గత 5 ఏళ్ళ కాలంలో వినిపించిన రెండు సమస్యలు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వినిపిస్తున్నాయి. ఒకటి కరెంటు కోతలు, రెండు రైతులకు విత్తన కష్టాలు. చంద్రబాబు అవలంభించిన విధానాలతో, రైతులకు సరైన సమయానికి విత్తనాలు అందేవి. సరైన టైంకు నీరు కూడా ఇచ్చేవారు. దీంతో సరైన టైంకు సాగు చేసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, రైతులకు మళ్ళీ విత్తన కష్టాలు ప్రారంభం అయ్యాయి. వర్షాలు పడుతున్నా, రైతులు పొలాల్లో కాకుండా, రోడ్ల మీద ఉంటున్నారు. ఈ ప్రజా సమస్యల పై స్పందించకుండా, వీటిని డైవర్ట్ చెయ్యటానికి, కూల్చివేతలు, కేసీఆర్ తో వారనికి ఒకసారి మంతనాలు చేస్తూ కాలం గడిపేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ విత్తన సమస్య అనంతపురం జిల్లాలో అధికంగా ఉంది. దీంతో ఈ విషయం పై, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రైతులకు విత్తన కష్టాల పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ, రైతుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అంటూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వర్షాలు పడుతున్నాయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు అవుతుంది, ఇప్పటి వరకూ రైతులకు, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదు అంటే, ప్రభుత్వం ఎంత మొద్దు నిద్ర పోతున్నారో అర్థంఅవుతుంది అన్నారు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్, సరైన సమయానికి, వేరుశనగ విత్తనం అందించడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి విధానాలతో, రైతులు రోడ్డెక్కే పరిస్థితి దాకా వచ్చిందని అన్నారు. ఈ సమయానికి, పొలాల్లో ఉండాల్సిన రైతులు, విత్తనాలు, ఎరువుల కోసం అర్ధరాత్రి వరకూ విత్తన కౌంటర్ల వద్ద పడిగాపులు పడినా, విత్తనాలు ఇవ్వటం లేదని, రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి తీసుకు వచ్చారాని ఆవేదన వ్యక్తం చేసారు. గడిచిన 5 ఏళ్ళ కాలంలో, టీడీపీ పాలనలో విత్తనాల కొరత రాకుండా చేసి, ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే నాణ్యమైన విత్తనం, ఎరువులు అందించామని గుర్తుచేశారు. ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఇప్పటికైనా రైతులకు విత్తనం, ఎరువులు అందించాలని, ఇంకా ఆలస్యమైతే, విత్తనాలు ఇచ్చినా రైతులు ఏమి చేసుకోలేరని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్‌ కోతలు పై కూడా బాలకృష్ణ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మొన్న ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడు చంద్రబాబుకు స్క్రిప్ట్ బలే రాసారు అంటూ, ప్రతి మీటింగ్ లో, చివరకు అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయం చూసాం. అయితే, జగన్ మాటలకు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ అదిరిపోయేలా అదే స్క్రిప్ట్ భాషలో సమాధానం చెప్పారు. జగన్ గారు, దేవుడు స్క్రోప్ట్ రాసి ముగించలేదు, స్క్రిప్ట్ రాస్తూ రాస్తూ, కామా పెట్టాడు అంతే. మీరు ఇదే ఫుల్‌స్టాప్ అనుకుంటున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తూ కామా పెట్టి, మళ్ళీ ఇప్పుడు స్క్రిప్ట్ రాయటం మొదలు పెట్టారు. ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఏ పట్టిసీమ అయితే వేస్ట్ అన్నారో, ఏ పట్టిసీమలో అయితే అవినీతి జరిగింది అన్నారో, అదే పట్టిసీమ మోటర్లు మీ చేతే ఆన్ చేయించాడు ఆ దేవుడు. మేము పోలవరం అంచనాలు అడ్డగోలుగా పెంచేసామని, అవినీతి చేసామని మీరు గోల చేసారు, అయితే అదే పోలవరం అంచనాలు య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు, ఆ దేవుడు అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

చంద్రబాబు హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు అన్నీ అక్రమం అని మీరంతుంటే, అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు దేవుడు. దేవుడు రాస్తున్న స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి జగన్ గారు. మీరు భ్ర‌మ‌రావ‌తి భ్ర‌మ‌రావ‌తి అంటూ, అమరావతిని ఎలా ఎగతాళి చేసారో, ఇప్పుడు అదే మీరంటున్న భ్రమవారతిలో మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడైనా చంద్ర‌బాబుగారికి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడు అంటూ లోకేష్ ఈ రోజు ట్వీట్ చేసారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి చెప్తున్న దేవుడు స్క్రిప్ట్ తోనే, ఇప్పుడు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనికి వైసీపీ నేతలు, ముఖ్యంగా ట్విట్టర్ లో అందరినీ గిల్లే విజయసాయి రెడ్డి, ఏమని సమాధనం చెప్తారో చూడాలి...

