాదని, దాని కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు అని భావించి, ఇసుకను ఉచితం చేసారు. అయితే అక్కడ లోడింగ్ చెయ్యటానికి, ట్రావెలింగ్ చార్జెస్ కింద, లోకల్ నాయకులు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే వారు. అది ప్రాంతాన్ని బట్టి, మారుతూ ఉండేది. అంతే కాని, ప్రభుత్వానికి ఇసుక నుంచి ఆదాయం మాత్రం రాలేదు. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం, ఈ విషయం పై గోలగోల చేసారు.

green 23072019 2

చంద్రబాబు ఇసుకాసురుడు అంటూ తన పత్రికల్లో కధనాలు వేసారు. ఇసుక అక్రమ రవాణా మొత్తం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది అని, ఇసుకలో చంద్రబాబు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేసారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్రంగా ఇసుక అక్రమాలు చేస్తున్నారని, ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు అంటూ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. అయితే అప్పడు ట్రాక్టర్ ఇసుక 1500 ఉంటె, ఇప్పుడు 5 వేలు ఉంది. ఎవరు దోపిడీ చేసారో, ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుంది. అయితే, కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో, కొన్ని రోజుల క్రిందట ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ రోజు ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన వాదన విని అందరూ అవాక్కయ్యారు.

green 23072019 3

గతంలో చంద్రబాబు ఇసుకలో తినేసాడు అని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే మాట మార్చారు. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో, అసలు కృష్ణా నదిలో ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదు అంటూ, విచారణ సందర్భంగా, ఏపి ప్రభుత్వం తరుపున వాదన వినిపించారు. కేవలం కృష్ణా నదిలో జల రవాణా కోసం, ప్రకాశం బ్యారేజీ వద్ద పుడిక తీసామని చెప్పారు. అయితే దీని పై ఎన్జీటీ స్పందిస్తూ, ఈ తవ్వకాల కు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించగా, పుడికతీటకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. అలాగే పూడిక తీసిన ఇసుకని అమరావతి నిర్మాణం కోసం వాడమని ఏపి ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో చంద్రబాబు ఇసుకను తవ్వేసారు అని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే, అసలు ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు అని చెప్పటంతో, వైసీపీ అభిమానులతో పాటు, సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. రాజకీయం కోసం అప్పుడు ఆరోపణలు చేసి, ఇప్పుడు అధికారంలో ఉండగా, అంతా మంచిగా ఉందని చెప్పటంతో, రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారని, మరోసారి రుజువైంది.

మొన్న సున్నా వడ్డీ ఛాలెంజ్ పైనా, నిన్న అమరావతి రుణం పైనా, ఈ రోజు 45 ఏళ్ళ పెన్షన్ పైనా... అసెంబ్లీలో ఏ విషయం పైనా చంద్రబాబుకు మాట్లాడే అవకాసం ఇవ్వటం లేదు. అధికార పక్షం అన్నీ అబద్ధాలు చెప్పటం, చంద్రబాబుకి అది కౌంటర్ ఇచ్చే అవకాసం ఇవ్వకుండా, సభను వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం, ఇదే జరుగుతుంది. దీంతో సభలో మాట్లాడే అవకాసం ఇవ్వకపోవటంతో, జగన్ మాట్లాడే మాటలే ప్రజలు నిజం అని నమ్మే అవకాసం ఉంది. అందుకే చంద్రబాబు అసెంబ్లీలో అవకాసం ఇవ్వకపోవటంతో, ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, అసెంబ్లీలో జగన్ ఆడుతున్న అబద్ధాలను డాక్యుమెంట్ ప్రూఫ్ తో, వీడియో ప్రూఫ్ తో, విలేకరుల సమావేశంలో చూపించి, జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలను ఎండగడుతున్నారు.

cbn 23072019 2

ఈ రోజు కూడా అసెంబ్లీలో 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ ఇస్తాను అంటూ జగన్ ఇచ్చిన హామీ పై, తెలుగుదేశం నిలదీసింది. జగన్ మాత్రం, నేను అలా చెప్పలేదని, 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాను అని చెప్పానని చెప్పారు. అయితే, ఇది కౌంటర్ చేసే అవకాసం తెలుగుదేశం పార్టీకి స్పీకర్ ఇవ్వలేదు. ఆందోళన చేస్తున్న ముగ్గురు సభ్యులను అసెంబ్లీ అయ్యేంతవరకు సస్పెండ్ చేసారు. దీంతో చంద్రబాబు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి, జగన్ ఆడిన అబద్ధాలు అన్నీ వీడియో వేసి విలేకరులకు చూపించారు. జగన్ మోహన్ రెడ్డి అనంతపురంలో, అక్టోబర్ 18 2017న, ప్రతి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసి లకు 45 ఏళ్ళకే రెండు వేలు పెన్షన్ ఇస్తాను అని చెప్పిన వీడియో అది. అలాగే, తన సాక్షి ఛానెల్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ను కూడా చంద్రబాబు చూపించారు.

