వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పై లైంగిక ఆరోపణలు చేసిన కోటి, నిన్న బీజేపీ పార్టీలో చేరారు. ఏకంగా ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, కోటిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఈ పరిణామం పై, బీజేపీ అనధికార మిత్రపక్షం వైసీపీ, బీజేపీ పై అసహనం వ్యక్తం చేసింది. మా పార్టీ నేత పై లైంగిక ఆరోపణలు చేసిన కోటిని, మీ అధ్యక్షుడే పార్టీలో చేర్చుకున్నారు అంటే, మమ్మల్ని అవమానించనట్టె కదా అంటూ ఆక్షేపించారు. అలాగే సోషల్ మీడియాలో కూడా వైసీపీ కార్యకర్తలు, ఈ విషయం పై బీజేపీ పై విమర్శలు గుప్పించారు. కోటికి, మేడలో కాషాయం కండువా కప్పుతున్న కన్నా ఫోటో, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాగా వైరల్ అయ్యింది. కోటి పై విమర్శలు చేస్తూ, లక్ష్మీపార్వతి కోటీ పై సిబిఐ విచారణ కోరుతున్నారని, అందుకే సిబిఐ విచారణ తప్పించుకోటానికి కోటి బీజేపీలోకి చేరారని, చేసిన తప్పులు బీజేపీలో చేరితే పోతాయా అని ? బీజేపీ పార్టీ పై సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది.

ఈ పరిణామాల పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అలెర్ట్ అయ్యింది. కోటిని బీజేపీలో చేర్చుకుంటే వైసీపీ దూరం అవుతుందని భావించిన నేతలు, కోటి చెరక పై వివరణ ఇచ్చుకున్నారు. కోటి బీజేపీలో చేరడం అనుకోకుండా జరిగిపోయిందని, అతని గురించి, స్థానిక పార్టీ నేతలకు సరైన సమాచారం ఇవ్వకుండా అతడు బీజేపీలో చేరారని ఏపీ బీజేపీ వివరణ ఇచ్చింది. అతను ఎవరో కూడా సరిగ్గా తెలియదని, కొంచెం కమ్యునికేషన్ గ్యాప్ ఉండటం వల్ల, కన్నా లక్ష్మీనారాయణ కూడా కండువా వేసారని చెప్పింది. బీజేపీలో కోటికి సభ్యత్వం ఇంకా ఇవ్వలేదని, అతడికీ బీజేపీకి ఎలాంటి సంభందం లేదని, అతడు బీజేపీ సభ్యుడు కాదని ఏపి బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మీడియాకు ప్రకటన విడుదల చేసింది. మరి ఇప్పటికైనా వైసీపీ నేతలు శాంతిస్తారో లేదో చూడాలి.

మా జీవితాలు నాశనం చెయ్యద్దు, మిమ్మల్ని నమ్ముకుని ఓటు వేసాం, నెల రోజుల్లోనే ఇలా చేస్తారా అంటూ, ఆరోగ్యమిత్రలు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు తాడేపల్లిలో ఉన్న జగన్‌ నివాసం దగ్గరకు వందలాదిగా వచ్చిన ఆరోగ్యమిత్రలు ఆందోళన చేస్తూ, తమ నిరసన తెలియచేసారు. జగన్ వస్తే తమ జీవితాలు మారతాయని ఓటు వేసి గెలిపించుకున్నామని, ఇప్పుడు అసలు తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేసారు. 11 ఏళ్లుగా మేము ఈ పని చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా పుట్టుకుచ్చిన వాలంటీర్లకు తమ విధులు అప్పగిస్తారన్న సమాచారం ఉందని, ఇలా చేస్తే మేము ఏమి చెయ్యాలి అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ నిరసనలో 13 జిల్లాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. మాకు జీతం ఇవ్వరని, కమీషన్ ప్రాతిపదికన పని చేస్తామని, అయినా సారే ఎలాగోలా నేట్టుకోస్తుంటే, ఇప్పుడు ఇది కూడా లేకుండా చేస్తారా, మా పని వాలంటీర్లుకు ఇస్తే, మా కమీషన్ తగ్గిపోదా అని నిలదీశారు.

గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రాగానే, తమను తీసేస్తారనే ప్రచారం జరుగుతోందని, దీని పై జగన్ క్లారిటీ ఇవ్వాలని, ఉద్యోగాలకు భరోసా ఇవ్వాలని కోరారు. పోలీసులు ఎంత వారించినా వినకపోవటంతో, నిరసన చేస్తున్న మహిళలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల వ్యవహరించిన తీరు పై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన మాకు, ఇదేనా చేసే న్యాయం అంటూ నినాదాలు చేసారు. రాష్ట్రంలో ఆరోగ్య పధకాలు అమలు చెయ్యటం వీరి పని. ఆరోగ్య పధకలాను ప్రజల్లోకి తీసుకు వెళ్లి, రోగికి వైద్య సహాయం అందిచటం, పధకాల గురించి అవగాహన, శస్త్ర చికిత్స జరిగిన సమయంలో బాగోగులు, తిరిగి ఇంటికొచ్చిన తరువాత మందులు తీసుకునేలా చైతన్య పరచడం, చికిత్స జరిగిన విధానంలోని అభిప్రాయాలు, ఫిర్యాదుల నమోదు, వైద్యశిబిరాలు నిర్వహించడం ఇంకా ఎన్నో వీరి విధులు. ప్రభుత్వానికి, ప్రజలకు వైద్య మరియు ఆరోగ్య సలహాలు అందించే ఓ వారధి అని చెప్పవచ్చు.ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఆరోగ్యమిత్రలను తీసేసి, వాలంటీర్లు బాధ్యత అప్పగిస్తారని, రాష్ట్ర ఉన్న 18 వేల మంది ఆరోగ్య మిత్రల భ్యవిషత్తు నాశనం చెయ్యవద్దని జగన్ ని కోరుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జగన్ వైఖరిని తప్పు బడుతున్నారు. ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ఎలా ముందకు నడిపిద్దామని అని చూసామే కాని, ఎలాంటి తప్పులు చేయలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ప్రభుత్వం కావటం వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటిని పరిష్కారం చేస్తూ, ఆంధ్రా ప్రజల మనోభావాలు కాపాడుతూ, అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లానని చెప్పారు. జీతాలు ఇవ్వలేని స్థితిలో, ఆర్ధిక పరిస్థితి ఉన్న, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ప్రజలు ఏ కష్టం రానివ్వలేదని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్మాన్ని కాపాడామని చెప్పారు. ఏ నాడు లైన్ దాటలేదని, ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదురుకున్నామే కాని, దాడులు, కక్ష తీర్చుకోవటం వంటివి చెయ్యలేదని అన్నారు.

