ఉండవల్లిలో నిర్మించిన ప్రజా వేదిక అక్రమం అంటూ జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు, రాత్రికి రాత్రి, విధ్వంసం చేసి, కూల్చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజా వేదికకు చంద్రబాబు హయంలో అయిన ఖర్చు విషయంలో గందరగోళం నెలకొంది. ప్రజా వేదికకు అయిన ఖర్చు, 5 కోట్లు అని, తరువాత అంచనాలు పెంచి 8.5 కోట్లతో నిర్మాణం పూర్తి చేసారని జగన్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇలా ఎవరు లెక్కలు వాళ్ళు చెప్తూ, ఇదే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తూ రాజకీయంగా పై ఎత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఒక జీఓ బయట పడింది. చంద్రబాబు హయాంలో ప్రజా వేదిక నిర్మాణం కోసం ఈ జీఓ విడుదల చేసారు. ఆ జీఓ ప్రకారం ప్రజా వేదిక మొత్తానికి, దాని నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 90 లక్షల రూపాయలేనని, 2017 ఏప్రిల్ 4న రిలీజ్ అయిన జీవో చెబుతోంది. అయితే ఆ జీఓలో ప్రజా వేదిక ఒక్కటే కాదు, ఇంకా మిగతా వాటికి కూడా కలిపి, జీఓ విడుదల చేసారు.
ప్రజా వేదిక దగ్గర సెక్యూరిటీ పోస్టులు, ప్రజావేదిక చుట్టూ పెన్సింగ్, గ్రౌండ్ చదును చేయడానికి, పార్కింగ్ కోసం, ఇలా ప్రజావేదిక నిర్మాణానికి మొత్తం అయిన ఖర్చు కోటి 91 లక్షల రూపాయలని, ఆ డబ్బులు విడుదల చేసినట్టు జీవో ద్వారా తెలుస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం, ప్రజా వేదిక నిర్మాణం కోసం మొత్తం రూ. 8.50 కోట్ల ఖర్చు చేశారని చెప్తుంది. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన జోవోకి, ఇప్పుడు జగన్ ప్రభుత్వం చెప్తున్న ఖర్చుకు భారీ తేడా ఉంది. ఇప్పుడు చెప్తున్న లెక్కలు నిర్మాణం ఒక్కటేనా ? లేకపోతె అక్కడ ఉన్న ఫర్నిచర్, అక్కడ అమర్చిన పెద్ద పెద్ద ఎల్ఈడీ టీవీలు, అత్యాధునిక సౌండ్ సిస్టం, లైటింగ్ ఇలా అన్నీ కలుపుకుని చెప్పరా అనేది తెలియాలి. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం, 8.5 కోట్లు అయినట్టు ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళింది. కాని అప్పటి చంద్రబాబు విడుదుల చేసిన జీఓ ప్రకారం, అన్నీ కలిపి కోటి 91 లక్షలు అని ఉంది. మరి ఎవరి వాదన కరెక్ట్ అనేది విచారణ చేస్తే మొత్తం బయట పడుతుంది.