మొన్నటి వరకు ఒక పధ్ధతి ప్రకారం, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, తెలుగుదేశం పార్టీకి దూరం చెయ్యటంలో వైసీపీ పార్టీ, సోషల్ ఇంజనీరింగ్ లో పర్ఫెక్ట్ గా పని చేసింది. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణులను ఆదుకున్నా, ఓట్లు పడలేదు. అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు, మీ పార్టీ వాళ్ళు నా స్థలం ఆక్రమించారని రోడ్డు ఎక్కారు. మరి ఈ పేద బ్రాహ్మణుడుకి జగన్ న్యాయం చేస్తారా ? వివరాలు ఇలా ఉన్నాయి. ‘జగన్ గారూ మా స్థలాన్ని మీ పార్టీ నేత కబ్జా చేశారు’ అని ఒక ఫ్లెక్సీ పెట్టుకుని, ఒక పేద బ్రాహ్మణుడు, ఏకంగా అధికారంలో ఉన్న పార్టీ పై పోరాడుతూ, జగన్ ని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. అదే నియోజక్వరంలో ఉండే తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మల్యే బొండా ఉమా ఈ విషయం పై ప్రభుత్వాన్ని నిలదీసినా, ఎవరూ పట్టించుకోలేదు.

ఆ ఫ్లెక్సీలో ఉన్న మాటలు ఇవి "మాతృదేవోభవ.. గౌరవనీయులైన జగన్ గారు, సీనియర్ సిటిజన్ అయిన మా అమ్మగారికి స్థలం తప్పుడు పత్రాలతో 43 క్రిమినల్ కేసులు ఉన్న మీ పార్టీ నాయకుడు, శ్రీ పూనూరు గౌతమ్‌రెడ్డి కబ్జా చేసి, అక్రమ కట్టడం (VMC Declared)నిర్మించి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ ను నడుపుతూ, గత ఐదేళ్లగా మా కుటుంబమును భయబ్రాంతులకు గురిచేయుచున్నారు. మేము సాంప్రదాయ మరియు ఉన్నత విద్యను అభ్యసించిన బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారము. మేము ఏ రాజకీయ పార్టీకి చెందనివారము. స్థలముతో పాటూ మీ అపాయింట్‌మెంట్ ఇప్పించ ప్రార్థన. మీక సహస్ర వందనములతో.. ఉమా మహేశ్వర శాస్త్రి గండూరి’అంటూ ఆ ఫ్లెక్సీలో వేడుకున్నారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఎవరూ దీని పై స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం, ఇది బాగా వైరల్ అవ్వటంతో, ప్రతి ఒక్కరు ఇది చూసి, మొన్నటి వరకు బ్రాహ్మణులకు మేమే న్యాయం చేస్తాం అన్న జగన్, ఇప్పుడు ఈ విషయం పై స్పందించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నారు.

అసెంబ్లీ వేదికగా నేను ఆరుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు, కాని నేను అలా తీసుకోను అని చెప్పన జగన్, రూటు మార్చి వేరే రూపంలో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్ లు అన్నీ తిరగేసి, ఎక్కడన్నా తేడా ఉందా, లేకపోతే ఏదన్న చిన్న లూప్ హోల్ దొరికినా, వారి పై కేసులు వేసి, ఎమ్మెల్యే పదవికి అనర్హత వేయ్యాలని కోర్ట్ కు వెళ్లారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల పై ఇలా చేసారు వైసీపీ నేతలు. నలుగిరి పై వైసీపీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామ కృష్ణమూర్తి, మద్దాలి గిరిధర్‌రావు, అచ్చెంనాయడుల ఎన్నికను రద్దు చేయాలని అందులో కోరారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు. ఆయన అఫిడవిట్ లో క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించలేదని, 2007లో ఓబులాపురం గనుల క్వారీ వద్ద దౌర్జన్యానికి పాల్పడితే కేసు ఉందని చెప్తున్నారు.

ఇక ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం బలరాం పై కూడా ఇలాగే వేసారు. అందుకే ఆయన ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టులో వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ హైకోర్టులో కేసు వేసారు. కారణం బలరాం, ఒక సంతానం గురించి అఫిడవిట్ లో రాయలేదని అందుకే కోర్ట్ అనర్హత వేటు వెయ్యాలని కోరారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు కూడా వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ వేసారు. ఆయన బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గోట్టేరాని పిటీషన్ లో చెప్పారు. ఇక మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఎన్నిక పై కూడా, వైసీపీ నేత పేరాడ తిలక్ అభ్యంతరం చెప్తున్నారు. అచ్చెన్నాయుడు తన ఎన్నికల అఫిడవిట్‌లో, తనపై అరెస్ట్‌ వారెంట్‌ను దాచిపెట్టారని తిలక్ ఆరోపిస్తున్నారు. మొత్తంగా, ఇలా అఫిడవిట్ లు అన్నీ చూసి, ఎదో ఒక తప్పు పట్టుకుని, తెలుగుదేశం పార్టీ ఎమ్మల్యేల పై అనర్హత వేటు వేయించి, తరువాత స్థానంలో ఉన్న తమ పార్టీ నేతలను ఎమ్మల్యేలుగా చేసుకునే ప్లాన్ వేసారు. మరి తెలుగుదేశం కూడా ఇలా రివర్స్ ప్లాన్ వేసి, 151 మంది అఫిడవిట్లు కూడా ఇలాగే చూసి, ఎదో ఒకటి పట్టుకుని కోర్ట్ కు వెళ్తే, ఎలా ఉంటుందో మరి.