గన్నవరం ఎయిర్ పోర్ట్ ని అధునాతనంగా నిర్మించుకుని, కేంద్రం చేత ఇంటర్నేషనల్ స్టేటస్ తెప్పించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే అప్పట్లో మారిన రాజకీయ పరిస్తితుల కారణంగా, ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా రాకుండా, అప్పటి కేంద్ర పెద్దలు అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం పట్టు వీడ లేదు. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విధానంలో, ఇండిగోని ఒప్పించి, గన్నవరం నుంచి సింగపూర్ దేశానికి ఫ్లైట్ కనెక్టివిటీ తేగలిగారు. ఇదే గన్నవరం నుంచి మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్. తరువాత దుబాయ్ ఫ్లైట్ సర్వీస్ కు కూడా ఒప్పించే ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే, తరువాత ప్రభుత్వం మారటంతో, ఇది మరుగున పడిపోయింది. అయితే, ఇప్పుడు సింగపూర్ సర్వీస్ కూడా ఎసరు వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన విధంగా స్పందిచకపోవటంతో, ఈ సర్వీస్ నడపలేము అంటూ ఇండిగో చేతులు ఎత్తేసింది.

చంద్రబాబు తీసుకు వచ్చిన వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విధానంలో కాంట్రాక్టును మళ్ళీ కొనసాగించలేమని ప్రభుత్వం చెప్పటంతో, ఇండిగో సంస్థ సింగపూర్ ఫ్లైట్ ఆపేసింది. దీంతో, జూలై 9వ తేదీ నుంచి, గన్నవరం - సింగపూర్ ఫ్లైట్ బుకింగ్ ఆగిపోనుండి. ఏం జరిగిందో తెలియదు కాని, మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం కూడా ఈ కాంట్రాక్టు కొనసాగిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఉన్నట్టు ఉంది, ఏపీ ఏడీసీఎల్‌ సంస్థ నుంచి ఇండిగో హెడ్డాఫీసుకు, మేము కాంట్రాక్టును పొడిగించటానికి సానుకూలంగా లేము అంటూ, ఈమెయిల్ వెళ్ళింది. అయితే ఎందుకు రద్దు చేసుకున్నారు అనే విషయం మాత్రం, ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సింగపూర్ - గన్నవరం సర్వీస్ ఎప్పుడూ, 80శాతం పైగా ఆక్యుపెన్సీతో రాక పోకలు సాగించేది. మొన్న సమ్మర్ లో, వంద శాతం ఆక్యుపెన్సీతో సింగపూర్‌ సర్వీసు నడిచింది. ఇప్పుడు ఈ సర్వీస్ రద్దు కావటంతో, ఇక మనకు విదేశీ సర్వీస్ ఆశలు ఇప్పట్లో లేనట్టే..

గత 5 ఏళ్ళుగా నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా, అలుపు సొలుపు లేకుండా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కష్ట పడ్డారు. చివరకు పార్టీని పట్టించుకోలేదు అనే అపవాదు కూడా మూట కట్టుకున్నారు. అంతే కాదు, పార్టీని పట్టించుకోక పోవటం వల్లే, కార్యకర్తలు అసంతృప్తికి లోనయ్యారని, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి ఒక కారణం అనే విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి. ఈ తరుణంలో, చంద్రబాబు ఓడిపోవటం, ప్రతిపక్ష నేత అవ్వటం జరిగిపోయాయి. ప్రతి రోజు ప్రజలు, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చి, వారి కష్టాలు తెలుపుకుని వెళ్తున్నారు. మరో పక్క ప్రజా అవేదికను ప్రతిపక్ష నేతకు ఇచ్చే ఇంటిలో భాగంగా, తనకు ఇవ్వాలని, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా, దాని పై సమాధానం ఇవ్వకుండా, రాత్రికి రాత్రి దాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో గత మూడు రోజులుగా, చంద్రబాబు తన ఇంట్లోనే ప్రజలను కలుస్తున్నారు. అదే విధంగా, పార్టీ నాయకులతో సమావేశాలు కూడా తన ఇంటి నుంచే చేస్తున్నారు.

అయితే ఇక నుంచి తన వర్కింగ్ స్టైల్ మార్చనున్నారు చంద్రబాబు. ఇక నుంచి వారంలో అయిదు రోజుల పాటు గుంటూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు, ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజలకు కూడా ఇక్కడే అందుబాటులో ఉంటారు. చంద్రబ్బు కోసం, ఇప్పటికే గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని సిద్ధం చేసారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి రోజు చంద్రబాబుతో పాటు, పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్‌, ఏపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా, వారంలో అయిదు రోజులపాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. మంగళగిరి సమీపంలో, తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ నిర్మిస్తున్నారు. అది సెప్టెంబర్ చివరకు పూర్తి కానుంది, అప్పటి వరకు చంద్రబాబు గుంటూరు నుంచే పని చేస్తున్నారు. ఎక్కువ సమయం కార్యకర్తలతో గడపనున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవటమే ధ్యేయంగా చంద్రబాబు తన టీంని రెడీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు బుధవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read