కొత్తగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వెనకడుగు వెయ్యటం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కలిపి, ఏ ముఖ్యమంత్రి వాడనటు వంటి కాస్ట్లీ కార్లు జగన్ వాడుతున్నారు. అయనకు జడ్ సెక్యూరిటీ కాన్వాయ్ లను ఏర్పాటు చేశారు. జగన్ వాడుతున్న పాత సార్లు తీసేసి, ఆరు టయోటా ఫార్చ్యూనర్ లను ఏర్పాటుచేశారు. పోలీస్ శాఖ టాటా సఫారీ స్టోమ్ వాహనాలు ఆమోదించగా, సియంఓ అధికారులు మాత్రం, టయోటా ఫార్చ్యూనర్ వైపు మొగ్గు చూపారు. న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, జాతీయ మీడియా రిపోర్ట్ ప్రకారం, బుల్లెట్ ప్రూఫ్ తో కలిగిన, ఆరు కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్యువి లను, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ను జగన్ కోసం ఏర్పాటు చేసారు. మొత్తం ఆరు టయోటాలకు బుల్లెట్ ప్రూఫ్ రక్షణను కల్పించారు. కార్లు కొనటం ఒక ఎట్టు అయితే, దీనికి బులెట్ ప్రూఫ్ వెయ్యటానికి పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు చేసారు.

జాతీయ మీడియా ప్రకారం ఒక్కో ప్రకారం టయోటా ఫార్చ్యూనర్ కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ తొడిగిన కార్ ధర రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ బ్లాకు కలర్ లో ఉన్నాయి.అలాగే, జగన్ కోసం ప్రత్యేకంగా వాడే టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ధర ఒక్కటే, రూ.1 కోటి కంటే ఎక్కువ. మళ్ళీ దానికి అధునాతన బులెట్ ప్రూఫ్ షీల్డ్ వెయ్యటానికి మరో 30 లక్షల దాక ఖర్చు అవుతుంది. అంటే మొత్తంగా జగన్ కొత్త కాన్వాయ్ కోసం, 4.5 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. భద్రత కోసం ఏర్పాటు చేసుకోవటం తప్పు లేదు కాని, గతంలో చంద్రబాబు ఇన్ని ఖర్చులు పెట్టారు, అన్ని పెట్టారు అంటూ చివరకు తాగే వాటర్ బాటిల్ పై కూడా రాజకీయం చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. అంత పొదుపు చెయ్యాలి అని, చేస్తున్నాం అని చెప్పే వైసీపీ, మరి దీని పై ఏమి సమాధానం చెప్తుందో మరో. మరో పక్క జగన్ వాడుతున్న పాట కాన్వాయ్ ని హైదరాబాద్ పంపించారు. జగన్ అక్కడకు వెళ్ళినప్పుడు అది వాడుకుంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చే నవరత్న పథకాలను ఇంటింటికీ అందించడం, కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ప్రక్రియ ప్రారంభించింది. గతంలో ఉన్న జన్మభూమి కమిటీకి భిన్నంగా, 5 వేలు జీతం ఇచ్చి, వీరిని పెట్టనున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఖాళీలు చెప్తూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు విదులైన 11 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే ఈ నియామకాలు అన్నీ వైసీపీ పార్టీకి చెందుతాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు, ఎవరైనా అర్హత ఉంటే, వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వాల్సిందే. పార్టీలతో సంబంధం ఉండదు. అర్హులైన వారికి ఈ ఉద్యోగం వస్తే, నెలకు 5 వేలు రూపాయలు ఇస్తారు. కాబట్టి, ఎవరైనా వైసీపీకి మాత్రమే అని చెప్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకు రండి.

మరో పక్క, ఈ ఉగ్యోగాలు, సగం మహిళలకు కేటాయిస్తారని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మహిళలు కూడా వీటి కోసం పోరాడాలి. ఈ నెల 24వ తేదీ అంటే సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం మొదలు అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి, విధుల్లో చేర్చుకుంటారు. ఇంతర్వ్యులు కూడా ఉంటాయి. గ్రామ వలంటీరుగా అవ్వాలి అంటే అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇంటర్‌, లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 18సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎంపికైన వలంటీర్లకు రూ. 5 వేలు జీతం కూడా ఇస్తారు. కాబట్టి మీ గ్రామంలో మీకే అవకాసం రావచ్చు. గ్రామ సేవ చెయ్యొచ్చు. మీ గ్రామంలో నిరుద్యోగులు అందరి చేత, అప్లికేషన్ పెట్టించి, ప్రభుత్వ సేవ చెయ్యండి. ఇది వైసీపీ పార్టీకి మాత్రమే కాదు, ఎవరైనా అప్లై చెయ్యవచ్చు.

రోజు రోజుకీ మానవత్వం అనేది చచ్చిపోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయి, 9 నెలల చిన్నారిని రేప్ చేసిన సైకోలను మరువక ముందే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోలు కూడా బరితెగించారు. 5 రోజులుగా, పదవ తరగతి చదువుతున్న బాలిక పై గ్యాంగ్ రేప్ చేసారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో, ఓకే హాస్టల్‌లో ఉండి ఆ బాలిక చదువుకుంటుంది. తెలిసీ తెలియని వయసులో ఒక స్నేహితుడుకు ఆకర్షితురాలు రాయ్యింది. తన స్నేహితుడి కోసం వెతుక్కుంటూ ఒంగోలు వరకు వెళ్లింది. అదే ఆమె పాలిత శాపం అయ్యింది. ఐదురోజుల పాటు ఆ బాలికను ఒక గదిలో బంధించి, గ్యాంగ్ రేప్ చేశారు దుండగలు. రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది. గుంటూరుకు చెందిన ఆ బాలిక విజయవాడలో ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆ బాలికకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కారు డ్రైవర్‌ పరిచయం అయ్యాడు. అది కాస్తా స్నేహంగా మారింది. ఆమె అతడిని వెతుక్కుంటూ ఒంగోలు వెళ్లింది.

