వంగవీటి అంటే బెజవాడలోనే కాదు, కోస్తా జిల్లాల్లో కూడా ఒక బ్రాండ్. దానికి వారసుడిగా ఉన్న వంగవీటి రాధా మాత్రం, రాజకీయంగా ఎదగలేక పోయారు. దానికి ప్రధాన కారణం ఆయన పార్టీలు మారే విధానం అనే చెప్పాలి. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన రాధా ఇప్పుడు మళ్ళీ పార్టీ మారుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం, ఈ రోజు రాధా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కావడం. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా అరగంట పాటు, రాధా పవన్ కల్యాణ్‌తో వంగవీటి భేటీ అయ్యారు. వంగవీటి రాధా, త్వరలోనే జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు అనుచరులు ప్రచారం చేసారు. జనసేనలో చేరేందుకే రాధా, పవన్‌తో భేటీ జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు, జగన్ తనను అవమానించారని చెప్తూ, రాధా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు టికెట్ ఇవ్వరని తెలిసినా, ఆయన పార్టీలో చేరి, ప్రచారం చేసారు. అప్పట్లో ఈయనకు ఎమ్మల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, ఎమ్మల్సీ ఆశలు గల్లంతు అయ్యాయి.

అయితే తెలుగుదేశం పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల పై పోరాడకుండా, మళ్ళీ పార్టీ మరే ఆలోచనలో పడ్డారు. అందరూ బీజేపీలో చేరుతుంటే, రాధా మాత్రం, జనసేన వైపు చూస్తున్నారు. తన సామాజికవర్గం ఎక్కువగా ఆదరించే పార్టీ కావటంతో, అటు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. అయితే రాధా మాత్రం, ఎప్పుడూ నిలకడగా లేకుండా ఇలా పార్టీలు మారుతూ ఉంటే, చూసే వాళ్ళకు కూడా ఇబ్బందిగ ఉంటుంది. ఇప్పటికే రాధా నాలుగు పార్టీలు, మారి, అయిదవ పార్టీ వైపు చూస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన రాధా, ఎమ్మల్యే అయ్యారు. తరువాత చిరంజీవి పార్టీ పెట్టటంతో ప్రజారాజ్యం వైపు వెళ్లారు. ప్రజారాజ్యం ఎత్తేయటంతో, కాంగ్రెస్ లో విలీనం అయినా, అటు వెళ్ళకుండా, వైసీపీ వైపు వచ్చారు. ఇక్కడ జగన్ తో విభేదాలు రావటంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో, మరో సారి పార్టీ మారే ఆలోచనలో జనసేన వైపు చూస్తున్నారు. మొత్తానికి, అయుదు సార్లు, అయుదు పార్టీలు మారిన నేతగా రాధా నిలిచిపోతారు. బీజేపీ కూడా రాధా వైపు చూస్తునట్టు తెలుస్తుంది. మరి రాధా జనసేన వైపు వెళ్తారో, బీజేపీ వైపు వెళ్తారో చూడాలి...

ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కాని లేని కొత్త సంస్కృతీ జగన్ మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు. తమిళనాడు తరహా కక్ష పురిత రాజకీయాలు మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. అమరావతి మీద తనకు ఎంత కక్ష ఉందో, ప్రమాణ స్వీకారం రోజే చూపించారు. 40 వేల మంది కార్మికులతో నిత్యం బిజీగా ఉండే అమరావతి, నేడు ఒక్క మనిషి కూడా లేకుండా, ఎక్కడి కట్టడాలు అక్కడ ఆగిపోయాయి. అమరావతి పై ఇప్పటి వరకు జగన్ సమీక్ష చెయ్యలేదు, క్లారిటీ ఇవ్వలేదు. అమరావతి అంటే, అదేదో చంద్రబాబు ఆస్తి అనుకుంటూ, 33 వేల ఎకారాలు ఇచ్చిన రైతులకు క్షోభ మిగిల్చారు. అలాగే ప్రజావేదిక. ఒక ప్రతిపక్ష నేతకు, ప్రభుత్వం నివాసం కల్పించాలి. అందులో భాగంగా, ప్రజా వేదికను తన కార్యకలాపాలకు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అయితే దాని పై సమాధానం ఇవ్వకుండా, సామాను బయట పడేసి, ఏకంగా చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న ప్రజా వేదిక వద్దే కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ పేరుతొ, వచ్చి జగన్ కూర్చున్నారు. 

ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే నిర్ణయిస్తారు. అంతటితో ఆగలేదు, ఇప్పుడు ఏకంగా అమరావతిలో కూల్చే మొదటి బిల్డింగ్ ఈ ప్రజా వేదిక అంటూ జగన్ ప్రకటించారు. నిబంధనలకు అనుకూలంగా ఇది కట్టలేదని, అందుకే దీన్ని బుధవారం కూల్చేయాలి అని జగన్ ఆదేశించారు. చంద్రబాబు ఊరిలో లేని సమయంలో, ఆయన వాడుకుంటున్న ఆఫీస్ ని, కనీసం ఆయన వచ్చే దాక అయినా ఉండకుండా, నిబంధనలు పేరు చెప్పి, కూల్చేస్తున్నారు. ఇన్ని నిబంధనలు చెప్పే జగన్ గారు, ఆ పక్కనే ఉన్న గోకరాజు గంగ రాజు గెస్ట్ హౌస్, ఆ పక్కనే ఉన్న మంతెన సత్యన్నారాయణ ఆశ్రమం కూల్చే దమ్ము ఉందా ? గోకరాజు జోలికి వెళ్తే అమిత్ షా ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. వాళ్ళు తలుచుకుంటే 24 గంటల్లో సీన్ రివర్స్ అవుతుంది. అందుకే వాళ్ళ జోలికి వెళ్లరు. అధికారం లేదు కాబట్టి చంద్రబాబు జోలికి వెళ్తారు. ఇదే చంద్రబాబు, జగన్ లాగా అలోచించి ఉంటే ? అధికారం బాధ్యతను పెంచాలి, అహంకారం కాదు. కాలమే అన్నిటికీ సమాధనం చెప్తుంది.