cbn 23072019 3

అందులో కొమ్మినేని శ్రీనివాస్, జగన్ ని అడుగుతూ, మీకు 45 ఏళ్ళకే పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అనిపించింది అని అడిగితే, సెంటిమెంట్ డైలాగ్ లు చెప్తూ, జగన్ సమాధానం ఇచ్చారు. ఇలా ఈ వీడియో కూడా చూపించారు. తరువాత వివిధ సందర్భాల్లో వైసిపీ పార్టీ, ఈ 45 ఏళ్ళకే పెన్షన్ అనే హామీని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన స్క్రెన్ షాట్స్ కూడా చూపించారు. స్వయానా జగన్ మోహన్ రెడ్డి ఎకౌంటులోనే, నేను 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను, మాట తప్పను, మడం తిప్పను అని పోస్ట్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ పధకం రద్దు అయిందని ఎక్కడా చెప్పలేదు. అయితే జగన్ మాత్రం, నేను 4 ఏళ్ళలో 75 వేలు ఇస్తాను అని చెప్పానని, చెప్పి, 45 ఏళ్ళకే, 2 వేలు పెన్షన్ అనే మాటను మర్చిపోయారు. చంద్రబాబు ఇవన్నీ వీడియోలు వేసి అసెంబ్లీలో చూపిస్తారని భయపడి, టిడిపి సభ్యులను సస్పెండ్ చేసారు. అయితే చంద్రబాబు ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి ఈ విషయం పై ప్రజలు ఏమి డిసైడ్ చేసుకుంటారో ?

మన అమరావతి - మన రాజధాని అంటూ, ప్రజల అందరినీ అమరావతితో కనెక్ట్ అవ్వటం కోసం, ఆ రోజు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు. 10 రూపాయలకే ఇటుకు అంటూ, ప్రతి సామాన్యుడు ఇది నా రాజధాని అని అనుకునే విధంగా, చంద్రబాబు ప్రయత్నాలు చేసారు. దీంతో ప్రతి ఒక్క ఆంధ్రుడు, అమరావతితో అనుబంధం పెంచుకున్నారు. దేశం కాదు, ప్రపంచ గర్వించే రాజధాని మేము కట్టుకుంటున్నాం అంటూ ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు ఆంధ్రుడు. కాని ప్రజలు తీర్పు మాత్రం ఎన్నికల్లో వేరే విధంగా ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించారు. అప్పటి నుంచి అమరావతి పరిస్థితి ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు, మా పరిస్థితి ఏంటి అంటూ జగన్ వైపు చూడాల్సిన పరిస్థితి.

amaravati 23072019 2

నిత్యం వేల మంది కార్మికులతో హడావిడిగా ఉన్న అమరావతి ప్రాంతం, ఈ రోజు ఒక్కరు కూడా అక్కడ లేక, బోసిపోయింది. అన్ని కట్టడాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డికి, అసలు అమరావతి అంటే ఇంట్రెస్ట్ లేదని తేలిపోయింది. అయితే అమరావతి పై ఇంకా కొంత మందికి ఆశలు ఉన్నాయి. దానికి కారణం, ప్రపంచ బ్యాంక్, మిగతా బ్యాంక్ లు ఇస్తాం అంటున్న లోన్లు. నాలుగు రోజుల క్రిందట ప్రపంచ బ్యాంక్ మేము లోన్ ఇవ్వం అని చెప్పింది. దానికి కారణం కేంద్రం, ఇచ్చిన ప్రతిపాదన వెనక్కు తీసుకోవటం. ఎందుకు కేంద్రం తీసుకుంది అంటే, రాష్ట్రానికే ఇంట్రెస్ట్ లేకపోతే మేము ఏమి చెయ్యం అంటూ కేంద్రం కూడా వదిలించుకుంది. దీంతో ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలి అనుకున్న లోన్ వెనక్కు వెళ్ళిపోయింది.

amaravati 23072019 3

ఇప్పుడు తాజగా మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు లోన్ ఇవ్వం అంటూ మరో కీలక బ్యాంకు చెప్పేసింది. అమరావతికి లోన్ ఇవ్వం అంటూ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్(ఏఐఐబీ) అమరావతి స్పష్టం చేసింది. చంద్రబాబు హయంలోనే, అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం మారటంతో, అమరావతి పై జగన్ ప్రభుత్వ వైఖరి చూశాక, ప్రపంచ బ్యాంకే వెనక్కు వెళ్ళిపోతే, మనకు ఎందుకు అంటూ రుణం ఇవ్వకపోవడమే మంచిదని ఏఐఐబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. అమరావతికి ఒక్కో షాక్ తగులుతూ ఉండటం, అలాగే జగన్ కు అమరావతి అంటే ఇష్టం లేకపోవటంతో, ఇక అమరావతి అనే రాజధాని గురించి ఏపి ప్రజలు మర్చిపోవటమేనా ?