rape 23062019 3

సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె ఒంగోలు బస్టాండ్‌కు చేరుకుంది. తన వద్ద ఫోన్ లేకపోవడంతో, బస్ స్టాండ్ లో ఉన్న వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని, ఆ కార్ డ్రైవర్ కు ఫోన్ చేసింది. కానీ ఆ ఫోన్ కలవకపోవడంతో, ఆ రోజు రాత్రి పది గంటల వరకూ ఒంగోలు బస్ స్టాండ్ లోనే ఉండిపోయింది. అయితే ఆమె ఫోన్ తీసుకుంది మాత్రం ఓ దుర్మార్గుడి నుంచి. ఆ ఫోన్ ఇచ్చిన వ్యక్తి, తన స్నేహితుడుతో కలిసి, ఆ బాలిక పై కన్నేశారు. ఆ బాలిక దగ్గరకు వెళ్లి మాటలు కలిపాడు. విషయాలు అన్నీ ఆరా తీశారు. నీ ఫ్రెండ్ నాకు తెలుసని, అతని దగ్గరకు తీసుకెళ్తానని చెప్పి, ఆ బాలికను తమ వెంట తీసుకెళ్లారు. కాని ఆ బాలికను, నలుగురు బీటెక్ విద్యార్థులు ఉంటున్న రూమ్‌కు తీసుకెళ్లి హింసించారు. ఆరుగురూ కలిసి ఆ బాలిక పై పడి తమ వాంఛ తీర్చుకున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఐదు రోజులపాటు ఆ బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

rape 23062019 3

అయితే శనివారం ఆ కామాంధుల చెర నుంచి ఎలాగోలా ఆ బాలిక తప్పించుకుంది. దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు రేప్ చేసిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అయితే ఇందులో ప్రధాన నిందితుడు ఒక దివ్యాంగుడు. అతని పేరు, బాజీ. అయితే అతని సోషల్ మీడియా ఫేస్బుక్ చూసిన వారు అవాక్కయ్యారు. అతను జగన్ వీరాభిమానిగా తెలుస్తుంది. జగన్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, ఇతగాడు కేవలం రెండు రోజుల క్రిందట, తెలంగాణాలో జరిగిన 9 నెలల పాప రేప్ పై ఫేస్బుక్ లో స్పందిస్తూ, ఇలాంటి వారిని సమాజంలో ఉండనివ్వ కూడదు, ఉరి తియ్యాలి అంటూ పోస్ట్ పెట్టాడు. అంటే, ఒక పక్క ఆరుగురితో కలిసి అయుదు రోజులగా గ్యాంగ్ రేప్ చేస్తూ, మరో రేప్ పై స్పందిస్తూ, ఇలాంటి వారిని ఉరి తియ్యాలని అంటున్నాడు. అంటే దొంగ పని చేస్తూనే, మరో దొంగను దొంగతం చెయ్యద్దు అంటూ నీతులు చెప్పటం అనమాట... సమాజం ఇలా ఉంది..

దాదపుగా 10 ఏళ్ళ కల సాకారం కావటంతో జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ హుషారుగా ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ లో జరిగిన పొరపాటు, ప్రభుత్వ పెద్దలకు ఎంతో కోపం తెప్పించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత, వచ్చిన మొదటి సంచిక కవర్ పేజి పై , అయన ఫోటో బ్లాకు అండ్ వైట్ పడింది అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అంతే కాదు, రెండు మూడు చోట్ల వారికి అనుకూలంగా కూడా లేవు అంటూ, ప్రింట్ అయిన మ్యాగజైన్ ని పక్కన పడేసారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసి, జగన్ ను కావలని అవమానించారు అంటూ ప్రభుత్వం వారి పై విచారణ చేసి, చర్యలు కూడా తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి నెల ప్రభుత్వం తరుపున, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ విడుదల అవుతూ ఉంటుంది. ఏపి ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాష్టంలో జిరిగే అభివృద్ధి పనులు, ప్రజలకు తెలియటానికి, 'ఆంధ్రప్రదేశ్ ' అనే పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నడుపుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రతి నెల ఈ పత్రిక వస్తుంది.

అయితే ఈ సారి ప్రభుత్వం మారటం, జగన్ రావటం జరిగిపోయాయి. ప్రతి నెల లాగానే, ఈ నెల కూడా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో జూన్ నెలకు సంబధించిన మ్యాగజైన్ రెడీ అయ్యింది. అయితే ఆ మ్యాగజైన్ కవర పేజ్ పై, జగన్ మోహన్ రెడ్డి బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ ప్రభుత్వ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఇది కావలానే చేసారు అంటూ ఎడిటర్ , మిగతా సిబ్బంది పై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అలాగే "జగన్ అనే అతను" అనే వ్యాఖ్యం పై కూడా వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జూన్ మాసానికి ప్రింట్ అయిన 25 వేల కాపిలను తీసుకువెళ్ళి గోడౌన్ లో పడేసారు. ఈ ప్రింటింగ్ కు అయిన ఖర్చు, అక్షరాల 38 లక్షలు. మేము ఆదా చేస్తున్నాం అంటున్న ప్రభుత్వం, కేవలం ఫోటో బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ, 25 వేల కాపిలను బ్యాన్ చెయ్యటం వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం 38 లక్షలు.

Advertisements

Latest Articles

Most Read