చంద్రబాబు మీద కక్షతో, ఆయన తన కార్యక్రమాలకు ప్రజావేదిక ఇవ్వాలి అని కోరాటంతో, రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుని ప్రజా వేదిక కూల్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తరువాత చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూడా కూల్చేయటానికి పధకం రచించారు. దీని కోసం, కరకట్ట పై ఉన్న నివాసాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చారు. అయితే ఇవన్నీ దాదాపుగా రాజశేఖర్ రెడ్డి సియంగా ఉండగా అనుమతులు ఇచ్చినవే. అప్పటికి నదికి 100 మీటర్ల దాక ఏ కట్టడం కట్టకూడదు అనే చట్టం లేదు. అయితే ఇవన్నీ పక్కన పెట్టి, చంద్రబాబుని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే, కరకట్ట పై ఉన్న బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి కూడా నోటీసులు పంపించారు. అయితే గోకరాజు మాత్రం, నోటీస్ లను లైట్ తీసుకున్నారు. ఆయనకు ఎక్కడ స్విచ్ వేస్తె, ఎక్కడ లైట్ వేలుగుతుందో తెలిసు కాబట్టి, ప్రభుత్వం తనని ఏమి చెయ్యలేదు అనే ధీమాతో ఉన్నారు. అంతే కాదు, ఆయన ఈ నోటీసుల పై స్పందించిన తీరు మరీ వెరైటీగా ఉంది.
ఆయన స్పందన చూసి ప్రజలు కూడా అవాక్కయ్యారు. గోకరాజు గంగరాజు స్పందిస్తూ, కరకట్ట పై తాము ఏమి ఆక్రమించుకోలేదని, కృష్ణా నదే మా భూములను ఆక్రమించిందని వెరైటీగా స్పందించారు. కరకట్ట పై ఉన్న భూములను కృష్ణా నదే కబ్జా చేసిందని గోకరాజు చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అవాక్కయ్యారు. అయితే తన గెస్ట్‌హౌస్‌లో కొంత భూమి అక్రమమేనని గోకరాజు అంగీకరించారు. తన గెస్ట్ హౌస్ లో ఉన్న ఒక భవనానికి ఉడా అనుమనుతులు ఉన్నాయ అన్నారు. కొద్ది కాలం క్రితం నిర్మించిన భవనానికి అనుమతులు లేవని, అనుమతి కోరినా మంజూరు కాలేదని అన్నారు. తనకు కృష్ణా నది లోపల కూడా భూమి ఉందని, వరదలు వచ్చిన ప్రతీ సారి కొంత భూమి పోతూ వచ్చిందని చెప్పారు. ప్రజా వేదికను కూల్చినట్టు, అన్నీ కుల్చాలంటే, రాష్ట్రంలో నదుల వెంట కొన్ని వేలు బిల్డింగ్స్ ఉంటాయని, అవన్నీ కూల్చిన తరువాత తన పై కూడా ఇష్టం వచ్చిన చర్యలు తీసుకోవచ్చని అన్నారు. తాను మామూలు గెస్ట్ హౌస్ కట్టుకున్నాని, అదేమీ విలాసవంతమైన భవనం కాదని అన్నారు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తారాని, దానికి ఎదో ఒకటి చెయ్యాలి కాని, కూల్చేస్తాం అంటే ఎలా అని అన్నారు. తనకు వచ్చిన నోటీస్ పై, వారంలో సీఆర్డీఏకి సమాధానం చెప్తానని గోకరాజు అన్నారు.