దేశ రాజధాని ఢిల్లీలో, ఆంధ్రపదేశ్ కు చెందిన విధ్యార్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మిక ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం, 500 మంది వరకు విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఢిల్లీ వచ్చారు. అయితే, ఏపీ ఇంటర్‌బోర్డు గ్రేడింగ్‌ విధానంతో, ఢిల్లీ యూనివర్సిటీలో పెడుతున్న ఇబ్బందులకు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. గత రెండు రోజులుగా, యూనివర్సిటీలో ప్రవేశాల కోసం వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఉన్న నిబంధనల ప్రకారం, ఆంధ్రపదేశ్ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను, 10తో గుణించి పెర్సెంటేజ్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఢిల్లీ యూనివర్సిటీ వర్గాలు, మాత్రం 10తో కాకుండా, 9.5తో గుణించి ఆ పెర్సెంటేజ్ తీసుకుంటామని అంటున్నారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం 100 మార్కులకు మెరిట్‌ తీసుకుంటున్నారు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు ఇచ్చిన గ్రేడ్‌ మార్కులను 10తో గుణించి 100 మార్కులకు ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశాలు తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.

అయితే ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు మాత్రం అలా తీసుకోకుండా, ఆ నిబంధన అమలు చెయ్యటం లేదని విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ గొడవ తలెత్టటంతో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం వచ్చిన సుమారు 500 మంది ఏపి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదని, త్వరగా స్పందించి, తగు సూచనలు చేసి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఏపి విధ్యార్ధులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, ఢిల్లీ యూనివర్సిటీ అధకారులు, ఏపీ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేశారు. మరి ఈ సమస్య పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి, మన విద్యార్ధులకు న్యాయం చేస్తారో లేదో వేచి చూడాలి.

సోషల్ మీడియా పవర్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే పరిస్థితి. సోషల్ మీడియా గెలుపు ఓటములను కూడా ప్రభావితం చేస్తుంది అనేది మొన్నటి ఎన్నికలో కూడా అర్ధమైంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా, జగన్ పరిపాలనను ప్రశ్నిస్తుంది. ఏ సోషల్ మీడియాలో అయితే జగన్ ను ఎత్తారో, ఇప్పుడు అదే సోషల్ మీడియా ద్వారా జగన్ ను ప్రశ్నించే పరిస్థితి. గత వారం రోజుల్లో, జగన్ ప్రభుత్వం వదిలిన రెండు జీఓలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే, చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అవి మాట్లాడుకునే అంత. నేను కిన్లే వాటర్ బాటిల్ వాడుతూ డబ్బులు ఆదా చేస్తున్నాను అని చెప్తున్న జగన్, ఇప్పుడు దుబారా ఖర్చు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రమాణ స్వీకారం తక్కువలో ఖర్చులో చేసాను అని చెప్పి, రెండో రోజే ఇచ్చిన ఇఫ్తార్ విందులో, 6 వేల మంది భోజనాలకి, 1.1 కోట్లు విడుదల చేసి, జాతీయ మీడియాకు ఎక్కారు.

అయితే ఇప్పుడు ముఖ్యంగా గత వారం రిలీజ్ అయిన రెండు జీఓల గురించి మాట్లాడుకుంటే, ఒక జీఓ ప్రకారం, జగన్ ఇంటి వద్ద హెలీ‌ప్యాడ్ ఏర్పాటుకు, టాయిలెట్ కట్టటానికి బ్యారికేడ్ లు వెయ్యటానికి, రూ.1.89 కోట్ల మంజూరు చేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది, కేవలం టాయిలెట్ లు కట్టటానికి 30 లక్షలు, ఇంటి చుట్టూ బ్యారికేడ్ లు కట్టటానికి 75 లక్షలు విడుదల చేస్తూ జీఓ రిలీజ్ అయ్యింది. ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అని, అదే ప్రజా వేదిక 90 లక్షలతో కడితే ఎందుకు గొడవ చేసరాని ప్రశ్నిస్తున్నారు. ఇక మరో జీఓలో, జగన్ ఇంటి సమీపంలో, 1.3 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణకు రూ.5 కోట్లు మంజూరు చేస్తూ విడుదల అయిన జీఓ పై కూడా నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1.3 కి.మీ రోడ్డుకు, 5 కోట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేని పై ఇప్పటి వరకు వైసీపీ నేతలు మాత్రం, ఏ సమాధానం చెప్పలేదు.