గత 5 ఏళ్ళుగా అవినీతిని అవినీతి అంటూ మనల్ని ఆరోపించారని, గత రెండేళ్ళుగా కేంద్రం కూడా మన మీద అవినీతి మరకలు వెయ్యటానికి స్పెషల్ టీంలు వేసి, అవినీతి అంటించాలని చూసి, ఒక్క రూపాయి కూడా అవినీతి నిరూపించలేకపోయారని, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చి, తెలుగుదేశం పార్టీకి అవినీతి మరకలు అంటించాలని చూస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేసామని స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, నేతలతో ఫోన్‌ లో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్కడ లేని అవినీతిని మనకు అంటించాలని చూస్తే, అది వారికే చుట్టుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యి, వారి సమస్యల పై పోరాడాలని పార్టీ నేతలను సూచించారు. వైసీపీ చేస్తున్న దాడులు, వారి చేతిలో గాయపడిన వారికి అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి, ఇతర అభివృద్ధి పనులపై అవినీతి జరిగిపోయినట్లుగా జగన్‌, మంత్రులు అంటున్నారని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రూవ్ చెయ్యలేకపోయారని అన్నారు.

ఈ సందర్భంగా టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ " అక్కడేదో పెద్ద కొండ ఉంది, తవ్వుతానంటున్నారు, తవ్వుకోండి, తవ్వితే ఎలుక కాదు కదా చీమ, దోమను కూడా మీరు పట్టుకోలేరు. ఎంత తవ్వుతారో, ఎక్కడ నుంచి తవ్వుతారో తవ్వండి, ఎంత లోతుకు తవ్వుతారో తవ్వుకోండి అని అన్నారు. నెల రోజుల నుంచి, తవ్వడానికి గునపాలే దొరకడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపించలేక, అధికారులను అడుగుతూ, అవినీతి బయటపెడితే సన్మానం చేస్తాం అనే స్థాయికి వచ్చారు. జగన్ గురించి, ఆయన కేబినెట్ మంత్రులు గతంలో ఏం మాట్లాడారో అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వీరందరూ చేసిన చరిత్రలు ఉన్నాయి, ఈ రోజు ఎదో నీతులు చెప్తున్నారు. గతంలో జగన్ అత్యంత అవినీతిని విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు జగన్ పక్కన చేరి తాము అసలు అవినీతి అంటే ఏంటో ఎరగం అయినట్లు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి నాయకులు, గతంలో జగన్ అవినీతి గురించి, వైఎస్ ప్రతి రోజు తాగుతాడు అనే అలవాట్ల గురించి ఏమన్నారో అందరికీ గుర్తుందని’’ అన్నారు.

తెలుగుదేశం పార్టీ ఓటమిని గత నెల రోజులుగా ఎవరికి తోచింది వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇదే బలామైన కారణం అంటూ బల్ల బద్దులు కొట్టి చెప్తున్నారు. ఎన్నికల్ ఫలితాలు వచ్చిన తరువాత టిడిపి అధినేత చంద్రబాబు కూడా వివిధ రకాల సమీక్షలు చేస్తూ, ఓటమి కారణాలు విశ్లేషిస్తున్నారు. నేతల దగ్గర నుంచి, గ్రామ స్థాయి కార్యకర్తల వరకు, వారి నుండి అభిప్రాయాలూ తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తూ, తమ దృష్తిలో ఎక్కడ తప్పు జరిగింది అనే విషయం చంద్రబాబు ముందు కుండ బద్దలు కొడుతున్నారు. తాజాగా ఓటమి పై విశ్లేషిస్తూ, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సొంత పార్టీ నేతలను కూడా వదలకుండా, ఓటమికి గల కారణాలను చెప్పారు. నిన్న ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొండా ఉమా ఈ వ్యాఖ్యలు చేసారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది అని, అది బాగా ప్రభావితం చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ ఒక్క నినాదమే తెలుగుదేశం పార్టీ ఓటమికి ఓ బలమైన కారణంగా చెప్పారు.

ఇక సొంత పార్టీ నేతలను కూడా బొండా ఉమా వదల్లేదు. కొంతమంది మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు, చంద్రబాబు వద్ద ప్రతీదానికి భజన చేసి, పార్టీ ఇలా అవ్వటానికి కారణం అయ్యారని బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని మంచి పనులు, పధకాలు, అభివృద్ధి చేసినా, గ్రౌండ్ లెవెల్ లో ఉన్న వాస్తవాలను తమ అధినేత దృష్టికి తీసుకెళ్లకుండా, అదే విధంగా కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, వారి మనోభావాలు ఏంటి అనేది చంద్రబాబుకు తెలియకుండా, ప్రతి విషయానికి భజన చేస్తూ ఆ మంత్రులు చేసిన అతి, ఈ పరిస్థితికి తెచ్చిందని వ్యాఖ్యానించారు. మరో పక్క తాను పార్టీ మారుతున్నాను అంటూ చేసిన ప్రచారం ఖండించారు. కాపు నేతలు అంతా, ఎందుకు ఓడాం అని విషయం సమీక్ష చేసుకుని, పార్టీని బలపరచటానికి సమావేశం అయ్యామని చెప్పారు. బీజేపీలోకి, వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేదని, జనసేనలోకి మేమే కాదు, మా కార్ డ్రైవర్ కూడా వెళ్ళడు అంటూ బొండా ఉమా వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Latest Articles

Most Read