కొన్ని సంవత్సరాల క్రితం, విజయవాడలో ఆస్తి వివాదంలో, చిన్నారి వైష్ణవిని కిడ్నాప్ చేసి, గుంటూరులోని ఒక బాయలర్ లో పాడేసి, ఆ చిన్నారిని కాల్చి చంపేసిన విషయం ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు, మళ్ళీ ఈ భయంకర సంఘటన గుర్తు చేస్తూ, మీ పిల్లలను కూడా ఇలాగే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఇలా, గుంటూరు జిల్లాకు చెందిన రావూరి వెంకటేశ్వర్లు, అనురాధ దంపతులను, తీవ్రంగా బెదిరించారు, వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఐటీ విభాగంలో పనిచేస్తున్న కొందరు. దీంతో వారు, తమ పాపకు ప్రాణ బిక్ష పెట్టి, రక్షించాలని, గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. వారి కధనం ప్రకారం, వైసీపీ కార్యాలయం ఐటీ విభాగంలో పనిచేస్తున్న కే మహేంద్ర రెడ్డి నుంచి వ్యాపారం కోసమని, అప్పు తీసుకున్నారు. రూ. 15 లక్షలు రూ. 4 వడ్డీకి అప్పు తీసుకున్నారు. దీనికి ప్రతి నెలకు రూ. 60వేలు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారురు. ఇప్పటి వరకు, రూ. 28 లక్షల వరకు చెల్లించారు. ఇప్పటికే అప్పు తీర్చేసనని, అప్పు తీసుకున్న సమయంలో ఇచ్చిన చెక్కులు, నోటు ఇవ్వమని అడగగా, వైసీపీ ఐటీ విభాగంలో పనిచేస్తున్న మహేంద్ర రెడ్డి అడ్డం తిరిగాడు.

ఇంకా ఇవ్వాలని, ఇంకా ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాడు. ఇక నా వల్ల కదాని, మొత్తం తీర్చేసాను కదా అని వెంకటేశ్వర్లు చెప్పడంతో రెండు చెక్కులను రూ. 5 లక్షలకు వేరేవారి పేరుతో కోర్టులో వేశారు. అంతటితో ఆగలేదు, కొద్ది రోజుల క్రితం మహేంద్రరెడ్డి, తనతో కలిసి పనిచేస్తున్న శంకర్‌రెడ్డి, చెన్నూరి చిన సుబ్బారావు, ఇప్పల నర్సిరెడ్డితో కలిసి కార్లలో ఆయనింటికి వచ్చి దాడిచేశారు. మళ్ళీ పోయిన వారం, వెంకటేశ్వర్లుకు ఎవరో ఫోన్‌ చేసి, తనను తాను జగన్ గన్‌మెన్‌గా పరిచయం చేసుకొన్నాడు. మహేంద్రరెడ్డికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని బెదిరించాడు. మరో వైసీపీ నాయకుడు సుంకర రామాంజనేయులు ఫోన్‌ చేసి, ఇది జగన్‌ పీఏ పర్సనల్‌ అని, వెంటనే డబ్బులు ఇవ్వాలని, లేదంటే వైష్ణవి తరహాలోనే నీ కూతుర్ని కూడా కిడ్నాప్‌ చేసి బాయిలర్‌లో వేస్తామన్నాడు. దీంతో ప్రాణ భయంతో, గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు.

ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా, తాడిపత్రిలో పర్యటిస్తున్నారు. వైసీపీ నేతలు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపిన విషయం తెలిసిందే. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించటానికి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక ఆసక్తికర విషయం చెప్పారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది. తాడిపత్రికి చెందిన ఒక గ్రామ స్థాయి కార్యకర్త, చంద్రబాబుకి రాసిన లేఖ, వివిధ పత్రికా కార్యలయాలుకు పంపించి, ఇది ప్రచురణ అయ్యేలా చూడమన్నారు. ఇది తెలిసిన టిడిపి కార్యాలయ సిబ్బంది, ఆ లేఖను తీసుకుని, చంద్రబాబుకి కూడా ఇచ్చారు. ఆ లేఖలో ఒక సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పడే ఆవేదన అంతా పంచుకున్నాడు, ఆ కార్యకర్త. "అన్నా, చంద్రన్నా" అంటూ లేఖ మొదలు పెట్టారు. మీరు ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్తారు, కాని అధికారంలోకి వస్తే మాత్రం, మీ నుంచి, మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు దాకా ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు అన్నారు.

పచ్చిగా చెప్పాలి అంటే, మీకు అధికారంలో ఉంటే కార్యకర్త కనిపించదు, మీరు రాష్ట్ర అభివృద్ధిలో మునిగిపోతే, స్థానిక నాయకుల వద్దకు వెళ్ళాలన్నా, రికమండేషన్లు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పారు. అంతే కాదు, నాయకులు అందరూ కలిసి, వాస్తవ పరిస్థితి చెప్పకుండా, ఎలా భజన చేసే వారో కూడా ఆ లేఖలో రాసారు. అధికారంలో ఉండగా మేము కనిపించం, కాని ప్రతిపక్షంలో ఉంటే, మీకు దేవుళ్ళు లాగా కనిపిస్తాం అని అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, మమ్మల్ని చంపేస్తున్నారు. ఇలాంటి మమ్మల్ని కాదని, ఎవరెవిరినో అందలం ఎక్కించారు, ఇప్పుడు వాళ్ళు ఏమి చేసారు, అని ప్రశ్నించారు. మీరు వారి మాటలు విని మునిగిపోయారు అని అన్నారు. ఇప్పటికైనా దయచేసి కార్యకర్తలను వదలకండి, సిన్సియర్‌ కార్యకర్తలను, నమ్మండి అంటూ ఆ లేఖను ముగించారు. ఈ లేఖ చూసిన వారు , తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత మనోవేదనకు గురయ్యారో అర్ధమవుతుంది అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read