నిన్న కాక మొన్న, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. చంద్రబాబు హయంలో, వైద్యరంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ స్థానంలో ఉందని. ఆ రిపోర్ట్ చూసి మురిసిపోతూ, ఇప్పుడు చంద్రబాబు లేరు కదా, మన వైద్య రంగం పరిస్థితి ఏంటి, వచ్చే సంవత్సరం నాటికి మన ర్యాంక్ ఎంత అనుకునే వారికి, ఇది నిజంగా షాకింగ్ న్యూస్. చంద్రబాబు రెండవ స్థానంలో పెడితే, జగన్ దాన్ని మొదటి స్థానంలో పెడతారు అని అందరూ ఆశించారు. కాని కింద స్థాయిలో పరిస్థితి అప్పుడే మారిపోయింది. సిబ్బందికి నిర్లక్ష్యం అనే జబ్బు మళ్ళీ అందుకుంది, దీంతో ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఘటన, దాన్ని కప్పిపుచ్చటానికి వారు వేసిన వేషాలు చూస్తే, ఎవరికైనా కోపం రాక మానదు. తాడిపత్రి పట్టణానికి చెందిన అక్తర్‌ భాను, పురిటి నొప్పులతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సాయంత్రానికి సిజేరియన్‌ చేసారు. అయితే రక్తం కౌంట్ తక్కువగా ఉండటంతో, ఒక బాటిల్‌ రక్తాన్ని ఎక్కించాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే రక్తం ఎక్కిస్తూ ఉండగానే, శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. దీంతో రక్తం ఎక్కించటం ఆపేసారు. అయితే కొద్ది సేపటికే ఆ బాలింత చనిపోయింది. బంధువులు గొడవ చేసారు. ఆమె గుండెపోటుతో చనిపోయింది అని నమ్మించి పంపించి వేసారు హాస్పిటల్ సిబ్బంది. అయితే అనుమానం వ్యక్తం చేస్తూ, పత్రికల్లో కధనాలు రావటంతో, జిల్లా కలెక్టర్ నేరుగా హాస్పిటల్ కు వచ్చి ఎంక్వయిరీ మొదలు పెట్టారు. అయితే ఆమె రక్తం బీ పోజిటివ్ అంటూ వేరే శాంపిల్స్ చూపించి కలెక్టర్ ను కూడా నమ్మించారు. అయినా కలెక్టర్ కు ఎదో అనుమానం వెంటాడుతూనే ఉంది. వేరే పని ఉండటంతో, నగర పాలక సంస్థ కమిషనర్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసు షీటు లోతుగా పరిశీలించారు. నిపుణులను పిలిపించి క్రాస్ వెరిఫై చేసారు. అయితే ఆమె కేస్ షీట్ లో ఓ ఉన్న బ్లడ్ గ్రౌండ్, బీ గా దిద్ది ఉండటాన్ని చూసారు. దీంతో మరింత లోతుగా అన్నీ విచారించగా, హాస్పిటల్ సిబ్బంది ఓ బదులు, బీ బ్లడ్ గ్రూప్ ఎక్కించారని నిర్ధారణకు వచ్చారు. ఎవరి ఎవరి పై చర్యలు తీసుకోవాలి అనే విషయం పై సమాలోచనలు జరుపుతున్నారు. అయితే, ఇక్కడ ఏకంగా కలెక్టర్ నే, అక్కడి సిబ్బంది బురిడీ కొట్టించిన విధానం చూస్తుంటే, ఒక తప్పు చేసి, దాన్ని నిజం అని నమ్మించటానికి ఎన్ని వేషాలు వేసారో చూస్తే, వీళ్ళు డాక్టర్ల, క్రిమినల్స్ ఆ, అన్న అనుమానం రాక మానదు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అయిన సందర్భంలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై, తన పై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు పై చంద్రబాబు స్పందించారు. తనకు భద్రత తగ్గింపు విషయం పై పెద్దగా ఆందోళన లేదని, ఇలాంటి కక్ష సాధింపు ధోరణిని ఎదుర్కోవటం నాకు కొత్త ఏమి కాదని చంద్రబాబు అన్నారు. వెంకన్న ఆశీస్సులు, ప్రజల దీవెనలతోనే, అలిపిరిలో అంత పెద్ద దాడి జరిగినా బయట పడ్డానని చంద్రబాబు అన్నారు. తనకు భద్రత ఎంత తగ్గించినా పరవాలేదని, ప్రజలే తనకు రక్షకులని చంద్రబాబు అన్నారు. కాని, గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల చూస్తే బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే, రాష్ట్రానికి చాలా ప్రమాదమని చంద్రబాబు అన్నారు.

ఇలాగే దాడులు చేసుకుంటూ వెళ్తే, పెట్టబడులు రావని, ఇన్నాళ్ళు తాను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ నిర్మించిన కష్టం అంతా వృధా అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తల పై దాడుల పై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. సాక్షాత్తూ హోంమంత్రిగా ఉన్న వ్యక్తే ఎన్నో జరుగుతుంటాయి. అన్నింటికీ కాపలా ఉంటామా?, ఘటన జరిగిన తరువాత చెప్తే, చర్యలు తీసుకుంటాం అని చెప్పటం వింటుంటే, రాష్ట్రంలో సామాన్య ప్రజలకి రక్షణగా ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. హోంమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఇలా మాట్లాడటం ఏంటి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సుచరిత మాటలు వింటుంటే, దాడులు చెయ్యండి, తరువాత వచ్చి కేసులు పెడితే చూస్తాం అన్నట్టు ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి వస్తారని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read