గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. పట్టిసీమ నీళ్ళు వదిలిన నేపధ్యంలో, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ కోసం, తన నియోజకవర్గంలో భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాలని కోరారు. గత మూడేళ్ళుగా చంద్రబాబు ప్రభుత్వం వారిని ఆదుకున్న విషయాన్ని ప్రస్తావించారు. పట్టిసీమ మొదలైన నేపధ్యంలో, వారి పోలాలకు పట్టిసీమ నీళ్ళ కోసం 500 మోటార్లు ఏర్పాటు చేసామని, ప్రతి సారి చేస్తున్నామని చెప్పారు. దీని కోసం, ప్రతి సారి ప్రభుత్వం మోటార్లకు ఉచిత విద్యుత్ ఇస్తూ వచ్చిందని, ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. 500 మోటార్లు వల్లభనేని వంశీ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం అధికారులు అక్కడ కరెంట్ ఇవ్వటానికి సిద్ధంగా లేరు అని తెలియటంతో, వంశీ, జగన్ కు లేఖ రాసారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించాలన్నారు. 2014కి ముందు వరకు, అక్కడ రైతుల భూమి ఇవ్వకపోవటంతో, రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పనులు నిలిచిపోయాయన విషయాన్ని గుర్తు చేసారు. అయితే పట్టిసీమ ప్రాజెక్ట్ కోసమని, చంద్రబాబు సుచనతో, రైతులు పెట్టిన కేసులు వెనక్కు తీసుకోవటంతో, పట్టిసీమ ప్రవాహం కృష్ణా నదికి చేరిందని, కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ చెప్పారు. మరి ఈ విషయం పై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే పట్టిసీమ లేట్ అవ్వటంతో, డెల్టా రైతులు అల్లాడిపోతున్నారు. రెండు రోజుల క్రితం, పట్టిసీమ ప్రవాహం ప్రారంభమయ్యింది.

ఎన్నికల ముందు వరకు చంద్రబాబుని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి, సోషల్ ఇంజనీరింగ్లో చంద్రబాబుని ఓడించటంలో, సూపర్ సక్సస్ అయిన ముద్రగడ, మళ్ళీ ఆక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు చంద్రబాబుకి ఉత్తరాలు రాసిన ముద్రగడ, ఇప్పుడు జగన్ కు ఉత్తరాలు మొదలు పెట్టారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డికి ఉత్తరం రాసారు ముద్రగడ. ఈ లేఖలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో మా కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదనుకుని, తమ కాపు కులం ఓటర్లు అందరూ, మీకే ఓటేశారని ముద్రగడ, జగన్ కు గుర్తు చేసారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించారు. మా కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్ముతున్నామని ముద్రగడ అన్నారు. కాపు కులానికి న్యాయం చేయాలని ముద్రగడ జగన్ కు రాసిన లేఖలో కోరారు. కాపు రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రపదేశ్ లో కాపులు అందరూ మీకే ఓటు వేసారని అన్నారు. ఇది గుర్తించి, కాపులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత మీపై ఉందని ముద్రగడ అన్నారు. గత ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ఇస్తూ ప్రక్రియ ప్రారంభించిందని, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఉన్నత కులల్లలోని పేదలకు కేంద్రం ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అందులో 5 శాతం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని, తన లేఖలో జగన్‌ ను ముద్రగడ పద్మనాభం కోరారు. అయితే ఈ లేఖలో, పరోక్షంగా జనసేన పార్టీని కాపు పార్టీ అని చెప్పటం పట్ల, జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో పక్క కాపులకు రిజర్వేషన్ లు కుదరదు అని చెప్పిన జగన్, ముద్రగడ లేఖ పై ఎలా స్పందిస్తారో మరి.

మంగళవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా, తాడిపత్రిలో పర్యటించారు. గత 40 రోజులుగా వైసీపీ నేతల దాడిలో మరణించిన, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వటానికి, ఈ పర్యటన చేసారు. తాడిపత్రిలో కిరాతకంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ సభ్యుడు కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లోనూ సచించమని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ప్రజలే తగిన శాస్తి చేస్తారని చంద్రబాబు అన్నారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. ఒక పక్క దాడులు చేస్తూ, మరో పక్క తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కార్యకర్తలే కాదని, శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పై, ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పై నా దాడి చేసారని చంద్రబాబు అన్నారు.

మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక్క గ్రామానికే చెందిన పార్టీ కాదని, రాష్ట్రం అంతటా ఉందని, అన్ని చోట్లా మీకు అండగా ఉంటామని, మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలని కార్యకర్తలకు పిలుపిచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు, మేమంతా మీకే ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అని అందరూ అడుగుతున్నారు, అయితే ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లాకు ఎప్పుడూ లేనంత నీరు ఇచ్చి, కోస్తాకు ధీటుగా చేసామని, అయితే విధి వైపరీత్యం, ఏమి చెయ్యలేమని, ఓడిపోయినా ప్రజల కోసమే పోరాడతామని చంద్రబాబు అన్నారు.

కర్నూల్ జిల్లా టిడిపి నేత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు అంటూ, హడావిడి చేసారు. అయితే, అనూహ్యంగా కోట్ల బయటకు వచ్చి చంద్రబాబుని పొగుడుతూ, జగన్ పాలన పై విమర్శలు సెహ్సారు. ఒక పక్క జగన్ పై విమర్శలు చేస్తూనే, చంద్రబాబు పై విమర్శలు చెయ్యటంతో, ఇక ఆయన పార్టీ మార్పు వార్తలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎప్పటికైనా చంద్రబాబుని పరిపాలనలో కొట్టే వారు ఎవరూ లేరని, ఇప్పుడు జగన్ కూడా అంతే అని, జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన వంద శాతం బెటర్ అని కోట్ల అన్నారు. వైఎస్ జగన్ ని ప్రజలు దగ్గరకు తీసారు అంటే, అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగానే అని, అందుకే ప్రజలు ఒక అవకాసం ఇచ్చారని కోట్ల అన్నారు.

అయితే, ప్రస్తుతం జగన్ పరిపాలన అనుకున్నట్టు ఏమి లేదని, ఎదో సాగుంతుందని, ప్రజలకు అప్పుడే తేడా తెలిసిపోయిందని అన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై జరుగుతున్న దాడుల విషయంలో కూడా తీవ్రంగా స్పందించారు. తమ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ కూర్చోమని, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని అన్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే. తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేసారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెష్ పార్టీలో కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇక కోలుకునే పరిస్థితి లేకపోవటంతో, ఆయన మొన్న ఎన్నికలో తెలుగుదేశం పార్టీలో చేరారు.a

Advertisements

Latest Articles

Most Read