కాని ఇప్పుడు, తెలుగుదేశం శ్రేణులు పై దాడులు పెరిగిపోయాయి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతల పై , వైసీపీ చేస్తున్న దాడులను చంద్రబాబు ఖండించారు. కొత్త ప్రభుత్వం కాబట్టి, ఆరు నెలలు సమయం ఇచ్చి, వారి పరిపాలన చూసి స్పందిద్దామని, నిర్మాణాత్మకంగా ఉండాలని అనుకున్నామని చంద్రబాబు అన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉండటం , ప్రతిపక్షంలో ఉండటం తమ పార్టీకి కొత్తేమి కాదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు మా పైనే అవినీతి మరకలు వెయ్యాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏదైనా అవినీతి చేసమంటే, విచారణ జరుపొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. అలా కాకుండా, ఎలా అయినా సరే, చెప్పండి చెప్పండి అంటూ, సబ్‌కమిటీ వేసి, అధికారులను అవినీతి చేస్తే సన్మానిస్తాము అని చెప్పి, ఎవరూ స్పందిచక పోవటంతో, మీలో ఎవరికీ సీరియస్‌నెస్ లేదని అధికారులను సీఎం జగన్ హెచ్చరించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎలా అయినా సరే తమ పై అవినీతి మచ్చ వెయ్యాలని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, ఎందుకు ఇంత తాపత్రయం అని చంద్రబాబు అన్నారు. గత సంవత్సర కాలంగా మోడీ కూడా ఇలాగే చేసి, చివరకు అవినీతి మరక అంటించ లేకపోయారని గుర్తు చేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రశాంతతకు మారు పేరు. గత 5 ఏళ్ళుగా రాయలసీమ కూడా ప్రశాంతంగా ఉండటంతో, అక్కడకు కూడా కంపెనీలు వస్తున్నాయి. అనంతపురంలో కియా, కర్నూల్ లో సీడ్ ప్లాంట్, కడపలో సోలార్ ప్లాంట్ ఇలా అనేక పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, మళ్ళీ రాయలసీమలో టెన్షన్ వాతావరణం వచ్చేసింది. తాజాగా కడప జిల్లా మైలవరం మండలలోని రామచంద్రాయపల్లె సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సోలార్‌ ప్లాంట్ లో, గుర్తు తెలియని వ్యక్తులు, దాదపుగా 1,700కు పైగా సోలార్‌ ప్యానెల్స్ నాశనం చేసారు. ఈ చర్యతో కంపెనీని రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు కంపెనీ సిబ్బంది చెబుతున్నారు. సోలార్ కంపెనీ ఉన్న 16వ ప్లాంటులో ఈ ఘటన చేసుకుంది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సోమవారం ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది అధికారులకు తెలిపారు. దీంతో కంపెనీ ఉదయ్‌, దస్తగిరిరెడ్డి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జమ్మలమడుగు రూరల్‌ సీఐ మంజునాధ రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని సోలార్‌ ప్యానెల్స్ ధ్వంసం చేసిన విధానం పరిశీలించారు. కంపెనీ సిబ్బందిని అడిగి, వివరాలు రాబట్టారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ లో 250 మెగావాట్ల సామర్థ్యంతో, సోలార్ ప్లాంట్ రెడీ అవుతుంది. దీనికి సంబందించిన పనులు, ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు జరిగాయి. ఆదివారం రాత్రి ఈ ప్యానెల్స్ ను ధ్వంసం చేసారు. జరిగిన విధానం చూస్తే, 1,700లకు పైగా సోలార్‌ ప్యానెల్స్ ను గొడ్డలి లాంటి ఆయుధాలతో ధ్వంసం చేసినట్లు అర్ధమవుతుంది. ఈ చర్యతో దాదాపు మూడు కోట్ల మేర నష్టం జరిగిందని, ఇది కంపెనీకి చాలా నష్టం అని, ఇలా జరిగితే, మేము ఇక్కడ నుంచి ప్లాంట్ ఎత్తేయటమే అని కంపెనీ సిబ్బంది వాపోతున్నారు. అయితే ఈ గుర్తు తెలియని దుండగలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు సరైన దర్యాప్తు చేస్తే, వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది.

Advertisements

Latest Articles

Most Read