తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్ష డిప్యూటీ లీడర్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు గురించి కుటుంబ సభ్యులుతో పాటు, సొంత పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రాధాన కారణం, ప్రస్తుతం ఆయన ఏ భద్రత లేకుండా ఉండటం. అలాగని ఇంట్లో కూర్చోవటం లేదు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా, సెక్యూరిటీ లేకుండా పర్యటనలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలతో పాటు, కుటుంబ సభ్యులు కూడా భయంభయంగా గడుపుతున్నారు. ఒక పక్క నక్సల్స్ ప్రభావం, మరో పక్క వైసీపీ పార్టీ పై ఆయన చేస్తున్న పోరాటం, అసెంబ్లీలో జగన్ పై దూకూడుగా వెళ్ళటం, ఇవన్నీ చూసి, తెలుగుదేశం శ్రేణులకు అచ్చెన్నాయుడు గన్‌మెన్‌లు లేకుండా బయటకు వెళ్తున్నారు అంటే భయపడిపోతున్నారు. జగన్ ప్రభుత్వం రాగానే, తెలుగుదేశం పార్టీ నేతలకు సెక్యూరిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా భద్రత తగ్గించారు.

గడిచిన 35 రోజులుగా అచ్చెన్నాయుడుకు భద్రత లేదు, దీనికి కారణం, ఆయన ప్రభుత్వం పై నిరసన తెలపటం. గతంలో ఆయనకు 4+4 గన్ మేన్ ల భద్రతతో పాటు, స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్, రోప్ పార్టీ, పైలట్ తదితర భద్రత ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయనకు భద్రత పూర్తిగా తగ్గించి, 2+2 భద్రత కల్పించారు. తరువాత రెండు రోజులకే, అది కూడా తగ్గించి, కేవలం ఒకే ఒక గన్ మేన్ ను కేటాయించారు. ఒరిస్సా , ఆంధ్రా బోర్డర్ లో, నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తి , అందునా ఇప్పటికే నక్సల్స్ టార్గెట్ లో ఉన్న వ్యక్తికీ, కేవలం ఒకే ఒక గన్ మేన్ ను కేటాయించటంతో, అచ్చెన్నాయుడు నిరసన వ్యక్తం చేస్తూ, ఆ ఒక్క గన్ మేన్ ని కూడా తిప్పి పంపించారు. గతంలో ఎర్రన్నాయుడు పై మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు, అలాగే అచ్చెన్నాయుడు పై రెక్కీ నిర్వచించారు. ఇవన్నీ చూసి, ఆందోళన చెందుతున్నారు. పోయిన వారం, కొండల ప్రాంతం అయిన రాంపురం పంచాయతీకి భద్రత లేకుండానే ఆయన వెళ్ళటంతో, పోలీసులు కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా భద్రత పెంచుతుందో లేదో.

పాదయాత్ర సమయంలో, జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రజలు అవన్నీ నమ్మి జగన్ ను గెలిపించారు. అయితే జగన పై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ప్రజలు, రెండు నెలలు కావస్తున్నా, తమ సమస్యల పై కనీసం స్పందించక పోవటంతో, వివిధ వర్గాల ప్రజలు, రాష్ట్ర నలుమూలల నుంచి జగన్ ఇంటికి వచ్చి, ప్రతి రోజు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలోని అనెక్ ప్రాంతాలకు చెందిన అనేక మందిప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జగన్ తాడేపల్లి ఇంటి ముందు పడిగాపులు పడుతున్నారు. తమకు జగన్ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని, అలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా కొందరు ఏకంగా వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొంత మందికి మాత్రం, ఎన్ని రోజులు అయినా కనీసం వారి సమస్య తెలుసుకోటానికి ఎవరూ రాకపోవటంతో, ఆందోళన బాట పడుతున్నారు. దీంతో జగన్ ఇంటి దగ్గర ఉన్న తాడేపల్లి భారతమాత జంక్షన్, ధర్నా ప్లేస్ గా మారిపోయింది.

అయితే రోజు రోజుకీ ప్రజలు తమ సమస్యల పై ఆందోళన బాట పట్టి, జగన్ ఇంటి ముందు ధర్నాలు చెయ్యటంతో, ప్రభుత్వం ఈ విషయం పై రియాక్ట్ అయ్యింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ సమస్యలు సాకుగా చెప్పి తాడేపల్లిలోని జగన్‌ నివాసం సహా పరిసర ప్రాంతాల్లో నిరసన, ధర్నాలను నిషేదిస్తున్నాం అని డీజీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఎవరినా ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, గుంటూరు అర్బన్‌, రూరల్‌, విజయవాడ సిటీ పరిధిలో ఈ నెల 12 నుంచి 30 వరకు పోలీసు యాక్టు అమల్లో ఉంటుందని చెప్పారు. ఎవరైనా నిరసన తెలిపాలి అనుకుంటే, జగన్ ఇంటి వద్ద కాకుండా, విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో నిరనస తెలుపుకోవచ్చని, దానికి కూడా ముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. మొత్తానికి అధికారం రాగానే, తన క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఎవరూ నిరసన, ఆందోళన చెయ్యకూడదు అని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు పై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. చాలా అవమానకర రీతిలో జగన్ మాట్లడారు. అచ్చెన్నాయుడు అనే మనిషి ఆ సైజులో ఉంటాడు, కానీ బుర్ర, బుద్ధి పెరగలేదు అంటూ జగన్ ఎంతో హేళనగా మాట్లాడారు. సాక్షాత్తు ఒక సియంగా ఉంటూ, నిండు శాసనసభలో, మరో శాసనసభ్యుడిని, బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే, జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉందో చూడవచ్చు. ఇది మొదటి సారి కాదు. నిన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు జగన్. మాటిమాటికీ ఇలాగే హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. నా బాడీ పెరిగిందని, కానీ బుద్ధి పెరగలేదని జగన్ నన్ను మాటి మాటికి విమర్శిస్తున్నారు అన్న అచ్చెంనాయుడు, జగన్,నీకు కూడా అది పెరగాలని కోరుకుంటున్నా, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, హుందాతనం రావాలని కోరుకుంటున్నా అంటూ అచ్చెన్నాయుడు జగన్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