జగన్ ప్రభుత్వానికి రోజుకి ఒక పవర్ షాక్ తగులుతాంది. చంద్రబాబు ని టార్గెట్ చేసుకుంటూ , గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చేస్తాను అంటూ జగన్ ప్రకటించారు. అయితే ఇలా చెయ్యటం చాలా తప్పు అని, పెట్టుబడి దారులు, వెళ్లిపోతారని, కేంద్రం నుంచి బిజినెస్ అనలిస్ట్ ల దాకా అందరూ హెచ్చరించినా, జగన్ మాత్రం ముందుకే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న గ్రీన్ కో కంపెనీ షాక్ ఇస్తే, నిన్న కేంద్ర సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. తాజగా మరో కేంద్ర సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), జగన్ ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసింది. మీరు అడిగిన రేట్ కు మేము కరెంట్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకున్నామో, ఆ ఒప్పందం మేరకే సరఫరా చేస్తామని, అంతకు మించి రూపాయి కూడా తగ్గించే ప్రసక్తే లేదని, తేల్చి చెప్పారు.

ntpc 23072019 2

ఒప్పందం చేసుకున్న సమయంలో, అన్నీ పారదర్శకంగా జరిగాయని, అప్పటి మార్కెట్ ధరల్లో అతి తక్కువ బీడ్లను పిలిచామని అన్నారు. ఈ బిడ్ల విధానాన్ని, జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా మేచ్చుకుందని అన్నారు. ఇవన్నీ మీరు పరిశీలించకుండ, మీ ఇష్టం వచ్చిన రేట్ ఇవ్వమంటే మాకు కుదరదని అన్నారు. దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం రేట్లు తగ్గించమంటూ రాసిన లేఖకు, ఈ నెల 17వ తేదీన ఎన్‌టీపీసీ (కమర్షియల్‌-రెన్యువబుల్‌ ఎనర్జీ) ఏజీఎం ఐ.ఉప్పల్‌ సమాధానం ఇచ్చారు. దాదపుగా నాలుగు పేజిల ఈ లేఖలో, అన్ని వివరాలు స్పష్టం చేసారు. వివధ రాష్ట్రాల్లో జరిగిన విద్యుత్ ఒప్పందాలు అన్నీ పరిశీలించాకే, ఆంధ్రప్రదేశ్‌కు 1250 యూనిట్లను ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని కేటాయించామని అన్నారు.

ntpc 23072019 3

కర్నూలు అలా్ట్రమెగా సోలార్‌ పార్కులో 500 మెగావాట్ల యూనిట్ ఏర్పాటు చెయ్యటానికి, బిడ్లు పిలిస్తే, 28 మంది వచ్చారని, 27 మంది క్వాలిఫై అయ్యారని, రివర్స్ టెండరింగ్ చేసి, యూనిట్ ధర రూ.4.63కు ఉత్పత్తి చేసేందుకు వచ్చిన బిడ్దర్ ను ఒకే చేసామని చెప్పారు. అలాగే మిగతా సాంకేతిక అంశాలు అన్నీ ఆ లెటర్ లో రాసారు. ఒప్పందాలు అన్నీ మంచిగానే జరిగాయని, దాని పై అనవసరం రాద్ధాంతం చెయ్యద్దు అని అన్నారు. మేము మాత్రం, మీరు కోరిన రేట్ కు కరెంటు ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. మేము ఒప్పందం చేసుకున్న రేట్ కే సరఫరా చేస్తామని, ఇష్టం ఉంటె తీసుకోండి, లేకపోతె లేదు అన్నట్టు లేఖ రాసారు. మొత్తానికి జగన్ విధానాల వల్ల, విద్యుత రంగంలోని పెట్టుబడిదారులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. జగన్ గారి సండూర్ పవర్ కు మంచి రోజులు వచ్చాయనే అనుకోవాలి. చూద్దాం కేంద్రం ఏమి చేస్తుందో.

Advertisements

Latest Articles

Most Read