అసెంబ్లీ మీడియా పాయింట్ లో అచ్చెంనాయుడు ఈ వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, అన్ని అవాస్తవాలు చెప్పి, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేసి, పారిపోయారని అన్నారు. అసలు జగన్ గారికి ఏ విషయం పైనా అవగాహన లేదని అన్నారు. చాలామంది కన్సల్టెంట్లను పెట్టుకుంటున్నట్లు విన్నాం, అలాగే జగన్ గారు శాసనసభను ఏ విధంగా జరపాలో తెలుసుకునే కన్సల్టంట్ ను పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. మేము మాట తప్పం మడమ తిప్పం అన్న జగన్, చంద్రబాబుకి ఛాలెంజ్ చేశారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. సమస్యలు దారి మళ్లించేందుకు చంద్రబాబును, తనను అవమానించేలా మాట్లాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు .

నిన్నటి నుంచి ఈ రోజు దాకా, అసెంబ్లీలో హాట్ టాపిక్ రైతులకు సున్నా వడ్డీ రుణాలు. నిన్న కరువు పై జగన్ మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు, ఎవరూ సున్నా వడ్డీలకు రుణాలు ఇవ్వలేదని, మేమే ఈ పధకం ప్రవేశపెట్టామని చెప్పారు. జగన్ మాట్లాడిన తరువాత, తెలుగుదేశం పార్టీ సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జగన్ మాటలను తప్పుపట్టారు. సున్నా వడ్డీ అనేది జగన్ ప్రభుత్వమే ముందు మోడల పెట్టలేదని, అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి 2013లో మొదలు పెడితే, తరువాత చంద్రబాబు గారి ప్రభుత్వం కంటిన్యూ చేసిందని చెప్పారు. దీని పై జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్తూ, చంద్రబాబు సున్నా వడ్డీ రుణాలు, రూపాయి అంటే రూపాయి ఇవ్వలేదని, దీని పై నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటూ, ఒకటికి రెండు సార్లు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ చంద్రబాబుని రెచ్చగొట్టారు. అంతే కాదు, నేను రికార్డులు తెప్పిస్తున్నా, మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని నిరూపిస్తా, వెంటనే రాజీనామా చేసి చంద్రబాబు వెళ్ళిపోతారా అని ఛాలెంజ్ చేసారు.

దీని పై చంద్రబాబు సమాధనం ఇస్తూ, అన్ని లెక్కలు, డాక్యుమెంట్ లు స్పీకర్ ముందు పెట్టి, తాము 960 కోట్లు సున్నా వడ్డీ రుణాల కింద ఖర్చు పెట్టామని, ఆ వివరాలు సభ ముందు పెట్టారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి ఎదురు దాడి మొదలు పెట్టారు. చంద్రబాబు ఇచ్చింది కేవలం 5 శాతం మాత్రమే అని, అదేదో గొప్పగా ఇచ్చినట్టు, ఆహా, ఓహో అంటూ చెప్తున్నారని చెప్పారు. నేను ఏదో మాట వరుసకు, రూపాయి ఇవ్వలేదు అన్నానని, దాన్ని పట్టుకుని, ఇంత సాగదీస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. అయితే, ఇక్కడితో చర్చ ముగిసింది. వెంటనే బుగ్గన గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందరూ జగన మోహన్ రెడ్డి గారు, ఎన్ని వేల కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారో అని ఆశగా ఎదురు చూస్తుంటే, బుగ్గన గారు చెప్పింది, వడ్డీ లేని రుణాల కింద, 100 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మరి, ఇప్పుడు జగన్ గారిని, ఆహా, ఓహో అనాలా ? నిన్న ఒక్క రూపాయి ఇవ్వలేదని ఛాలెంజ్ చేసారు, ఈ రోజు ఉదయం ఇంత తక్కువా అని చంద్రబాబు ఎద్దేవా చేసి, మధ్యాహ్నం చంద్రబాబు కంటే తక్కువగా 100 కోట్లు కేటాయించారు. ఇలా ఉంది మన జగన్ గారి, పూటకు ఒక తీరు.

Advertisements

Latest Articles

Most Read